ఐజాల్

వికీపీడియా నుండి
(ఐజ్‌వాల్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఐజాల్
రాజధాని
ఐజాల్‌ నగరం ఎడమ నుండి సవ్యదిశలో: పచుంగా విశ్వవిద్యాలయ ప్రవేశ ద్వారం, ఐజాల్ లోని సోలమన్ ఆలయం, ఐజాల్‌ బజార్, ఐజాల్‌ రాత్రి దృశ్యం, లెంగ్‌పుయి విమానాశ్రయ భవనం
ఐజాల్‌ నగరం
ఎడమ నుండి సవ్యదిశలో: పచుంగా విశ్వవిద్యాలయ ప్రవేశ ద్వారం, ఐజాల్ లోని సోలమన్ ఆలయం, ఐజాల్‌ బజార్, ఐజాల్‌ రాత్రి దృశ్యం, లెంగ్‌పుయి విమానాశ్రయ భవనం
దేశం భారతదేశం
రాష్ట్రంమిజోరాం
జిల్లాఐజాల్
Area
 • Total457 km2 (176 sq mi)
Elevation
1,132 మీ (3,714 అ.)
Population
 (2011)
 • Total2,91,822
 • Density234/km2 (610/sq mi)
భాషలు
 • అధికారికమిజో
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
796001
టెలిఫోన్ కోడ్0389
Vehicle registrationఎంజెడ్
స్త్రీ పురుష నిష్పత్తి1024 స్త్రీలు per 1000 పురుషులు /

ఐజాల్ [1] Mizo: [ˈʌɪ̯.ˈzɔːl]) భారతీయ రాష్ట్రాలలో ఒకటి అయిన మిజోరాంకు రాజధానిగా ఉంది. జిల్లాలో జనసంఖ్య 291,822, [2] రాష్ట్రంలో ఐజాల్ పెద్ద నగరంగా గుర్తించబడింది. ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ, రాష్ట్ర శాసనసభ హైస్, సివిల్ సెక్రెటరేట్ ఉన్నాయి. ఐజాల్ లో మిజో గిరిజన తెగలకు చెందిన ప్రజలు అధికంగా ఉన్నారు.

చరిత్ర[మార్చు]

1871 - 1872 మద్యకాలంలో మిజోచీఫ్ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ప్రత్యేక నివాసగృహాలను నిర్మించమని బలవంతపెట్టి గృహసముదాయాన్ని నిర్మించజేసాడు. అదే తరువాత ఐజాల్ గ్రామం అయింది.[3] 1890లో మిజో గిరిజనులతో పోరాడడానికి బ్రిటిష్ సైన్యాలకు సహకరించడానికి అస్సాం పోలీసు అధికారి డాలీ 400 మంది మనుషులతో ఈ ప్రదేశానికి వచ్చి చేరాడు. ఈ బృందాలు ఇక్కడ గోదాములు, నివాసగృహాలను నిర్మించారు. [4] 1892 - 1995 ఐజాల్ చేరడానికి మేజర్ లోచ్ ఆధ్వర్యంలో సిచిలర్ నుండి రహదారి మార్గం నిర్మించబడింది. 1966 మిజో నేషనల్ ఫ్రంట్ తలెత్తిన సమయంలో భారతీయ వాయుసేన ఈ ప్రాతం మీద వాయుమార్గంలో దాడి చేసారు. తరువాత మిజో నేషనల్ ఫ్రంట్ తిరుగుబాటును వెనుకకు తీసుకుంది.[5] 1966 ఐజవి ఒక పెద్ద గ్రామంగా ఉంది. తిరుగుబాటు తరువాత అది పెద్ద ఊరుగా అభివృద్ధిచేయబడింది. తరువాత మిజోరాంకు ఇది కేంద్రంగా మారింది ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమరలను కలిపే కూడలిగా మారింది. ప్రస్తుతం ఐజాల్‌లో మిజోరాం రాష్ట్రం జనసంఖ్యలో 25% నివసిస్తున్నారు.

భౌగోళికం[మార్చు]

ఐజాల్ మిజోరాం ఉత్తరభాగంలో ఉంది. ఇది సముద్రమట్టానికి 1,132 మీటర్ల ఎత్తులో ఉంది. ఐజాల్ పడమర దిశలో ట్లాంగ్ నదీలోయ, తూర్పు దిశలో ట్యురియల్ నదీలోయ ఉన్నాయి.

వాతావరణం[మార్చు]

ఐజాల్‌లో స్వల్పంగా ఉపష్ణమండల వాతావరణం ఉంటూ ఉంది. కోపెన్ క్లైమేట్ క్లాదిఫికేషన్ నివేదికలు ఐజాల్ ఉపష్ణమండల వాతావరణం ఉందని తెలియజేస్తున్నాయి. అయినప్పటికీ వర్షాలు అత్యధికంగా ఉంటాఉయి. వేసవిలో 20-30 సెం. మీ, శీతాకాలంలో 11-12 సెం.మీ వర్షం ఉంటుంది. [6]

శీతోష్ణస్థితి డేటా - Aizawl
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 20.4
(68.7)
21.7
(71.1)
25.2
(77.4)
26.8
(80.2)
26.3
(79.3)
25.5
(77.9)
25.3
(77.5)
25.5
(77.9)
25.7
(78.3)
24.7
(76.5)
23.0
(73.4)
21.0
(69.8)
24.3
(75.7)
సగటు అల్ప °C (°F) 11.4
(52.5)
12.8
(55.0)
15.6
(60.1)
17.5
(63.5)
18.1
(64.6)
18.9
(66.0)
19.1
(66.4)
19.1
(66.4)
19.2
(66.6)
18.0
(64.4)
15.1
(59.2)
12.2
(54.0)
16.4
(61.5)
సగటు అవపాతం mm (inches) 13.4
(0.53)
23.4
(0.92)
73.4
(2.89)
167.7
(6.60)
289.0
(11.38)
406.1
(15.99)
320.4
(12.61)
320.6
(12.62)
305.2
(12.02)
183.7
(7.23)
43.2
(1.70)
15.3
(0.60)
2,161.4
(85.09)
సగటు అవపాతపు రోజులు 0.5 2.1 5.0 8.4 12.8 19.4 19.3 19.6 17.2 10.6 1.8 0.4 117.1
Source: World Meteorological Organization[7]

సిటీస్కేప్[మార్చు]

A panorama of Aizawl taken from Zemabawk

పాలన[మార్చు]

ఐజాల్ నగరపాలనా వ్యవహారాలను ఐజాల్ ముంసిపల్ కౌంసిల్ నిర్వహిస్తుంది. 2010లో 10 సభ్యులతో ముంసిపల్ కౌంసిల్ ఏర్పాటు చేయబడింది. ఎ.ఎం.సి కార్యాలయం నిర్వహణా బాధ్యతను ముంసిపల్ కౌన్సిలర్, ఉప కౌందిలర్, 3 ఎగ్జిక్యూటివ్ వహిస్తారు. [8] కౌంసిల్ సభ్యులలో 19 మంది ప్రజలచేత ఎన్నుకొనబడతారు. ఇతర సభ్యులను గవర్నర్ నియమిస్తాడు. సభ్యులలో 3 వ వంతు స్త్రీలకు ప్రత్యేకంగా కేటాయిస్తారు. కౌంసిల్ 5 సంవత్సరాలు పాలనాధికారం కలిగి ఉంటుంది. ఒక్కోవార్డుకు వార్డు కమిటీ ఉంటుంది. 3 సంవత్సరాల అధికారం కలిగిన 78 ప్రాంతీయ కౌంసుల్స్ ఉంటాయి. [9]

గణాంకాలు[మార్చు]

2001 గణాంకాలను అనుసరించి [10] ఐజాల్ జనసంఖ్య 228,280. వీరిలో పురుషులు 50.80% స్త్రీలు 49.20% ఉన్నారు. ఐజాల్‌లో వివిధ రంగాలకు చెందిన గిరిజన తెగలకు చెందిన ప్రజలే అధికంగా ఉన్నారు. ప్రజలలో అధికంగా క్రైస్తవులు ఉన్నారు.[11] ఇతర మతాలలో ప్రధానంగా ఇస్లాం, బుద్ధిజం, హిందూమతం లాకు చెందిన ప్రజలు అధికంగా ఉన్నారు. జిల్లాలో అధికంగా ప్రెస్బైటెరియన్ ప్రజలు అధికంగా ఉన్నారు. జిల్లాలో తరువాత స్థానాలలో వరుసగా సాల్వేషన్ ఆర్మీ, బాప్తిస్టులు, సెవెంత్ డే అడ్వెంటిస్టులు, యునైటెడ్ పెంట్‌కోస్టల్ చర్చి, రోమన్ కాథలిక్కులు ఉన్నారు.

ఆర్ధికం[మార్చు]

ఐజాల్ ఆర్థికంగా ప్రభుత్వరంగ సేవల మీద ఆధారపడి ఉంది. ఐజాల్‌లో ప్రఖ్యాత బ్యాంకులు ఉన్నాయి. ఐజాల్ మద్య ఉన్న జార్క్వాత్‌లో ఉన్న 3 స్టార్ రీజెంసీ హోటెల్ వ్యాపారులకు, పర్యాటకులకు అవసరమైన సేవలను అందిస్తుంది.

ప్రయాణవసతులు[మార్చు]

వాయుమార్గం[మార్చు]

Lengpui Airport

ఐజాల్ సమీపంలో ఉన్న " లెంగ్‌పుయి ఎయిర్ పోర్ట్ " ద్వరా ఐజాల్ వాయుమార్గంలో అనుసంధానమై ఉంది. ఈ విమానాశ్రయం నుండి కొలకత్తా లోని సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, గౌహతి లోని లోక్‌ప్రియ గోపినాథ్ బర్దొలోయి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, ఇంపాలా లోని ఇంపాలా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లతో అనుసంధానించబడి ఉన్నాయి. ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్వేస్ విమానసేవలు అందిస్తున్నాయి. " పవన్ హాంస్ " హెలికాఫ్టర్ సేవలను అందిస్తుంది. [12] 2012లో స్థాపించబడిన ఈ సస్థ ఐజాల్‌ను లంగ్లెయి, లంగ్‌ట్లై, సైహ, చౌంగ్టీ, సెర్చ్షిప్, చంఫై, కొలసిబ్, ఖాజ్వాల్, హంతియాల్ లతో అనుసంధానిస్తుంది.[13]

రైలుమార్గం[మార్చు]

మిజోరాం రాష్ట్రం బైరబి రైల్వే స్టేషను ద్వారా దేశం లోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించబడి ఉంది. ఐజాల్ సమీపంలో ఉన్న సైరంగ్‌తో బైరబిని బ్రాడ్‌గేజ్ మార్గంతో అనుసంధానించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. There is also the plan for 5 km long Aizawl Monorail running between Zemabawk to Kulikawn.

రహదారి మార్గం[మార్చు]

ఐజాల్ సిల్చర్ రహదారి మార్గం (నేషనల్ హైవే 54) ద్వారా, అగర్తల నేషనల్ హైవే 40 ద్వారా, ఇంపాలా నేషనల్ హైవే 150 ద్వారా అనుసంధానించబడి ఉన్నాయి. పసుపు, తెలుపు టాక్సీలు విరివిగా లభ్యం ఔతున్నాయి. అధికంగా మారుతీ కార్లు లభ్యం ఔతున్నాయి. ప్రైవేట్ యాజమాన్యంతో నడిచే బ్లూ అండ్ వైట్ మినీ బసులు సిటీ బసులులాగా దినసరి సేవలు అందిస్తున్నాయి.

మాధ్యమం[మార్చు]

దినపత్రికలు: ఐజాల్‌లో " మిజో, ఆంగ్లభాషలలో ప్రధానదినపత్రికలు:[14]

రేడియో: All India Radio also has a studio that host programmes at scheduled hours. FM Zoawi is a popular radio station in Aizawl.[21]

పర్యాటక ఆకర్షణలు[మార్చు]

ఐజాల్‌లో పర్యాటక ఆకర్షణ కలిగిన ప్రదేశాలు :

ఐజాల్ బజార్ జియన్ వీధి
  • " బరాబజార్ " ఐజాల్ లోని దార్పుయి ప్రాంతంలో ఉన్న షిపింగ్ సెంటర్ ఉంది. ఇక్కడ ప్రజలు వారి సంప్రదాయ దుస్తులలో ఉండి తమ వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముతుంటారు. క్కడ మయన్మార్ సరిహద్దుల ద్వారా తీసుకురాబడుతున్న చైనా ఉత్పత్తులు కూడా లభ్యం ఔతాయి. ఈ ప్రాంతంలో ఉన్న " మిలేనియం సెంటర్ " ప్రజాకర్షణ కలిగిన షాపింగ్ సెంటర్‌గా గుర్తింపు తీసుకు వచ్చింది. ఈ ప్రాంతం ఐజాల్‌లో ప్రధానమైన వ్యాపార కూడలిగా భావించవడుతుంది.
  • జార్క్వత్ పట్టణకేంద్ర ప్రాంతంలో " మిజోర్ స్టేట్ మ్యూజియం " ఉంది. ఈ మ్యూజియంలో మిజో సంస్కృతికి చెందిన పలువద్యువులు ఇక్కడ ప్రదర్శించబడుతున్నాయి.
  • " రీయెక్ " టూరిస్ట్ రిసార్ట్. ఇది ఐజాల్‌కు 12 కి.మీ దూరంలో ఉంది. సముద్రమట్టానికి 1548 మీటర్ల ఎత్తున ఉన్న అతి సుందరప్రదేశమిది. ఇది మిజో ప్రజలు నివసిస్తున్న ఆకర్షణీయమైన గ్రామమని భావించవచ్చు.
  • ఐజాల్ ఉత్తరదిశలో ఉన్న " డర్ట్‌ లాంగ్ హిల్స్ " హిల్ స్టేషను‌లో ఉన్న డర్ట్‌లాంగ్ హాస్పిటల్ / ఐజాల్ థియోలాజికల్ కాలేజ్ నుండి హిమాలయ పర్వతశ్రేణుల సమగ్రదృశ్యాలను చూడవచ్చు.
  • ఐజాల్ నుండి 50 కి.మీ దూరంలో సముద్రమట్టానికి 1619 మీ ఎత్తులో ఉన్న " హ్మూయి ఫాంగ్ " లో పర్వతశ్రేణులలో మిజో రాజుల కాలం నుండి ఇప్పటి వరకు అభయారణ్యాలతో నిండి ఉంది.
  • ఐజాల్ 7 కి.మీ దూరంలో ఉన్న " బెరాట్లాంగ్ టూరిస్ట్ కాంప్లెక్స్ " లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతుంటాయి. ఇది ప్రఖ్యాత విహారకేంద్రంగా పరిగణించబడుతుంది.
  • అజ్ వాల్‌కు 70కి.మీ దూరంలో ఉన్న " బక్తాంగ్ గ్రామం " లో " పూ జియోనా " నివసించిన గ్రామమిది. పూ జియోనాకు 39 మంది భార్యలు, 94 మంది పిల్లలు, 14 మంది కోడళ్ళు, 33 మంది మనమలు, మనుమరాళ్ళు ఉన్నారు.[22]
  • కిండ్రన్ వెల్లీలో ఉన్న " సోలోమంస్ ఆలయం, ఆజ్ వాల్ మిజోరాం, ఇండియ " చౌమన్ అనబడే ఈ ఆలయసముదాయాన్ని కోహర్న్ థియాంగ్లిం నిర్వహిస్తున్నాడు.[23]
  • ఖువాంగ్‌చెరా పుక్ అనేది ఐజ్వాల్ నుండి 30 కిమీ దూరంలో ఉన్న రీక్ సమీపంలోని ఐలావ్ంగ్‌లోని ఒక గుహ.

విద్య[మార్చు]

మిజోరాం విశవవిద్యాలయ ప్రవేశద్వారం

బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ మిజోరాం , ది ప్రెస్బిటేరియన్ చర్చ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో (సింద్ హైయ్యర్ సెకండరీ స్కూల్, ఐజాల్ సింద్ హైయ్యర్ సెకండరీ స్కూల్) నిర్వహించబడుతున్నాయి. అలాగే పలు రోమన్ కాథలిక్ ఆర్డర్స్ & ది సెవంత్ డే అడ్వెంటిస్ట్స్ మొదలైనవి ఐజాల్‌లోని ఉత్తమ విద్యాసంస్థలుగా గుర్తించబడుతున్నాయి. ఇతర పాఠశాలలలో సెయింట్ పౌల్స్ హైయ్యర్ సెకండరీ స్కూల్, హోం మిషన్ స్కూల్, పచుంగ యూనివర్శిటీ కాలేజ్ 1958 లో స్థాపినబడ్డాయి. ఇవి ఐజాల్‌లో స్థాపినచబడిన ఆరంభకాల కళాశాలలుగా గుర్తించబడ్డాయి. తరువాత 1975 లో స్థాపించబడిన ఐజాల్ కాలేజ్ రెండవ పురాతన కాలేజిగా గురించబడుతుంది. 2001 ఏప్రెల్ 25న మిజోరాం విశ్వవిద్యాలయం స్థాపించబడింది.[24] ఇండియన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్, నేషనల్ ఇంస్టీట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిజోరాం ప్రారంభించబడింది. ఫాల్క్వాన్ వద్ద మెడికల్ కాలేజి స్థాపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.[25]

క్రీడలు[మార్చు]

లామ్ముయల్

మిజోరాం క్రీడలలో ప్రధానమైనది ఫుట్‌బాల్. మిజోరాం రాష్ట్రానికి చెందిన పలువురు క్రీడాకారులు భారతదేశంలో పలుప్రాంతాలలోని " నేషనల్ లిగ్ " లలో పాల్గొంటున్నారు. ఐజాల్‌లో అత్యధిక ప్రాధాన్యత కలిగిన క్రీడా వసతులు:

  1. " రాజీవ్ గాంధీ స్టేడియం మౌల్పుయి " ఈ స్టేడియంలో 20,000 మంది క్రీడలను వీక్షించే అవకాశం ఉంది.[26]
  2. " హవాల ఇండోర్ స్టేడియం " లో బాస్కెట్ బాల్, బాడ్‌మింటన్, బాక్సింగ్ వసతులు ఉన్నాయి.
  3. లామ్యుయల్ స్టేడియంలో 5,000 మంది క్రీడలను వీక్షుంచే అవకాశం ఉంది.

[27]

క్లబ్ క్రీడ లీగ్ వెన్యు
దింతర్ ఎఫ్.సి.ఐ దింతర్ ఫుట్‌బాల్ క్లబ్ అసోసియేషన్ ఫుట్‌బాల్ మిజోరాం ప్రీమియర్ లీగ్ లమ్ముయల్ / వైవక్వన్ ఫీల్డ్
లంగ్‌ముయల్ ఎఫ్.సి అసోసియేషన్ ఫుట్‌బాల్ మిజోరాం ప్రీమియర్ లీగ్ లామ్ముయల్
మిజోరాం ఫుట్‌బాల్ టీం అసోసియేషన్ ఫుట్‌బాల్ సంతోష్ ట్రోఫీ ల్ రాజీవ్ గాంధీ స్టేడియం మౌల్పుయి
ఐజ్వల్ ఎఫ్.సి అసోసియేషన్ ఫుట్‌బాల్ మిజోరాం ప్రీమియర్ లీగ్ లామ్ముయల్

పరిసర ప్రాంతాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Definition of Aizawl". The Free Online Dictionary. Retrieved 31 October 2013.
  2. "Aizawl City Population". census2011.co.in. Archived from the original on 24 డిసెంబరు 2018. Retrieved 15 August 2012.
  3. K. C. Kabra (2008). Economic Growth of Mizoram: Role of Business & Industry. Concept Publishing Company.
  4. "The Making of Aijal". Archived from the original on 2013-11-12. Retrieved 2014-05-25.
  5. Hamlet Bareh (2001). Encyclopaedia of North-East India: Mizoram. Mittal Publications. pp. 206–216. ISBN 978-81-7099-787-0.
  6. "Aizawl - the State Capital". Mizoram. Retrieved 2012-11-09.
  7. "World Weather Information Service–Aizawl". World Meteorological Organization. Archived from the original on 2012-05-06. Retrieved 2014-05-25.
  8. Chetri, Pratap. "AIZAWL GETS ITS FIRST MUNICIPAL COUNCIL". Eastern Panorama. Retrieved 14 August 2012.
  9. Dr. L.H.Chhuanawma. "AIZAWL MUNICIPAL COUNCIL". T Romana College. Archived from the original on 28 May 2013. Retrieved 7 September 2012.
  10. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
  11. Grogan, Paul (31 August 2010). "India: economic growth contrasts with political unrest in a forgotten enclave". The Guardian. London.
  12. "MIZORAMA HELICOPTER SERVICE TUR CHIEF MINISTER IN HAWNG". Mizoram DIPR. Archived from the original on 12 December 2013. Retrieved 14 August 2012.
  13. "Nilaini atangin 'Helicopter Service". The Zozam Times. Archived from the original on 23 September 2015. Retrieved 20 August 2012.
  14. "Accredited Journalists". DIPR Mizoram. Archived from the original on 19 June 2013. Retrieved 5 September 2012.
  15. "Vanglaini - Mizo Daily Since 1978". vanglaini.org. Retrieved 30 June 2010.
  16. "The Zozam Times". Archived from the original on 7 January 2014. Retrieved 7 September 2012.
  17. "The Aizawl Post". Archived from the original on 3 January 2014. Retrieved 7 September 2012.
  18. "Virthli". Archived from the original on 27 మార్చి 2013. Retrieved 7 September 2012.
  19. "The Mizoram Post". Retrieved 7 September 2012.
  20. "Zozam Weekly". Archived from the original on 18 May 2014. Retrieved 7 September 2012.
  21. "AIR buatsaih FM Zoawi chu le". Vanglaini. Archived from the original on 11 నవంబరు 2012. Retrieved 27 August 2012.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  22. "Biggest family: Ziona Chana has 39 wives and 94 children: a world record". worldrecordsacademy.org. 21 February 2011. Archived from the original on 2 ఏప్రిల్ 2012. Retrieved 24 October 2011.
  23. Kohhran, Thianghlim. "Solomon's Temple". Archived from the original on 24 డిసెంబరు 2013. Retrieved 30 December 2013.
  24. "The Mizoram University Act of 25 April 2000". Archived from the original on 3 August 2012. Retrieved 25 May 2014.
  25. "CENTRAL HEALTH SERVICES LEH AIIMS DOCTOR TEN CHIEF MINISTER HMU". DIPR. Archived from the original on 1 February 2014. Retrieved 15 August 2012.
  26. tirhkahthawla. "Mualpui Stadium Design". misual.com. Archived from the original on 27 May 2013. Retrieved 14 August 2012.
  27. "Lammual-ah Gallery sak hna tan dawn ta". The Zozam Times. Archived from the original on 15 April 2013. Retrieved 16 August 2012.

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఐజాల్&oldid=4011880" నుండి వెలికితీశారు