ఐటి
ఐటి పూర్తి పేరు ఇన్ఫొర్మేషన్ టెక్నాలజి (Information Technology). దీనిని ఐసిటి ( Information and Communication Technology) అని కూడా పిలుస్తారు. ఈ రంగంలోని పొరుగు సేవలలో భారతదేశం, ప్రపంచంలో పేరుగాంచింది. ఇది మొదట సాఫ్ట్వేర్ సేవలతో, ఎగుమతి ప్రధానంగా ప్రారంభమైనా, తరువాత దీని ఆధారంగా కల బిపిఒ రంగంతో అనేక వ్యాపార రంగాలలోకి మరియు జాతీయ/స్థానిక వ్యాపారాలలోకి విస్తరించింది. ఉద్యోగాల కల్పనలో ఈ రంగం ప్రధాన పాత్ర వహిస్తున్నది.
విషయ సూచిక |
[మార్చు] అంధ్రప్రదేశ్ లో ఐటి
సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా, హైద్రాబాద్ వారి గణాంకాల ప్రకారం[1]ఆంధ్ర ప్రదేశ్ [2] లో ఐటి పరిశ్రమ ఈ క్రింది విధంగా వుంది.
| సంవత్సరము | ఎగుమతులు (రు కోట్లలో) | ప్రత్యక్ష ఉద్యోగులు |
|---|---|---|
| 2002-03 | 3668 | 71445 |
| 2003-04 | 5025 | 85945 |
| 2004-05 | 8270 | 126920 |
| 2005-06 | 12521 | 151789 |
| 2006-07 | 18582 | 187450 |
| 2007-08 | 26122 | 239000 |
| 2008-09 | 32509 | 251786 |
2008-09 లో రు. 32,509 కోట్ల ఎగుమతులతో, 24.5% వృద్ధి సాధించింది. జాతీయ స్థాయిలో పెరుగుదల 20.65 శాతంగా వుంది. జాతీయ ఐటి ఎగుమతులలో రాష్ట్రం వాటా 15 %. 55శాతం ఐటి సేవలు, 20 శాతం బిపిఒ,25శాతం, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ మరియు ఇతరాలుగా వున్నాయి. రాష్ట్రం మొత్తం ఎగుమతులలో 52.09% ఐటి రంగానికి చెందినవి. ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, టిసిఎస్, విప్రో, జెన్పాక్ట్, ఒరాకిల్, డెల్,యుబిఎస్,సీమెన్స్. సొనాటా, పాట్నీ, యూనిసిస్, కన్వర్జిస్, గూగుల్ ప్రముఖ సంస్ధలు హైద్రాబాద్లో, తమ కార్యకలాపాలను విస్తరించాయి. 2,51,786 మంది ప్రత్యక్ష ఉద్యోగులతో దేశంలో ఐటి-బిపిఒ ఉద్యోగులలో రాష్ట్రం వాటా 11.44శాతం. అనుబంధ పరిశ్రమ (లేక పరోక్షంగా) ఉద్యోగులు 7,92,000తో,మొత్తం 9,06,430 మంది ఉపాధి పొందుతున్నారు.ఐటి పరిశ్రమ హైద్రాబాద్ , విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, వరంగల్ లలో ప్రధానంగా వుంది.
[మార్చు] ప్రారంభ దశలోఉద్యోగాల నియామకం
ఐటిలో పెద్దసంస్థలు ప్రముఖ వృత్తి విద్య కాలేజీ ప్రాంగణాలలో చివరి సంవత్సర విద్యార్థులకు ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహించి, ఉద్యోగులను ఎంపిక చేస్తారు. ఎక్కువ మార్కులు సాధించిన వారికిఅవకాశాలు ఎక్కువ. ఆ తరువాత స్థాయిలో సిడాక్ డిప్లొమా లాంటి కోర్సులు చదివినవారినికూడా కాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు. ఆ పై, రిఫరల్ ద్వారా, నేరుగా ఆఫీసులో ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహించి, ఉద్యోగులను ఎంపిక చేస్తారు.
- బిపిఒ నియామకాలకు చూడండి
- బిపిఒ
[మార్చు] జెకెసి
2004లో జవహర్ విజ్ఞాన కేంద్రాలను(Jawahar knowledge Centre JKC), ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో, ఇన్సిట్యూట్ ఆఫ్ ఎలెక్ట్రానిక్ గవర్నెన్స్ (Institute of Electronic Governance)[3] ద్వారా ప్రారంభించారు.విద్యార్థి పాఠ్యప్రణాళికద్వారా నేర్చుకొనే నైపుణ్యాలకి, ఉద్యోగానికి కావల్సిన నైపుణ్యాలకి వున్న ఖాళీని పూరించటానికి ఇవి ఉ పయోగపడ్తాయి. ఆధునిక కంప్యూటర్ లాబ్, సాఫ్ట్ స్కిల్స్, ప్రాజెక్ట్ మేనేజిమెంట్,కమ్యూనికేషన్ నైపుణ్యాలులో శిక్షణ ఇస్తారు.2004 నుండి 2009 వరకు 2,01,320 మంది విద్యార్థులు శిక్షణ పొందారు.[2]
[మార్చు] ఇవీ చూడండి
[మార్చు] వనరులు
- ↑ అంధ్రప్రదేశ్ లో ఐటి పరిశ్రమ 2009 మార్చి అంతానికి ఐటి గణాంకాల ప్రజంటేషన్
- ↑ 2.0 2.1 సామాజిక, ఆర్థిక సర్వే 2009-10 - సంకలనం రఘురామ్
- ↑ ఇన్సిట్యూట్ ఆఫ్ ఎలెక్ట్రానిక్ గవర్నెన్స్ వెబ్సైటు
|
||||||||