ఒంటరితనం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఒంటరితనం (Loneliness) అనేది ప్రజల అనుభవంలోకి వచ్చే శూన్యత మరియు ఏకాంతానికి సంబంధించిన ఒక బలమైన అభిప్రాయాన్ని గురించిన భావన. ఒంటరితనం తరచుగా శూన్యం, ఉపేక్షించబడటం మరియు అప్రాధాన్యంగా భావించబడటంతో పోల్చబడుతుంది. ఒంటరిగా ఉండే ఒక వ్యక్తికి వ్యక్తుల మధ్య సంబంధాలను బలంగా ఏర్పరచుకోవటం కష్టంగా ఉంటుంది.

“ఒంటరితనం” అనే మాటను తొలిసారిగా వాడినట్లు నమోదైన వాటిల్లో ఒకటి విలియం షేక్‌స్పియర్ వ్రాసిన కొరియోలనస్ లోని “ఒంటరి డ్రాగన్‌లా నేను ఒంటరిగా పోయినప్పటికీ…” యాక్ట్ IV సీన్ 1.[1]

ఏకాంతం నుండి వ్యత్యాసం[మార్చు]

జీన్ జాక్విస్ హెన్నర్, సాలిట్యూడ్

ఒంటరితనం అంటే ఒంటరిగా ఉండటం అని అర్థం కాదు. సంఘటనలు లేదా అవకాశాలను బట్టి చాలామంది ఒంటరిగా ఉండే సమయాలుండవచ్చు. ఒంటరితనమనేది వ్యక్తుల నియంత్రణలో ఉన్నట్లయితే, ఒంటరిగా ఉండటాన్ని సానుకూలంగా, ఉల్లాసకరంగా మరియు భావావేశపరంగా పునరుత్తేజం పొందటంగా అనుభూతించవచ్చు. ఏకాంతం స్థితి అంటే ఒంటరిగా మరియు ఇతర వ్యక్తుల నుండి వేరుగా ఉండటం, మరియు తరచుగా స్పృహతోనే ఒంటరిగా ఉండే అవకాశం కల్పించుకోవటంగా సూచించవచ్చు. ఉపేక్షింపబడిన ఏకాంతం నుండి వచ్చే ఫలితమే ఒంటరితనం. ఒంటరితనం, ఒంటరిగా ఉన్నప్పుడే కాదు, జనసమ్మర్ధం ఉన్న ప్రదేశాల్లో ఉన్నప్పుడు కూడా, అనుభవంలోకి రావచ్చు. దాన్ని వ్యక్తిగత గుర్తింపు, అర్ధం చేసుకోవటం లేదా కరుణ లేకపోవటంగా కూడా వర్ణించవచ్చు. ఒక వ్యక్తి భౌతికంగా ఇతరుల నుండి వేరు చేయబడ్డాడా లేదా అనే దానితో నిమిత్తం లేకుండా, ఒంటరితనం, ఇతర స్వతంత్ర వ్యక్తుల నుండి వేరు చేయబడిన భావనగా వర్ణింపబడుతుంది. నెరవేరని, అంతేకాదు పొందలేమనిపించే ప్రేమ లేదా సాహచర్యం గురించిన బలమైన కోరికగా కూడా దీన్ని వర్ణించవచ్చు. లేదా ఒకరి జీవితంలో ప్రేమ రాహిత్యం నుండి విస్తరించిందనవచ్చు, కాబట్టి తిరస్కారం, నైరాశ్యం మరియు హీనమైన ఆత్మగౌరవం వంటి భావోద్రేకాలకి దారి తీయవచ్చు. ఒంటరితనం యొక్క భావనలు, మృత్యుభావనలు లేదా ప్రియమైన వారిని పోగొట్టుకున్న భావనలకి సమానంగా ఉండవచ్చు.

వ్యక్తులుగా ఎదగటంలో, మానవులు పుట్టుకతో ఒక వేర్పాటు ప్రక్రియని ప్రారంభిస్తే, అది కౌమారం వైపు స్వతంత్రంగా ఎదగటంతో పాటు కొనసాగుతుంది. ఆ విధంగా ఒంటరిగా భావించటం ఒక ఆరోగ్యకరమైన భావోద్రేకం, నిజానికి ప్రజలకు దూరంగా ఉండే ఒక నిర్ధిష్ట కాల వ్యవధిలో ఒంటరిగా ఉండటాన్ని ఎంచుకోవటం నిస్సందేహంగా సుసంపన్నమైనది[citation needed]. ఏమైనా, ఒంటరితనాన్ని అనుభూతి చెందించాలంటే, గాఢమైన స్థాయిలో, భరించలేనంతగా వేర్పాటుదనాన్ని, ప్రతిఘటించలేనంత ఎక్కువగా భావించగలగాలి. ఇది, పరిత్యజించబడిన, తిరస్కారం, నిస్పృహ, అభద్రత, ఆందోళన, నిరాశ, తగనిది, అర్దరహితం మరియు నిరసన భావం వంటి అనుభూతులను వ్యక్తపరచగలదు. ఈ అనుభూతులు గనక కొనసాగినట్లయితే, అవి దుర్బలంగా తయారుకావచ్చు మరియు దీని బారిన పడిన వ్యక్తులు ఆరోగ్యకరమైన సంబంధాలను మరియు జీవన శైలులను అభివృద్ధి చేసుకోకుండా ఇది అడ్డుకోవచ్చు. ఒక స్వతంత్ర వ్యక్తి, అతడు లేదా ఆమె ప్రేమించబడటం లేదని గనుక నమ్మించబడితే, ఇది బాధాపూరిత అనుభవాన్ని మరియు సాంఘిక పరిచయాలను నివారించే సంభావ్యతను పెంచుతుంది. హీనమైన ఆత్మగౌరవం, సాంఘిక సంబంధాలు లేకపోవటానికి పెంచి పోషిస్తుంది, అది ఒంటరితనానికి దారి తీస్తుంది.

కొందరు వ్యక్తులలో, తాత్కాలికమైన లేదా కొనసాగించబడిన ఒంటరితనం, గమనించదగినంత కళాత్మక మరియు సృజనాత్మక వ్యక్తీకరణకి దారితీస్తుంది; ఉదాహరణకి కవి ఎమిలీ డికిన్‌సన్ విషయంలో, మరియు అసంఖ్యాక సంగీత కారుల విషయంలో ఇది రుజువైంది. అంటే దీనర్ధం ఒంటరితనం ఒక్కటే సృజనాత్మకతను ఇస్తుందని కాదు, అది కళాకారుడి యొక్క కళాత్మక విషయాన్ని ప్రభావితం చేయవచ్చు.

సామాన్య కారణాలు[మార్చు]

వ్యక్తులు ఎన్నో కారణాల వలన ఒంటరితనాన్ని అనుభూతి చెందవచ్చు, మరియు ఎన్నో జీవిత సంఘటనలు దానితో ముడిపడి ఉండవచ్చు. బాల్యంలోనూ మరియు ఎదుగుతున్న వయస్సులో స్నేహసంబంధాలు లేకపోవటం లేదా ఒక వ్యక్తి చుట్టూ భౌతికంగా అర్ధవంతమైన వ్యక్తులు లేకపోవటం, ఒంటరితనానికి, నైరాశ్యానికి, మరియు బలవంతపు బ్రహ్మచర్యానికి కారణాలౌతాయి. అదే సమయంలో, ఒంటరితనం, మరొక సాంఘిక లేదా దీర్ఘకాలిక నిస్పృహ వంటి మానసిక సమస్యకు బాహ్యలక్షణం కావచ్చు.

ఎక్కువమంది, శిశువుగా వారు ఒంటరిగా విడిచిపెట్టబడినప్పుడు, తొలిసారి ఒంటరితనాన్ని అనుభూతి చెందుతారు. అది మరింత సాధారణం కూడా, సాధారణంగా తాత్కాలికమైనా, ఇది, ఏదైనా ముఖ్యమైన సుదీర్ఘకాలం కొనసాగిన బంధం కోల్పోవటం లేదా విడాకులు లేదా విచ్ఛిన్నం కావడం పర్యవసానంగా సంభవిస్తుంది. ఇలాంటి సందర్భాలలో, ఒక ప్రత్యేక వ్యక్తిని కోల్పోవటం మరియు ఒక సంఘటన లేదా దానితో ముడిపడిన విషాదం కారణంగా, సాంఘిక వలయాల నుండి వేరు చేయబడటం, రెండింటి నుండి ఇది శాఖగా విస్తరించవచ్చు.

ఒకరి జీవితంలో, ముఖ్యమైన వ్యక్తిని కోల్పోవటం ఒక దుఃఖపూరిత స్పందనని తీవ్రంగా ప్రారంభిస్తుంది; ఇలాంటి సందర్భంలో, ఇతరుల సాహచర్యంలో ఉన్నాగానీ, ఆ వ్యక్తి ఒంటరిగా అనుభూతి చెందుతాడు. ఒంటరితనం ఒక బిడ్డకు జన్మనిచ్చాక (ప్రసవానంతర నిస్పృహ ద్వారా) వివాహం లేదా స్వంత పట్టణం నుండి విశ్వవిద్యాలయ ఆవరణకి లేదా పరిచయం లేని ఆవరణకి లేదా పాఠశాలకి వెళ్ళటం వంటి అంతరాయం కలిగించే సాంఘిక సంఘటన తర్వాత సంభవించవచ్చు. అస్థిరమైన వివాహాలు లేదా అదే విధమైన ఇతర సన్నిహిత బంధాలలో ఒంటరితనం సంభవిస్తుంది. అట్టి బంధాల్లో కోపం లేదా నిరసన భావం వంటి భావనలు జతపడి ఉంటాయి లేదా ప్రేమ భావన ఇవ్వబడి లేదా పుచ్చుకోబడి ఉండదు. ఒంటరితనం, సమాచార ప్రసారం యొక్క ఆటంకంగా ప్రతిబింబిస్తుంది. తక్కువ జనసాంద్రత గల ప్రదేశాల నుండి ఫలితంగా వస్తుంది. అట్టి ప్రదేశాల్లో పరస్పరం వ్యవహరించేందుకు సాపేక్షంగా తక్కువమంది వ్యక్తులుంటారు. ఒంటరితనాన్ని అధిగమించటానికి జీవనవిధానంలో మార్పుల కనుగుణంగా నిర్వహించటాన్ని నేర్చుకోవటం తప్పనిసరిగా అవసరం.

ఒక జంట అధ్యయనం, పెద్దల ఒంటరితనంలో పరిగణించదగిన వ్యత్యాసాలలో దాదాపు సగం జన్యుపరంగా ఉంటాయనటానికి ఋజువులు కనుగొన్నది. ఇది పిల్లల్లో గతంలో కనుగొనబడిన వారసత్వ అంచనాలకు సారూప్యంగా ఉంది. ఈ జన్యువులు స్త్రీ పురుషులలో ఒకేమాదిరిగా పనిచేస్తాయి. ఈ అధ్యయనం పెద్దవారి ఒంటరితనంలో ఏ విధమైన సాధారణ పర్యావరణ భాగస్వామ్యాన్ని కనుగొనలేదు.[2]

ఒంటరితనాన్ని ఒక వ్యాధి వలె వ్యాపించే సమర్ధత గల ఒక సాంఘిక దృగ్విషయంగా చూడవచ్చు[3].

వర్గీకరణ శాస్త్రం[మార్చు]

సాధారణ రకాలు[మార్చు]

ఒంటరితనాన్ని క్రింది విభాగాలుగా క్లుప్తీకరించవచ్చు:

 • సంఘటనాత్మకం - బంధాన్ని పోగొట్టుకోవటం, కొత్త నగరానికి పోవటం.
 • వృద్ధిపూర్వకం - స్వతంత్రత కోసం, స్థిరమైన స్నేహం కోసం.
 • అంతర్గతం - తరచుగా హీనమైన ఆత్మగౌరవం మరియు దుర్బలత యొక్క భావాలు జతపరచబడటం.

ఒకోసారి ఒకటి కంటే ఎక్కువ విభాగాలు మిళితమై కూడా ఇది సంభవించవచ్చు.

సాధారణ లక్షణాలు[మార్చు]

ఒంటరితనం సాంఘికంగా చాలినంత ప్రభావం లేకపోవటం వంటి భావనలను రేకెత్తిస్తుంది. ఒక ఒంటరి వ్యక్తి, స్త్రీగానీ పురుషుడు గానీ వారిలో ఏదో లోపముందని నమ్మించబడతారు, ఇంకా ఏ ఒక్కరూ వారి పరిస్థితిని అర్ధం చేసుకోరు. అలాంటి వ్యక్తి నమ్మకాన్ని కోల్పోతారు ఇంకా మార్పు తెచ్చుకునే ప్రయత్నానికి వ్యతిరేకంగా తయారౌతారు, లేదా మరింతగా సాంఘిక తిరస్కారానికి గురౌతామన్న భయంతో, కొత్త విషయాలకై ప్రయత్నించడానికి విపరీతంగా భయపడతారు. కొన్ని విపరీత సందర్భాలలో, ఒక వ్యక్తి శూన్యత యొక్క జ్ఞానాన్ని అనుభూతి చెందుతాడు, అది వైద్యపరంగా నిస్పృహ స్థితికి దారి తీయవచ్చు.

ఆధునిక సమాజంలో[మార్చు]

భారీ జనాభా ఉన్న నగరాలలో ఒంటరితనం తరచుగా సంభవిస్తూ ఉంటుంది; ఈ నగరాల్లో అనేకమంది ప్రజలు పూర్తిగా ఒంటరితనాన్ని, సమూహంతో వేరుపడిని స్థితిని అనుభూతి చెందుతుంటారు. వారు ఊరూ పేరూ లేని సమూహంలో కమ్యూనిటీ గుర్తింపును కోల్పోయినట్లు భావిస్తుంటారు. అత్యధిక జనాభా సాంద్రత ద్వారా మాత్రమే ఒంటరితనం పెంచి పోషించబడుతుందనేది స్పష్టం కాలేదు లేదా ఈ సామాజిక వ్యవస్థ ద్వారా పెంచి పోషించబడిన మానవ స్థితిలో ఒక భాగం అనే విషయం కూడా స్పష్టం కాలేదు. నిస్సందేహంగా, చిన్న జనాభాను కలిగిన సమాజాల్లో కూడా ఒంటరితనం సంభవిస్తుంటుంది, అయితే నగరంలో రోజు వారీ జీవితంలో సంబంధంలోకి వచ్చే ప్రజల సంఖ్య క్లుప్తంగా అయినా సరే, వారితో మరింత లోతైన సంబంధాలు పెట్టుకోవడానికి అడ్డంకులను పెంచవచ్చు, దీనివల్ల జన సమూహం నుంచి తాము వేరుపడి పోయిన అనుభూతిని వారిలో పెంచవచ్చు. సంబంధాల పరిమాణం అనేది సంబంధాల నాణ్యతను నిర్వచించలేదు.[4]

ఒంటరితనం అనేది ప్రత్యేకించి ఆధునికకాలాల్లో అధికంగా కనిపిస్తూంటుంది. ఇరవయ్యో శతాబ్దం ప్రారంభంలో కుటుంబాలు పెద్దవిగాను, మరింత స్థిరంగాను ఉండేవి, విడాకులు అరుదుగా మాత్రమే ఉండేవి మరియు కొద్దిమంది ప్రజలు మాత్రమే ఒంటరిగా జీవించేవారు. యునైటెడ్ స్టేట్స్‌,లో 1900లో 5% ఇళ్లు మాత్రమే సింగిల్ పర్సన్ ఇళ్లుగా ఉండేవి: 1995 నాటికి 24 మిలియన్ అమెరికన్లు ఒంటరిగా జీవించేవారు: 2010 నాటికి ఈ సంఖ్య 31 మిలియన్లకు పెరుగుతుందని అంచనా వేయబడింది.[5]

1985లో అమెరికన్లలో ఒక్కొక్కరికి ముగ్గురు స్నేహితులు ఉండగా ఇప్పుడు సగటున ఇద్దరు స్నేహితులు మాత్రమే ఉంటున్నారని అమెరికన్ సోషలాజికల్ రివ్యూ లో 2006లోని ఒక అధ్యయనం తెలిపింది. ఆత్మ విశ్వాసం లేని ప్రజల శాతం ఈ కాలంలో 10% నుంచి దాదాపు 25%కి పెరిగింది; తమకు నమ్మకమైన వారు ఒక్కరు మాత్రమే ఉన్నారని (తరచుగా వారి భార్యలు మాత్రమే) మరో 19% మంది చెప్పారు, సంబంధం ముగిసిందంటే తీవ్రమైన ఒంటరితనం ప్రమాదం ముంచుకొస్తుందని ఇది చెబుతోంది.[6]

ఒంటరితనం అనేది ఇంటర్నెట్ ఉపయోగంతో గట్టి సంబంధాన్ని కలిగి ఉంది,[7] మరియు ఒంటరితనంతో బాధపడుతున్న అనేకమంది ప్రజలు సహాయం పొందడానికి లేదా తమ బాధను తగ్గించుకోవడానికి ఇంటర్నెట్ సైట్లకు తరలి వెళుతున్నారు, ఇది "నేను ఒంటరిగా ఉన్నాను ఎవరైనా నాతో మాట్లాడతారా" వంటి దృగ్విషయంలో కనబడుతున్నట్లుగా ఉంటుంది.

మానవ స్థితివలే[మార్చు]

ఒంటరితనం అనేది మానవుడి అస్తిత్వ సారాంశమని అస్తిత్వవాద ప్రాపంచిక దృక్పథం చెబుతోంది. ప్రతి మానవప్రాణి ఈ ప్రపంచంలోకి ఒంటరిగా వస్తున్నాడు విడి వ్యక్తిలాగానే జీవితంలో పయనిస్తున్నాడు, ఒంటరిగానే మరణిస్తున్నాడు. దీనికి అనుగుణంగానే, ఒంటరితనాన్ని అంగీకరించాలి, కొంత దయ మరియు సంతృప్తితో మన స్వంత జీవితాలను మలుచుకోవడాన్ని నేర్చుకోవడమే మానవ స్థితి.[8] సాత్రే వంటి కొంతమంది తత్వవేత్తలు జ్ఞానమీమాంసాపరమైన ఒంటరితనంని నమ్ముతారు, ఒంటరితనం అనేది మానవ స్థితిలో మౌలిక భాగమని, జీవితానికి అర్థం తెలుసుకోవడానికి మనిషి చైతన్యం యొక్క ఆకాంక్షకు మధ్య అభాస అనేది ఒంటరితనంతో మరియు విశ్వ శూన్యతతోను కలిసి పోతుందని వీరి నమ్మిక. అయితే, ఇతర అస్తిత్వ వాద చింతనాపరులు దీనికి భిన్నంగా వాదిస్తున్నారు. మానవ ప్రాణులు భావప్రసారం చేస్తూ, సృష్టిస్తున్నారు కనుక పరస్పరం మరియు విశ్వంతో కార్యకలాపాలలోను నిమగ్నం కావచ్చు మరియు ఒంటరితనం అనేది ఈ ప్రక్రియ నుండి వైదొలుగుతున్న అనుభూతి మాత్రమే.

ప్రభావాలు[మార్చు]

దీర్ఘకాలిక ఒంటరితనం (ప్రతి ఒక్కరూ ఆయా కాలాల్లో అనుభూతి చెందే సాధారణ ఒంటరితనంకి భిన్నమైనది), అనేది తీవ్రమైన, జీవితానికి ప్రమాదకారిగా మారే స్థితి. కనీసం ఒక అధ్యయనం దీనితో ప్రయోగాత్మకంగా సానుకూలంగా నిరూపించబడింది, బాహ్య ప్రపంచానికి తమ ఒంటరితనాన్ని దాచి పెట్టి ఉంచేవారిలో కేన్సర్ వచ్చే ప్రమాదముందని ఈ అధ్యయన చెప్పింది.[9] ఇది గుండెపోటు మరియు కార్డియో వాస్క్యులర్ వ్యాధి పెరుగుదలకు దారి తీసే ప్రమాదముంది.[5] సామాజికంగా ఒంటరితనానికి గురైన ప్రజలు కూడా నిద్రలేమికి గురవుతున్నారని నివేదించబడింది అందుచేత వ్యాధి గుర్తింపు ప్రక్రియ వీరిలో క్షీణించిపోతుంది.[10] ఒంటరితనం అనేది నిస్పృహతో కూడా ముడిపడి ఉంది, ఇది ఆత్మహత్యకు ప్రమాద హేతువు.[11] ఎమిలి డర్క్‌హైమ్ కూడా ఒంటరితనాన్ని వర్ణించాడు, ప్రత్యేకించి ఇతరుల కోసం జీవించడానికి సామర్థ్యం లేకపోవడం లేదా సంసిద్ధత లేకపోవడం (అంటే స్నేహం కోసం లేదా పరహితాన్ని కోరే భావాల కోసం జీవించడం) గురించి ఇతడు పేర్కొన్నాడు, "అహంభావ పూరితమైన" ఆత్మహత్యకు ఇదే ప్రధాన కారణమని ఇతడు అంటాడు.[12] ఒంటరితనం అనేది మానసికోన్మాద ప్రవృత్తిని కలిగి ఉండటంతో ముడిపడి ఉంటుంది, చాలా తరచుగా వ్యక్తులు ప్రపంచాన్ని విభన్నంగానే చూస్తుంటారు మరియు అనుభూతులు కూడా ఇతరులకు పరాయిగానే ఉంటాయి, దీన్నే 'ప్రవాసంలో ఆత్మ' అని వర్ణించబడింది.(క్లెయిన్ 1995).

ఒంటరితనం మధ్యం మత్తులో కూడా భాగమై ఉంటుంది. పిల్లలలో, సామాజిక సంబంధాలు లేకపోవడం అనేది పలు సంఘవ్యతిరేక మరియు స్వీయ విధ్వంసక ప్రవర్తనా రూపాలతో నేరుగా ముడిపడి ఉంటుంది, ఇది చాలా వరకు శత్రుస్వభావంతో మరియు దోష ప్రవృత్తితోనూ ఉంటుంది. పిల్లలు మరియు పెద్దలలో, ఒంటరితనం అనేది తరచుగా నేర్చుకోవడం మరియు జ్ఞాపకంపై వ్యతిరేక ప్రభావం వేస్తుంటుంది ఇది నిద్ర స్థితిగతులపై ప్రభావం చూపుతుంది, అలాగే పైన సూచించబడిన ఇతర ప్రభావాలు కూడా దైనందిన జీవితంలో పని చేసే సామర్థ్యంపై విధ్వంసకర ప్రభావాన్ని చూపుతుంటాయి.[11]

మరికొన్ని ప్రభావాలు సంవత్సరాలుగా కూడా లక్షణాలను బయట పెట్టవు. ఒంటరితనంలో ఉన్నవారు IL-6 లెవల్‌ని అంటే గుండె వ్యాధితో సంబంధముండే రక్త రసాయన స్థితి పెరుగుతూ ఉంటుందని 2005లో, U.S. ఫ్రేమింగ్హామ్ హార్ట్ స్టడీ అధ్యయన పలితాలు వెల్లడించాయి. చికాగో యూనివర్శిటీలోని సెంటర్ ఫర్ కాగ్నిటివ్ అండ్ సోషల్ న్యూరోసైన్స్‌లో 2006లో జరిగిన ఒక పరిశోధన, ఒంటరితనం అనేది 50 ఏళ్ల వయసు ఉన్న పెద్దలలో రక్తపోటును 30 పాయింట్ల మేరకు పెంచుతుందని కనుగొంది. చికాగో యూనివర్శిటీకి చెందిన మనస్తత్వశాస్త్రజ్ఞుడు, జాన్ కసియోప్పో నిర్వహించిన మరొక సర్వేలో, తాము ఒంటరిగా ఉంటున్న రోగుల కంటే కుటుంబం మరియు స్నేహితులతో బలమైన అనుబంధం కలిగిన రోగులకు మెరుగైన వైద్య సంరక్షణను అందించినట్లు వైద్యులు పేర్కొన్నట్లు తెలిసింది.

2008లో కాసియోప్పో రాసిన ఒంటరితనం: మానవ స్వభావం మరియు సామాజిక అనుసంధానం అవసరం పుస్తకం, ఒంటరితనం అనేది ఎరుకను, మానసిక శక్తిని అడ్డుకుంటుందని, రోగనిరోధక కణాలలో DNA పరివర్తనను మారుస్తుందని, మరియు అధిక రక్తపోటుకు దారితీస్తుందని వివరించింది.[13]

బలప్రయోగం ద్వారా ఒంటరితనం (ఏకాంతవాస శిక్ష) అనేది మానవ చరిత్ర పొడవునా శిక్షా పద్ధతిగా ఉంటూ వచ్చింది.

చికిత్స మరియు నివారణ[మార్చు]

ఒంటరితనం, సాంఘిక ఏకాకితనం లేదా వైద్యపరంగా కృంగుబాటుకు చికిత్స చేయడానికి పెక్కురకాల పద్ధతులు వాడుకలో ఉన్నాయి. పెక్కుమంది వైద్యులు, రోగులకు సిఫార్సు చేసే తొలి సోపానం థెరపీ. ఒంటరితనానికి చికిత్స చేయటంలో థెరపీ, ఒక సాధారణ మరియు ప్రభావశీలమైన పద్ధతి మరియు ఇది తరచుగా విజయవంతమౌతుంది. ఒంటరితనం లేదా కృంగుబాటుకు గురైన రోగులకు, 10 నుండి 20 వారాల వ్యవధిలో తీవ్రంగా సంభవించే స్వల్పకాల థెరపీ, అత్యంత సాధారణ పద్ధతి. థెరపీ సమయంలో, సమస్య కారణాలని అర్ధం చేసుకోవటం గురించి నొక్కి చెప్పబడుతుంది, సమస్య నుండి ఉత్పన్నమైన ప్రతికూల ఆలోచనలు, భావనలు, దృక్పధాన్ని విపర్యయ పరచటం, మరియు రోగి అనుసంధాన భావనలు పొందేందుకు సహాయం చేసే మార్గాలు అన్వేషించబడతాయి. కొందరు వైద్యులు ఇతర బాధితులతో అనుసంధానించటం మరియు ఒక సహాయక పద్ధతిగా సామూహిక థెరపీని సిఫార్సు చేస్తారు.[14] వైద్యులు తరచుగా ఒక స్థిరమైన ఏకైక చికిత్స లేదా థెరపీలో కలిపివేసిన చర్యగా, రోగులకు యాంటీ-డిప్రెసంట్స్‌[[]]ను సిఫార్సు చేసారు. సాధారణంగా, ఒక రోగికి సరైన యాంటి-డిప్రెసంట్ ఔషధం కనుగొనబడే వరకూ, కొన్ని ప్రయత్నాలు తీసుకోబడతాయి. కొందరు రోగులు ఒక నిర్ధిష్ట రకమైన ఔషధానికి ప్రతిఘటనని వృద్ది చేసుకుంటారు కూడా, అందుచేత కాలవ్యవధులలో వాటిని మార్చవలసి వస్తుంది.[15]

పెక్కుమంది వైద్యులు కుంగుబాటుకు చికిత్సగా ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తారు. ఈ చికిత్సా పద్ధతులలో వ్యాయామం, ఆహార నియంత్రణ, హిప్నాసిస్, ఎలక్ట్రిక్-షాక్ థెరపీ, ఆక్యుపంక్చర్, మూలికలు, మరియు అనేక ఇతర అంశాలు ఉన్నాయి. ఈ ప్రక్రియలలో పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ పాల్గొన్న పెక్కుమంది రోగులు, కుంగుబాటుకు సంబంధించిన లక్షణాల నుండి ఉపశమనం కలగటాన్ని గుర్తించారు.[16] ఒంటరితనం మరియు కుంగుబాటు రెండింటికీ మరొక చికిత్స పెట్‌ థెరపీ, లేదా యానిమల్-అసిస్టెడ్ థెరపీ, ఇది ఈ విధంగానే పేరు పొందింది. కొన్ని అధ్యాయనాలు మరియు సర్వేలు, అదే విధంగా స్వచ్ఛంద, ఇంకా వర్గాల వ్యవస్థలు సమకూర్చిన వాస్తవ వ్యక్తులు సంఘటనల గురించిన పూర్వగాధలు, స్నేహపాత్ర జంతువులు శునకాలు, పిల్లులు మరియు కుందేళ్ళు కూడా లేదా గినియా పందులు కలిగి ఉండటంతో, కొందరు బాధితులలో ఒంటరితనం మరియు కుంగుబాటుకు చెందిన భావనలు తేలికయ్యాయని వెల్లడయ్యింది. వ్యాధి నియంత్రణ మరియు నివారణ కేంద్రాలుచెప్పిన ప్రకారం, పెంపుడు జంతువులను కలిగి ఉండటంతో అసంఖ్యాక ఆరోగ్యపరమైన ఉపయోగాలున్నాయి. ఒంటరితనపు భావనలని తేలిక చేయటంతో బాటుగా (పెంపుడు జంతువుల సాహచర్యానికి ఆవల, ఇతర పెంపుడు జంతువుల యజమానులతో సాంఘికంగా కలిసిపోయే అవకాశాలు పెరగటం వంటివి సమకూడిన కారణంగా) పెంపుడు జంతువును కలిగి ఉండటం అనేది రక్తపోటు తగ్గటం, కొలెస్ట్రాల్ మరియు ట్రిగ్లైసెరైడ్స్‌ల స్థాయి తగ్గటం వంటి వాటితో ముడిపడి ఉన్నాయి.[17]

నోస్టాల్జియా కూడా పునరుద్ధరణ ప్రభావం కలిగి ఉందని కనుగొనబడింది. సాంఘిక సహాయాన్ని అవగాహన చేసుకోవటం పెరగటంతో ఒంటరితనానికి వ్యతిరేకచర్య ఉంటుంది.[18]

1989 సంవత్సరపు ఒక అధ్యయనం, పెద్ద వయస్సుకల వ్యక్తులలో ఒంటరితనం మీద మతం ప్రముఖమైన ఒక వ్యతిరేక సంబంధం కలిగి ఉందని కనుగొంది; ఆ ప్రభావం, కుటుంబ మరియు మిత్రులతో సాంఘిక సంబంధాల కంటే మరింత అనుగుణ్యంగా ఉంటుందనీ, మరియు మతపూరితం యొక్క విషయాత్మక సిద్ధాంతం ఒంటరితనం మీద ప్రముఖమైన ప్రభావం కలిగించదని కనుగొంది.[19]

ఇవి కూడా చూడండి[మార్చు]

 • వ్యక్తివాదం
 • వ్యక్తుల మధ్య సంబంధం
 • ఒంటరివ్యక్తి
 • సిగ్గు
 • సామాజిక ఆందోళన

సూచనలు[మార్చు]

 1. Shakespeare, William (2008). Coriolanus p. 129. Google Books. ISBN 9780559437052. 
 2. బూమ్‌స్మా, D. I., విలియమ్స్, G., డోలన్, C. V., హాక్లీ, L. C., & కాసియోప్పో, J. T. (2005). పెద్దవారిలో ఒంటరితనానికి జన్యు, పర్యావరణ దోహదాలు: ది నెదర్లాండ్స్ ట్విన్ రిజిస్టర్ స్టడీ. ప్రవర్తనా జన్యుశాస్త్రం. pdf
 3. Park, Alice (2009-12-01). "Time.com". Time.com. సంగ్రహించిన తేదీ 2010-04-02. 
 4. Lonely Nation: Americans Try to Connect in a Country Where Isolation Is Common. Associated Press. 2006-08-06. సంగ్రహించిన తేదీ 2009-05-03 
 5. 5.0 5.1 "Loneliness and Isolation: Modern Health Risks". The Pfizer Journal IV (4). 2000. Archived from the original on 2006-01-28 
 6. McPherson, Miller; Smith-Lovin, Lynn; Brashears, Matthew E (2006). "Social Isolation in America: Changes in Core Discussion Networks over Two Decades" (PDF). American Sociological Review 71 (3): 353–375. doi:10.1177/000312240607100301 Inentaconnect.com
 7. http://escholarship.bc.edu/dissertations/AAI9923427/
 8. యాన్ ఎగ్జిస్టెన్షియల్ వ్యూ ఆఫ్ లోన్లీనెస్ - కార్టర్, మైఖేల్; ఎగ్జర్ప్ట్ ఫ్రమ్ ఎబైడింగ్ లోన్లీనెస్: యాన్ ఎగ్జిస్టెన్షియల్ పర్‌స్పెక్టివ్ , పార్క్ రైడర్ సెంటర్, సెప్టెంబర్ 2000
 9. ప్రమాదకర భావాలతో పోరాటం; హెచ్చరిక: అణిచిపెట్టబడిన ఉద్వేగాలు మీ ఆరోగ్యానికి ప్రమాదరకమైనవని శాస్త్రజ్ఞులు నిర్ధారించలేదు - ఇంకా - స్మిత్, ఎలెనార్; సైకాలజీ టుడే , మే 1988
 10. లోన్లీనెస్ అండ్ పాత్‌వేస్ టు డిసీజ్ (pdf) - హాక్‌లీ, లూయిస్ C. & కాసియెప్పో, జాన్ T.; ఇనిస్టిట్యూట్ ఆఫ్ మైండ్ అండ్ బయాలజీ, యూనివర్శిటీ ఆఫ్ చికాగో, గురువారం 18 జూలై 2002
 11. 11.0 11.1 ది డేంజర్స్ ఆఫ్ లోన్లీనెస్ - మరానో, హరా ఎస్ట్రోఫ్; సైకాలజీ టుడే గురువారం 21 ఆగస్ట్ 2003
 12. సామాజిక నిస్పృహ, ఒంటరితనం, మరియు నిస్పృహ (ఆన్‌లైన్ సోషల్ నెట్‌వ్రర్క్స్ వెబ్‌సైట్)
 13. కాసియెప్పో, జాన్; పాట్రిక్, విలియం, లోన్లీనెస్: హ్యూమన్ నేచుర్ అండ్ ది నీడ్ ఫర్ సోషల్ కనెక్షన్ , న్యూయార్క్ : W.W. నోర్టన్ & కో., 2008. ISBN 978-0-471-78712-9 సైన్స్ ఆఫ్ లోన్లీనెస్.కామ్
 14. "Psychotherapy". Depression.com. సంగ్రహించిన తేదీ 2008-03-29. 
 15. "The Truth About Antidepressants". WebMD. సంగ్రహించిన తేదీ 2008-03-30. 
 16. "Alternative treatments for depression". WebMD. సంగ్రహించిన తేదీ 2008-03-30. 
 17. కుక్కపిల్లల ఆరోగ్య ప్రయోజనాలు (వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రాల నుండి. తిరిగిపొందబడింది 2007-11-14.
 18. జిన్‌యూ జౌ, కాన్‌స్టాంటిన్ సెడైకిడ్స్, టిమ్ వైల్డ్‌స్కట్, డింగ్-గౌ గావో, "కౌంటరాక్టివ్ లోన్లీనెస్: ఆన్ ది రెస్టోరేటివ్ ఫంక్షన్ ఆఫ్ నాస్టాల్జియో", మనస్తత్వ శాస్త్రం , సంచిక. 19, No. 10, pp. 1023 - 1029, Nov. 4, 2008.
 19. "Doyle Paul Johnson, Larry C. Mullins, "Religiosity and Loneliness Among the Elderly ", ''Journal of Applied Gerontology'', Vol. 8, No. 1, 110-131 (1989)". Jag.sagepub.com. doi:10.1177/073346488900800109. సంగ్రహించిన తేదీ 2010-04-02. 

బాహ్య లింకులు[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
"http://te.wikipedia.org/w/index.php?title=ఒంటరితనం&oldid=1170085" నుండి వెలికితీశారు