ఒకరికి ఒకరు
| ఒకరికి ఒకరు | |
|---|---|
| దర్శకత్వము | రసూల్ ఎల్లోర్ |
| నిర్మాత | కిరణ్ |
| రచన | కోన వెంకట్ |
| తారాగణం | శ్రీరామ్, ఆర్తీ ఛాబ్రియా, బాలయ్య, రాధా కుమారి, తనికెళ్ళ భరణి, హేమ, బెనర్జీ, విజయ్ |
| సంగీతం | ఎం.ఎం. కీరవాణి |
| సినిమెటోగ్రఫీ | సునీల్, రాజా |
| కూర్పు | శంకర్ |
| డిస్ట్రిబ్యూటరు | ఆనంది ఆర్ట్స్ |
| విడుదలైన తేదీలు | 9 అక్టోబర్ 2003 |
| నిడివి | 157 min. |
| దేశము | భారతదేశం |
| భాష | తెలుగు |
ఒకరికి ఒకరు 2003 లో విడుదలైన తెలుగు చిత్రం. శ్రీరామ్, అర్తీ ఛాబ్రియా నాయకా నాయికలుగా రసూల్ ఎల్లోర్ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్స్ సంస్థ నిర్మించిన చిత్రం. ప్రముఖ ఛాయాచిత్రకుడు రసూల్ ఎల్లోర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా మారారు.
విషయ సూచిక |
కథ [మార్చు]
కామేశ్వరరావు (శ్రీరామ్) మధ్యతరగతి కుటుంబంలో జన్మిస్తాడు.కుటుంబ పరిస్థితి కారణంగా చిన్నతనం నుండి అన్ని విషయాలలో సర్దుకుపోవలసి వస్తుంటుంది. ఇంజనీరింగ్ ఉత్తీర్ణుడు అయిన తరువాత బామ్మ (రాధా కుమారి) మొక్కు కారణంగా కాశీ వెళ్ళ వలసి వస్తుంది. దారిలో కథానాయకి స్వప్న (ఆర్తీ ఛాబ్రియా పరిచయమౌతుంది. ఇద్దరూ తమ అసలు పేర్లను దాచిపెట్టి రాహుల్, సుబ్బలక్ష్మి గా పరిచయమవుతారు. తమ ప్రేమను వ్యక్త పరుచుకోకుండానే విడిపోతారు.
తరువాత స్వప్న అమెరికాలో ఉన్నట్లు తెలుసుకున్న కామేశ్, ఉద్యోగ నెపంతో ఆమెను వెతకడానికి అమెరికా వెళతాడు. తరువాత అతను స్వప్నను కలుసుకున్నాడా లేదా అన్నది తెర పైన చూడవలసిందే.
నటీ నటులు [మార్చు]
- శ్రీరామ్ -- కామేశ్వరరావు , రాహుల్
- ఆర్తీ ఛాబ్రియా -- స్వప్న, సుబ్బలక్ష్మి
- విజయ్ -- ఆంజనేయులు, పుచ్చు
- రాధా కుమారి -- కామేశ్వరరావు బామ్మ
- తనికెళ్ళ భరణి -- కామేశ్వరరావు తండ్రి
- హేమ -- కామేశ్వరరావు తల్లి
- బాలయ్య -- స్వప్న తాతయ్య
- బెనర్జీ -- కామేశ్వరరావు నాన్న స్నేహితుడు
పురస్కారాలు [మార్చు]
ఉత్తమ నూతన చిత్ర దర్శకుడు -- రసూల్ ఎల్లోర్