ఒమర్ ఖయ్యాం
| ముస్లిం శాస్త్రవేత్తలు, ముస్లిం పండితులు ఇస్లామీయ స్వర్ణయుగం |
|
|---|---|
|
నైషబూర్ లోని ఖయ్యాం సమాధివద్ద, చిత్రం
|
|
| పేరు: | ఒమర్ ఖయ్యాం |
| జననం: | 1048 |
| మరణం: | 1131 |
| సిద్ధాంతం / సంప్రదాయం: | పర్షియన్ గణితం, పర్షియన్ కవిత్వం, పర్షియన్ తత్వం |
| ముఖ్య వ్యాపకాలు: | పర్షియన్ సాహిత్యం, ఇస్లామీయ గణితశాస్త్రం, ఇస్లామీయ తత్వం, ఇస్లామీయ ఖగోళ శాస్త్రము |
| ప్రభావితం చేసినవారు: | అబూ రైహాన్ అల్-బెరూని, అవిసెన్నా |
| ప్రభావితమైనవారు: | |
గియాసుద్దీన్ అబుల్ ఫతహ్ ఒమర్ ఇబ్న్ ఇబ్రాహీం ఖయ్యాం నేషాబూరి (పర్షియన్: غیاث الدین ابو الفتح عمر بن ابراهیم خیام نیشابوری), ఇరాన్ లోని నేషాపూర్ లో మే 18, 1048 న జన్మించాడు. డిసెంబరు 4, 1131) న మరణించాడు. ఇతను పర్షియన్ కవి, గణిత శాస్త్రజ్ఞుడు, ఇస్లామీయ పండితుడు, ఖగోళ శాస్త్రజ్ఞుడు, చరిత్రకారుడు. ఇతనికి ఒమర్ ఖయ్యామీ అని కూడా పిలిచేవారు.[1] [2].
ఇతను కవిగా ప్రసిద్ధి. ఇంకనూ రుబాయిలకు ప్రసిద్ధి. ఇతని రుబాయీలు రుబాయియాత్ ఎ ఖయ్యాం అనే సంకలనం తో ప్రసిద్ధి. ఎడ్వర్డ్ ఫిట్జ్‌గెరాల్డ్ వీటిని తర్జుమా చేసి ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇతను గణిత శాస్త్రము, ఆల్‌జీబ్రా జియోమెట్రీ లలో ప్రసిద్ధి. [2]. ఇతను కేలండర్ తయారుచేశాడు. కోపర్నికస్ ప్రతిపాదించిన చాలాకాలం ముందే సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
ఖయ్యాము అనునది కవియొక్క కలం పేరు(తఖుల్లసస్ నామము/pen name).ఆ కాలములో సాహిత్య రచన చెయ్యు పారసీక కవులందరు సాధారనంగా కలంపేరు/మారు పేరు/pen name తో రచనలు చెయ్యడం పరిపాటి.ఫిరదౌసి,హఫిజ్,అతారి,సాది,జామి,అనునవి ఇటువంటి మారు పేరులే.
ఖయ్యాము యొక్క రుబాయుతుల పురాతనమైన వ్రాత ప్రతి 'ఆక్సుఫర్డు 'లోని బోడ్లీయన్ పుస్తక భాండాగారమున వున్నది.ఆ ప్రతి క్రీ.శ.1460 లో అనగా ఖయ్యాము మరణానంతరము 337 సంవత్సరములకు షిరాజు పట్టణమున వ్రాయబడినది.దానిలో కేవలము 158 రుబాయూలు మాత్రమేకలవు.ఆ తరువాత క్రీ.శ.1528 లో వ్రాయబడిన మరోక ప్రతి ప్యారిసు నగరమందలి 'బిబ్లియోతికె నాసియోనాల్(Bibliotheque nationale)అను గ్రంథాలయంలో వున్నది.అందులో 349 రుబాయూలున్నాయి.ఉమర్ ఖయ్యాము మరణానంతరము 500 సంవత్సరములకు వ్రాయబడిన,540 రుబాయూలున్న ప్రతి బ్రిటిష్ గ్రంథాలయంలో వున్నది.
మొదట బోడ్లియన్ లైబ్రరిలో వున్న ఖయ్యాము రుబాయూతులను గూర్చి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చరిత్రాధ్యాపకుడుగా వున్న ఇ.బి.కోవెల్ క్రీ.శ.1856 లో గుర్తించాడు.ఆయన దానిని గురించి 1858 లో 'కలకత్తా రెవ్యూ'లో ఒక వ్యాసంలో ప్రకటించెను.ఆ మరుసటి సంవత్సరము ఎడ్వర్డు ఫీ'ట్జెరాల్డ్ ,75 రుబాయుతులను ఇంగ్లీషులోకి తర్జుమా చేసెను.క్రీ.శ.1867 లో పారశీక రాజాస్ధానమున ఫ్రెంచి రాయబారికి దుబాసి/ద్విభాషి గా వున్న జె.బి.నికొల రుబాయూలను ఫ్రెంచి భాషలోకి అనువాదం చేసాడు.ఆ తరువాత సంవత్సరంలో ఫే 'ట్ జెరాల్డ్ ఇంకొన్ని రుబాయూలను చేర్చి 101 రుబాయూలున్న పుస్తకాన్ని ముద్రించెను.
ఖయ్యాము నిషాపూరులో జన్మించినప్పటికి బాల్యము బల్ఖలో గడచెను.ఖయ్యాము విద్యాభ్యాసము నిషాపూరులో వున్న సుప్రసిద్ధ శాస్త్రవేత్త ఇమాం మువఫి'క్ అను గురువు వద్ద జరిగినది.ఖయ్యాముకు, నిజాముల్ ముల్కు సహపాఠి,మిత్రుడు.నిజాముల్ ముల్కు అల్‍ఫ్ అర్సలాస్ ప్రభువు వద్ద మంత్రిగా పనిచేసాడు.అర్సలాన్ మరణానంతరము మాలిక్ షా వద్ద మంత్రిగా పనిచేశాడు.నిజాముల్ ముల్కు గొప్ప విద్వాంసుడు,నీతివేత్త.ఈతడు మలిక్ షా కొరకు 'సియాసత్ నామా' అను ప్రసిద్ధమైన పాలనాశాస్త్రమును రచించి పాదుషా పేరు ప్రతిష్టలకు చిరంజీవం కావించెను.అంతేకాదు 'వసాయా'అను పారసీక గ్రంథాన్ని రచించెను.నిజాముల్ ముల్కు అల్‍ఫ్ అర్సలాస్ వద్ద మంత్రిగా పనిచేయున్నప్పుడు అతని వద్దకు ఖయ్యాము వెళ్లగా,తమ పూర్వ స్నేహాన్ని మరవక,ఖయ్యాముకు రాజోద్యోగము ఇప్పించెదనని చెప్పగా,ఖయ్యాము తనకు వుద్యోగం చెయ్యుట యందు ఇఛ్చలేదని,శాస్త్రాద్యాయము చేయుచు,గ్రంథపఠనంచేయుచూవిద్యార్థులకు భోదన చేయూ ఆపేక్ష కలదనిచెప్పెను.అంతట పాదుషాకు చెప్పి సంవత్సరంకు 1200 తోమానులు ఆదాయము వచ్చు జాగీరును నిషాపూరులో ఖయ్యాముకు ఇనాముగా ఇచ్చెను.
ఖయ్యాముకు చిన్నతనమునుండి గణితమునందు మక్కువ ఎక్కువగా వుండెను.గణితములోని జ్యామితి,అంక(అక్షర)గణితమందు ప్రావీణ్యము సంపాదించెను.జ్యోతిశ్సాస్త్రమునందు దిట్ట.ఖయ్యాము అరబ్బీలో అక్షర గణితమును రచించెను.ఈ గ్రంథము చాలా కాలము వరకు ప్రమాణ గ్రంథముగా ఆకాలములో పరిగణింపబడినది.ఈ అరబ్బీ గ్రంథము ప్రెంచిభాషలోకి కూడా అనువాదం చెందినది.ఖయ్యాము దాతు రసాయన శస్త్రము,యూక్లిడ్ జ్యామెట్రికి వ్యాఖ్యానము,ఒక తత్వశాస్త్రము,రిబాయూతులు ఇలా అన్ని కలిపి దాదాపు తొమ్మిది గ్రంథములవరకు రచన చేసెను.వీటిలో అక్షర గణితము,రసాయన శాస్త్రము,జ్యామెట్రి వ్యాఖ్యానముల మాత్రుకలు ప్యారిస్,లేడన్,ఇండియా ఆఫిసు లైబ్రరియల నందు భద్ర పరచబడినవి.
విషయ సూచిక |
సంస్మరణాలు [మార్చు]
1970 లో చంద్రుడి పై గల ఒక క్రేటర్ కు 'ఒమర్ ఖయ్యాం క్రేటర్' అని పేరు పెట్టారు. 1980 లో సోవియట్ యూనియన్ కు చెందిన ల్యూడ్‌మిలా జురవ్‌ల్యోవా కనుగొనిన ఒక సూక్ష్మగ్రహానికి 3095 ఒమర్ ఖయ్యాం అనే పేరు పెట్టారు. [3]
మూలాలు [మార్చు]
- ↑ "Omar Khayyam". Encyclopædia Britannica. (2007). Retrieved on 2007-06-09.
- ↑ 2.0 2.1 "Omar Khayyam". The MacTutor History of Mathematics archive.
- ↑ Dictionary of Minor Planet Names - p.255
ఇతర మూలాలు [మార్చు]
- E.G. Browne. Literary History of Persia. (Four volumes, 2,256 pages, and 25 years in the writing). 1998. ISBN 0-7007-0406-X
- Jan Rypka, History of Iranian Literature. Reidel Publishing Company. 1968. ISBN 90-277-0143-1
ఇవీ చూడండి [మార్చు]
బయటి లింకులు [మార్చు]
- Multilingual Information about Chayyām
- / Omar Khayyam and Max StirnerStudent of eastern and western philosophy, H. Ibrahim Türkdogan, explores the anti-rationalism of Stirner and uncovers rather strong ties to the orient in the person of the renowned Persian philosopher, mathematician, astronomer, and poet.
- [1] - The Best and Free Software of Rubaiyat of Khayam and The PDF File of all his Poems.
- The Persian Poet (http://www.omar-khayyam.org) - Contains the translations by Edward FitzGerald and a biography.
- Persopedia - A source of Persian poetry.
- The Rubaiyat
- On Omar's solutions to cubic equations
- Khayyam, Umar. A biography by Professor Iraj Bashiri, University of Minnesota.
- The Quatrains of Omar Khayyam
- The Keeper: The Legend of Omar Khayyam A recent movie depiction of Omar Khayyam's life
- Rubaiyat Parodies - page about The Rubaiyat of Omar Khayyam, and it's many parodies. Included, with artwork, are The Rubaiyat of Ohow Dryyam, The Rubaiyat of a Persian Kitten, The Rubaiyat of Omar Cayenne, and The Rubaiyat of Omar Khayyam Jr..