ఓ.ఎస్.ఐ నమూనా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఓ.ఎస్.ఐ నమూనా
7. అప్లికేషన్ లేయర్
NNTP  · SIP  · SSI  · DNS  · FTP  · Gopher  · HTTP  · NFS  · NTP  · SMPP  · SMTP  · DHCP  · SNMP  · Telnet  · (more)
6. ప్రజెంటేషన్ లేయర్
MIME  · XDR  · TLS  · SSL
5. సెషన్ లేయర్
Named Pipes  · NetBIOS  · SAP  · SIP  · L2TP  · PPTP
4. ట్రాన్స్‌పోర్ట్ లేయర్
TCP  · UDP  · SCTP  · DCCP
3. నెట్‌వర్క్ లేయర్
IP  · ICMP  · IPsec  · IGMP  · IPX  · AppleTalk
2. డేటా లింక్ లేయర్
ARP  · CSLIP  · SLIP  · Ethernet  · Frame relay  · ITU-T G.hn DLL  · PPP
1. ఫిజికల్ లేయర్
RS-232  · RS-449  · V.35  · V.34  · I.430  · I.431  · T1  · E1  · POTS  · SONET/SDH  · OTN  · DSL  · 802.11a/b/g/n PHY  · 802.15.x PHY  · ITU-T G.hn PHY  · Ethernet  · USB  · Bluetooth

అంతర్జాతీయ ప్రామాణీకరణ సంస్థలో భాగంగా ఓపెన్ సిస్టమ్స్ ఇంటర్‌కనెక్షన్ చేసిన కృషి ఫలితమే ఓ.ఎస్.ఐ నమూనా (OSI model) . ఇది మొత్తం సమాచార వ్యవస్థని చిన్న చిన్న భాగాలుగా విభజిస్తుంది. ఈ భాగాలని లేయర్స్ (పొరలు) గా వ్యవహరిస్తారు. ఒక్కో లేయర్‌లో ఒకే రకమైన విధానసారూప్యత గల విధులు ఉంటాయి. ఇవి తమ పై లేయర్‌కి సేవలు అందిస్తూ, కింద లేయర్ నుంచి సేవలు పొందుతాయి.

ఓ.ఎస్.ఐ నమూనా లో కమ్యూనికేషన్ ( 3 నుండి 5 లేయర్స్ తో ఉదాహరణ)

ఓ.ఎస్.ఐ లేయర్ల వివరణ[మార్చు]

ఓ.ఎస్.ఐ నమూనా
డేటా అంశము లేయర్ విధులు
ఆతిధ్య యంత్రపు
లేయర్లు
(Host layers)
డేటా 7. అప్లికేషన్ Network process to application
6. ప్రజెంటేషన్ Data representation, encryption and decryption, convert machine dependent data to machine independent data
5. సెషన్ Interhost communication
సెగ్మెంట్‌లు 4. ట్రాన్స్‌పోర్ట్ End-to-end connections and reliability, Flow control
ప్రసార సాధన
లేయర్లు
(Media layers)
ప్యాకెట్ 3. నెట్‌వర్క్‌ Path determination and logical addressing
ఫ్రేమ్‌లు 2. డేటా లింక్ Physical addressing
బిట్ 1. ఫిజికల్ Media, signal and binary transmission

లేయర్ 1: ఫిజికల్ లేయర్[మార్చు]

పరికరాల యొక్క భౌతిక, విద్యుత్తు వివరములను ఫిజికల్ లేయర్ నిర్వచిస్తుంది. ముఖ్యంగా, ఇది పరికరం, ప్రసార మాధ్యమం మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తుంది. అంటే, పిన్‌ల యొక్క నమూనా, విపీడనాలు, కేబుల్ వివరాలు, హబ్‌లు, రిపీటర్‌లు, నెట్వర్క్ ఎడాప్టర్‌లు, హోస్ట్ బస్ ఎడాప్టర్‌లు, అనేక ఇతరాల్ని నిర్వచిస్తుంది.
ఫిజికల్ లేయర్ చేసే ముఖ్య పనులు, అందించే సేవలు:

  • ప్రసార మాధ్యమంతో సంబంధం స్థాపించడం, ముగించడం.
  • ప్రసార వనరులను బహుసంఖ్యాక వాడుకరుల మధ్య సమర్ధవంతంగా వినియోగించడం వంటి పనులలో పాల్గొనడం. ఉదాహరణకి, బ్యాండ్‌విడ్త్ వినియోగంలో వివాద పరిష్కరణ, ప్రవాహ నియంత్రణ.
  • మాడ్యులేషన్ : వాడుకరి ఉపకరణంలోని డిజిటల్ డేటా, వాటికి ప్రతిసమానమైన సంకేతముల మధ్య పరివర్తన చేయుట. ఈ సంకేతములు ఫిజికల్ కేబుల్ (కాపర్ లేదా ఆప్టికల్ ఫైబర్) లేదా రేడియో లంకె పై కార్యాచరణ సాగిస్తాయి.
  • ఈ లెయర్ లో 0, 1 తొ సమాఛారమ్ నిక్షిప్తమ్ అయి వున్తుది

లేయర్ 2: డేటా లింక్ లేయర్[మార్చు]

నెట్‌వర్క్ ఎన్టిటీస్ మధ్య డేటాని బదిలీ చేయడం కోసం అవసరమయ్యే విధులు, పద్ధతులు డేటా లింక్ లేయర్ సమకూరుస్తుంది. అంతేగాక, ఫిజికల్ లేయర్‌లో తలెత్తే తప్పులను (ఎర్రర్లని) కనిపెట్టి, వీలైతే వాటిని సవరించే పని కూడా డేటా లింక్ లేయర్ చేస్తుంది. వాస్తవానికి, ఈ లేయర్ పాయింట్-టు-పాయింట్, పాయింట్-టు-మల్టీపాయింట్ ప్రసార సాధనాల కోసం ఉద్ధేసించింది. ఈ లక్షణం టెలీఫోన్ వ్యవస్థలోని వైడ్ ఏరియా మీడియాది. డేటా లింక్ లేయర్ లో డేటా ఫ్రేమ్ రూపంలో ఉంటుంది.

లేయర్ 3: నెట్‌వర్క్‌ లేయర్[మార్చు]

అస్థిరమైన పొడవు గల డేటా క్రమములని (data sequences) మూలం నుండి గమ్యానికి బదిలీ చేయడానికి అవసరమైన విధులు, పద్ధతులని నెట్‌వర్క్ లేయర్ సమకూరుస్తుంది. ఈ క్రమంలో ట్రాన్స్‌పోర్ట్ లేయర్ కోరిన క్వాలిటీ ఆఫ్ సర్వీస్‌ని కూడా అందిస్తుంది. నెట్‌వర్క్ లేయర్ రౌటింగ్ విధులను నిర్వహిస్తుంది. అంతేగాక, ఫ్రాగ్మెంటేషన్, రీఅసెంబ్లీ, డేటా బదిలీలో చోటుచేసుకున్న తప్పులను నివేదించడం వంటి పనులను కూడా ఈ లేయర్ చేస్తుంది. ప్యాకెట్ రూపంలో వుండును.

లేయర్ 4: ట్రాన్స్‌పోర్ట్ లేయర్[మార్చు]

ట్రాన్స్‌పోర్ట్ లేయర్ అంత్య వాడుకరుల మధ్య పారదర్శక సమాచార బదిలీ వంటి సేవలను అందిస్తుంది. దీని వల్ల పై లేయర్లకు విశ్వసనీయమైన సమాచార బదిలీ సేవలు అందుతాయి. ప్రవాహ నియంత్రణ, ఖండీభవనము/విఖండీభవనము, తప్పుల నియంత్రణ వంటి పనులతో ట్రాన్స్‌పోర్ట్ లేయర్ ఒక లింకు యొక్క విశ్వసనీయతను నిర్ధేసిస్తుంది. ట్రాన్స్‌పోర్ట్ లేయర్ సమాచార ఖండాల జాడను కనిపెట్టగలదు, విఫలమయిన వాటిని పునఃబదిలీ చేయగలదు.సెగ్మంట్ రూపంలో వుండును.

లేయర్ 5: సెషన్ లేయర్[మార్చు]

సెషన్ లేయర్ కంప్యూటర్ల మధ్య సంభాషణను (సంబంధాలను) నియంత్రిస్తుంది. ఇది స్థానిక, రిమోట్ అప్లికేషన్ల మధ్య సంబంధాలను స్థాపించడం, వాటిని నిర్వహించడం, ముగించడం వంటి పనులు చేస్తుంది. ఈ లేయర్ ఫుల్-డ్యూప్లెక్స్, హాఫ్-డ్యూప్లెక్స్ లేదా సింప్లెక్స్ ఆపరేషన్లని సమకూరుస్తుంది. అంతేగాక, చెక్‌పాయింటింగ్‌, వాయిదా, ముగింపు, పునఃప్రారంభ పద్ధతులను కూడా స్థాపిస్తుంది. సాధారణంగా రిమోట్ ప్రోసిజర్ కాల్స్‌ను ఉపయోగించే అప్లికేషన్ పర్యావరణాలలో (application environments) సెషన్ లేయర్‌ అమలు చేయబడుతుంది.

లేయర్ 6: ప్రజెంటేషన్ లేయర్[మార్చు]

లేయర్ 7: అప్లికేషన్ లేయర్[మార్చు]