ఔరంగజేబు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Aurangzeb

Aurangzeb as the young emperor

Birth name: అబూ ముజఫ్ఫర్ మొహియుద్దీన్ ముహమ్మద్ ఔరంగజేబ్ ఆలంగీర్
Family name: Timurid
Title: Emperor of Mughal Empire
Birth: November 3, 1618
Birthplace: Dahod
Death: 1707(1707-03-03) (వయసు 88)
Place of death: Ahmednagar
Burial: Valley of Saints
Succeeded by: Bahadur Shah I
Marriage:
Children:

ఔరంగజేబు (మూస:పర్షియన్ (పూర్తి బిరుదు అల్-సుల్తాన్ అల్-ఆజమ్ వల్ ఖాఖన్ అల్-ముకర్రమ్ అబ్దుల్ ముజఫ్ఫర్ మొహియుద్దీన్ ముహమ్మద్ ఔరంగజేబ్ బహాదుర్ ఆలంగీర్ 1, పాదుషా గాజి)

ఔరంగజేబు ఆఖరి మొఘల్ చక్రవర్తిగా 1658 నుంచి 1707 వరకు రాజ్యం చేసాడు. ఈ ఆరవ మొఘల్ చక్రవర్తి భారత దేశాన్ని ఏలినవాళ్ళందిరిలోకీ కూడా అత్యంత వివాదాస్పదమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. ఔరంగజేబు (ఫారసీ పేరుకు అర్థం: సింహాసనానికి వన్నె తెచ్చిన వాడు) కాలంలో మొఘల్ సామ్రాజ్యం అత్యంత విస్తీర్ణం సాధించింది. ఔరంగజేబును ఆలంగిర్ ("ప్రపంచాధినేత") అని కూడ పిలుస్తారు. అతని ముందు వచ్చిన ముఘల్ చక్రవర్తులు సాధరణంగా సర్వమత సామరస్యాన్ని తమ రాజకీయాలలో ఒక భాగం చేసారు. ఆ విధంగా వారు తమ సామ్రాజ్యాన్ని తిరుగుబాటుల నుండి కాపాడుకున్నారు. వారికి విరుధ్ధంగా ఔరంగజేబు ఇతర మతాల వారిని నానా కష్టాలు పెట్టి చెడ్డ పేరు తెచ్చుకున్నాడు.

ఔరంగజేబు గొప్ప దైవ భక్తుడు. మతాచారాలను తు.చ. తప్పకుండ పాటించేవాడు. భారత దేశానికి తను చక్రవర్తి ఐనా, తన స్వంత ఖర్చులు (తిండి బట్టలు సైతం) కేవలం తను టొపీలు కుట్టి సంపాదించిన డబ్బులతొటే పెట్టేవాడని చెప్పుకుంటారు. అతని మత విశ్వాసాల ప్రకారం ముస్లిములు కాని వారిపై జిజియా పన్ను విధించాడు. ఇస్లాం మత శాస్త్రాలప్రకారం ముస్లింలనుండి జకాత్ ముస్లిమేతరులనుండి జిజియా పన్ను వసూలుచేసే సాంప్రదాయమున్నప్పటికీ, అతని పూర్వీకులు జిజియా పన్ను వసూలు చెయ్యలేదు. ఔరంగజేబు మాత్రం ఇద్దరినుండి పన్నులు వసూలు చేసి చెడ్డపేరు తెచ్చుకొని మొఘల్ సామ్రాజ్యం పతనానికి కారకుడయ్యాడు.

ఔరంగజేబు అతని జీవిత కాలంలో గొప్ప భాగం దక్షిణాపథంలో గడిపాడు. అతని 48 సంవత్సరాల పరిపాలనలో మొఘల్ సామ్రాజ్యం దక్షిణాన కర్ణాటక, తమిళనాడుల వరకు విస్తరించింది. అదే సమయంలో ఛత్రపతి శివాజీ నేత్రుత్వంలో మరాఠాలు ముఘల్ ఆధిపత్యానికి గండి కొట్టడం ప్రారంభించారు.

షాజహాన్ మరియు ముంతాజ్ బేగంల మూడవ కొడుకు గుజరాత్ రాష్ట్రం లో దాహోడ్ నగరంలో 1618 నవంబరు 3న పుట్టాడు. పూర్తి పేరు: అబూ ముజఫ్ఫర్ మొహియుద్దీన్ మహమ్మద్ ఔరంగజేబ్ ఆలంగిర్. తన ఆఖరి 27 సంవత్సరాలు దక్కన్లో యుధ్ధాలు చేస్తూ గదిపిన ఔరంగజేబు 1707 మార్చి 3న మరణించాడు. ఆతని సమాధి మహారాష్ట్రలో ఖుల్దాబాద్ గ్రామంలో వుంది.

వింతలూ విశేషాలు[మార్చు]

  • ఔరంగజేబు అలహాబాద్‌ లోని సోమేశ్వరనాథ్‌ ఆలయానికి స్థలాన్నీ, ఉజ్జయని మహాకేశ్వర, చిత్రకూట బాలాజీ, గౌహతి ఉమానంద్‌, శత్రుంజయ జైన్‌ దేవాలయాలకూ, అనేక గురుద్వారాలకూ నిధులనూ ఇచ్చాడు.
  • గోల్కొండ రాజైన తానాషా శిస్తులు వసూలుచేసి ఢిల్లీ పాదుషాకు అప్పగించకుండా కోట్లాది రూపాయలను భూమిలో పాతిపెట్టి దానిమీద జామా మసీదును కట్టించినప్పుడు ఔరంగజేబు ఆ మసీదును పడగొట్టి నిధులను వెలికితీయించి ప్రజోపయోగ కార్యక్రమాలకు వెచ్చించాడు !

మూలాలు[మార్చు]

యితర లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=ఔరంగజేబు&oldid=918905" నుండి వెలికితీశారు