కంగారూ

వికీపీడియా నుండి
కంగారూ[1]
Female Eastern Grey Kangaroo with joey
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ఏనిమేలియా
Phylum: కార్డేటా
తరగతి: క్షీరదాలు
ఉపతరగతి: మార్సుపీలియా
వర్గము: Diprotodontia
ఉపవర్గము: Macropodiformes
కుటుంబము: Macropodidae
ప్రజాతి: మాక్రోపస్
in part
జాతులు
మాక్రోపస్ రుఫస్
మాక్రోపస్ జైగాంటియస్
మాక్రోపస్ ఫులిగినోసస్
మాక్రోపస్ ఏంటిలోపినస్

కంగారూ (ఆంగ్లం Kangaroo) మార్సుపీలియా కు చెందిన క్షీరదము. ఆడజీవులు శిశుకోశాన్ని (మార్సూపియం) కలిగి ఉంటాయి. ఇవి ఆస్ట్రేలియా, టాస్మేనియా, న్యూగినియా దేశాలలో విస్తరించి ఉన్నాయి. తోక పొడవుగా ఆధార భాగంలో లావుగా ఉండి, గెంతినప్పుడు సమతుల్యతకు ఉయోగపడుతుంది. అందువల్ల తోకను కంగారూ యొక్క ఐదవ కాలుగా పేర్కొంటారు. ఇవి శాఖాహార వన్య జంతువులు.

[మార్చు] జాతులు

టాస్మేనియా అడవిలో పరిగెడుతున్న కంగారు.

కంగారులలో నాలుగు ముఖ్యమైన జాతులు ఉన్నాయి:

  • The Red Kangaroo (మాక్రోపస్ రూఫస్): ప్రపంచంలో అన్నింటికన్నా పెద్దవి. ఇవి ఆస్ట్రేలియా మధ్యన ఎడారి ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. ఒక్కొక్కటి రెండు మీటర్లు పొడవుండి 90 కి.గ్రా. బరువుంటాయి.[2]
  • The Eastern Grey Kangaroo (మాక్రోపస్ జైగాంటియస్): ఇవి ఎక్కువగా సారవంతమైన ఆస్ట్రేలియా తూర్పు ప్రాంతంలో నివసిస్తాయి.
  • The Western Grey Kangaroo (మాక్రోపస్ ఫులిగినోసస్): ఇవి దక్షిణ మరియు పశ్చిమ ఆస్ట్రేలియాలలో సముద్ర తీరం వెంట నివసిస్తాయి. ఇంచుమించు 54 కి.గ్రా. బరువుంటాయి.
  • The Antilopine Kangaroo (మాక్రోపస్ ఏంటిలోపినస్): ఇవి ఉత్తర ఆస్ట్రేలియాలో నివసిస్తాయి.

[మార్చు] మూలాలు

  1. Groves, C. (2005). in Wilson, D. E., & Reeder, D. M, eds: Mammal Species of the World, 3rd, Baltimore: Johns Hopkins University Press, 64 & 66. ISBN 0-801-88221-4. OCLC 62265494. 
  2. Red Kangaroos. తీసుకొన్న తేదీ: 2007-01-07.
"http://te.wikipedia.org/w/index.php?title=కంగారూ&oldid=709843" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు