కంప్యూటర్ వైరస్

వికీపీడియా నుండి

కంప్యూటర్ వైరస్ కూడా ఒక ప్రోగ్రామే. నిజజీవితంలో వైరస్ లానే ఇది కంప్యూటర్ ను వాడే వాడుకరికి తెలియ కుండా తన సంఖ్యను తానే పెంచుకోగలదు. సాధారణంగా ఫ్లాపీ, సిడి, పెన్ డ్రైవ్ లాంటి స్టోరేజ్ పరికరాల ద్వారా లేదా ల్యాన్, ఇంటర్నెట్ ద్వారా ఇతర కంప్యూటర్లకు వ్యాపిస్తుంది. కానీ ఇది దానంతట అదే స్వంతంగా పనిచేయదు, వేరే ప్రోగ్రామ్ ని అంటిపెట్టుకుని ఆ ప్రోగ్రాము ఎక్జిక్యూట్ అయినప్పుడల్లా మరికొన్ని ప్రోగ్రాములకు అంటుకోవడానికి ప్రయత్నిస్తుంది. హార్డ్ డిస్కు ను ఫార్మాట్ చెయ్యడం కొన్ని ఫైల్సు ను తీసివేయడం వంటివి వైరస్ లక్షణాలు. ఒక కంప్యూటర్ లోని ఫైల్స్ ను మరొక కంప్యూటర్ వాడినపుడు లేదా నెట్‌వర్క్ ఫైల్ సిస్టమ్ ను వాడు తున్నపుడు ఇవి సులభంగా వ్యాప్తి చెందుతాయి. కంప్యూటర్ వైరస్ ను ఇతర చెడ్డ కంప్యూటర్ ప్రోగ్రాము లైన కంప్యూటర్ వార్మ్, లేదా ట్రోజన్ హార్స్ లతో పొరబడడం సహజమే. అయితే వీటి మద్య కొన్ని తేడాలు ఉన్నాయి. కంప్యూటర్ వార్మ్ వేరే ప్రోగ్రాము సహాయం లేకుండా తనంతట తానే ఇతర కంప్యూటర్లకు వ్యాపించదు. ట్రోజన్ హార్స్ బయటినుంచి చూడడానికి మంచి ప్రోగ్రాము లాగే కనిపిస్తుంది. కానీ దానిని ఎక్జిక్యూట్ చేసినపుడు అసలు స్వరూపం బయట పడుతుంది.

ఇప్పుడు చాలా కంప్యూటర్లు ఇంటర్నెట్ కు అనుసంధానం అయి ఉండటం వలన కొన్ని రకాలైన వైరస్ లు సులభంగా మరియు వేగంగా ఇతర కంప్యూటర్లకు వ్యాపించ గలుగుతున్నాయి

పేజీకి సంభందించిన లింకులు