కకురో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పూరించని కకురో పజిల్

కకురో అనేది సుడోకు లాంటి అంకెలు నింపే తర్కభరితమైన ఒక ఆట. పదవినోదం లాంటి అక్షర క్రీడలను పోలి ఉంటుంది. అమెరికా లోని పత్రికలలో గణిత,, తార్కిక ప్రశ్నల విభాగంలో ఇది కచ్చితంగా ఉంటుంది.[1]

నియమ నిబంధనలు[మార్చు]

అంకెలు నింపిన కకురో పజిల్
  • కేవలం ఒకటి నుంచి తొమ్మిది లోపు అంకెలు మాత్రమే ఖాళీలు నింపడానికి ఉపయోగించాలి
  • ఒక సంఖ్యని మొత్తంగా కొన్ని అంకెల మొత్తంగా నిలువ వరుసలోగానీ లేదా అడ్డువరుసలోగానీ రాసేటపుడు ఒకసారి వాడిన అంకె మరలా వాడకూడదు.

పూరించే విధానం[మార్చు]

ఈ పజిల్ ను బ్రూట్ ఫోర్స్ విధానం ద్వారా సాధించగలిగినా ఒక సంఖ్యను ఎన్ని విధాలుగా కొన్ని అంకెల మొత్తంగా రాయవచ్చునో తెలుసుకుంటే ఇంకా సులభతరమౌతుంది. ఉదాహరణకు 3 అనే సంఖ్యను రెండంకెల మొత్తంగా కేవలం 1+2 లేదా 2+1 గా మాత్రమే సూచించగలం. అలాగే 24 ని మూడంకెల మొత్తంగా కావాలంటే కేవలం 9,8,7లను మాత్రమే ఉపయోగించుకోవాలి.

మూలాలు[మార్చు]

  1. Timmerman, Charles (2006). The Everything Kakuro Challenge Book. Adams Media. p. ix. ISBN 9781598690576. Retrieved November 18, 2018.

బయటి లింకులు[మార్చు]

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=కకురో&oldid=3806572" నుండి వెలికితీశారు