కణ వర్ధనం
నియంత్రిత పరిస్థితుల్లో కణాలు పెరిగే సంక్లిష్ట ప్రక్రియను కణ వర్ధనం (సెల్ కల్చర్) అంటారు. ఆచరణలో, "కణ వర్ధనం" అనే పదాన్ని బహుకణ యూకారియోట్‌లు, ముఖ్యంగా జంతు కణాల నుంచి జరిగే కణాల వర్ధనాన్ని సూచించేందుకు ఉపయోగిస్తారు. అయితే, మొక్కలు, శిలీంధ్రాలు (ఫంగీ) మరియు వైరస్‌లు, బ్యాక్టీరియా, ప్రోటిస్ట్‌ల వంటి సూక్ష్మజీవుల (మైక్రోబ్‌లు) వర్ధనాలు కూడా ఉన్నాయి. కణజాల వర్ధనం మరియు అవయవ వర్ధనంతో కణ వర్ధనం యొక్క చారిత్రక అభివృద్ధి మరియు పద్ధతులు అంతస్సంబంధం కలిగివున్నాయి.
1900వ దశకం మధ్యకాలంలో జంతు కణ వర్ధనం ఒక సాధారణ ప్రయోగశాల సాంకేతిక పద్ధతిగా అవతరించింది,[1] అయితే అసలు కణజాల మూలం నుంచి వేరుచేసిన జీవ కణ తంతువుల నిర్వహణ పద్ధతిని 19వ శతాబ్దంలోనే కనిపెట్టారు.[2]
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
19వ శతాబ్దంలో ఇంగ్లీష్ శరీరధర్మ శాస్త్రవేత్త సిడ్నీ రింజెర్ ఒక వివిక్త జంతు గుండె స్పందనలను నిర్వహించేందుకు యోగ్యమైన, సోడియం, పొటాషియం, కాల్షియం మరియు మాగ్నిషియం క్లోరైడ్‌లు కలిగివున్న లవణ ద్రావణాలను కనిపెట్టారు.[1] 1885లో విల్‌హెల్మ్ రౌక్స్ పిండ దశలో ఉన్న కోడి యొక్క అంతస్థ ఫలకంలో ఒక భాగాన్ని వేరు చేశారు, ఆపై దీనిని అనేక రోజులపాటు ఒక వెచ్చని సెలైన్ ద్రావణంలో భద్రపరిచారు, దీంతో కణజాల వర్ధనం యొక్క మూలసూత్రం ఏర్పాటయింది.[3] జాన్స్ హోప్‌కిన్స్ మెడికల్ స్కూల్‌లో మరియు తరువాత యెల్ విశ్వవిద్యాలయంలో పనిచేసిన రాస్ గ్రాన్‌విల్లే హారిసన్ 1907-1910 మధ్యకాలంలో తన ప్రయోగాలకు సంబంధించిన ఫలితాలను ప్రచురించారు, తద్వారా ఆయన కణజాల వర్ధనం యొక్క పరిశోధనా పద్ధతిని ఏర్పాటు చేశారు.[4]
కణ వర్ధన పద్ధతులు 1940 మరియు 1950వ దశకాల్లో బాగా అభివృద్ధి చెందాయి, వైరాలజీ (వైరస్‌లకు సంబంధించిన శాస్త్రం)లో పరిశోధనలకు మద్దతుగా ఈ పద్ధతులను అభివృద్ధి చేశారు. కణ వర్ధనాల్లో వైరస్‌లకు ప్రాధాన్యత పెరగడంతో టీకాలు (వ్యాక్సిన్‌లు) తయారు చేసేందుకు స్వచ్ఛమైన వైరస్‌లు సృష్టించడం సాధ్యపడింది. సూదితో ఎక్కించగల పోలియో టీకాను జోనాస్ సాల్క్ అభివృద్ధి చేశారు, కణ వర్ధన పద్ధతులను ఉపయోగించి పెద్దఎత్తున తయారు చేసిన మొదటి ఉత్పత్తుల్లో ఇది కూడా ఒకటి. జాన్ ఫ్రాంక్లిన్ ఎండెర్స్, థామస్ హుకిల్ వెల్లెర్ మరియు ఫ్రెడెరిక్ చాప్‌మాన్ రాబిన్స్‌ల యొక్క కణ వర్ధన పరిశోధన ద్వారా ఈ టీకా తయారీ సాధ్యపడింది, కోతి మూత్రపిండ కణ వర్ధనాల్లో వైరస్‌ను పెంచే పద్ధతిని కనిపెట్టినందుకు వీరికి నోబెల్ బహుమతి లభించింది.
[మార్చు] క్షీరద కణ వర్ధనంలో భావాలు
[మార్చు] కణాలు వేరుపరచడం (పృథక్కరణం)
అనేక మార్గాల్లో ఎక్స్ వివో (జీవి వెలుపల కృత్రిమ వాతావరణంలో) వర్ధనం కోసం కణజాలాల నుంచి కణాలను వేరుచేయవచ్చు. కణాలను సులభంగా రక్తం నుంచి శుద్ధి చేయవచ్చు, అయితే తెల్లరక్త కణాలు మాత్రమే వర్ధనంలో పెరుగుదల సామర్థ్యం కలిగివుంటాయి. కొల్లజెనస్, ట్రైప్సిన్ లేదా ప్రోనాస్ వంటి ఎంజైమ్‌లతో ఎంజైమ్ జీర్ణం ద్వారా మృదు కణజాలాలను ఏకకేంద్రక కణాలు విడుదల చేయవచ్చు, ఇది కణేతర మాతృకను విచ్ఛిన్నం చేస్తుంది. ప్రత్యామ్నాయంగా, కణజాల భాగాలను ఉత్పత్తి మాధ్యమంలో ఉంచవచ్చు మరియు ఈ విధంగా పెరిగే కణాలు వర్ధనానికి అందుబాటులో ఉంటాయి. ఈ పద్ధతిని ఎక్స్‌ప్లాంట్ కల్చర్ గా గుర్తిస్తారు.
ఒక భాగం నుంచి నేరుగా వర్ధనం చేసే కణాలను ప్రాథమిక కణాలు గా గుర్తిస్తారు. ట్యూమర్‌లు (కణితలు) నుంచి సేకరించే కొన్ని కణాలను మినహాయిస్తే, అనేక ప్రాథమిక కణ వర్ధనాలకు పరిమిత జీవితకాలం ఉంటుంది. కొన్ని జనాభా ద్విగుణతలు (రెట్టింపు చేయడం) తరువాత (దీనిని హేఫ్లిక్ పరిమితిగా పిలుస్తారు) కణాలు సునెసన్స్ (వయస్సు పెరగడం) అనే ప్రక్రియకు గురవతాయి, అవి విభజన చెందడం నిలిచిపోతుంది, ఇదిలా ఉంటే వీటికి సాధారణంగా జీవించే శక్తి మాత్రం నిలిచివుంటుంది.
స్థిరపరచబడిన లేదా అమర్త్య కణ తంతువు , టెలోమెరాస్ జన్యువు యొక్క కృత్రిమ సమీకరణం వంటి నియమరహిత ఉత్పరివర్తన లేదా ఉద్దేశపూర్వక రూపాంతరణం ద్వారా నిరవధికంగా తననుతాను పునరుత్పత్తి చేసుకునే సామర్థ్యాన్ని పొందుతుంది. కొన్నిరకాల కణాలకు ప్రాతినిధ్యం వహించే అనేక స్థిరీకరించబడిన కణ తంతువులు ఉన్నాయి.
[మార్చు] వర్ధనంలో కణాల నిర్వహణ
కణాలు పొదిగే సాధనంలో తగిన ఉష్ణోగ్రత మరియు వాయు మిశ్రమం (ఎక్కువగా, క్షీరద కణాలకు 37°C, 5% CO2) వద్ద కణాలు పెరుగుతాయి మరియు నిర్వహించబడతాయి. వర్ధన పరిస్థితులు ప్రతి కణ రకానికి ఎక్కువగా మారుతుంటాయి, మరియు ఒక నిర్దిష్ట కణ రకం కోసం వైవిధ్య పరిస్థితులు భిన్నమైన సమలక్షణాలను (ఫెనోటైప్‌లు) ప్రతిఫలించవచ్చు.
ఉష్ణోగ్రత మరియు వాయు మిశ్రమం కాకుండా, వర్ధన వ్యవస్థల్లో ఎక్కువగా మారుతుండే అంశం ఏమిటంటే పెరుగుదల మాధ్యమం. పెరుగుదల మాధ్యమానికి సూత్రాలు pH, గ్లూకోజ్, సాంద్రత, పెరుగుదల కారకాలు మరియు ఇతర పోషకాల ఉనికి తదితరాలతో మారుతుంటాయి. మాధ్యమ సంపూరకానికి ఉపయోగించే పెరుగుదల కారకాలను తరచుగా కాల్ఫ్ సెరమ్ (సీరం) వంటి జంతు రక్తం నుంచి సేకరిస్తారు. రక్తం-నుంచి సేకరించిన ఈ భాగాలతో ముడిపడిన ఒక సమస్య ఏమిటంటే, వీటి ద్వారా, ముఖ్యంగా బయోటెక్నాలజీ వైద్య అనువర్తనాల్లో, వైరస్‌లు లేదా ప్రియాన్‌లతో వర్ధనం కలుషితమయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనప్పుడు ఈ భాగాల ఉపయోగాన్ని తగ్గించడం లేదా తొలగించడం ద్వారా ప్రస్తుతం కణ వర్ధనాన్ని నిర్వహిస్తున్నారు, అయితే అన్ని వేళలా ఇది సాధ్యపడటం లేదు. ఆస్ట్రేలియా మరియు న్యూజీలాండ్ వంటి దేశాల నుంచి కనిష్ట BSE/TSE నష్ట సంభావ్యత ఉన్న జంతు రక్తాన్ని తీసుకోవడం మరియు సీరం (సెరమ్) నుంచి సేకరించే శుద్ధి చేసిన పోషక సాంద్రతలను మొత్తం జంతు సీరం స్థానంలో కణ వర్ధనానికి ఉపయోగించడం వంటి ప్రత్యామ్నాయ వ్యూహాలు ఉన్నాయి.[5]
ప్లాంటింగ్ డెన్సిటీ (వర్ధన మాధ్యమం యొక్క ప్రతి ఘనపరిమాణానికి ఉన్న కణాల సంఖ్య) కొన్ని కణ రకాల కోసం కీలక పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు, కనిష్ట ప్లేటింగ్ డెన్సిటీ గ్రాన్యులోసా కణాలు ఈస్ట్రోజెన్ ఉత్పత్తి చేసేలా చేస్తుంది, ఇదిలా ఉంటే అధిక ప్లేటింగ్ డెన్సిటీ వాటిని ప్రోజెస్టెరోన్ ఉత్పత్తి చేసే థెకా ల్యూటీన్ కణాలు మాదిరిగా కనిపించేలా చేస్తుంది.[6]
వ్యాక్షేప లేదా సంసంజక వర్ధనాల్లో కణాలు పెరుగుతాయి. కొన్ని కణాలు సహజంగా ఉపరితలానికి జోడించబడకుండా వ్యాపేక్షంలో, అంటే రక్తప్రవాహంలో ఉండే కణాలు మాదిరిగా ఉంటాయి. వ్యాక్షేప వర్ధనాల్లోనూ మనుగడ సాధించగల సామర్థ్యం కలిగివుండే విధంగా మార్పులు చేసిన కణ తంతువులు కూడా ఉన్నాయి, అందువలన అవి సంసంజక వర్ధన పరిస్థితులు వీలు కల్పించే దాని కంటే అధిక సాంద్రతలో కూడా పెరగగలవు. సంసంజక కణాలకు కణజాల వర్ధన ప్లాస్టిక్ లేదా మైక్రోకారియర్ వంటి ఒక ఉపరితలం అవసరమవుతుంది, వీటికి సంసంజక లక్షణాలను పెంచేందుకు మరియు పెరుగుదల మరియు విభజనీకరణకు అవసరమైన ఇతర సంకేతాలను అందించేందుకు కణేతర మాతృక భాగాలతో పూత పూస్తారు. ఘన కణజాలాల నుంచి తీసుకునే అనేక కణాలు సంసంజకంగా ఉంటాయి. సంసంజక వర్ధనం యొక్క మరో రకం ఏమిటంటే ఆర్గనోటైపిక్ కల్చర్ , ద్వి-కోణ వర్ధన పాత్రలకు భిన్నంగా దీనిలో ముక్కోణపు పర్యావరణంలో కణాలను పెంచుతారు. ఈ 3డి వర్ధన వ్యవస్థ జీవరసాయనికంగా మరియు శరీరధర్మ శాస్త్రపరంగా ఇన్ వివో (జీవి శరీరం లోపల) కణజాలం మాదిరిగానే ఉంటుంది, అయితే సాంకేతికంగా అనేక కారణాల వలన దీని నిర్వహణ సవాలుతో కూడుకొని ఉంటుంది (ఉదాహరణకు విస్తరణం).
[మార్చు] కణ తంతు పరపరాగ-కాలుష్యం
కణ తంతు పరపరాగ-కాలుష్యం (సెల్ లైన్ క్రాస్-కంటామినేషన్) వర్ధన కణాలతో పనిచేసే సమయంలో శాస్త్రవేత్తలకు ఒక సమస్య కాగలదు. ప్రయోగాల్లో ఉపయోగించే కణాల్లో 15–20% కణాలను మరో కణ తంతువుతో తప్పుగా గుర్తించడం లేదా కాలుషితం చేయబడటం జరుగుతున్నట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి.[7][8][9] కణ తంతు పరపరాగ కాలుష్యానికి సంబంధించిన సమస్యలు NCI-60 శ్రేణి నుంచి తంతుాల్లో గుర్తించబడ్డాయి, ఈ శ్రేణిని తరచుగా మందుల-పరిశీలన అధ్యయనాలకు ఉపయోగిస్తున్నారు.[10][11] అమెరికన్ టైప్ కల్చర్ కలెక్షన్ (ATCC) మరియు జర్మన్ కలెక్షన్ ఆఫ్ మైక్రోఆర్గానిజమ్స్ అండ్ సెల్ కల్చర్స్ (DSMZ) వంటి ప్రధాన కణ తంతు సురక్షిత కేంద్రాలు పరిశోధుకుడి చేత తప్పుగా గుర్తించబడిన కణ తంతు సమర్పణలను పరిశోధకుల నుంచి పొందాయి.[10][12] ఇటువంటి కాలుష్యం కణ వర్ధన తంతువులను ఉపయోగించి ఉత్పత్తి చేసిన పరిశోధన నాణ్యతకు సమస్యలను సృష్టిస్తుంది, ప్రధాన సురక్షిత కేంద్రాలు ఇప్పుడు అన్ని కణ తంతు సమర్పణలను ధ్రువీకరిస్తున్నాయి.[13] తన యొక్క కణ తంతువులను ధ్రువీకరించేందుకు ATCC షార్ట్ టెండెమ్ రిపీట్ (STR) DNA ఫింగర్‌ప్రింటింగ్‌ను ఉపయోగిస్తుంది.[14]
కణ తంతు పరపరాగ-కాలుష్యం యొక్క సమస్యను పరిష్కరించేందుకు కణ తంతువు యొక్క గుర్తింపును ఏర్పాటు చేసేందుకు ప్రారంభ దశలోనే తమ కణ తంతువులను ధ్రువీకరించేందుకు పరిశోధకులను ప్రోత్సహిస్తున్నారు. కణ తంతు నిల్వలను శీతలపరిచే ముందు, క్రియాశీల వర్ధనం సందర్భంలో ప్రతి రెండు నెలలకు మరియు కణ తంతువులను ఉపయోగించి సృష్టించిన ఏదైనా పరిశోధన సమాచారాన్ని ప్రచురించే ముందు ధ్రువీకరణను పునరావృతం చేస్తున్నారు. కణ తంతువులను గుర్తించేందుకు ఉపయోగించే అనేక పద్ధతుల్లో ఐసోఎంజైమ్ విశ్లేషణ, హ్యూమన్ లింపోసైట్ యాంటీజెన్ (HLA) టైపింగ్ మరియు STR విశ్లేషణ ముఖ్యమైనవి.[14]
ఒక ముఖ్యమైన కణ-తంతు పరపరాగ కాలుష్యం ఏమిటంటే అమర్త్య (మరణంలేని) HeLa కణ తంతువు.
[మార్చు] వర్ధన కణాల యొక్క అభిసంధానం
సాధారణంగా అన్ని కణాలు వర్ధనంలో విభజన చెందుతాయి, అవి సాధారణంగా అందుబాటులో ఉన్న వైశాల్యం లేదా ఘనపరిమాణాన్ని పూరించేందుకు పెరుగుతాయి. అవి అనేక సమస్యలను సృష్టించవచ్చు, అవి:
- పెరుగుదల మాధ్యమంలో పోషకాల క్షీణత
- అపోప్టోటిక్/నెక్రోటిక్ (మృత) కణాల వృద్ధి.
- కణానికి కణానికి మధ్య సంబంధం కణ చక్ర నిర్బంధాన్ని ప్రేరేపించగలదు, ఇది సంపర్క నిరోధం (కాంటాక్ట్ ఇన్‌హాబిటేషన్) లేదా సెనెసెన్స్‌గా తెలిసిన కణాల విభజనను నిలిపివేస్తుంది.
- కణం-కణం మధ్య సంబంధం కణ విభజనీకరణను ప్రేరేపించగలదు.
మాధ్యమ మార్పులు, నిష్క్రమణ కణాలు మరియు ఖండన కణాలను వర్ధన కణాల్లో నిర్వహించే సాధారణ అభిసంధానాలుగా చెప్పవచ్చు. వీటిని సాధారణంగా వంధ్య సాంకేతిక ప్రక్రియపై ఆధారపడే కణజాల వర్ధన పద్ధతులను ఉపయోగించి నిర్వహిస్తారు. బ్యాక్టీరియా, ఈస్ట్ మరియు ఇతర కణ తంతువులతో కాలుష్యాన్ని నివారించేందుకు వంధ్య సాంకేతిక ప్రక్రియను ఉపయోగిస్తారు. అభిసంధానాలను ఎక్కువగా కాలుషితకారక సూక్ష్మ-జీవులను నివారించేందుకు ఒక బయోసేఫ్టీ హుడ్ లేదా లామినార్ ఫ్లో క్యాబినెట్‌లో నిర్వహిస్తారు. యాంటీబయాటిక్స్ (సూక్ష్మజీవనాశకం) (ఉదాహరణకు పెన్సిలిన్ మరియు స్ట్రెప్టోమైసిన్) మరియు యాంటీఫంగల్స్ (శిలీంధ్రనాశిని) (ఉదాహరణకు యాంఫోటెరిసిన్ B)లను కూడా పెరుగుదల మాధ్యమానికి జోడిస్తారు.
అన్ని కణాలు జీవక్రియా ప్రక్రియల్లో పాల్గొనడంతో, ఆమ్లం ఉత్పత్తి అవుతుంది మరియు pH క్షీణిస్తుంది. పోషకాల క్షీణతను కొలిచేందుకు, తరచుగా ఒక pH సూచికను మాధ్యమానికి జోడిస్తారు.
[మార్చు] మాధ్యమ మార్పులు
సంసంజక వర్ధనాల సందర్భంలో, మాధ్యమాన్ని నేరుగా నీరు తీసివేయడం మరియు మార్చడం ద్వారా తొలగించవచ్చు.
[మార్చు] నిష్క్రమణ కణాలు
- ప్రధాన వ్యాసం: Passaging
నిష్క్రమణ (పాసింగ్) (కణాల ఉపవర్ధనం లేదా కణాల విభజనగా కూడా దీనిని గుర్తిస్తారు) ప్రక్రియ కొద్ది సంఖ్యలో కణాలను కొత్త పాత్రలోకి బదిలీ చేయడంతో ముడిపడివుంటుంది. సుదీర్ఘ అధిక కణ సాంద్రతకు సంబంధించిన సెనెసెన్స్ (వయస్సు పెరగడం) తప్పిపోతుంది కాబట్టి, కణాలు తంతువుతప్పకుండా విభజన చెందుతున్నట్లయితే, సుదీర్ఘకాలంపాటు వాటిని వర్ధనం చేయవచ్చు. ఒక పెద్ద తాజా మాధ్యమ పరిమాణంలో కొన్ని కరిగిన కణాలు గల వర్ధనం యొక్క కొద్ది పరిమాణంతో వ్యాక్షేప వర్ధనాలను సులభంగా నిష్క్రమింపజేయవచ్చు. సంసంజక వర్ధనాలకు, కణాలను మొదట విడదీయాల్సిన అవసరం ఉంది; దీనిని సాధారణంగా ట్రైప్సిన్-EDTA మిశ్రమంతో చేస్తారు, అయితే ప్రస్తుతం దీని కోసం ఇతర ఎంజైమ్ మిశ్రమాలు అందుబాటులో ఉన్నాయి. ఒక కొత్త వర్ధనాన్ని వేగవంతం చేసేందుకు కొద్ది సంఖ్యలో విభజించబడిన కణాలను ఉపయోగించవచ్చు.
[మార్చు] ట్రాన్స్‌పెక్షన్ మరియు ట్రాన్స్‌డక్షన్
- ప్రధాన వ్యాసం: Transfection
- ప్రధాన వ్యాసం: Transformation (genetics)
ట్రాన్స్‌ఫెక్షన్ ద్వారా అన్య DNAను ప్రవేశపెట్టడాన్ని కణాలను అభిసంధానం చేయడానికి మరో సాధారణ పద్ధతిగా చెప్పవచ్చు. దీనిని తరచుగా కణాలు ఒక ప్రోటీన్‌ను వ్యక్తపరిచేలా చేసేందుకు నిర్వహిస్తారు. ఇటీవల RNAi యొక్క ట్రాన్స్‌ఫెక్షన్ నిర్మాణాలు ఒక నిర్దిష్ట జన్యువు/ప్రోటీన్ యొక్క సమీకరణాన్ని నిరోధించేందుకు యోగ్యమైన పద్ధతిగా నిరూపించబడ్డాయి. DNAను వైరస్‌లను ఉపయోగించడం ద్వారా కూడా కణాల్లోకి చేర్చవచ్చు, దీనికి ట్రాన్స్‌డక్షన్, ఇన్ఫెక్షన్ లేదా ట్రాన్స్‌ఫార్మేషన్ వంటి పద్ధతులను ఉపయోగిస్తారు. పరాన్నజీవుల కారకాలు మాదిరిగా వైరస్‌లు DNAను కణాల్లోకి ప్రవేశపెట్టేందుకు బాగా అనుకూలంగా ఉంటాయి, వాటి పునరుత్పత్తి ప్రక్రియ ఇది ఒక సాధారణమైన భాగం.
[మార్చు] స్థిరీకరించబడిన మానవ కణ తంతువులు
మానవులకు సంబంధించిన కణ తంతువులు జీవ నైతిక విలువల్లో కొంతవరకు వివాదాస్పదంగా ఉన్నాయి, అవి వాటి మాతృ జీవి కంటే ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంది మరియు తరువాతి కణాలు లాభసాటి వైద్య చికిత్సల అన్వేషణలో ఉపయోగపడతాయి. ఈ విభాగంలో ఒక నిర్ధారణ కోసం, కాలిఫోర్నియా సుప్రీం కోర్టు మూర్ మరియు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ అధికారుల కేసులో సంపూర్ణ అంగీకారంతో తమ అవయవాల నుంచి తీసుకున్న కణ తంతువులపై మానవ రోగులకు ఎటువంటి ఆస్తి హక్కులు ఉండవని తీర్పు చెప్పింది.[15]
[మార్చు] హైబ్రిడోమాస్ యొక్క సృష్టి
- మరిన్ని వివరాలకు చూడండి: Hybridoma.
ఒక అమర్త్య కణ తంతువుతో సాధారణ కణాలను కలపడం సాధ్యపడుతుంది. ఈ పద్ధతిని మోనోక్లోనల్ యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేసేందుకు ఉపయోగిస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే, ఒక వ్యాధి నిరోధకత కలిగించిన జంతువు యొక్క స్ప్లీన్ (లేదా రక్తం) నుంచి వేరుచేసిన లింఫోసైట్‌లను ఒక అమర్త్య మైలోమా కణ తంతువు (B కణ వారసత్వం)తో చేర్చడం ద్వారా హైబ్రిడోమాను సృష్టించవచ్చు, దీనికి ప్రాథమిక లింఫోసైట్ యొక్క వ్యాధినిరోధక లక్షణం మరియు మైలోమా యొక్క అమరత్వం ఉంటుంది. ప్రత్యేక పెరుగుదల మాధ్యమం (HA లేదా HAT) కలపని మైలోమా కణాలకు వ్యతిరేకమైన ఎంపికకు ఉపయోగిస్తారు; ప్రాథమిక లింఫోసైట్‌లు వర్ధనంలో త్వరగా మరణిస్తాయి మరియు కలిసిన కణాలు మాత్రమే బతికి ఉంటాయి. అవసరమైన వ్యాధినిరోధకం తయారీ కోసం వీటిని పరిశీలిస్తారు, సాధారణంగా ప్రారంభించే వర్గాల్లో మరియు ఆపై ఒకసారి క్లోనింగ్ తరువాత వీటిని పరిశీలించడం జరుగుతుంది.
==కణ వర్ధనం యొక్క అనువర్తనాలు== వైరస్ సంబంధ టీకాలు మరియు ఇతర బయోటెక్నాలజీ ఉత్పత్తుల తయారీకి జంతు కణ తంతువుల యొక్క సామూహిక వర్ధనం ప్రధాన ఆధారంగా ఉంది [16] , బయోటెక్నాలజీ ఉత్పత్తులకు అడ్జువాంట్స్ ఒక ఉదాహరణ.[17]
[మార్చు] క్షీరదేతర కణాల వర్ధనం
[మార్చు] మొక్కల కణ వర్ధన పద్ధతులు
- ప్రధాన వ్యాసం: Plant tissue culture
- చూడండి: Tobacco BY-2 cells
మొక్కల కణ వర్ధనాలు ఎక్కువగా ద్రవ మాధ్యమంలో కణ వ్యాక్షేప వర్ధనాలుగా లేదా ఘన మాధ్యమంలో కల్లస్ కల్చర్‌లుగా పెరుగుతాయి. విభజనీకరణ చెందని మొక్క కణాల వర్ధనం మరియు కాల్లీకి మొక్కలు పెరుగుదలకు అవసరమయ్యే హార్మోన్‌లు ఆక్సిన్ మరియు సైటోకినిన్‌లలో సరైన సంతులనం అవసరమవుతుంది.
[మార్చు] బ్యాక్టీరియా మరియు ఈస్ట్ (మధుశిలీంధ్రం) వర్ధన పద్ధతులు
- ప్రధాన వ్యాసం: microbiological culture
బ్యాక్టీరియా మరియు ఈస్ట్ కోసం, కొద్ది పరిమాణాల్లో కణాలను సాధారణంగా ఒక ఘన మద్దతు పదార్థంపై పెంచుతారు, ఈ పదార్థంపై పోషకాలు ఉంటాయి, సాధారణంగా దీనికి ఒక ఏగర్ వంటి జెల్‌ను ఉపయోగిస్తారు, భారీ-స్థాయి వర్ధనాలను ఒక పోషక రసంలో ఉన్న కణాలతో నిర్వహిస్తారు.
[మార్చు] వైరస్ వర్ధన పద్ధతులు
- ప్రధాన వ్యాసం: Viral culture
వైరస్‌ల యొక్క వర్ధనానికి పెరుగుదల మరియు వైరస్ ప్రతిరూపకల్పనకు ఆతిథేయులుగా ఉపయోగపడే క్షీరద, మొక్కల, శిలీంధ్ర లేదా బ్యాక్టీరియా మూలాలు గల కణాల వర్ధనాలు అవసరం అవతాయి. మొత్తం అటవీ రకం వైరస్‌లు, రీకాంబినెంట్ వైరస్‌లు లేదా వైరస్ ఉత్పత్తులను సరైన పరిస్థితుల్లో వాటి సహజ అతిథేయులకు బదులుగా ఇతర కణ రకాల్లో సృష్టిస్తారు. వైరస్ యొక్క జాతుల ఆధారంగా వైరస్ ప్రతిరూపకల్పన అతిథేయ కణం లైసిస్ మరియు ఒక వైరస్ ఫలకం సృష్టిలో ప్రతిఫలిస్తుంది.
[మార్చు] సాధారణ కణ తంతువులు
- మానవ కణ తంతువులు
- నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ యొక్క 60 క్యాన్సర్ కణ తంతువులు
- ESTDAB డేటాబేస్ http://www.ebi.ac.uk/ipd/estdab/directory.html
- DU145 (ప్రొస్టేట్ క్యాన్సర్)
- Lncap (ప్రొస్టేట్ క్యాన్సర్)
- MCF-7 (రొమ్ము క్యాన్సర్)
- MDA-MB-438 (రొమ్ము క్యాన్సర్)
- PC3 (ప్రొస్టేట్ క్యాన్సర్)
- T47D (రొమ్ము క్యాన్సర్)
- THP-1 (వాస్తవ మైలోయిడ్ ల్యుకేమియా)
- U87 (గ్లియోబ్లాస్టోమా)
- SHSY5Y, మైలోమా నుంచి క్లోనింగ్ చేసిన హ్యూమన్ న్యూరోబ్లాస్టోమా సెల్స్
- Saos-2 కణాలు (ఎముక క్యాన్సర్)
- ప్రాగ్వానర (కోతిజాతి జంతువులన్నింటినీ కలిపి సూచించేందుకు ఈ పదాన్ని ఉపయోగిస్తారు) కణ తంతువులు
- వెరో (ఆఫ్రికా పచ్చ కోతి చ్లోరోసెబస్ కిడ్నీ ఎపిథీలియల్ సెల్ లైన్ ఇన్షియేటెట్ 1962)
- ఎలుక కణిత కణ తంతువులు
- GH3 (పిట్యూటరీ కణిత)
- PC12 (ఫెయోక్రోమోసైటోమా)
- చిట్టెలుక కణ తంతువులు
- MC3T3 (ఎంబ్రయోనిక్ కాల్వారియాల్)
- మొక్క కణ తంతువులు
- పొగాకు BY-2 కణాలు (కణ వ్యాక్షేప వర్ధనంగా ఉంచబడిన, ఇవి మొక్క కణ నమూనా వ్యవస్థగా పరిగణించబడుతున్నాయి)
- ఇతర జీవుల కణ తంతువులు
- జీబ్రాఫిష్ ZF4 మరియు AB9 కణాలు.
- మేడిన్-డార్బీ కానైన్ కిడ్నీ (MDCK) ఎపిథీలియల్ కణ తంతువు
- జెనోపస్ A6 కిడ్నీ ఎపిథీలియల్ కణాలు.
[మార్చు] కణ తంతువుల జాబితా
| అర్థం | జీవి | మూల కణజాలం | స్వరూపశాస్త్రం | లింకు | ||
| 293-T | మానవ | మూత్రపిండం (ఎంబ్రయోనిక్) | HEK 293ECACC యొక్క ఉత్పన్నం | |||
| 3T3 కణాలు | "3-రోజుల బదిలీ, ఐనోకులమ్ 3 x 105 కణాలు" | చిట్టెలుక | ఎంబ్రయోనిక్ ఫైబ్రిబ్లాస్ట్ | దీనిని NIH 3T3 ECACCగా కూడా గుర్తిస్తారు | ||
| 721 | మానవ | పుట్టకరుపు | ||||
| 9L | ఎలుక | గ్లియోబ్లాస్టోమా | ||||
| A2780 | మానవ | గర్భాశయం | గర్భాశయ క్యాన్సర్ | ECACC | ||
| A2780ADR | మానవ | గర్భాశయం | అడ్రియామైసిన్-నిరోధక ఉత్పన్నం | ECACC | ||
| A2780cis | మానవ | గర్భాశయం | సిస్‌ప్లాటిన్-నిరోధక ఉత్పన్నం | ECACC | ||
| A172 | మానవ | గ్లియోబ్లాస్టోమా | ప్రాణాంతక గ్లియోమా | ECACC | ||
| A20 | చుంచెలుక | B లింఫోమా | B లింఫోసైట్ | |||
| A253 | మానవ | తల మరియు మెడ క్యాన్సర్ | సబ్‌మండిబ్యులార్ డక్ట్ | |||
| A431 | మానవ | చర్మ ఉపతలం | పొలుసుల క్యాన్సర్ | ECACCసెల్ లైన్ డేటా బేస్ | ||
| A-549 | మానవ | ఊపిరితిత్తుల క్యాన్సర్ | ఉపతలం | DSMZECACC | ||
| ALC | చుంచెలుక | ఎముక మజ్జ | స్ట్రోమా | మూస:PMID | ||
| B16 | చుంచెలుక | పుట్టకరుపు | ECCAC | |||
| B35 | ఎలుక | న్యూరోబ్లాస్టోమా | ATCC | |||
| BCP-1 కణాలు | మానవ | PBMC | HIV+ లింఫోమా | ATCC | ||
| BEAS-2B | బ్రోన్చియాల్ ఎపిథీలియం + అడెనోవైరస్ 12-SV40 వైరస్ హైబ్రిడ్ (Ad12SV40) | మానవ | ఊపిరితిత్తులు | ఉపతల | ATCC | |
| bEnd.3 | మెదడు లోపలి పొర | చిట్టెలుక | మెదడు / వెన్నెపాము | లోపలి పొర | ATCC | |
| BHK-21 | "చిన్న చిట్టెలుక మూత్రపిండ ఫైబ్రోబ్లాస్ట్ కణాలు" | హామ్‌స్టెర్ (చిట్టెలుక) | మూత్రపిండం | ఫైబ్రోబ్లాస్ట్ | ECACCఒలింపస్ | |
| BR 293 | మానవ | రొమ్ము | రొమ్ము క్యాన్సర్ | |||
| BxPC3 | పాన్‌క్రియేటిక్ కార్సినోమా లైన్ 3 యొక్క బయోప్సీ జెనోగ్రాఫ్ | మానవ | పాన్‌క్రియేటిక్ అడెనోకార్సినోమా | ఉపతల | ATCC | |
| C3H-10T1/2 | చిట్టెలుక | ఎంబ్రయోనిక్ మెసెన్‌చైమాల్ సెల్ లైన్ | ECACC | |||
| C6/36 | ఆసియా టైగర్ దోమ | లార్వా కణజాలం | ECACC | |||
| Cal-27 | మానవ | నాలుక | పొలుసు కణ క్యాన్సర్ | |||
| CHO | చైనీయుల చిట్టెలుక గర్భాశయం | హామ్‌స్టెర్ (ఒక రకమైన చిట్టెలుక) | గర్భాశయం | ఉపతలం | ECACCICLC | |
| COR-L23 | మానవ | ఊపిరితిత్తులు | ECACC | |||
| COR-L23/CPR | మానవ | ఊపిరితిత్తులు | ECACC | |||
| COR-L23/5010 | మానవ | ఊపిరితిత్తులు | ECACC | |||
| COR-L23/R23 | మానవ | ఊపిరితిత్తులు | ఉపతల | ECACC | ||
| COS-7 | కాస్సోపిథికస్ ఎథియోప్స్, ఆరిజన్-డిఫెక్టివ్ SV-40 | ఏప్ - కార్సోపిథికస్ ఎథియోప్స్ (క్లోరోసెబస్) | మూత్రపిండం | ఫైబ్రోబ్లాస్ట్ | ECACCATCC | |
| COV-434 | మానవ | గర్భాశయం | మెటాస్టాటిక్ గ్రాన్యులోసా సెల్ కార్సినోమా | [2]ECACC | ||
| CML T1 | క్రోనిక్ మైలోడ్ ల్యుకేమియా T-లింఫోసైట్ 1 | మానవ | CML ఎక్యూట్ ఫేజ్ | T సెల్ ల్యుకేమియా | రక్తం | |
| CMT | కానైన్ మమ్మరీ ట్యూమర్ | శునకం | క్షీర గ్రంథి | ఉపతలం | ||
| CT26 | చుంచెలుక | కొలరెక్టాల్ కార్సినోమా | కొలోన్ | |||
| D17 | కానైన్ | ఓస్టెయోసార్సోమా | ECACC | |||
| DH82 | కానైన్ | హిస్టియోసైటోసిస్ | మోనోసైట్/మాక్రోఫేజ్ | ECACCJ Vir Meth | ||
| DU145 | మానవ | ఆండ్రోజెన్ ఇన్‌సెన్సిటివ్ కార్సినోమా | ప్రొస్టేట్ | |||
| DuCaP | ప్రొస్టేట్ డ్యూరా మేటెర్ క్యాన్సర్ | మానవ | మేటాస్టాటిక్ ప్రొస్టేట్ క్యాన్సర్ | ఉపతల | మూస:PMID | |
| EL4 | చిట్టెలుక | T సెల్ ల్యుకేమియా | ECACC | |||
| EM2 | మానవ | CML బ్లాస్ట్ క్రైసిస్ | Ph+ CML లైన్ | సెల్ లైన్ డేటా బేస్ | ||
| EM3 | మానవ | CML బ్లాస్ట్ క్రైసిస్ | Ph+ CML లైన్ | సెల్ లైన్ డేటా బేస్ | ||
| EMT6/AR1 | చిట్టెలుక | రొమ్ము | ఉపతలం-మాదిరి | ECACC | ||
| EMT6/AR10.0 | చిట్టెలుక | రొమ్ము | ఉపతలం-మాదిరి | ECACC | ||
| FM3 | మానవ | మెటాస్టాటిక్ లింఫ్ నోడ్ | పుట్టకురుపు | |||
| H1299 | మానవ | ఊపిరితిత్తులు | ఊపిరితిత్తుల క్యాన్సర్ | |||
| H69 | మానవ | ఊపిరితిత్తులు | ECACC | |||
| HB54 | హైబ్రిడోమా | హైబ్రిడోమా | సెక్రెటెస్ L243 mAb (HLA-DRపై) | హ్యూమన్ ఇమ్యునాలజీ | ||
| HB55 | హైబ్రిడోమా | హైబ్రిడోమా | సెక్రెటెస్ MA2.1 mAb (HLA-A2 మరియు HLA-B17పై) | జర్నల్ ఆఫ్ ఇమ్యునాలజీ | ||
| HCA2 | మానవ | ఫైబ్రోబ్లాస్ట్ | జర్నల్ ఆఫ్ జనరల్ వైరాలజీ | |||
| HEK-293 | హ్యూమన్ ఎంబ్రయోనిక్ కిడ్నీ | మానవ | కిడ్నీ (ఎంబ్రయోనిక్) | ఉపతలం | ATCC | |
| HeLa | హెన్రియెట్టా లాక్స్ | మానవ | గర్భాశయ క్యాన్సర్ | ఉపతలం | DSMZECACC | |
| Hepa1c1c7 | క్లోన్ 1 హెపాటోమా లైన్ 1 యొక్క క్లోన్ 7 | చిట్టెలుక | హెపాటోమా | ఉపతల | ECACCATCC | |
| HL-60 | హ్యూమన్ ల్యుకేమియా | మానవ | మైయెలోబ్లాస్ట్ | రక్తకణాలు | ECACCDSMZ | |
| HMEC | మానవ క్షీర గ్రంథి ఉపతల కణం | మానవ | ఉపతలం | ECACC | ||
| HT-29 | మానవ | కోలాన్ ఉపతలం | అడెనోకార్సినోమా | ECACCసెల్ లైన్ డేటా బేస్ | ||
| జుర్కాత్ | మానవ | T-సెల్-ల్యుకేమియా | తెల్ల రక్త కణాలు | ECACCDSMZ | ||
| JY కణాలు | మానవ | లింఫోబ్లాస్టోయిడ్ | EBV అమర్త్య B కణం | |||
| K562 కణాలు | మానవ | లింఫోబ్లాస్టోయిడ్ | CML బ్లాస్ట్ క్రైసిస్ | ECACC | ||
| Ku812 | మానవ | లింఫోబ్లాస్టోయిడ్ | ఎరైథ్రోల్యుకేమియా | ECACCLGCస్టాండర్డ్స్ | ||
| KCL22 | మానవ | లింఫోబ్లాస్టోయిడ్ | CML | |||
| KG1 | మానవ | లింఫోబ్లాస్టోయిడ్ | AML | |||
| KYO1 | క్యోటో 1 | మానవ | లింఫోబ్లాస్టోయిడ్ | CML | DSMZ | |
| LNCap | ప్రొస్టేట్ లింఫ్ నోడ్ క్యాన్సర్ | మానవ | ప్రోస్టాటిక్ అడెనోకార్సినోమా | ఉపతల | ECACCATCC | |
| Ma-Mel 1, 2, 3....48 | మానవ | పుట్టకురుపు కణ తంతువుల పరిధి | ||||
| MC-38 | చిట్టెలుక | అడెనోక్యార్సినోమా | ||||
| MCF-7 | మిచిగాన్ క్యాన్సర్ ఫౌండేషన్-7 | మానవ | క్షీర గ్రంథి | ఇన్వాసివ్ బ్రెస్ట్ డ్యుక్టాల్ కార్సినోమా | ER+, PR+ | |
| MCF-10A | మిచిగాన్ క్యాన్సర్ ఫౌండేషన్ | మానవ | క్షీర గ్రంథి | ఉపతలం | ATCC | |
| MDA-MB-231 | M.D. ఆండర్సన్ - మెటాస్టాటిక్ బ్రెస్ట్ | మానవ | రొమ్ము | క్యాన్సర్ | ECACC | |
| MDA-MB-468 | M.D. ఆండర్సన్ - మెటాస్టాటిక్ బ్రెస్ట్ | మానవ | రొమ్ము | క్యాన్సర్ | ECACC | |
| MDA-MB-435 | M.D. ఆండర్సన్ - మెటాస్టాటిక్ బ్రెస్ట్ | మానవ | రొమ్ము | పుట్టకురుపు లేదా క్యాన్సర్ (వివాదాస్పదం) | కేంబ్రిడ్జ్ పాథోలజీ ECACC | |
| MDCK II | మేడిన్ డెర్బీ కానైన్ కిడ్నీ | శునకం | మూత్రపిండం | ఉపతలం | ECACC ATCC | |
| MDCK II | మేడిన్ డెర్బీ కానైన్ కిడ్నీ | శునకం | మూత్రపిండం | ఉపతలం | [3] ATCC | |
| MOR/0.2R | మానవ | ఊపిరితిత్తులు | ECACC | |||
| MONO-MAC 6 | మానవ | WBC | మైయెలాయిడ్ మెటాప్లాసిక్ AML | సెల్ లైన్ డేటా బేస్ | ||
| MTD-1A | చిట్టెలుక | ఉపతలం | ||||
| మైఎండ్ | మైయోకార్డియల్ ఎండోథీలియల్ | చిట్టెలుక | ఎండోథీలియం | |||
| NCI-H69/CPR | మానవ | ఊపిరితిత్తులు | ECACC | |||
| NCI-H69/LX10 | మానవ | ఊపిరితిత్తులు | ECACC | |||
| NCI-H69/LX20 | మానవ | ఊపిరితిత్తులు | ECACC | |||
| NCI-H69/LX4 | మానవ | ఊపిరితిత్తులు | ECACC | |||
| NIH-3T3 | NIH, 3-డే ట్రాన్స్‌ఫర్, ఐనోకులమ్ 3 x 105 కణాలు | చిట్టెలుక | ఎంబ్రయో | ఫైబ్రోబ్లాస్ట్ | ECACCATCC | |
| NALM-1 | పెరిఫెరాల్ బ్లడ్ | బ్లాస్ట్-క్రైసిస్ CML | క్యాన్సర్ జెనెటిక్స్ అండ్ సైటోజెనెటిక్స్ | |||
| NW-145 | పుట్టకరుపు | ESTDAB | ||||
| OPCN / OPCT కణ తంతువులు | Onyvax [4] ప్రొస్టేట్ క్యాన్సర్.... | ప్రొస్టేట్ కణిత తంతువుల పరిధి | ఆస్టెరాండ్ | |||
| పీర్ | మానవ | T సెల్ ల్యుకేమియా | DSMZ | |||
| PNT-1A / PNT 2 | ప్రొస్టేట్ కణిత తంతువులు | ECACC | ||||
| RenCa | నేత్రసంబంధ క్యాన్సర్ | చిట్టెలుక | నేత్రసంబంధ క్యాన్సర్ | |||
| RIN-5F | చిట్టెలుక | పాన్‌క్రెయాస్ | ||||
| RMA/RMAS | చిట్టెలుక | T కణ కణిత | ||||
| Saos-2 కణాలు | మానవ | ఆస్టెయోసార్సోమా | ECACC | |||
| Sf-9 | స్పోడోప్టెరా ఫ్రుగిపెర్డా | ఇన్‌సెక్ట్ - స్పోడోప్టెరా ఫ్రుగిపెర్డా (మోత్) | గర్భాశయం | DSMZECACC | ||
| SkBr3 | మానవ | రొమ్ము క్యాన్సర్ | ||||
| T2 | మానవ | T సెల్ ల్యుకేమియా/B సెల్ లైన్ హైబ్రిడోమా | DSMZ | |||
| T-47D | మానవ | క్షీర గ్రంథి | డక్టాల్ కార్సినోమా | |||
| T84 | మానవ | కొలారెక్టాల్ కార్సినోమా / లంగ్‌మెటాస్టాసిస్ | ఉపతలం | ECACCATCC | ||
| THP1 కణ తంతువు | మానవ | మోనోసైట్ | AML | ECACC | ||
| U373 | మానవ | గ్లియోబ్లాస్టోమా-ఆస్ట్రోసైటోమా | ఉపతలం | |||
| U87 | మానవ | గ్లియోబ్లాస్టోమా-ఆస్ట్రోసైటోమా | ఉపతలం-మాదిరి | Abcam | ||
| U937 | మానవ | ల్యుకేమిక్ మోనోసైటిక్ లింఫోమా | ECACC | |||
| VCaP | వెన్నుపూస ప్రొస్టేట్ క్యాన్సర్ | మానవ | మెటాస్టాటిక్ ప్రొస్టేట్ క్యాన్సర్ | ఉపతల | ECACC ATCC | |
| వెరో కణాలు | 'వెరా రెనో' ('గ్రీన్ కిడ్నీ') / 'వెరో' ('ట్రూత్') | ఆఫ్రికన్ గ్రీన్ మంకీ (ఆఫ్రికా పచ్చ కోతి) | మూత్రపిండ ఉపతలం | ECACC | ||
| WM39 | మానవ | చర్మం | ప్రాథమిక పుట్టకురుపు | |||
| WT-49 | మానవ | లింఫోబ్లాస్టోయిడ్ | ||||
| X63 | చిట్టెలుక | పుట్టకరుపు | ||||
| YAC-1 | చిట్టెలుక | శోషరసపు కణుపు | సెల్ లైన్ డేటా బేస్ ECACC | |||
| YAR | మానవ | B-కణం | EBV ట్రాన్స్‌ఫ్రేమ్డ్ | [5] హ్యూమన్ ఇమ్యునాలజీ |
గమనిక: అందుబాటులో ఉన్న కణ తంతువుల నమూనాలు మాత్రమే ఈ జాబితాలో ఉన్నాయి, ఇక్కడ సమగ్ర వివరాలు లేవు.
[మార్చు] వీటిని కూడా చూడండి
- జీవ అమరత్వం
- కణ వర్ధన పరీక్షలు
- ఎలక్ట్రిక్ సెల్-సబ్‌స్టెన్స్ ఇంపెడెన్స్ సెన్సింగ్
- కాలుష్య కణ తంతువుల జాబితా
- అవయవ వర్ధనం
- మొక్క కణజాల వర్ధనం
- కణజాల వర్ధనం
[మార్చు] సూచనలు మరియు గమనికలు
- ↑ "Cell Culture". తీసుకొన్న తేదీ: 2006-04-19.
- ↑ "Some landmarks in the development of tissue and cell culture.". తీసుకొన్న తేదీ: 2006-04-19.
- ↑ "Animals and alternatives in testing.". తీసుకొన్న తేదీ: 2006-04-19.
- ↑ షిఫ్, జుడిత్ ఎన్. "An unsung hero of medical research.". తీసుకొన్న తేదీ: 2006-04-19."An unsung hero of medical research.". తీసుకొన్న తేదీ: 2006-04-19. యాల్ అల్యూమ్నీ మేగజైన్ , ఫిబ్రవరి 2002.
- ↑ LipiMAX purified lipoprotein solution from bovine serum. Selborne Biological Services (2006). తీసుకొన్న తేదీ: 2010-02-02.
- ↑ Portela VM, Zamberlam G, Price CA (April 2010). "Cell plating density alters the ratio of estrogenic to progestagenic enzyme gene expression in cultured granulosa cells". Fertil. Steril. 93 (6): 2050–5. DOI:10.1016/j.fertnstert.2009.01.151. PMID 19324349.
- ↑ (Oct 1999) "False human hematopoietic cell lines: cross-contaminations and misinterpretations". Leukemia 13 (10): 1601–7. DOI:10.1038/sj/leu/2401510. ISSN 0887-6924. PMID 10516762.
- ↑ (Dec 2001) "Cross-contamination: HS-Sultan is not a myeloma but a Burkitt lymphoma cell line" (Free full text). Blood 98 (12): 3495–6. DOI:10.1182/blood.V98.12.3495. ISSN 0006-4971. PMID 11732505.
- ↑ (Jun 2006) "Identity tests: determination of cell line cross-contamination". Cytotechnology 51 (2): 45–50. DOI:10.1007/s10616-006-9013-8. ISSN 0920-9069. PMID 19002894.
- ↑ 10.0 10.1 (Feb 2007) "Cell biology. Cases of mistaken identity.". Science (New York, N.Y.) 315 (5814): 928–31. DOI:10.1126/science.315.5814.928. ISSN 0036-8075. PMID 17303729.
- ↑ (Jan 2007) "A case study in misidentification of cancer cell lines: MCF-7/AdrR cells (re-designated NCI/ADR-RES) are derived from OVCAR-8 human ovarian carcinoma cells.". Cancer letters 245 (1-2): 350–2. DOI:10.1016/j.canlet.2006.01.013. ISSN 0304-3835. PMID 16504380.
- ↑ (Nov 1999) "Widespread intraspecies cross-contamination of human tumor cell lines arising at source.". International journal of cancer. Journal international du cancer 83 (4): 555–63. DOI:<555::AID-IJC19>3.0.CO;2-2 10.1002/(SICI)1097-0215(19991112)83:4<555::AID-IJC19>3.0.CO;2-2. ISSN 0020-7136. PMID 10508494.
- ↑ (Apr 2002) "HeLa cells 50 years on: the good, the bad and the ugly.". Nature reviews. Cancer 2 (4): 315–9. DOI:10.1038/nrc775. ISSN 1474-175X. PMID 12001993.
- ↑ 14.0 14.1 డున్హామ్, J.H. మరియు గుత్‌మిల్లెర్, పి. (2008) డూయింగ్ గుడ్ సైన్స్: అథ్నిటికేటింగ్ సెల్ లైన్ ఐడెంటిటీ. సెల్ నోట్స్ 22 , 15–17.
- ↑ Ceb.com
- ↑ | రచయితలు = గావో డబ్ల్యూ, సోలోఫ్ ఏసీ, లు ఎక్స్, మోంటెకాల్వో ఎ, గుయెన్ డీసీ, మత్సోకా వై, రాబిన్స్ పీడీ, స్వైన్ డీఈ, డోనిస్ ఆర్వో, కాట్జ్ జేఎం, బ్యారాట్-బోయెస్ ఎస్ఎం, గ్యాంబోట్టో ఎ. | సంవత్సరం = 2006 | నెల = ఫిబ్రవరి | శీర్షిక = ప్రొటెక్షన్ ఆఫ్ మైస్ అండ్ పౌల్ట్రీ ఫ్రమ్ లీథల్ H5N1 ఏవియన్ ఇన్‌ఫ్యూయెంజా వైరస్ త్రూ ఎడెనోవైరస్-బేస్డ్ ఇమ్యునైజేషన్ | జర్నల్ = జర్నల్ ఆఫ్ వైరాలజీ | సంపుటి = 80 | సంచిక = 4 | పేజీలు = 1959–1964 | ప్రచురణకర్త = అమెరికన్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ | ప్రదేశం = అమెరికా సంయుక్త రాష్ట్రాలు | issn = 0022-538X | doi = 10.1128/JVI.80.4.1959-1964.2006 | url = http://jvi.asm.org/cgi/content/abstract/80/4/1959 | accessdate = 2010-01-31 }}
- ↑ NIAID Taps Chiron to Develop Vaccine Against H9N2 Avian Influenza. National Institute of Allergy and Infectious Diseases (NIAID) (2004-08-17). తీసుకొన్న తేదీ: 2010-01-31.
- Hpacultures.org.uk, హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కల్చర్ కలెక్షన్స్ (ECACC)
- మ్యాక్‌లియోడ్, R. A. F. మరియు ఇతరులు (1999): వైడ్‌స్ప్రెడ్ ఇంట్రాస్పీసెస్ క్రాస్-కాంటామినేషన్ ఆఫ్ హ్యూమన్ ట్యూమర్ సెల్ లైన్స్. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్ 83 :555–563.
- మాస్టర్స్, జాన్ ఆర్. (2002): HeLa సెల్స్ 50 ఇయర్స్ ఆన్: ది గుడ్, ది బ్యాడ్ అండ్ ది అగ్లీ. నేచర్ రివ్యూస్ క్యాన్సర్ 2 :315-319.
[మార్చు] బాహ్య లింకులు
ఎండోటాక్సిన్ ఫ్రీ వాటర్ ఫర్ సెల్ కల్చర్స్
- హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కల్చర్ కలెక్షన్స్ - ECACC సహా (యూరోపియన్ కలెక్షన్ ఆఫ్ సెల్ కల్చర్స్)
- Witkowski JA. ఎక్స్పెరిమెంటల్ పాథోలజీ అండ్ ది ఆరిజిన్స్ ఆఫ్ టిష్యూ కల్చర్: లియో లోయెబ్స్ కంట్రిబ్యూషన్. మెడ్ హిస్ట్. 1983 జులై; 27(3): 269–288.
- atcc
- కోరీయెల్ సెల్ రెపోజిటరీస్
- ది నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్ (NCCS), పూణే, ఇండియా; నేషనల్ రెపోజిటరీ ఫర్ సెల్ లైన్స్/హైబ్రిడోమాస్ తదితరాలు.
- న్యూరల్ స్టెమ్ సెల్ కల్చర్: న్యూరోస్పియర్ జెనరేషన్, మైక్రోస్కోపికల్ ఎనాలసిస్ అండ్ క్రైయోప్రిజర్వేషన్ (ఎ ప్రోటోకాల్)
- రాట్ క్రోమాఫిన్ సెల్స్ ప్రైమరీ కల్చర్స్: స్టాండర్డైజేషన్ అండ్ క్వాలిటీ అసస్మెంట్ ఫర్ సింగిల్-సెల్ అస్సేస్ (ఎ ప్రోటోకాల్)
- ఆల్బెర్ట్స్ 4వ సంచికలోని సాధారణ కణ తంతువుల పట్టిక.
- వర్ధనంలో క్యాన్సర్ కణాలు
- హైపర్‌టెక్స్ట్ వెర్షన్ ఆఫ్ ది సెల్ లైన్ డేటా బేస్
- సెల్ కల్చర్ బేసిక్స్ - ఇంట్రడక్షన్ టు సెల్ కల్చర్, కవరింగ్ టాపిక్స్ సచ్ యాజ్ లాబోరేటరీ సెట్-అప్, సేఫ్టీ అండ్ ఎసెప్టిక్ టెక్నిక్ ఇన్క్లూడింగ్ బేసిక్ సెల్ కల్చర్ ప్రోటోకాల్స్ అండ్ వీడియో ట్రైనింగ్
- డేటాబేస్ ఆఫ్ హు ఈజ్ హు ఇన్ సెల్ కల్చర్ అండ్ రిలేటెడ్ రీసెర్చ్
