కబంధుడు

వికీపీడియా నుండి
రామ లక్ష్మణులకు తన వృత్తాంతమును వివరిస్తున్న కబంధుడు.

కబంధుడు రామాయణములో రాముని చేత సంహరింపబడిన ఓ వికృతరూపము గల రాక్షసుడు. ఈతను దట్టమయిన రోమములు గలవాడనియు, పర్వతమువంటి భీకరమైన శరీరముగలవాడనియు, తల మరియు మెడ లేనివాడనియు, ఉదరభాగమునందు క్రూరమయిన దంతములు గల నోరు గలవాడనియు, పొడవాటి చేతులు మరియు వక్షమందు ఓ పెద్ద కన్ను కలవానిగను వర్ణించిరి. కొందరు ఇతడు లక్ష్మీదేవి కొడుకుగా చెప్పిరి.

జన్మ వృత్తాంతము[మార్చు]

ముందుగా కబంధుడు ఒక గంధర్వుడు. స్వర్గాధిపతి అయిన ఇంద్రునితో కలహించెను. అంతట ఇంద్రుడు వజ్రాయుధముచే కబంధుని పరాజితుని గావించి, ఆతని శిరస్సును మరియు ఇతర అంగములను శరీరము లోనికి చొచ్చునటుల చేసెను. ఇది ఒక కారణముగా చెప్పబడినది. మరొక కథ ప్రకారము, ఒక ముని శాపముచే కబంధునకు ఆ వికృత రూపము ప్రాప్తించెను.

కబంధ వధ[మార్చు]

శ్రీరాముడు కబంధుని యుద్ధమున తీవ్రముగా గాయపరచిన పిదప, కబంధుడు శ్రీరాముని తన దేహమును మరణించిన పిదప దహనము చేయమని కోరెను. శరీరము దహింపబడుచుండగా కబంధుడు తన నిజ రూపమున ప్రత్యక్షమై, శ్రీరామునకు మైత్రి అవసరమని సుగ్రీవుడు చేతులు కలపమని రావణుని జయించడం తేలికగా అవుతుందని బోధించెను. కబంధునకు దను అను పేరు కూడా కలదు.

బయటి లింకులు[మార్చు]

కబంధుడు గురించి

"http://te.wikipedia.org/w/index.php?title=కబంధుడు&oldid=809620" నుండి వెలికితీశారు