కమలిని ముఖర్జీ
| కమలినీ ముఖర్జీ | |
| జన్మనామం | కమలినీ ముఖర్జీ |
|---|---|
| పుట్టినతేదీ | మార్చి 04 1980 (వయసు 33) |
| జన్మస్థలం | కలకత్తా, పశ్చిమ బెంగాల్, భారతదేశం |
| వృత్తి | నటీమణి |
| ఎత్తు | 5'5" |
కమలిని ముఖర్జీ ప్రముఖ దక్షిణ భారతీయ సినిమా నటి.
విషయ సూచిక |
బాల్యం, నాటకాభిలాష[మార్చు]
కమలిని ముఖర్జీ (అసలు పేరు: రోష్ని లేక రోని) మార్చి 4, 1980 లో కలకత్తా లో జన్మించింది. ఇద్దరు చెల్లెళ్ళు. స్కూల్, కాలేజ్ లో నాటక ప్రదర్శనల తర్వాత ముంబాయి పట్టణం లో నాటకాల పై నిర్వహించిన అభ్యాస సదస్సు లో పాల్గొన్నది. నాటకాలే కాకుండా, ఆధ్యాత్మిక పుస్తక పఠనం, చిత్రలేఖనం కమలినికి ప్రీతిపాత్రమైనవి. పెక్కు సంవత్సరాలు భరత నాట్యం అభ్యాసం చేసింది. నీల్‌కమల్ ప్లాస్టిక్ సామాన్లు, పారాచూట్ కోబ్బరి నూనె, ఫైర్ అండ్ లవ్లీ క్రీం ఇంకా ఆయుష్ వ్యాపార ఉత్పత్తుల ప్రకటన చిత్రాలలో నటించింది.
సినిమాలలో అవకాశం[మార్చు]
కమలిని ని ఒక ప్రకటన చిత్రంలో చూసిన దర్శకురాలు రేవతి తన ఫిర్ మిలేంగే (2004) హిందీ చిత్రం లో అవకాశమిచ్చింది. ఎయిడ్స్ కధా నేపధ్యంలో సాగె ఈ చిత్రానికి చాలా బహుమతులు వచ్చాయి. ఇంగ్లీష్ లిట్ (డిగ్రీ) చదివిన కమలిని కు కవిత్వం రాయటం ఇష్టం. Thoughts, Confusion and Solitude అనే కవితలను poetry.com లో ప్రచురించింది. తన కవిత అంతర్జాతీయ కవితల పోటీలో ఎంపికయిన సందర్భంలో, వాషింగ్టన్ లో (దలైలామా ఆధ్వర్యాన) నిర్వహించిన కవితా సదస్సు కు ఆహ్వానించిన 150 మంది లో కమలిని ఉంది. అదే సమయం లో దర్శకుడు శేఖర్ కమ్ముల ఆనంద్ సినిమా లో కధానాయిక అవకాశం రావటం తో సినిమా వైపే మొగ్గు చూపింది.
అవార్డులు[మార్చు]
ఆనంద్, గోదావరి ఇంకా గమ్యం చిత్రాలలో ఆమె నటన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు చిత్రాలతో పాటు హిందీ, తమిళ్, మళయాళం ఇంకా కన్నడ చిత్రాలలో నటించింది. ఆనంద్ చిత్రం లో రూప పాత్రలో కనపరచిన నటనకు ఉత్తమ నటిగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వపు నంది బహుమతిని గెలుచుకుంది.
నటించిన తెలుగు చిత్రాలు[మార్చు]
- ఆనంద్ (2004) - రూప
- మీనాక్షి (2005) -మీనాక్షి
- గోదావరి (2006) -సీతా మహాలక్ష్మి
- స్టైల్ (2006) - ప్రియ
- రాఘవ (2006) -కయల్విఝి రాఘవన్ (తమిళ అనువాద చిత్రం)
- క్లాస్ మేట్స్ (2007) -రజియా
- హ్యాపీ డేస్ (2007) -శ్రీయ
- పెళ్ళైంది కాని (2007) -గాయత్రి
- బ్రహ్మానందం డ్రామా కంపనీ (2008) -అర్పిత
- జల్సా (2008) -ఇందు
- గమ్యం (2008) - జానకి
- గోపి గోపిక గోదావరి (2009) - గోపిక
- మా అన్నయ్య బంగారం (2010) - మంజు
- పోలీస్ పోలీస్ (2010) - హారిక (తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం)
- నాగవల్లి (2010) - గాయత్రి
- విరోధి (2011) -సునీత (అతిధి పాత్ర)
- రామాచారి (2011) -నిర్మాణంలో