కరణం మల్లేశ్వరి

వికీపీడియా నుండి

కరణం మల్లేశ్వరి తెలుగు వారు గర్వించదగిన వ్యక్తి. శ్రీకాకుళంకు చెందిన ఈమె బరువులు ఎత్తడం ఆటలో ఒలింపిక్ పతకం సాధించి ప్రసిద్ధురాలయ్యింది. ఈమె 1975 జూన్ 1 న జన్మించింది.

సిడ్నీలో జరిగిన 2000 ఒలింపిక్ క్రీడలలో వెయిట్ లిఫ్టింగ్ పోటీలో కాంస్య పతకం సాధించింది. ఆ విధంగా ఒలింపిక్ ఆటలలో పతకం సాధించిన మొదటి భారతీయ మహిళ అయ్యింది, మరియు మూడవ భారతీయ వ్యక్తి. (అంతకుముందు పతకాలు సాధించిన భారతీయులు - 1952 హెల్సింకీ లో bantamweightwrestler ఖషబా జాదవ్, మరియు 1996 అట్లాంటాలో టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్)

[మార్చు] పతకాలు, పురస్కారాలు

  • 2000 - ఒలింపిక్ క్రీడలు - కాంస్య పతకం - 69 కిలోగ్రాముల విభాగంలో
  • 1994 - ఇస్తాంబుల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలు - బంగారు పతకం
  • 1995 - పూసాన్, కొరియా - ఆసియా ఛాంపియన్‌షిప్ పోటీలు
  • 1995 - ఘుంగ్‌జౌ, చైనా - 54 కిలోల విభాగంలో మూడు బంగారు పతకాలు

ఒక సందర్భంలో ఆమె ఇలా అంది -

భారత దేశానికి పతకాలు ఎందుకు రావని అడుగుతుంటారు. అది ఎయిర్-కండిషన్డ్ గదులలో కూర్చుని మాట్లాడినంత సులభం కాదు. ఆ ప్రయత్నంలో ఉన్న శ్రమ, వేదన మాకు తెలుస్తాయి...

[మార్చు] బయటి లింకులు

[మార్చు] మూలాలు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు