కరీంనగర్ జిల్లా
| ?కరీంనగర్ ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం | 11,823 కి.మీ² (4,565 చ.మై) |
| ముఖ్య పట్టణము | కరీంనగర్ |
| ప్రాంతం | తెలంగాణ |
| జనాభా • జనసాంద్రత • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
38,11,738 (2011) • 322/కి.మీ² (834/చ.మై) • 1897068 • 1914670 • 564.87 • 74.72 • 55.18 |
కరీంనగర్ భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమునకు చెందిన ఒక జిల్లా. జిల్లాకు ఉత్తరాన అదిలాబాదు జిల్లా, ఈశాన్యమున మహారాష్ట్ర మరియు చత్తీసుగఢ్ రాష్ట్రాలు, దక్షిణాన వరంగల్ జిల్లా, ఆగ్నేయాన మెదక్ జిల్లా, మరియు పశ్చిమాన నిజామాబాదు జిల్లా సరిహద్దులు.
[మార్చు] జిల్లా పేరు వెనుక చరిత్ర
కరీంనగర్, సయ్యద్ కరీముద్దీన్ ఖిలాదారు పేరుమీదుగా నామకరణము చేయబడినది. పురాతన కాలము నుండి వేద అభ్యాసన కేంద్రముగా ప్రసిద్ధికెక్కినది. పూర్వము ఈ ప్రాంతమునకు 'సబ్బినాడు' అని పేరు. కరీంనగర్ మరియు శ్రీశైలములలో దొరికిన, కాకతీయ రాజులు ప్రోల II మరియు ప్రతాపరుద్రుని శాసనాలు ఈ ప్రాంత ఘనమైన చరిత్రకు నిదర్శనాలు.
[మార్చు] జిల్లా చరిత్ర
నిజాం పరిపాలనలో కరీంనగర్ ఒక రాజధాని మరియు మాజీ భారత ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు, ప్రసిద్ధ కవులు సింగిరెడ్డి నారాయణ రెడ్డి(సినారె), వేములవాడ భీమకవి,దన్దు కమలాకర్, పొన్నమ్ ప్రబాకర్' వంటి పలు సుప్రసిద్ధ వ్యక్తులు ఈ జిల్లా వాస్తవ్యులే. గోదావరి నది ఈ ప్రాంత సౌందర్యమును మరింత ఇనుమడింపజేస్తున్నది. కరీంనగర్ గోండ్లు, కోయలు, చెంచులు మొదలైనటువంటి అనేక గిరిజన జాతులకు ఆవాసము. ఈ ప్రాంతీయులు సున్నితమైన లోహకళ అయినటువంటి వెండి నగిషీ పనిలో మంచి నిపుణులు.
నేటి కరీంనగర్ ప్రాంతాన్ని పూర్వం సబ్బినాడు అని వ్యవహరించేవారు. 1905కు పూర్వము ఎలగందల్ జిల్లాగా ప్రసిద్ధి చెందినది. 1905లో వరంగల్ జిల్లా నుండి పరకాల తాలూకాను జిల్లాలో కలిపి, లక్సెట్టిపేట మరియు చెన్నూరు తాలూకాలను అదిలాబాద్ జిల్లాలో, సిద్దిపేట తాలూకాను మెదక్ లో చేర్చి జిల్లాను 7 తాలూకాలతో పునర్‌వ్యవస్థీకరించి కరీంనగర్ జిల్లాగా నామకరణము చేశారు.
కరీంనగర్ కు 30. కి.మీ. దూరంలో గోదావరి నది శాఖైన మూలవాగు తీరంలో వేములవాడ రాజరాజేశ్వరస్వామి పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయి, గోదావరి తీరాన గల ప్రసిద్ధ కాళేశ్వర క్షేత్రము ఈ జిల్లా లో కలదు. కరీంనగర్ కు ఉత్తరంగా 50 కి.మీ. దూరంలో గోదావరీ తీరంలోని ధర్మపురిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉంది. ఇవికాక జగత్యాల కొండగట్టు దగ్గర శ్రీఆంజనేయస్వామి ఆలయం ఎత్తైన పర్వతంపై ఉంది. హజూరాబాద్ సమీపానగల కొత్తగట్టు వద్ద అరుదైన శ్రీ మత్సగిరీంద్ర స్వామి వారి ఆలయం ఉన్నది. రామగుండం వద్ద ఉన్న ఫెర్టిలైజర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా బొగ్గు ముడిపదార్థంగా ఉపయోగించి ఎరువును తయారుచేసిన మొట్టమొదటి ఫ్యాక్టరీ. నల్ల బంగారం ఉత్పత్తిలో సిరులపంట పండిస్తున్న సింగరేణి కాలరీస్ కంపనీ కు , ఖజానాలో ఎక్కువ ఆదాయం లభించేది రామగుండం బొగ్గు గనుల నుంచే. 2001 జనాభాలెక్కల ప్రాధమిక అంచనా ప్రకారం ఈ జిల్లాలో పురుషుల కంటే స్త్రీల జనాభా అధికంగా ఉంది.
[మార్చు] భౌగోళిక స్వరూపం
[మార్చు] ఆర్ధిక స్థితి గతులు
[మార్చు] పరిశ్రమలు
- సింగరేణి కొలరీస్ కంపెని లిమిటెడ్.
- కెసొరామ్ సిమెంట్ ఫ్యాక్టరీ.
- గ్రానైట్ ఇండస్ట్రీ.
[మార్చు] నేషనల్ ధర్మల్ పవర్
రామగుండం వద్ద 2,600 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే నేషనల్ ధర్మల్ పవర్ స్టేషన్‌లో ఒక భాగమైన ఎన్ టి పి సి (రామగుండం, ఆంధ్రప్రదేశ్, ఇండియా). ఇది దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద విద్యుదుత్పత్తి కేంద్రం. భారతదేశంలో ఐ ఎస్ ఓ 14001 సర్టిఫికేషన్ పొందిన సూపర్ ధర్మల్ పవర్ స్టేషన్ ఇది మాత్రమే. ఇది అంతర్జాతీయంగా 6వ శ్రేణిలో ఉన్న పవర్ జనరేటర్. దీని స్థాపిత పవర్ కెపాసిటీ 19,435 మెగావాట్లు. ఈ సంస్థ నవరత్న పబ్లిక్ సెక్టర్ అండర్టేక్ చేసిన ఈ సంస్థ 25 సంవత్సరాల సర్వీసును పూర్తి చేసుకుంది.
[మార్చు] సింగరేణి కొలరీస్ కంపెని లిమిటెడ్
గోదావరీ తీరంలో బొగ్గు అన్వేషణ మరియు వినియోగానికి అధికారయుత సంస్థ సింగరేణి కొలరీస్ కంపెనీ లిమిఆటెడ్. సింగరేణి బొగ్గు గని దక్షిణ భారతదేశం లోని ఏకక బొగ్గుగని. ప్రస్థుతం ఆంధ్రప్రదేశ్‌లో ఎస్ సి సి ఎల్ గనుల చర్యలు నాలుగు జిల్లాలలో జరుగుతున్నాయి. అవి వరుసగా అదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం మరియు వరంగల్.
[మార్చు] కెసోరామ్ ఫిమెంట్ ఫ్యాక్టరీ
కెసొరామ్ సిమెంట్ ఫ్యాక్టరీ బిర్లా గ్రూప్ కంపెనీలలో ఒకటి. 1967లో ఇది అవతరించింది. ఒకరోజుకు 2500 మెట్రిక్ టన్నుల సిమెంటును ఉత్పత్తి చేస్తూ ఈ సిమెంట్ ప్లాంట్ దక్షిణ భారతదేశంలో అతి పెద్దదైన సిమెంట్ ఫ్యాక్టరీ. ఈ కంపెనీ సాకేంతికంగా జాతీయ సాకేంతికతను ఉపయోగిస్తూ అవసరమైనప్పుడు మాత్రమే అంతర్జాతీయ సాంకేతికతను వాడుకుంటున్నది.
[మార్చు] గ్రానైట్ ఇండస్ట్రీ
టాన్ బ్రౌన్ మరియు మేపిల్ బ్రౌన్ జాతి గ్రానైట్‌కు కరీంనగర్ జిల్లా అంతర్జాతీయ గుర్తింపును పొందింది. కరీంనగర్ జిల్లాలోని ఒడియారమ్ గ్రామం లోని గ్రానైట్ 2008 ఒలింపిక్స్ క్రీడల సమయంలో చైనా ఉపయోగించుకున్నది. చైనా ఉపయోగించుకున్నప్పటి నుండి ఈ గ్రానైట్ అంతరజాతీయ ముఖ్యంగా ఆసియా దేశాలలో ప్రబలమైంది. జపాన్‌తో సహా ఆసియాదేశాలు కరీంనగర్ గ్రానైట్‌ను వివిధ ప్రాజక్ట్‌లకు ఉపయోగించుకుంటుంది. పలు దేశాలు గ్రానైటును ఉత్తమ నాణ్యత మరియు తక్కువ వెలకు లభించిన కారణంగా వాడుకుంటున్నాయి. కరీంనగర్‌లో మనకొండూరు, మల్లైల్, కేశవపట్టణం, కరీంనగర్ మొదలైన మండలాలలో 600 లకు పైగా క్వారీలు విస్తరించి ఉన్నాయి. అయినప్పటికీ అంతర్జాతీయంగా పేరొందిన క్వారీలు మాత్రం 20. ఒక మాసానికి 10,000 నుండి 12,000 క్యూబిక్ మీటర్ల గ్రానైట్ ఉత్పత్తులు కరీంనగర్ నుండు చైనా మరియు ఇతర దేశాలకు ఎగుమతి ఔతుంది. కరీంనగర్ జిల్లా గ్రానైట్ ఒక సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు ఉంటుంది. రైల్వే శాఖకు కూడా గ్రానైట్ ఎగుమతుల ద్వారా మంచి అదాయాన్ని పొందుతుంది. గ్రానైట్ రవాణా కొరకు కరీంనగర్, గంగధారా మరియు ఉప్పల్ రైల్వే స్టేషన్‌లలో ప్రత్యేక ప్లాట్‌ఫారములు నిర్మించబడ్డాయి. ఇక్కడి నుండి గ్రానైట్ చెన్నై మరియు కాకినాడా రేవుల ద్వారా చైనాదేశనికి ఎగుమతి చేయబడుతుంది. ఈ గ్రానైట్ చైనాదేశానికి పంపిన తరువాత అక్కడ పాలిష్ చేయబడి జపాన్ వంటి ఆసియాదేశాలకు అమ్మబడుతుంది. బృహత్తరమైన గ్రానైట్ రాళ్ళను పైకి ఎత్తి పెట్టడానికి ఉపయోగిస్తున్న క్రేన్లు కూడా అనేక లక్షలు సంపాదిస్తున్నాయి. అలాగే గ్రానైట్ ఎగుమతుల ద్వారా అనేకమందికి ఉపాది కూడా లభిస్తుంది.
[మార్చు] సాఫ్ట్‌వేర్ సంస్థలు
కరీంనగర్ ఇప్పుడిప్పుడే అంకురిస్తున్న ఐటి ప్రొడక్ట్స్ మరియు స్టార్టప్స్ యొక్క నిలయం .
- ఐకాన్ ఇన్ఫోలింక్స్ , కంప్లీట్ ఐటి సొల్యూషన్స్, కరీంనగర్
- స్పూర్తి ఫైనాన్షియల్ సర్వీసెస్, కరీంనగర్ - 9848354992.
- బ్లూ-రే టెక్నాలజీస్, పరివార్ బర్కిలీ బిల్డింగ్, నియర్ గీతాభవన్, కరీంనగర్.[1]
- పెన్సిల్ కోడర్స్ లాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సాయీ క్రిష్ణ ధియేటర్ సమీపంలో, భారత్ నగర్, Karimnagar.[2]
- మెలంగో లాబ్స్ ఐ ఎన్ సి, భగత్ నగర్, కరీంనగర్ [3]
- డి ఐ ఎస్ సి కంప్యూటర్స్ , మంకమ్మతోట, కరీంనగర్ [4]
[మార్చు] వ్యాపార కూడళ్ళు
కరీంనగర్‌లో ఉన్న మల్టీ కాంప్లెక్సలలో ఫాతిమా మల్టీ కాంప్లెక్స్ ఒకటి. ఇందులో త్రీస్టార్ హోటల్, రెండు రెస్టారెంట్స్, 24-గంటల కాఫీ షాప్, బార్స్, బ్యంక్విట్ హాల్స్ మరియు బౌలింగ్ అల్లే మరియు కంప్యూటర్ గేమ్స్ కలిగిన గేమింగ్ జోన్ మొదలైనవి ఉన్నాయి. త్రీస్టార్ హోటెల్ కలిగిన మల్టీ కాంప్లెక్స్‌లలో రాష్ట్రంలో ఫాతిమా మల్టీ కాంప్లెక్స్ మొదటిది. అలాగే హైదరాబాద్ తరువాత కరీంనగర్ మల్టీ కాంప్లెక్స్ రాష్ట్రంలో మొదటి మల్టీ కాంప్లెక్స్. [5]
శ్వేతా ఫోర్ స్టార్ హోటెల్. ఇందులో రెస్టారెంట్, కాఫీ షాప్, బార్, బ్యాంక్విట్ హాల్ ఉన్నాయి.
కరీంనగర్‌లో చాలా కాలంనాటి ఉన్న హోటెల్ కల్పన. హోటెల్ కల్పన 1972లో స్థాపించబడింది. 2000లో కొత్త భవనానికి మార్చబడింది. ఇందులో ఫ్యామిలీ రెస్టారెంట్, ఉడిపి ఫాస్ట్ ఫుడ్ సెంటర్, బార్, లాడ్జ్, బేకరీ, స్వీట్ హౌస్ మరియు బేంక్విట్ హాల్ ఉన్నాయి. అలాగే కరీంనగర్‌లో గీతాభవన్ కూడా పాత హోటెళ్ళలో ఒకటి. ఇది 1975లో ప్రారంభించబడింది. ఇది కరీంనగర్‌లో ప్రబలమైన శాఖాహార రెస్టారెంట్ మరియు ఉత్తమ స్వీట్ హౌస్. జిల్లాలో ఇది ఉత్తమ స్వీట్ హౌస్‌గా పేరు పొందింది.
[మార్చు] డివిజన్లు లేదా మండలాలు, నియోజక వర్గాలు
భౌగోళికంగా కరీంనగర్ జిల్లాను 57 రెవిన్యూ మండలాలుగా విభజించినారు[6].
![]() |
|
|
|
|
[మార్చు] రవాణా వ్వవస్థ
[మార్చు] రహదారి మార్గం
కరీనగర్ హైదరాబాదుకు 162 కిలోమీటర్లు, వరంగల్లు 70 కిలోమీటర్లు, నిజామాబాదు నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్స్ కార్పొరేషన్ (ఎ పి ఎస్ ఆర్ టి సి)జోనల్ (అలహాబాదు, నిజామాబాదు, ఖమ్మం మరియు కరీంనగర్ కలసినవి )ప్రధాన కార్యాలయం కరీంనగర్ జిల్లాలో ఉంది. రోజుకు 2,500 బస్సులు దాటి వెళ్ళే చురుకైన బస్సు స్టేషన్‌లలో కరీంనగర్ బస్‌స్టేషన్ ఒకటి. కరీంనగర్ రైలు మార్గం ద్వారా అన్ని గమ్యాలను చేరే వసతి లేని కారణంగా పట్టణప్రజలు అధికంగా తమ ప్రయాణాలకు బస్సులను దూరగమ్యాలను చేరడానికి ఉపయోగిస్తారు. ఎ పి ఎస్ ఆర్ టి సి కరీంనగర్ నుండి వివిధ గమ్యాలకు బస్సు సర్వీసులను నడుపుతుంటారు. ఇక్కడి నుండి హైదరాబాదు మరియు సికింద్రాబాద్కు మాత్రం వాల్వో బస్సుల వంటి అధునాతన బస్సులతో పాటు 300 బస్సులను నడుపుతుంటారు. అలాగే అదిలాబాదు, నిజామాబాదు, వరంగల్లు, ఖమ్మం, నల్గొండ, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, పిడుగురాళ్ళ మరియు ఒంగోలు, కావలి, కందుకూరు,నెల్లూరు, పుట్టపర్తిమరియు తిరుపతి మొదలైన ఆంధ్రప్రదేశ్ ఊర్లకు బస్సులు నడుస్తుంటాయి . అలాగేఅతర ప్రాంతాలైన ముంబాయి, భివంది, సిరిడి, చంద్రపూరు, గధ్చిరోలి, గొండియా, రామ్‌టెక్ మరియు అహిరి వంటి మహారాష్ట్రంలోని ఊర్లకు బస్సులను నడుపుతుంటారు. అలాగే కర్నాటక రాష్ట్రంలోని బెంగుళూరుకు వాల్వో బస్సులను నడుపుతుంటారు.
కరీంనగర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డురవాణా సంస్థకు లాభసాటిగానున్నది. ప్రధాన వ్యాపార కేంద్రాలను కలుపు రైలు మార్గమేమీ లేనందువల్ల, రోడ్డు రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందింది. దీనివల్ల అదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం మరియు కరీంనగర్ జిల్లాలకు జోనల్ హెడ్ క్వార్టర్ గా కరీంనగర్ జిల్లా బస్ స్టేషన్ ఉంది.
[మార్చు] రైలు మార్గం
కరీంనగర్ సింగిల్ రైల్వే బ్రాడ్వే లైన్ చేత ఉత్తర తూర్పు రైల్వే (ఢిల్లీ నుండి చెన్నై) 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దపల్లి వద్ద అనుసంధానించబడి ఉంది. అలాగే కరీంనగర్ నుండి 48 కిలోమీటర్లదూరంలో ఉన్న జగిత్యాల వద్ద ఉత్తర పడమట రైల్వే లైన్‌తో అనుసంధానించబడి ఉంది. ప్రతిరోజు (జగిత్యాల-సిరిపుర్‌కు పుష్-పుల్ పాసింజర్ అప్ అండ్ డౌన్) మరియు వారానికి ఒక సారి జగిత్యాల-విజయవాడలకు రైళ్ళను నడుపుతున్నారు. ఈ రైలు ప్రతి మంగళ మరియు గురువారాలలో కరీంనగర్ రైల్వే స్టేషన్ ద్వారా పోతుంది. గ్రానైట్ రవాణా ద్వారా భారతీయ రైల్వేకు ఆదాయాన్ని సమకూర్చే అతి తక్కువ పట్టణాలలో కరీంనగర్ జిల్లా ఒకటి. అతి సమీపంలోని రైల్వే కూడలి ఖాజీపేట. అక్కడ నుండి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌తో సహా 147 రైళ్ళు ఈ రైలు మార్గం నుండి నడుస్తుంటాయి. ఈ మార్గం గుండా రాజధాని ఎక్స్‌ప్రెస్ మరియు ఎ పి ఎక్స్‌ప్రెస్ నడుస్తుంటాయి.
2009లో భారతీయ రైల్వే గుడ్స్- ఫ్రైట్ మూవ్మెంట్ సమయంలో కరీంనగర్-జగిత్యాల రైల్వే ప్రధమ స్థానంలో ఉంది.
భారతప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రణాళికను అనుసరించి, కరీంనగర్ రైల్వే లైన్ల నిర్మాణం పూర్తి అయినట్లైతే, కరీంనగర్ రైల్వే జంక్షన్ తూర్పు- పడమర మరియు ఉత్తర దక్షిణాల రైలు మార్గాను అనుసంధానించే పెద్ద రైల్వే కూడలిగా మారుతుంది.
[మార్చు] వాయు మార్గం
కరీంనగర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామగుండంలోని బేసెంట్ నగర్ కెసూరామ్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న విమానాశ్రయం నుండి భారత ప్రభుత్వ సంస్థ ఎయిర్ ఇండియాలో అంతర్భాగంగా ఉన్న వాయుదూత్ విమానాలు నడిపే సమయంలో సర్వీసులు ఉండేవి. వాయుదూత్ విమాన సేవలను నిలిపి వేసిన తరువాత ఈ విమానాశ్రయం వాడుకలో లేదు. 2010 లో ఈ విమానాశ్రయం వి వి ఐ పి విమానాలు నిలపడానికి అత్యవసర పరిస్థితిలో ఎయిర్ ఇండియా విమానాలు నిలపడానికి వాడబడుతుంది. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణాలోని రెండవ విమానాశ్రయంగా ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని యోచిస్తుంది. కరీంనగర్‌కు సమీపంలోని ముఖ్య విమానాశ్రయం 162 కిలోమీటర్ల దూరంలొ ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం .
[మార్చు] జనాభా లెక్కలు
- రాష్ట్రవైశాల్యంలో జిల్లా వైశాల్యం శాతం - 4.29
- రాష్ట్రజనాభాలో జిల్లా జనాభా శాతం - 4.59
- నగరీకరణ - 20.55%
- వర్షపాతం - 953 మి.మీ.
- అడవుల శాతం - 21.18
- రెవిన్యూ డివిజన్లు : 4 (కరీంనగర్, పెద్దపల్లి, మంథని, జగిత్యాల,)
- శాసనసభ నియోజకవర్గాలు: 13 (మేడారం, వేములవాడ, మంథని, పెద్దపల్లి, హుజూరాబాద్, కమలాపూర్, ఇందుర్తి, కరీంనగర్, చొప్పదండి, జగిత్యాల, బుగ్గారం, మెట్‌పల్లి, సిరిసిల్ల)
- లోక్‌సభ స్థానాలు : 2 (పెద్దపల్లి, కరీంనగర్)
- పురపాలక సంఘాలు : 6
- నదులు: మానేరు. గోదావరి నది దాదాపు 283 కిలో మీటర్లు ఈ జిల్లాలో ప్రవహిస్తోంది.
- పుణ్య క్షేత్రాలు: వేములవాడ, ధర్మపురి, మంథని, కాళేశ్వరం, కొండగట్టు, బిజ్ గిర్ షరీఫ్.
- దర్శనీయ ప్రదేశాలు: రామగిరి ఖిల్లా, ఎలగందుల ఖిల్లా.
| Religions in Karimnagar | ||||
|---|---|---|---|---|
| Religion | Percentage | |||
| హిందు | 80% | |||
| ముస్లిం | 15% | |||
| క్రిస్టియన్ | 4% | |||
| సిఖ్కు | 1% | |||
2011 భారతదేశ గణాంకాలను అనుసరించి ,[7] కరీంనగర్ జనసంఖ్య 2,99,660. వీరిలో పురుషుల శాతం 51% స్త్రీల శాతం 49%. సరాసరి అక్షరాస్యత శాతం 86.75%, ఇది జాతీయ అక్షరాస్యత 74.04% కంటే అధికం: వీరిలో పురుషుల అక్షరాస్యత 92.61%, స్త్రీల అక్షరాస్యత 80.79%. కరీంనగర్‌లో, జనాభాలో 12% అరు సంవత్సరాలకంటే త్క్కువైన వారు. [8]
[మార్చు] సంస్కృతి
- సంస్కృతి :-
కరీంనగర్ జిల్లాలో అత్యధికులు మాట్లాడే భాష తెలుగు. సంప్రదాయవస్త్రాలైన చీర, ధోవతి లే కాకుండా అధునిక వస్త్ర ధారణ కూడా చేస్తుంటారు.
- పండగలు :-
కరీంనగర్ ప్రత్యేకత అయిన బతుకమ్మ పండుగను ఇక్కడి ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంలో బతుకమ్మను అందమైన స్థానికంగా లభించే పూలతో అలకంకరించి సామూహికంగా సాంప్రదాయకమైన గీతనృత్యాలతో స్త్రీలు వేడుక చేసుకుంటారు. ఇతర హిందూ పండుగలైన ఉగాది, శ్రీరామనవమి, వినాయకచవితి, హోలి, శ్రీకృష్ణ జన్మాష్టమి, దసరా, దీపావళి, సంక్రాంతి మరియు మహాశివరాత్రి పండుగలు జరుపుకుంటారు. అలాగే ముస్లిములు రంజాన్, మొహరమ్ వంటి పండుగలు జరుపుకుంటారు. అలాగే క్రైస్తవులు క్రిస్‌మస్ మరియు గుడ్‌ఫ్రైడే జరుపుకుంటారు.
- అహార సంస్కృతి:-
కరీంనగర్ జిల్లా ప్రత్యేక అహారం పిండివంటలలో సకిలాలు ఒకటి. సాధారణంగా సంక్రాంతి పండుగ సందర్భంలో వీటిని ప్రతి ఇంట చేసుకుంటారు. బియ్యపు పిండి మరియు నువ్వులు కలిపి తయారు చేసిన పిండిని నూనెలో దేవి వీటిని తయారు చేస్తారు.
కరీంనగర్‌లో అధ్యధికులు హిందువులు. అయినా ఈ ప్రదేశం భారతదేశ స్వాతంత్రానికి ముందు గుర్తించతగిన ముస్లం పాలకుల చేత పాలించబడింది. కరీంనగర్‌లో హిందువుల శాతం 80%, ముస్లిముల శాతం 4%, సిక్కులు 1%. కరీంనగర్ జిల్లా అంతటా అనేక హిందూ ఆలయాలు, మసీదులు, చర్చిలు మరియు గురుద్వారాలు ఉన్నాయి. ప్రజలు ప్రతి మతాన్ని గౌరవిస్తూ ఒకరితో ఒకరు సహకారంతో జీవిస్తున్నారు.
[మార్చు] పశుపక్ష్యాదులు
[మార్చు] విద్యాసంస్థలు
ఆంధ్రప్రదేశ్ వాయవ్యదిశలో ఉన్న విద్యావిషయ ప్రధాన కేంద్రాలలో కరీంనగర్ ఒకటి. కరీంనగర్ అనేక మేధావులను, రాజకీయ నాయకులను, కవులను మరియు సాంకేతిక నిపుణులను పలు దశాబ్ధాలుగా తయారు చేసింది. ప్రధానమంత్రిగా సేవలందించిన పి. వి. నరసింహారావు వారిలో ఒకరు. అనేక సాఫ్ట్ వేర్ విద్యార్ధులను కరీంనగర్ జిల్లా తయారుచేసింది. వారంతా భారతదేశ మహానగరాలలో మరియు అంతర్జాతీయంగా పనిలో నిమజ్ఞమై ఉన్నారు.
కరీనగర్ జిల్లాలోని విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలు.
- శాతవాహన విశ్వవిద్యాలయం, కరీంనగర్.
- జవహర్లాల్ నెహ్రూ టెక్నోలాజికల్ యూనివర్సిటీ, కరీంనగర్, నాచుపల్లి.
- నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (ఎన్ ఎ సి ) ఈ విశ్వవిద్యాలయం ఒక ప్రాంతీయ విద్యాకేంద్రాన్ని కరీంనగర్ జిల్లా జగిత్యాల వద్ద స్థాపించారు. [9]
[మార్చు] ప్రభుత్వ కళాశాలలు ఉన్నత కళాశాలలు
- శాతవాహన పి జి కాలేజ్, ఎల్ ఎమ్ డి, కరీంనగర్
- ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, కరీంనగర్
- గవర్నమెంట్ డిగ్రీ & కాలేజ్ ఫర్ వుమెన్, కష్మీర్గడ్డ, కరీంనగర్.
- గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, గంభీర్రావు పేట మండల్.
[మార్చు] ప్రబల ప్రైవేట్ కళాశాలలు ఉన్నత కళాశాలలు
|
|
[మార్చు] మెడికల్ కాలేజ్‌లు
- చల్మేడ ఆనందరావు ఇస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, కరీంనగర్.
- సివిఎమ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, వెలిచాల, కొత్తపల్లి (వయా), కరీంనగర్. [10]
- ప్రతిమా ఇస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(పి ఐ ఎమ్), నగునూర్, కరీంనగర్.
- ప్రతిమా కాలేజ్ ఆఫ్ నర్సింగ్, కరీంనగర్.
- ఎస్.ఆర్.ఆర్. కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్, వల్లభపూర్ (వి), ఏల్కతూరి(ఎమ్), కరీంనగర్.(2010 నుండి శాతవాహనా విశ్వవిద్యాలయానికి అనుబంధం, కరీంనగర్)
- సాయీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (బిపిటి & ఎమ్ ఎల్ టి), కరీంనగర్.
- సంతోష్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, కరీంనగర్.
- శివాని స్కూల్ ఆఫ్ నర్సింగ్, కరీంనగర్.
- శ్రీబాలాజీ కాలేజ్ ఆఫ్ ఫార్మసి, చొప్పదండి(వి), చొప్పదండి(ఎమ్), కరీంనగర్ .
- శ్రీ చైతన్యా ఇస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్.
- ఎస్ ఆర్ ఎమ్ ఇస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ, కరీంనగర్.
- ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, కరీంనగర్.
- వాగేశ్వరీ ఆయుర్వేదిక్ కాలేజ్, రామక్రిష్ణా కాలనీ(వి), తిమ్మపూరు(ఎమ్), కరీంనగర్.
- వాగేశ్వరీ ఇస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, రామక్రిష్ణా కాలనీ(వి), తిమ్మపూరు(ఎమ్), కరీంనగర్.
[మార్చు] ఇంజనీరింగ్ కాలేజ్‌లు
- (జెఐటిఎస్-ఐ)జ్యోతిష్మతి ఇస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, కరీంనగర్.
- (జెఐటిఎస్-II) జ్యోతిష్మతి ఇస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ (ఐ) అండ్ టెక్నాలజీ, కరీంనగర్.
- శ్రీ చైతన్యా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (ఐ) అండ్ టెక్నాలజీ, కరీంనగర్.
- శ్రీచతన్యా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (II) అండ్ టెక్నాలజీ, కరీంనగర్.
- (విఐటిఎస్-ఐ)వివేకానంద ఇస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్, కరీంనగర్.(25)
- (వి ఐ టి ఎస్ ఇ టి) వివేకానందా ఇస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్ (వి ఐ టి ఎస్)- స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ), కరీంనగర్.
- (వి ఐ టి ఎస్-వీ ఇ సి)వి ఐ టి ఎస్ వుమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, బొమ్మకల్, కరీంనగర్.
- వాగేశ్వరీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కరీంనగర్.
- వాగేశ్వరీ ఇంజనీరింగ్ కాలేజ్,కరీంనగర్.
- వాగేశ్వరీ ఇస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్, కరీంనగర్.
- వాగేశ్వరీ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ కంప్యూటర్ సైన్సెస్, కరీంనగర్.(26)
- నిగమ ఇంజనీరింగ్ కాలేజ్, కరీంనగర్.
- సహజ ఇంజనీరింగ్ కాలేజ్, కరీంనగర్.
- ట్రినిటీ ఇంజనీరింగ్ కాలేజ్, కరీంనగర్ (జె ఐ టి ఎస్-ఐ) జ్యోతిష్మతి ఇస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, కరీంనగర్.
[మార్చు] టీచర్ ట్రైనింగ్ కాలేజ్
- క్రిసెంట్ కాలేజ్ ఆఫ్ ఎజ్యుకేషన్, కరీంనగర్.[11]
- షాలిని కాలేజ్ ఆఫ్ ఎజ్యుకేషన్, కరీంనగర్.
- గౌరిషెట్టి వెంకటేష్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఎజ్యుకేషన్, కరీంనగర్.
- లయోలా కాలేజ్ ఆఫ్ ఎజ్యుకేషన్, కరీంనగర్.
- మేనేజర్ కాలేజ్ ఆఫ్ ఎజ్యుకేషన్, కరీంనగర్.
- ఆర్ బి వి ఆర్ ఆర్ కాలేజ్ ఆఫ్ ఎజ్యుకేషన్, కరీంనగర్.
- రౌసీయు కాలేజ్ ఆఫ్ ఎజ్యుకేషన్, కరీంనగర్.
- వాసిష్టా కాలేజ్ ఆఫ్ ఎజ్యుకేషన్, కరీంనగర్.
- వాణినికేతన్ విద్యా సమితి, కరంనగర్.
[మార్చు] ఆకర్షణలు
వేములవాడ, కాళేశ్వరము, ధర్మపురి, నగునూరు కోట, మంథని, కొండగట్టు, రాయికల్, మొలంగూరు ఖిల్లా, శివారం వణ్యప్రాణి సంరక్షణాలయము, ఎలగందల్ ఖిల్లా, దో మినార్, మానేరు డాం, ఉజ్వల పార్క్, కొనరావుపేట.
[మార్చు] పర్యాటక ఆకర్షణలు
కరీంనగర్ జిల్లాలో అనేక విధాల పర్యాటకుల ఆకర్షించే అనేక పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. వీటిలో అతి ప్రధానమైనవి క్రింద వర్ణించ బడ్డాయి.
[మార్చు] యలగందల్ కోట
కరీంనగర్ జిల్లాలో కరీంనగర్‌కు 10 కిలోమీటర్ల దూరంలో కొమ్మారెడ్డి రోడ్డు మార్గంలో మానైర్ నదీతీరంలో తాటిచెట్ల మద్య సుందర ప్రకృతిక నేపధ్యంలో యలగందల్ కోట నిర్మించబడి ఉంది. చారిత్రకంగా ఈ ప్రదేశం అయిదు సామ్రాజ్యాల చేత పాలించబడింది. పురాతన జ్ఞాపక చిహ్నాలు కొండశిఖరాన ఉన్న కోట, తూర్పు ద్వారానికి వెలుపల ఉన్న బృందావన్ సరసు 1774 ఎ డి ఫాఫర్ -ఉద్ - దౌలా చేత నిర్మించబడింది. ముస్లిమ్ సన్యాసులైన సైయద్ షాహ్ మునావర్ క్వాద్రి సాహెబ్, దూలా షాహ్ సాహెబ్, సయద్ మరూఫ్ సాహెబ్, షాహ్ తాలిబ్ బిస్మిల్లా సాహెబ్ మరియు వాలి హైదర్ సాహెబ్ సమాధులు కదిలించినప్పుడు అక్కడ ఉన్న మినార్లు ఉఉగుతాయి. హైస్కూలు వద్ద మరోరెండు మీనార్లు ఉన్నాయి. ఈ మీనార్లు ఎక్కడానికి లోపలి నుండి మెట్లు ఉన్నాయి.
[మార్చు] ఉజ్వలా పార్క్
కరీంనగర్ జిల్లా ఆకర్షణలలో ఉజ్వలా పార్క్ ఒకటి. 2001లో ఈ పార్క్‌కు ప్రారంభోత్సవం జరిగింది. ప్రకృతి మనోహరమైన వాతావరణంలో ఉన్న ఈ పార్క్‌ను సందర్శించడానికి కరీంనగర్ నుండి పర్యాటకులు అధికంగా వస్తుంటారు. కరీంనగర్ పర్యాటకులు అధికంగా సందర్శించే ప్రదేశం ఇది.
[మార్చు] దిగువ మానైర్ రిజర్వాయర్
దిగువ మానైర్ రిజర్వాయర్ 1974లో ప్రారంభించబడి 1985లో నిర్మాణపు పనులు పూర్తి చేయబడ్డాయి. వర్షాకాలంలో ఈ రిజర్వాయర్ నీటి మట్టం అత్యధికంగా పెరుగుతుంది.
[మార్చు] రాజీవ్ డీర్ పార్క్
దిగువ మనైర్ రిజర్వాయర్ సమీపంలో ఉన్న 30 ఎకరాల వైశాల్యంలో రాజీవ్ డీర్ పార్క్ కరీంనగర్ పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ఇది కరీంనగర శివార్లలో ఉన్నది.
[మార్చు] వేములవాడ
కరీంనగర్ పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేములవాడ లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరీ ఆలయం హిందువులను విశేషంగా ఆకర్షించే అధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతుంది. ఈ దేవాలయ కూడలికి అనేక మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు.
[మార్చు] ధర్మపురి
కరీంనగర్ జిల్లాలోని ధర్మపురిలో హిందూ ఆలయాలకు ప్రసిద్ధి. ఇక్కడ విష్ణు మూర్తి అవతారలలో ఒకటి అయిన నరసింహస్వామి ఆలయం, దక్షిణామూర్తితో ఉన్న శివాలయం, ఏక శిలలో చెక్కబడిన వినాయకుడు మరియు సప్త మాతృకల శిల్పాలు మరియు మహిషాసుర మర్ధిని అరవై స్థంభాలు కలిగిన ఆలయంలో ఉన్నారు, 5 వందల సంవత్సరాల పూర్వపు శ్రీ సీతారామ ఆలయం మరియు అక్కాపల్లే రాజన్న మొదలైన పవిత్రక్షేత్రాలు ఈ జిల్లాను అధ్యాత్మిక సుసంపన్నం చేస్తున్నాయి.
[మార్చు] కొండగట్టు
కరీనగర్‌కు 35 కిలోమీటర్లదూరంలో ఉన్న కొండగట్టు వద్ద ఉన్న ఆంజనేయుడి ఆలయం ఉంది. ఈ ఆలయం 300 సంవత్సరాల క్రితం ఒక కౌహర్డ్ చేత నిర్మించబడినదని భావిస్తున్నారు. 160 సంవత్సరాల క్రితం తిరిగి ఈ ఆలయం క్రిష్ణారావ్ దేశ్‌ముఖ్ గారి చేత పునరుద్ధరణ చేయబడింది. ఈ ఆలయంలో 40 రోజుల దీక్ష వహించి పూజ చేసిన స్త్రీ మాతృమూర్తి ఔతుందని విశ్వసిస్తున్నారు. వేములవాడకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం కరీంనగర్ జిల్లాలో ప్రాముఖ్యత కలిగిన ఆలయాలలో ఒకటి.
[మార్చు] పర్యాటక కేంద్రాలు

[మార్చు] ఆర్ధికరంగం
[మార్చు] పరిశ్రమలు
- సింగరేణి కొలరీస్ కంపెని లిమిటెడ్.
- కెసొరామ్ సిమెంట్ ఫ్యాక్టరీ.
- గ్రానైట్ ఇండస్ట్రీ.
[మార్చు] నేషనల్ ధర్మల్ పవర్
రామగుండం వద్ద 2,600 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే నేషనల్ ధర్మల్ పవర్ స్టేషన్‌లో ఒక భాగమైన ఎన్ టి పి సి (రామగుండం, ఆంధ్రప్రదేశ్, ఇండియా). ఇది దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద విద్యుదుత్పత్తి కేంద్రం. భారతదేశంలో ఐ ఎస్ ఓ 14001 సర్టిఫికేషన్ పొందిన సూపర్ ధర్మల్ పవర్ స్టేషన్ ఇది మాత్రమే. ఇది అంతర్జాతీయంగా 6వ శ్రేణిలో ఉన్న పవర్ జనరేటర్. దీని స్థాపిత పవర్ కెపాసిటీ 19,435 మెగావాట్లు. ఈ సంస్థ నవరత్న పబ్లిక్ సెక్టర్ అండర్టేక్ చేసిన ఈ సంస్థ 25 సంవత్సరాల సర్వీసును పూర్తి చేసుకుంది.
[మార్చు] సింగరేణి కొలరీస్ కంపెని లిమిటెడ్
గోదావరీ తీరంలో బొగ్గు అన్వేషణ మరియు వినియోగానికి అధికారయుత సంస్థ సింగరేణి కొలరీస్ కంపెనీ లిమిఆటెడ్. సింగరేణి బొగ్గు గని దక్షిణ భారతదేశం లోని ఏకక బొగ్గుగని. ప్రస్థుతం ఆంధ్రప్రదేశ్‌లో ఎస్ సి సి ఎల్ గనుల చర్యలు నాలుగు జిల్లాలలో జరుగుతున్నాయి. అవి వరుసగా అదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం మరియు వరంగల్.
[మార్చు] కెసోరామ్ ఫిమెంట్ ఫ్యాక్టరీ
కెసొరామ్ సిమెంట్ ఫ్యాక్టరీ బిర్లా గ్రూప్ కంపెనీలలో ఒకటి. 1967లో ఇది అవతరించింది. ఒకరోజుకు 2500 మెట్రిక్ టన్నుల సిమెంటును ఉత్పత్తి చేస్తూ ఈ సిమెంట్ ప్లాంట్ దక్షిణ భారతదేశంలో అతి పెద్దదైన సిమెంట్ ఫ్యాక్టరీ. ఈ కంపెనీ సాకేంతికంగా జాతీయ సాకేంతికతను ఉపయోగిస్తూ అవసరమైనప్పుడు మాత్రమే అంతర్జాతీయ సాంకేతికతను వాడుకుంటున్నది.
[మార్చు] గ్రానైట్ ఇండస్ట్రీ
టాన్ బ్రౌన్ మరియు మేపిల్ బ్రౌన్ జాతి గ్రానైట్‌కు కరీంనగర్ జిల్లా అంతర్జాతీయ గుర్తింపును పొందింది. కరీంనగర్ జిల్లాలోని ఒడియారమ్ గ్రామం లోని గ్రానైట్ 2008 ఒలింపిక్స్ క్రీడల సమయంలో చైనా ఉపయోగించుకున్నది. చైనా ఉపయోగించుకున్నప్పటి నుండి ఈ గ్రానైట్ అంతరజాతీయ ముఖ్యంగా ఆసియా దేశాలలో ప్రబలమైంది. జపాన్‌తో సహా ఆసియాదేశాలు కరీంనగర్ గ్రానైట్‌ను వివిధ ప్రాజక్ట్‌లకు ఉపయోగించుకుంటుంది. పలు దేశాలు గ్రానైటును ఉత్తమ నాణ్యత మరియు తక్కువ వెలకు లభించిన కారణంగా వాడుకుంటున్నాయి. కరీంనగర్‌లో మనకొండూరు, మల్లైల్, కేశవపట్టణం, కరీంనగర్ మొదలైన మండలాలలో 600 లకు పైగా క్వారీలు విస్తరించి ఉన్నాయి. అయినప్పటికీ అంతర్జాతీయంగా పేరొందిన క్వారీలు మాత్రం 20. ఒక మాసానికి 10,000 నుండి 12,000 క్యూబిక్ మీటర్ల గ్రానైట్ ఉత్పత్తులు కరీంనగర్ నుండు చైనా మరియు ఇతర దేశాలకు ఎగుమతి ఔతుంది. కరీంనగర్ జిల్లా గ్రానైట్ ఒక సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు ఉంటుంది. రైల్వే శాఖకు కూడా గ్రానైట్ ఎగుమతుల ద్వారా మంచి అదాయాన్ని పొందుతుంది. గ్రానైట్ రవాణా కొరకు కరీంనగర్, గంగధారా మరియు ఉప్పల్ రైల్వే స్టేషన్‌లలో ప్రత్యేక ప్లాట్‌ఫారములు నిర్మించబడ్డాయి. ఇక్కడి నుండి గ్రానైట్ చెన్నై మరియు కాకినాడా రేవుల ద్వారా చైనాదేశనికి ఎగుమతి చేయబడుతుంది. ఈ గ్రానైట్ చైనాదేశానికి పంపిన తరువాత అక్కడ పాలిష్ చేయబడి జపాన్ వంటి ఆసియాదేశాలకు అమ్మబడుతుంది. బృహత్తరమైన గ్రానైట్ రాళ్ళను పైకి ఎత్తి పెట్టడానికి ఉపయోగిస్తున్న క్రేన్లు కూడా అనేక లక్షలు సంపాదిస్తున్నాయి. అలాగే గ్రానైట్ ఎగుమతుల ద్వారా అనేకమందికి ఉపాది కూడా లభిస్తుంది.
[మార్చు] మాద్యమం
|
|
[మార్చు] సాఫ్ట్‌వేర్ సంస్థలు
కరీంనగర్ ఇప్పుడిప్పుడే అంకురిస్తున్న ఐటి ప్రొడక్ట్స్ మరియు స్టార్టప్స్ యొక్క నిలయం .
- ఐకాన్ ఇన్ఫోలింక్స్ , కంప్లీట్ ఐటి సొల్యూషన్స్, కరీంనగర్
- స్పూర్తి ఫైనాన్షియల్ సర్వీసెస్, కరీంనగర్ - 9848354992.
- బ్లూ-రే టెక్నాలజీస్, పరివార్ బర్కిలీ బిల్డింగ్, నియర్ గీతాభవన్, కరీంనగర్.[12]
- పెన్సిల్ కోడర్స్ లాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సాయీ క్రిష్ణ ధియేటర్ సమీపంలో, భారత్ నగర్, Karimnagar.[13]
- మెలంగో లాబ్స్ ఐ ఎన్ సి, భగత్ నగర్, కరీంనగర్ [14]
- డి ఐ ఎస్ సి కంప్యూటర్స్ , మంకమ్మతోట, కరీంనగర్ [15]
[మార్చు] వ్యాపార కూడళ్ళు
కరీంనగర్‌లో ఉన్న మల్టీ కాంప్లెక్సలలో ఫాతిమా మల్టీ కాంప్లెక్స్ ఒకటి. ఇందులో త్రీస్టార్ హోటల్, రెండు రెస్టారెంట్స్, 24-గంటల కాఫీ షాప్, బార్స్, బ్యంక్విట్ హాల్స్ మరియు బౌలింగ్ అల్లే మరియు కంప్యూటర్ గేమ్స్ కలిగిన గేమింగ్ జోన్ మొదలైనవి ఉన్నాయి. త్రీస్టార్ హోటెల్ కలిగిన మల్టీ కాంప్లెక్స్‌లలో రాష్ట్రంలో ఫాతిమా మల్టీ కాంప్లెక్స్ మొదటిది. అలాగే హైదరాబాద్ తరువాత కరీంనగర్ మల్టీ కాంప్లెక్స్ రాష్ట్రంలో మొదటి మల్టీ కాంప్లెక్స్. [16]
శ్వేతా ఫోర్ స్టార్ హోటెల్. ఇందులో రెస్టారెంట్, కాఫీ షాప్, బార్, బ్యాంక్విట్ హాల్ ఉన్నాయి.
కరీంనగర్‌లో చాలా కాలంనాటి ఉన్న హోటెల్ కల్పన. హోటెల్ కల్పన 1972లో స్థాపించబడింది. 2000లో కొత్త భవనానికి మార్చబడింది. ఇందులో ఫ్యామిలీ రెస్టారెంట్, ఉడిపి ఫాస్ట్ ఫుడ్ సెంటర్, బార్, లాడ్జ్, బేకరీ, స్వీట్ హౌస్ మరియు బేంక్విట్ హాల్ ఉన్నాయి. అలాగే కరీంనగర్‌లో గీతాభవన్ కూడా పాత హోటెళ్ళలో ఒకటి. ఇది 1975లో ప్రారంభించబడింది. ఇది కరీంనగర్‌లో ప్రబలమైన శాఖాహార రెస్టారెంట్ మరియు ఉత్తమ స్వీట్ హౌస్. జిల్లాలో ఇది ఉత్తమ స్వీట్ హౌస్‌గా పేరు పొందింది.
[మార్చు] ఆరోగ్య సంరక్షణ
కరీంనగర్ గత రెండు దశాబ్ధాలుగా చుట్టుపక్కల తాలూకాలకు ప్రధాన ఆరోగ్యసంరక్షణా కేంద్రంగా ఉంటుంది. జగిత్యాల, సిర్సిల్లా, రామ గుండం,కొడిమ్యాల్-చెప్పియల్, మంథని , హుజూరాబాద్, హుస్నాబాద్ , చొప్పదండి, మాల్యాల్ మరియు గంగాధరా తాలుకాలకు కేంద్రమై ఉన్న కరీంనగర్ ఆరోగ్యసంరక్షణా కేంద్రంగా కూడా ప్రధానమైనది. జిల్లా మొత్తం నుండి రోగులు ఆరోగ్యసంరక్షణ కొరకు కరీంనగర్ మీద ఆధారపడుతుంటారు. ప్రభుత్వాసుపత్రి కూడా రోగులకు తగిన చికిత్స అందజేయడంలో కీలకపాత్ర వహిస్తుంది.
కరీంనగర్ జిల్లాలో ప్రధాన ఆసుపత్రులు.
- అపోల్లో రీచ్ హాస్పిటల్, సుభాష్ నగర్, రైల్వే స్టేషన్ సమీపంలో.
- శివరామ్ హాస్పిటల్.
- ఆర్యన్ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్, రాజా డీలక్స్ ధియేటర్ వద్ద.
- నేచుర్ క్యూర్ హెల్త్ సెంటర్, బొమ్మకల్.
- రెకర్తీ ఐ హాస్పిటల్.
- చల్మేడ ఆనంద్ రావు హాస్పిటల్.
- ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్.
- గవర్నమెంట్ హాస్పిటల్.
- సూర్యా నర్సింగ్ హోమ్.
[మార్చు] క్రీడలు
కరీంనగర్ నగరం అనేక జాతీయ అంతర్జాతీయ స్థాయి వివిధ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది.
- బి.ఆర్ అంబేత్కర్ స్టేడియం.
- ఇండోర్ స్టేడియం.
- స్విమ్మింగ్ పూల్.
- రీజనల్ స్పోర్ట్స్ స్కూల్.
- వాటర్ స్పోర్ట్స్ అకాడమీ.
- పీలిస్ పేరేడ్ గ్రౌండ్.
- ఎస్ ఆర్ పి కాలేజ్ గ్రౌండ్.
[మార్చు] ప్రముఖవ్యక్తులు
[మార్చు] మాద్యమం
|
|
[మార్చు] ఆరోగ్య సంరక్షణ
కరీంనగర్ గత రెండు దశాబ్ధాలుగా చుట్టుపక్కల తాలూకాలకు ప్రధాన ఆరోగ్యసంరక్షణా కేంద్రంగా ఉంటుంది. జగిత్యాల, సిర్సిల్లా, రామ గుండం,కొడిమ్యాల్-చెప్పియల్, మంథని , హుజూరాబాద్, హుస్నాబాద్ , చొప్పదండి, మాల్యాల్ మరియు గంగాధరా తాలుకాలకు కేంద్రమై ఉన్న కరీంనగర్ ఆరోగ్యసంరక్షణా కేంద్రంగా కూడా ప్రధానమైనది. జిల్లా మొత్తం నుండి రోగులు ఆరోగ్యసంరక్షణ కొరకు కరీంనగర్ మీద ఆధారపడుతుంటారు. ప్రభుత్వాసుపత్రి కూడా రోగులకు తగిన చికిత్స అందజేయడంలో కీలకపాత్ర వహిస్తుంది.
కరీంనగర్ జిల్లాలో ప్రధాన ఆసుపత్రులు.
- అపోల్లో రీచ్ హాస్పిటల్, సుభాష్ నగర్, రైల్వే స్టేషన్ సమీపంలో.
- శివరామ్ హాస్పిటల్.
- ఆర్యన్ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్, రాజా డీలక్స్ ధియేటర్ వద్ద.
- నేచుర్ క్యూర్ హెల్త్ సెంటర్, బొమ్మకల్.
- రెకర్తీ ఐ హాస్పిటల్.
- చల్మేడ ఆనంద్ రావు హాస్పిటల్.
- ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్.
- గవర్నమెంట్ హాస్పిటల్.
- సూర్యా నర్సింగ్ హోమ్.
[మార్చు] పాలనా నిర్వహణ
కరీంనగర్ నగరాన్ని పురపాలక వ్యవస్థ నిర్వహిస్తుంది. [19] కరీంనగర్ పురపాలక వ్యవస్థ 2005 నుండి నగరపాలక వ్యవస్థగా అభివృద్ధి చెందింది. నగరంలోని కొన్ని వేల మంది ప్రజలు నగర పరిమితిని దాటి నివసిస్తున్నారు. నగరవెలుపలి ప్రాంతాలు అనేకం నగరపఅలక పరిమితిలో చేరాయి. నగర మొత్తం జనాభా (కరీంనగర్ మరియు దూర ప్రాంత జనాభా కలిసి)3,30,000. నగరపాలనఅ వ్యవస్థ సభ్యులు వార్డుల వారిగా ఎన్నుకొనబడతారు. మున్సిపల్ కమీషనర్ నియామకం భారతప్రభుత్వం ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ద్వారా నియమిస్తుంది. ఆయన మునిసిపల్ నిర్వహణా వ్యవస్థకు అధిపత్యం వహిస్తాడు. అయ్యన నగరపాలనా వ్యవస్థ నిర్ణయాలను తీసుకోవడం మరియు ఆర్ధిక ప్రణాళిక మొదలైన నిర్ణ్యాలు తీసుకుంటాడు.
[మార్చు] బయటి లింకులు
|
||||||||||||||
[మార్చు] వనరులు
[మార్చు] మూలాలు
- ↑ Software firms located at Karimnagar
- ↑ Helping Businesses build great social web experience
- ↑ Melango| UnConferences without borders
- ↑ DISC Computers| Program your way to Success
- ↑ Multiplex in the heart of the city/Karimnagar
- ↑ పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో కరీంనగర్ జిల్లా తాలూకాల వివరాలు. జూలై 26, 2007న సేకరించారు.
- ↑ Population statistics of towns and cities in india
- ↑ Population, population in the age group 0-6 and literates by sex - Cities/Towns (in alphabetic order): 2001
- ↑ National Academy of Construction,Karimnagar region centre Tom 'n' Jerry is one of the best school
- ↑ CVM College of Pharmacy
- ↑ Crescent College of Education
- ↑ Software firms located at Karimnagar
- ↑ Helping Businesses build great social web experience
- ↑ Melango| UnConferences without borders
- ↑ DISC Computers| Program your way to Success
- ↑ Multiplex in the heart of the city/Karimnagar
- ↑ Major hospitals in Karimnagar
- ↑ Major hospitals in Karimnagar
- ↑ Municipal Corporation