కర్ట్ కోబెన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Kurt Cobain
Nirvana around 1992.jpg
Cobain performing with Nirvana at the 1992 MTV Video Music Awards.
వ్యక్తిగత సమాచారం
జన్మ నామం Kurt Donald Cobain
సుపరిచితుడు Kurdt Kobain
రంగం Alternative rock, grunge
వృత్తి Musician, songwriter
వాద్యపరికరం Vocals, guitar
క్రియాశీల కాలం 1987–1994
Labels Sub Pop, DGC/Geffen
Associated acts Nirvana, Fecal Matter
Notable instruments
Fender Jag-Stang
Fender Jaguar
Fender Mustang
Fender Stratocaster
Martin D-18E
Univox Hi-Flier[1]

కర్ట్ డొనాల్డ్ కోబెన్ (/koʊbeɪn/, /kʌbeɪn/ అని ఉచ్ఛరించబడుతుంది; ఫిబ్రవరి 20, 1967 – సి. ఏప్రిల్ 5, 1994) అమెరికాకు చెందిన ఒక పాటల రచయిత మరియు స్వరకర్త. నిర్వాణ రాక్ బ్యాండ్‌ యొక్క ప్రముఖ గాయకుడు మరియు గిటారిస్ట్‌గా అతను సుపరిచితుడు.


తన రెండో ఆల్బమ్ నెవర్‌మైండ్ (1991)లోని "స్మెల్స్ లైక్ టీన్ స్పిరిట్" అనే పాట ద్వారా ప్రధాన స్రవంతిలోకి నిర్వాణ ప్రవేశించింది. తద్వారా గ్రంజ్‌గా పిలవబడే ఆల్టర్‌నేటివ్ రాక్ యొక్క ఉప సాహిత్యానికి మరింత ప్రాచుర్యం లభించింది. అలైస్ ఇన్ చైన్స్, పెరల్ జామ్ మరియు సౌండ్‌గార్డెన్ వంటి ఇతర సీటిల్ గ్రంజ్ బ్యాండ్లు కూడా అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తద్వారా 1990ల ప్రారంభం నుంచి మధ్యకాలం వరకు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఆల్టర్‌నేటివ్ రాక్ అనేది రేడియో మరియు మ్యూజిక్ టెలివిజన్‌లో ప్రబల సాహిత్యంగా ఆధిక్యతను కనబరిచింది. నిర్వాణ అనతికాలంలోనే "జనరేషన్ X" యొక్క "పతాక బ్యాండ్"గా పరిగణించబడింది. బ్యాండ్ యొక్క ప్రముఖ గాయకుడు కోబెన్‌ను పత్రికలు జనరేషన్ యొక్క "ప్రతినిధి"గా అభివర్ణించాయి.[2] తత్ఫలితంగా కాస్త అసౌకర్య భావనకు లోనైన కోబెన్ బ్యాండ్ సంగీతంపై దృష్టి సారించాడు. బ్యాండ్ సందేశం మరియు సృజనాత్మక దృష్టిని జనాలు తప్పుగా అర్థం చేసుకున్నారని గ్రహించిన అతను మూడో స్టూడియో ఆల్బమ్ ఇన్ ఉటెరో (1993)ను విడుదల చేసి, బ్యాండ్ శ్రోతలకు సవాలు విసిరాడు.


కోబెన్ తన జీవిత చరమాంకంలో హెరాయిన్‌ వ్యసనం, అనారోగ్యం మరియు మనోవేదనకు గురయ్యాడు. ఫలితంగా పేరుప్రతిష్ఠలు దెబ్బతినడంతో పాటు వృత్తిపరమైన మరియు జీవితకాల వ్యక్తిగత ఒత్తిళ్లు అతన్ని మరియు అతని భార్య, స్వరకర్త కోర్ట్‌నీ లవ్‌‌ను చుట్టుముట్టాయి. 8 ఏప్రిల్ 1994న కోబెన్ సీటిల్‌లోని తన నివాసంలో మరణించి ఉండటం గుర్తించారు. అతని తలపై ఉన్న గాయం కారణంగా అతను తుపాకీతో కాల్చుకుని, ఆత్మహత్య చేసుకున్నాడని తొలుత అధికారికంగా ధ్రువీకరించారు. అతని మరణానికి సంబంధించి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో అత్యాసక్తి మరియు చర్చనీయ అంశాలుగా మారాయి. కోబెన్ పాటల రచయితగా నిర్వాణ అరంగేట్రం మొదలుకుని బ్యాండ్ యొక్క ఆల్బమ్ అమ్మకాలు ఒక్క USలోనే ఇరవై ఐదు మిలియన్లకు పైగా మరియు ప్రపంచవ్యాప్తంగా యాభై మిలియన్లకు పైగా అమ్ముడయ్యాయి.[3][4] మరణం తర్వాత, కోబెన్ తన సమకాలీన దిగ్గజ స్వరకర్తల్లో ఒకడని పలువురు పాత్రికేయులు మరియు శ్రోతలు కొనియాడటం మొదలుపెట్టారు. ఫలితంగా అతని ప్రాబల్యం మరింత విస్తరించింది.


బాల్యం[మార్చు]

20 ఫిబ్రవరి 1967న వాషింగ్టన్‌లోని అబర్‌దీన్‌లో కర్ట్ డొనాల్డ్ కోబెన్ జన్మించాడు. తన కుటుంబం తిరిగి అబర్‌దీన్‌కు వెళ్లడానికి ముందు కోబెన్ పుట్టిన తర్వాత తొలి ఆరు రోజులు హోకియమ్ నగరంలో ఉన్నాడు. అతని తండ్రి డొనాల్డ్ లీల్యాండ్ కోబెన్ ఐరిష్ మరియు ఫ్రెంచ్ సంతతికి చెందినవాడు కాగా, అతని తల్లి వెండీ ఎలిజబెత్ (నీ ఫ్రాడెన్‌బర్గ్)[5] ఐరిష్, జర్మన్ మరియు ఇంగ్లీష్ వంశపరంపరకు చెందినది.[6][7] కోబెన్ తన వారసత్వంపై పరిశోధన జరిపిన అనంతరం తన ఇంటిపేరు ఐర్లాండ్‌లోని కౌంటీ కార్క్ నుంచి ఉత్తర అమెరికాకు వలస వెళ్లిన కోబర్న్ జాతి నుంచి సంక్రమించిందని గుర్తించాడు.[8] కోబెన్‌ సోదరి కింబర్లీ 24 ఏప్రిల్ 1970న జన్మించింది.[5]


అతను సంగీత కుటుంబంలో జన్మించాడు. అతని తల్లి వెండీ పెద్ద సోదరుడు చుక్ ది బీచ్‌కూంబర్స్ అనే బ్యాండ్‌లో ఉండేవాడు. అతని అత్త మేరీ గిటారు వాయిస్తూ, బ్యాండ్ల తరపున అబర్‌దీన్ అంతటా ప్రదర్శనలు ఇచ్చేది. ఇక అతని పెద్ద మామ డెల్‌బర్ట్ ఐరిష్ మధ్యస్వర గాయకుడు. 1930లో కింగ్ ఆఫ్ జాజ్ అనే చిత్రం ద్వారా అతను తెరంగేట్రం చేశాడు.


కళాకారుడిగా కోబెన్ ప్రతిభ చిన్నతనం నుంచే ప్రజ్వరిల్లింది. కోబెన్ పడకగది ఒక కళామందిరం వలే తీర్చిదిద్దబడినట్లు కనిపించేది. అక్కడ తనకు నచ్చిన పలు చిత్రాల్లోని పాత్రలను మరియు ఆక్వామ్యాన్, క్రియేచర్ ఫ్రమ్ ది బ్లాక్ లాగూన్ వంటి చిత్తుపటాలను మరియు డొనాల్డ్ డక్, మిక్కీ మౌస్, ఫ్లూటో వంటి డిస్నీ పాత్రలను కూడా చిత్రీకరించేవాడు.[9]


బాల్యం నుంచే అతను సంగీతంపై ఆసక్తి పెంచుకున్నాడు. రెండేళ్ల ప్రాయం నుంచే అతను గీతాలాపన మొదలుపెట్టాడని అతని అత్త మేరీ తెలిపింది. నాలుగేళ్లున్నప్పుడు, కోబెన్ గీతాలాపనతో పాటు పియానో వాయించడం మరియు తమ విహారయాత్రకు సంబంధించి ఒక పాటను కూడా రాశాడు. రమోన్స్[10] వంటి కళాకారులను అతను క్షుణ్ణంగా పరిశీలించేవాడు. అలాగే ఆర్లో గుత్రీ యొక్క "మోటార్‌సైకిల్ సాంగ్", ది బీటిల్స్‌కు చెందిన "హే జూడ్," టెర్రీ జాక్స్ యొక్క "సీజన్స్ ఇన్ ది సన్" వంటి పాటలు మరియు ది మంకీస్ టెలివిజన్ కార్యక్రమం యొక్క నేపథ్య గీతాన్ని కూడా ఆలపించేవాడు.[11]


కోబెన్‌కు ఎనిమిదేళ్లున్నప్పుడు అతని తల్లిదండ్రులు విడిపోయారు. ఆ సంఘటన తన జీవితంపై ప్రతికూల ప్రభావం చూపిందని అతను తర్వాత చెప్పాడు. అతని వ్యక్తిత్వం నాటకీయంగా మార్పు చెందిందనే విషయాన్ని అతని తల్లి గుర్తించింది. కోబెన్ ఇతరుల నుంచి దూరంగా ఉండటం ప్రారంభించాడు.[12] 1993 ఇంటర్వూలో, కోబెన్ ఈ విధంగా వివరించాడు:

"ఓ కారణం చేత నేను సిగ్గుపడుతున్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్నాను. నా తల్లిదండ్రులను చూసి నేను సిగ్గుపడుతున్నాను. పాఠశాలలో నా మిత్రులు కొందర్ని ఏమాత్రం నిలువరించలేకపోతున్నాను. ఎందుకంటే తక్షణం నేనొక ఉత్యుత్తమ అంటే గుర్తింపు ఉన్న ఒక కుటుంబం కోసం ఆశపడుతున్నాను. అంటే తల్లి, తండ్రి. ఆ విధమైన భద్రత నేను కోరుకుంటున్నా. ఆ కారణం వల్లే నేను కొన్నేళ్లుగా నా తల్లిదండ్రులను అసహ్యించుకుంటున్నాను."[13]

విడాకుల నేపథ్యంలో తన తల్లితో కలిసి ఏడాది గడిపిన అనంతరం వాషింగ్టన్‌లోని మోంటెసానోలో ఉన్న తన తండ్రి వద్దకు కోబెన్ వెళ్లాడు. కొన్నేళ్లు గడిచిన తర్వాత, కోబెన్ యొక్క యుక్తవయసు తిరుగుబాటు ధోరణి అతని తండ్రిని వేదనకు గురిచేసింది. దాంతో అతను మిత్రులు, కుటుంబం మధ్య అటూఇటూ తిరగసాగాడు.


యవ్వనం[మార్చు]

క్రైస్తవ మతంలోకి మారిన తన మిత్రుడు జెస్సీ రీడ్ కుటుంబంతో కలిసున్నప్పుడు కోబెన్ కూడా అందులోకి మారాడు. తద్వారా బైబిల్‌ పఠించడం మరియు చర్చి సేవాకార్యక్రమాలకు హాజరయ్యేవాడు. అయితే కోబెన్ తర్వాత దేవుడికి వ్యతిరేకంగా దూషణలు చేస్తూ, క్రైస్తవమతాన్ని విడిచిపెట్టాడు. "లిథియం" అనే పాట రీడ్స్‌తో కోబెన్ అనుభవాలను తెలుపుతుంది.


కోబెన్ తన కార్యకలాపాల కోసం తరచూ క్రిస్టియన్ పేరును ఉపయోగించుకోవడంతో అతని వ్యక్తిగత జీవితం మరియు విశ్వాసాల పరంగా మతం అనేది కీలక పాత్ర పోషిస్తూ వచ్చింది. మరోవైపు జైనమతం మరియు బౌద్ధమత సిద్ధాంతంపై అతను స్థిరమైన ఆసక్తిని కొనసాగించాడు. బాధ, హింస మరియు బాహ్య ప్రపంచం నుంచి విముక్తిగానూ మరియు పంక్ రాక్ నీతి మరియు సిద్ధాంతమునకు సమాంతరంగా ఉండేదిగా కోబెన్ భావించే బౌద్ధమత ఆచారం నుంచి నిర్వాణ అనే బ్యాండ్ పేరు ఉద్భవించింది. తన జీవితంలోని విభిన్న పరిస్థితుల్లో కోబెన్ తనను బౌద్ధుడుగానూ మరియు జైనుడిగానూ పరిగణించుకున్నాడు. రెండు మతాలకు సంబంధించిన అర్థరాత్రి టెలివిజన్ లఘు చిత్రాలను వీక్షించడం ద్వారా అతను అలా అనుకునేవాడు.[14][15][16]


చదువుకునే రోజుల్లో కోబెన్ క్రీడలపై కొంత ఆసక్తిని కనబరిచేవాడు. తన తండ్రి ఒత్తిడి మేరకు అతను జూనియర్ హైస్కూల్ మల్లయుద్ధం జట్టులో చేరాడు. అందులో నైపుణ్యం సాధించినప్పటికీ, జట్టుసభ్యులు మరియు శిక్షకుడి దూషణల వల్ల తన అనుభవాన్ని కోబెన్ తృణప్రాయంగా భావించాడు. తన తండ్రి ఏవగింపు మరియు తిరస్కృతి వల్ల అతన్ని బాధించేలా కోబెన్ తనకు తానుగా గిరి గీసుకున్నాడు. అతని తండ్రి తర్వాత అతన్ని స్థానిక బేస్‌బాల్ లీగ్‌లో చేర్పించాడు. అయితే అందులో ఆడటానికి కోబెన్ ఉద్దేశ్యపూర్వకంగానే విముఖత వ్యక్తం చేశాడు.[17]


దానికి బదులుగా కోబెన్ కళా కోర్సులపై దృష్టి పెట్టాడు. తరగతులు జరుగుతున్న సమయంలో అతను మానవ శరీరనిర్మాణ శాస్త్రానికి సంబంధించిన పలు భాగాలను తరచూ చిత్రీకరించేవాడు. వ్యంగ్యచిత్రం గీయమని చెప్పినప్పుడు మైఖేల్ జాక్సన్ బొమ్మను కోబెన్ గీశాడు. పాఠశాలలో ఇలా చేయడం సరికాదని అతనికి చెప్పారు. దాంతో కోబెన్ అప్పటి దేశాధ్యక్షుడు రొనాల్డ్ రీగన్‌ను కించపరిచే విధంగా ఒక చిత్రాన్ని గీశాడు.[18]


హైస్కూల్‌లో చదివేటప్పుడు కోబెన్ ఒక స్వలింగసంపర్క విద్యార్థితో స్నేహం చేశాడు. ఆ కారణం చేత స్వలింగసంపర్క దురభిమాన విద్యార్థులు కొన్ని సందర్భాల్లో అతన్ని కూడా అదే విధంగా భావించి, గేలిచేసేవారు. 1993లో ది అడ్వొకేట్‌ తో ఇంటర్వూ సందర్భంగా తాను "ఆత్మానుసారంగా స్వలింగసంపర్కుడ"ని మరియు "బహుశా ద్విలింగకుడై ఉండొచ్చని" కోబెన్ వ్యాఖ్యానించాడు. దేవుడు స్వలింగసంపర్కుడంటూ అబర్‌దీన్‌లోని పలు వాహనాలపై తాను పెయింట్ వెదజల్లేవాడని కూడా అతను తెలిపాడు. వాస్తవానికి "అయామ్ నాట్ గాట్ నో హౌ వాచ్చమకల్లిట్" అనే పదబంధానికే అతన్ని ఖైదు చేసినట్లు అబర్‌దీన్ పోలీసు నివేదికలు తెలుపుతున్నాయి.[19] తన వ్యక్తిగత రచనల్లోని ఒకానొక దానిలో "నేను స్వలింగసంపర్కుడను కాను. అయితే అలా ఉండాలని కోరుకుంటున్నాను. స్వలింగసంపర్క దురాభిమానులను బెదరగొట్టడానికి మాత్రమే." అని కోబెన్ పేర్కొన్నాడు.[20]


కోబెన్ అసంఖ్యాక మిత్రులు మరియు తల్లిదండ్రులు చెప్పిన విధంగా, అతను హాజరైన తొలి కచేరీ 1983లో సీటిల్ సెంటర్ కొలీజియంలో జరిగిన శామీ హాగర్ మరియు క్వార్టర్‌ఫ్లాష్.[21] అయితే తాను హాజరైన తొలి కచేరీ మెల్విన్స్ చేసినదిగా ప్రాచుర్యం పొందుతుందని కోబెన్ స్పష్టం చేశాడు. దానికి సంబంధించిన అనుభవాలను తన రచనల్లో అతను విపులంగా వివరించాడు.[22] మోంటెసానోలో కోబెన్ యుక్తవయస్కుడుగా ఉన్న సమయంలో, పురోగామి పసిఫిక్ నార్త్‌వెస్ట్ పంక్ సన్నివేశం ద్వారా అతను ఎట్టకేలకు తప్పించుకుని, సీటిల్‌లో జరిగే పంక్ రాక్ ప్రదర్శనలకు వెళ్లేవాడు. కోబెన్ ఎట్టకేలకు మెల్విన్స్‌కు చెందిన మోంటెసానో సహ స్వరకర్తల అభ్యాస ప్రాంతానికి తరచూ వెళ్లేవాడు.


10వ తరగతి మధ్యలో కోబెన్ తన తల్లితో కలిసి తిరిగి అబర్‌దీన్‌ చేరుకున్నాడు. పట్టభద్రుడు కావడానికి రెండు వారాల ముందు, అలా కావడానికి తనకు తగిన అర్హతలు లేవని గ్రహించిన అనంతరం కోబెన్ హైస్కూల్ నుంచి వైదొలిగాడు. ఉద్యోగం సంపాదించు లేదా ఇళ్లు విడిచిపో అంటూ కోబెన్ తల్లి అతనికి ఒక అవకాశమిచ్చింది. సుమారు వారం రోజుల అనంతరం, తన బట్టలు ఇతర సామగ్రి పెట్టెల్లో సర్దిఉండటాన్ని కోబెన్ గుర్తించాడు.[23]


తల్లి ఇంటి నుంచి బయటకు గెంటివేయబడిన తర్వాత అతను తరచూ మిత్రుల ఇళ్లల్లో తలదాచుకునేవాడు. సందర్భానుసారంగా తన తల్లి ఇంటిలోకి రహస్యంగా ప్రవేశించేవాడు.[24] నిలువునీడ లేని సమయంలో విష్కా నది[24]పై నిర్మించిన వంతెన కింద తలదాచుకున్నానని కోబెన్ తెలిపాడు. నెవర్‌మైండ్ ఆల్బమ్‌లోని "సమ్‌థింగ్ ఇన్ ది వే" అనే పాట రాయడానికి అదే అనుభవం అతనికి ప్రేరణ కలిగించింది. నిర్వాణ స్వరకర్త క్రిస్ట్ నోవోసెలిక్ మాట్లాడుతూ, "అతను అక్కడ గడిపాడు. అయితే అలలు ఎగసిపడే అలాంటి బురద తీరాల్లో ఉండలేము. అది అతని దిద్దుబాటువాదం" అని అన్నాడు.[25]


1986 చివర్లో కోబెన్ తొలిసారిగా సొంత నివాసం పొందాడు. అబర్‌దీన్‌ నుంచి 20 మైళ్ల దూరంలో ఉన్న పాలినేషియా తీరప్రాంత టికానాలో పనిచేయడం ద్వారా ఇంటి అద్దె చెల్లించేవాడు.[26] అదే సమయంలో రాక్ ప్రదర్శనలు చూడటానికి వాషింగ్టన్‌లోని ఒలింపియాకు కూడా అతను తరచూ వెళ్లేవాడు.[27] ఒలింపియా సందర్శనల సమయంలో "అబౌట్ ఎ గర్ల్" అనే పాటకు వస్తువుయైన ట్రాసీ మరందర్‌తో కోబెన్ పరిచయం ఏర్పరుచుకున్నాడు. బ్లీచ్ ఆల్బమ్ సందర్భంగా ఆమెకు సముచిత గుర్తింపు కూడా లభించింది.


మరందర్‌తో తెగదెంపుల అనంతరం టోబి వైల్‌కు కోబెన్ దగ్గరయ్యాడు. ఆమె బికినీ కిల్ అనే riot grrrl బ్యాండ్ యొక్క ప్రభావవంతమైన DIY పంక్ ప్రచురణకర్త. వైల్‌ను కలిసిన అనంతరం, కోబెన్ ఆమెపై విపరీతమైన వ్యామోహాన్ని పెంచుకున్న కారణంగా వాంతులు చేసుకున్నాడు. "లవ్ యు సో మచ్ ఇట్ మేక్స్ మి సిక్" అనే పాటకు అది ప్రేరణ కలిగించి ఉండొచ్చు. "అన్యూరిజం" అనే పాటలో అది పొందుపరచబడింది.[28] వైల్‌ను తన వృత్తిపరమైన భాగస్వామిగానే కోబెన్ గుర్తించడంతో ఆమెతో సంబంధం బెడిసికొట్టింది. సంప్రదాయ సంబంధం యొక్క మాతృసంబంధ ఆదరణను కోబెన్ ఆశించాడు. అయితే వైల్ దానిని సంస్కృతిని చెడగొట్టే పంక్ రాక్ సమాజంలో పురుష దురహంకారమైనదిగా భావించింది. వైల్ భాగస్వాములను మిత్రురాలు అలైస్ వీలర్ "సోకు వస్తువులు"గా అభివర్ణించింది.[29] వారిద్దరూ అధిక సమయాన్ని రాజకీయ మరియు తత్వసంబంధ విషయాలపైనే చర్చించేవారు. వైల్‌తో కోబెన్ సంబంధం యొక్క అనుభవసారం నెవర్‌మైండ్ ఆల్బమ్‌లోని పలు పాటల సాహిత్యానికి అత్యంత దోహదపడి ఉంటుంది. అరాజకవాదం మరియు పంక్ రాక్ వంటి అంశాలను స్నేహితురాలు కత్లీన్ హన్నాతో చర్చించేటప్పుడు అతని గోడపై "కర్ట్ స్మైల్స్ లైక్ టీన్ స్పిరిట్" అని ఆమె ఒకసారి లేపనాన్ని వెదజల్లింది. టీన్ స్పిరిట్ అనేది వైల్ వాడే దుర్గంధనాశని పేరు. కోబెన్ ఆ విధంగా కంపు కొడుతున్నాడని హన్నా పరిహాసం చేసేది. అయితే ఈ విషయం తెలియని కోబెన్‌ దానికి ఏదో చిచ్చుపెట్టే అర్థముందని భావించడం ద్వారా "స్మెల్స్ లైక్ టీన్ స్పిరిట్" అనే పాట శీర్షికకు ప్రేరణ కలిగించినట్లయింది.


నిర్వాణ[మార్చు]

కోబెన్ 14వ పుట్టినరోజు సందర్భంగా అతని మామ పుట్టినరోజు కానుకగా అతనికి గిటారు లేదా సైకిలు ఇవ్వజూపాడు. కోబెన్ మాత్రం గిటారునే ఎంచుకున్నాడు. తర్వాత లూయీ లూయీ మరియు ది కార్స్ యొక్క "మై బెస్ట్ ఫ్రెండ్స్ గర్ల్" సహా పలు పాటలను నేర్చుకోవడం అతను ప్రారంభించాడు. సొంతంగానే పాటల రూపకల్పనకు కూడా కసరత్తు చేశాడు.[16] హైస్కూల్‌లో చదువుకునేటప్పుడు, కోబెన్‌కు తన మాదిరిగా సంగీతాభిరుచి ఉన్న వాళ్లు కొద్దిపాటి మంది మాత్రమే ఉండేవాళ్లు. మెల్విన్స్ సాధనా కేంద్రంలో గడుపుతున్నప్పుడు కోబెన్ పంక్ రాక్ పట్ల తన మాదిరిగా అభిరుచి ఉన్న క్రిస్ట్ నోవోసెలిక్‌ను కలిశాడు. నోవోసెలిక్ తల్లికి సొంతంగా ఒక క్షౌరశాల ఉంది. దాని పై అంతస్థులోని గదిలో కోబెన్ మరియు నోవోసెలిక్ వీలుచిక్కినప్పుడల్లా సాధన చేసేవారు. కొన్నేళ్లు గడిచిన అనంతరం, తనతో కలిసి సొంతంగా ఒక బ్యాండ్‌ను ఏర్పాటు చేసేలా నోవోసెలిక్‌ను ఒప్పించడానికి కోబెన్ ప్రయత్నించాడు. దానికి సంబంధించి తన గత బ్యాండ్ ఫెకాల్ మేటర్ రికార్డు చేసిన స్వగృహ ప్రదర్శన యొక్క ఒక ప్రతిని అతనికి కోబెన్ ఇచ్చాడు. ఇలా కొన్ని నెలల పాటు కోబెన్ అడిగిన తర్వాత నోవోసెలిక్ ఎట్టకేలకు సొంత బ్యాండ్ ఏర్పాటుకు అంగీకరించాడు. ఫలితంగానే నిర్వాణ ఆవిర్భవించింది.[30]


పర్యటన మొదట్లో తమ బ్యాండ్ జనాలను ఆకర్షించలేకపోవడంతో కోబెన్ తీవ్రంగా మనస్తాపం చెందాడు. నిలదొక్కుకోవడం కూడా వారికి కష్టమయింది. నోవోసెలిక్ మరియు కోబెన్ బ్యాండ్‌ను ఆవిష్కరించిన తొలినాళ్లలో ఇద్దరూ కలిసి వాద్యకారులుగా పనిచేశారు. చాద్ చానింగ్‌తో కలిసి బ్లీచ్ అనే ఆల్బమ్‌ను రికార్డు చేయడం ద్వారా నిర్వాణ ఎట్టకేలకు నిలదొక్కుకుంది. ఈ ఆల్బమ్‌ను 1989లో సబ్ పాప్ రికార్డ్స్‌పై విడుదల చేశారు. అయితే చానింగ్ వైఖరి పట్ల కోబెన్ తీవ్రంగా అసంతృప్తి చెందాడు. ఫలితంగా అతని స్థానంలో డేవ్ గ్రోల్‌కు అవకాశం కల్పించాల్సి వచ్చింది. గ్రోల్‌తో కలిసి రూపొందించిన మొదటి ఆల్బమ్ నెవర్‌మైండ్ ద్వారా బ్యాండ్ 1991లో తొలి ఘనవిజయాన్ని నమోదు చేసుకుంది.


నిర్వాణ ఘనవిజయాన్ని కోబెన్ తన అవ్యక్త మూలాల ద్వారా సమాధానపరచడానికి శ్రమపడ్డాడు. తనను ఫ్రాన్సెస్ ఫార్మర్‌తో పోల్చడం ద్వారా ప్రసార మాధ్యమాలు తనను వేధింపులకు గురిచేశాయని కోబెన్ అభిప్రాయపడ్డాడు. తర్వాత అతను బ్యాండ్ అభిమానులుగా చెప్పుకుంటున్న వారి ఆగ్రహావేశాలను క్షుణ్ణంగా పరిశీలించాడు. అయితే వారు మాత్రం బ్యాండ్ యొక్క సామాజిక మరియు రాజకీయ దృక్పథాలను గుర్తించకపోవడం లేదా తప్పుగా అర్థం చేసుకున్నారు. లింగవివక్ష, జాత్యహంకారం మరియు స్వలింగసంపర్క దురభిమానాన్ని తీవ్రంగా వ్యతిరేకించే అతను 1992లో ఓరిగాన్‌లో స్వలింగ హక్కుల ప్రయోజనార్థం చేపట్టిన నో ఆన్ నైన్ ప్రచారానికి మద్దతు పలుకుతూ నిర్వాణ ప్రదర్శన ఇవ్వడం గర్వంగా ఉందని బహిరంగంగా అన్నాడు.


గర్భవిచ్ఛిత్తి ఉద్యమానికి గట్టిగా మద్దతిచ్చే కోబెన్ L7 చేపట్టిన ఉద్యమం ఆరంభం నుంచి వరుస లాభదాయక కచేరీల్లో పాల్గొన్నాడు. అలా చేస్తున్నందుకు గాను గర్భవిచ్ఛిత్తి వ్యతిరేక కార్యకర్తల నుంచి అతనికి హత్యా బెదిరింపులు వచ్చాయి. వేదికపైకి వచ్చీరాగానే కోబెన్‌ను కాల్చిచంపుతానని ఒకానొక కార్యకర్త తీవ్రంగా హెచ్చరించాడు.[31] "మీలో ఎవరైనా ఏ విధంగానైనా స్వలింగసంపర్కులను, విభిన్న వర్ణజాతులను లేదా మహిళలను గనుక అసహ్యించుకోదలచితే దయచేసి మమ్మల్ని విడిచిపెట్టండి. ఇదే మీరు మాకు చేయాల్సిన గొప్ప సాయం! అని ఇన్‌సెస్టిసైడ్ ఆల్బమ్‌ ద్వారా అతను విజ్ఞప్తి చేశాడు. మా ప్రదర్శనలకు రావొద్దు అలాగే మా రికార్డులను కొనుగోలు చేయొద్దు." అతని మరణానంతరం విడుదలయిన రచనల లోని ఒక కథనం లింగవివక్షను రూపుమాపడం ద్వారానే సామాజిక స్వాతంత్ర్యం సాధ్యపడుతుందని స్పష్టం చేసింది.


వివాహం మరియు ఫ్రాన్సెస్ బీన్ కోబెన్ జననం[మార్చు]

1989లో ఓరిగాన్‌లోని పోర్ట్‌లాండ్‌లో ఓ ప్రదర్శనలో పాల్గొన్న కోబెన్‌ను కోర్ట్‌నీ లవ్ తొలిసారిగా చూసింది. ప్రదర్శన అనంతరం వారిద్దరూ కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. లవ్ అతనిపై ఆధిక్యతను కనబరిచింది.[32] 1987లో విడుదలయిన స్ట్రెయిట్ టు హెల్ అనే చిత్రంలో లవ్ ఒక పాత్ర పోషించింది. ఆ విధంగా కోబెన్‌కు లవ్ సుపరిచితురాలు. పాత్రికేయుడు ఎవరెట్ ట్రూ ప్రకారం, L7 మరియు మే, 1991లో లాస్‌ఏంజిల్స్‌లో జరిగిన బట్‌హోల్ సర్ఫర్స్ కచేరీ ద్వారా ఈ జంట లాంఛనంగా పరిచయం చేయబడింది.[33] పలు వారాలు గడిచాక, డేవ్ గ్రోల్ నుంచి కొంత నేర్చుకున్నాక, ఆమె మరియు కోబెన్ ఇద్దరూ పరస్పరం తమ అభిరుచులు పంచుకున్నారు. కోబెన్‌ను లవ్ అనుసరించడం మొదలుపెట్టింది. 1991 చివర్లో వీరిద్దరూ తరచూ ఒకటిగా మరియు మాదకద్రవ్య వినియోగం ద్వారా తమ మధ్య బంధాన్ని బలపరుచుకున్నారు.[34]


వివాహం[మార్చు]

1992లో నిర్వాణ యొక్క సాటర్‌డే నైట్ లైవ్ ప్రదర్శన సమయానికి కోబెన్ శిశువుకు తాను తల్లయ్యానన్న విషయాన్ని లవ్ తెలుసుకుంది. నిర్వాణ పసిఫిక్ రిమ్ పర్యటన ఖరారైన కొద్ది రోజులకు, సోమవారం రోజున అంటే 24 ఫిబ్రవరి 1992న హవాయిలోని వైకికి బీచ్‌ వద్ద కోబెన్ మరియు లవ్ వివాహం చేసుకున్నారు. ఈ శుభకార్యానికి కోబెన్ పైజామా ధరించి, హాజరయ్యాడు. ఒకప్పుడు ఫ్రాన్సెస్ ఫార్మర్‌కు ఉన్న బట్టలను లవ్ ధరించింది. ఇలా కొన్ని వారాలు గడిచాక, "ఆఖరి రెండు నెలల్లో నాకు వివాహమైంది. నా ప్రవర్తన పూర్తిగా మారిపోయింది" అని సాసీ సంచికకు ఇచ్చిన ఇంటర్వూలో కోబెన్ పేర్కొన్నాడు. "నేనెంత సంతోషంగా ఉన్నానన్నది నమ్మలేకపోతున్నా. అలాంటి సమయాల్లో నేను బ్యాండ్‌లో ఉన్నానన్న విషయాన్ని కూడా మరిచిపోతా. ప్రేమ నన్ను ఆ విధంగా మార్చివేసింది. అది ఇబ్బంది కలిగిస్తోందన్న విషయం నాకు తెలిసినప్పటికీ, అది మాత్రం వాస్తవం. బ్యాండ్‌ను నేను ఇప్పుడే త్యజించగలను. అది పెద్ద విషయం కాదు. అయితే నేను ఒప్పందం కుదుర్చుకున్నాను."[35]


ఫ్రాన్సెస్ బీన్ కోబెన్ మరియు సంరక్షణ పోరాటం[మార్చు]

ఆగస్టు, 18న ఈ జంట ముద్దుల తనయ ఫ్రాన్సెస్ బీన్ కోబెన్ జన్మించింది.


గర్భవతినన్న విషయం తెలియనప్పుడు తాను హెరాయిన్ వాడానని వేనిటీ ఫెయిర్‌ లోని 1992 కథనంలో లవ్ అంగీకరించింది. వేనిటీ ఫెయిర్ తనను తప్పుగా ఉటంకించిందని[36] లవ్ పేర్కొంది. అయితే ఆ కార్యక్రమం వారిద్దరి మధ్య చిచ్చు రేపింది. కోబెన్ మరియు లవ్ శృంగారం ఎప్పుడూ మీడియా దృష్టిని ఆకర్షించడంతో, కథనం ప్రచురితమైన అనంతరం సంచిక విలేఖరులు వారిని చుట్టుముట్టారు. జనన సమయంలో ఫ్రాన్సెస్ మాదకద్రవ్యానికి బానిసయ్యిందా అన్న విషయం తెలుసుకోవాలని వారిలో పలువురు ఉబలాటపడ్డారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల వారు అయోగ్య తల్లిదండ్రులుగా మారారని ఆరోపిస్తూ లాస్‌ఏంజిల్స్ శిశు సేవా కౌంటీ విభాగం కోబెన్ దంపతులను కోర్టుకు లాగింది.[37] మూత్ర పరీక్షల నివేదిక సమర్పణ మరియు సామాజిక కార్యకర్త ద్వారా సాధారణ సందర్శనలకు సంబంధించి కుదుర్చుకున్న బదిలీ ఒప్పందం ద్వారా కోబెన్ దంపతులు తమ కుమార్తె సంరక్షణ దక్కించుకున్నారు. అయితే అనంతరం రెండు వారాల ఫ్రాన్సెస్ బీన్ కోబెన్‌ను తల్లిదండ్రుల నుంచి వేరుచేసి, ఆమె సంరక్షణను కొన్ని వారాల పాటు కోర్ట్‌నీ సోదరి జామీకి అప్పగిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చాడు. కొన్ని నెలలపాటు సాగిన న్యాయపోరాటం అనంతరం తమ కుమార్తె యొక్క సంపూర్ణ సంరక్షణ బాధ్యతను కోబెన్-లవ్ జంట చివరకు తిరిగి దక్కించుకుంది.


మితిమీరిన మాదకద్రవ్య వాడకం మరియు ఆరోగ్యం[మార్చు]

దీర్ఘకాల ఉదర పరిస్థితిని నిర్థారించకపోవడంతో కోబెన్ తన జీవితంలోని ఎక్కువ భాగం దీర్ఘకాల శ్వాసనాళాల వాపు మరియు తీవ్రమైన ఒంటి నొప్పితో బాధపడ్డాడు.[38] 1980లో 13 ఏళ్ల ప్రాయంలో ఉండగా కోబెన్ తొలిసారిగా గంజాయి వాడాడు. యుక్తవయసులో దానిని యధావిథిగా ఉపయోగించాడు.[39] ట్రాసీ మరందర్[40] అనుభవం ప్రకారం, LSDని కోబెన్ "విరివిగా" వాడిన సందర్భం కూడా ఉంది. "నిజానికి మాదకద్రవ్యాలు, ఆమ్లం మరియు ఇతర మత్తుమందు ఏదైనా సరే ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది" అని క్రిస్ట్ నోవోసెలిక్ అనుభవసారం. అంతేకాక కోబెన్ మద్యపానం మరియు ద్రావకాల వాడకానికి కూడా బానిసయ్యాడు.[39] చిన్న వయసులో ఉన్నప్పుడు కోబెన్‌కు ధారణ లేమి రుగ్మతకు మరియు యుక్త వయసులో ఉండగా ద్విధ్రువీయ రుగ్మతకు చికిత్స చేశామని నర్సుగా పనిచేసే అతని సోదరి బేవర్లీ తెలిపింది. కోబెన్ కుటుంబంలో చోటు చేసుకున్న ఆత్మహత్యల చరితం, మానసిక రుగ్మత మరియు మద్యపానంకు సంబంధించిన విషయాలను కూడా ఆమె తెలిపింది. తన ఇద్దరు మామలు తుపాకీలతో కాల్చుకుని, ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తెలిపింది.[41]


ఉదర అవస్థ[మార్చు]

కోబెన్ ఉదర అవస్థ అతన్ని చాలా వరకు కుంగదీసింది. అందువల్ల సాధారణంగా లవ్ బలవంతం మేరకే అతను అనారోగ్య కారణాలను అన్వేషించే ప్రయత్నం చేశాడు. పలువురు వైద్యులను సంప్రతించినప్పటికీ, ఒక్కరు కూడా తన అనారోగ్యానికి సరైన కారణాలను చెప్పలేకపోయారు. అంతేకాక వారు సూచించిన పౌష్టికాహార పద్ధతులు మరియు ఆరోగ్య సలహాలను కూడా కోబెన్ పెడచెవినపెట్టాడు. కుహరాంతర్దర్శనాలు వంటి మరింత లోతైన వైద్య పరీక్షలు నిర్వహించడానికీ అతను వారిని అనుమతించలేదు. శరీర బరువు తగ్గడం వల్ల అతను స్వీయ చైతన్యలేమి మరియు బక్కచిక్కిన శరీరంతో ఎప్పుడూ బాధపడేవాడు. పౌష్టికాహారలేమి లేదా అనుసరించిన సాదాసీదా పథ్యం (పలువురు వైద్యులు సూచించినది) లేదా రెండింటి కారణంగానే అతను బక్కచిక్కిపోవడంతో పాటు ఉదర అవస్థకు గురయ్యాడు.


మితిమీరిన మాదకద్రవ్య వాడకం[మార్చు]

కోబెన్ తొలిసారిగా 1986లో ఒకానొక సందర్భంలో హెరాయిన్‌ను రుచిచూశాడు. దానిని వాషింగ్టన్‌లోని టకోమాలో ఉన్న స్థానిక ఔషధ వ్యాపారి నుంచి అతను పొందాడు. కోబెన్‌కు అంతకుముందు పెర్కోడన్‌ను అందించింది కూడా అతనే.[42] హెరాయిన్‌ను అతను కొన్నేళ్ల పాటు విరివిగా ఉపయోగించాడు. అయితే 1990 చివరి కల్లా ఆ అలవాటు పూర్తిస్థాయి వ్యసనంగా మారింది. అందువల్ల తన ఉదర అవస్థకు స్వీయ వైద్యం దిశగా ఒక అలవాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు కోబెన్ తెలిపాడు. "వరుసగా మూడు రోజుల పాటు హెరాయిన్‌ వాడకం ద్వారా అలవాటు మొదలైంది. అప్పుడు నాకెలాంటి కడుపు నొప్పి ఉండేది కాదు. అది అటువంటి ఉపశమనం," అని తెలిపాడు.[43]


అతని హెరాయిన్ వ్యసనం వల్ల బ్యాండ్‌ యొక్క నెవర్‌మైండ్ ఆల్బమ్ పర్యటనపై ప్రభావం పడింది. ఫోటోలు తీసే సమయంలో కోబెన్ సొమ్మసిల్లి పడిపోయాడు. 1992లో బ్యాండ్ యొక్క సాటర్‌డే నైట్ లైవ్ ప్రదర్శన రోజు ఫోటోగ్రాఫర్ మైఖేల్ లెవిన్‌తో నిర్వాణ ఫోటోల సమయంలో ఒక స్మరణీయ సంఘటన చోటుచేసుకుంది. ప్రదర్శన ప్రారంభానికి ముందు అత్యుత్సాహంతో పాల్గొన్న కోబెన్ చిత్రీకరణ సమయంలో పలుమార్లు సొమ్మసిల్లి పడిపోయాడు. జీవితచరిత్ర రచయిత మైఖేల్ అజిరాడ్‌కు కోబెన్ ఈ విధంగా తెలిపాడు. "బహుశా వారు ఏమి చేయాలి? అన్నది నా ఉద్దేశ్యం. మాదకద్రవ్యాల వాడకాన్ని నిలిపివేయమని వారు నాకు చెప్పలేకపోయారు. కాబట్టి నిజంగా నేను ఏ మాత్రం లక్ష్యపెట్టను. కచ్చితంగా వారికి ఇదొక మంత్రవిద్య లేదా మరొక దానిని సాధన చేయడం వంటిది. దాని గురించి వారికేమీ తెలీదు. కాబట్టి నేను ఏ సెకనులోనైనా మరణించవచ్చని వారు అనుకుంటారు."[44]


పునరుజ్జీవనం[మార్చు]

కొన్నేళ్లు గడిచిన తర్వాత, కోబెన్ హెరాయిన్ వ్యసనం మరింత ముదిరింది. తాను మరియు లవ్ తల్లిదండ్రులు కాబోతున్నామన్న విషయం తెలుసుకున్న కొంతకాలానికే 1992 ప్రారంభంలో పునరుజ్జీవన కేంద్రంలో అతను తొలిసారిగా చేరాడు. పునరుజ్జీవ కేంద్రం నుంచి బయటకు వచ్చిన వెంటనే నిర్వాణ బ్యాండ్ ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధమయింది. అయితే ఉపసంహరణల యొక్క లక్షణాల వల్ల కోబెన్ పాలిపోయి మరియు బక్కచిక్కిపోయినట్లు కనిపించాడు. ఇంటికి వచ్చిన కొంతకాలానికే కోబెన్ హెరాయిన్ వాడకాన్ని తిరిగి ప్రారంభించాడు.


హెచ్చు మోతాదు మరియు పునరుజ్జీవనం[మార్చు]

జులై, 1993లో న్యూయార్క్ నగరంలోని న్యూ మ్యూజిక్ సెమినార్‌లో ప్రదర్శనకు ముందు హెరాయిన్‌ హెచ్చు మోతాదు వల్ల కోబెన్ తీవ్ర సమస్యను ఎదుర్కొన్నాడు. అంబులెన్స్‌ను పిలవకుండా కోబెన్‌ను అపస్మారక స్థితి నుంచి బయటకు తీసుకురావడానికి నార్కన్‌ను అతని శరీరంలోకి లవ్ ఎక్కించింది. అసాధారణంగా ఏదో జరగవచ్చన్న సంకేతాన్ని జనాలకు ఇవ్వకుండా నిర్వాణ తరపున ప్రదర్శన ఇవ్వడానికి కోబెన్ సన్నద్ధమయ్యాడు.[45]


మరణం[మార్చు]

1 మార్చి 1994న జర్మనీలోని మ్యూనిచ్‌లో ఉన్న టెర్మినల్ ఐన్స్ వద్ద పర్యటన విరామం నేపథ్యంలో కోబెన్‌కు శ్వాసనాళాలవాపు మరియు తీవ్రమైన స్వరపేటికవాపుకు చికిత్స చేశారు. వైద్య చికిత్స కోసం అతను మరుసటి రోజు రోమ్ వెళ్లాడు. మార్చి 3న అక్కడ తన భార్యను కలుసుకున్నాడు. మరుసటిరోజు ఉదయం, తెల్ల ద్రాక్ష సారా మరియు ఉపశమనికం యొక్క మిశ్రమం మోతాదుకు మించిందన్న విషయాన్ని లవ్ గుర్తించింది. దాంతో కోబెన్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మిగిలిన రోజంతా అతను అచేతనంగా గడిపాడు. ఆసుపత్రిలో ఐదు రోజులు గడిపిన అనంతరం కోబెన్ బయటకు వచ్చాక, తిరిగి సీటిల్ చేరుకున్నాడు.[5] అయితే అది కోబెన్ తొలి ఆత్మహత్యాయత్నం అని లవ్ తర్వాత వెల్లడించింది.[46]


కోబెన్ ఆత్మఘాతుకానికి పాల్పడుతున్నాడని మరియు తుపాకీని చేతబట్టి, ఒక గదిలో తనను తాను బంధించుకున్నాడని మార్చి, 18న లవ్ పోలీసులకు ఫోన్‌ ద్వారా తెలిపింది. అక్కడకు చేరుకున్న పోలీసులు కోబెన్ నుంచి పలు తుపాకీలు మరియు ఒక సీసా గుళికలను స్వాధీనం చేసుకున్నారు. అతను ఆత్మఘాతుకానికి పాల్పడలేదని, లవ్‌కు కనబడకుండా ఉండటానికే గదిలోకి వెళ్లాడని ఆ సందర్భంగా వారు తెలిపారు. తాను ఆత్మఘాతుకానికి పాల్పడే వ్యక్తినని కోబెన్ ఎప్పుడూ చెప్పలేదని, అతను తుపాకీ కలిగి ఉండటం తాను చూడనేలేదని పోలీసులు అడిగిన ప్రశ్నలకు లవ్ సమాధానమిచ్చింది.[47]


కోబెన్ మాదకద్రవ్య వాడకానికి సంబంధించి మార్చి, 25న లవ్ మధ్యవర్తిత్వమును ఏర్పాటు చేసింది. ఇందులో స్వరకర్త మిత్రులు, రికార్డు కంపెనీ ప్రతినిధులు, కోబెన్ ప్రాణస్నేహితుల్లో ఒకరైన డిలాన్ కార్ల్‌సన్ సహా పదిమంది పాల్గొన్నారు. కోపోద్రిక్తుడైన కోబెన్ మధ్యవర్తిత్వంలో పాల్గొన్న వారిపై విరుచుకుపడటంతో మధ్యవర్తిత్వం తొలుత విజయవంతం కాలేదు. చివరకు అతను పై అంతస్థులోని పడకగదిలోకి వెళ్లి, తనకు తానుగా బంధించుకున్నాడు. ఎట్టకేలకు ఆ రోజు ముగింపు కల్లా, నిర్విషీకరణ చికిత్స చేయించుకోవడానికి కోబెన్ అంగీకరించాడు.[48] మార్చి, 30న కాలిఫోర్నియాలోని లాస్‌ఏంజిల్స్‌లో ఉన్న ఎక్సోడస్ రికవరీ సెంటర్‌కు కోబెన్ చేరుకున్నాడు. అక్కడి సిబ్బందికి కోబెన్ మనోవ్యాకులత మరియు అతని మునుపటి ఆత్మహత్యాయత్నాల గురించి తెలియదు. మిత్రులు పరామర్శిస్తున్నప్పుడు, కోబెన్ ప్రతికూల లేదా ఆత్మఘాతుక స్థితిలో ఉన్నాడన్న సంకేతం గోచరించలేదు. ఆ రోజంతా మితిమీరిన మాదకద్రవ్య వినియోగం మరియు వ్యక్తిగత సమస్యల గురించి అతను సలహాదారులతో మాట్లాడుతూ గడిపాడు. అలాగే తనను పరామర్శించడానికి వచ్చిన కుమార్తె ఫ్రాన్సెస్‌తోనూ సంతోషంగా ముచ్చట్లాడాడు. ఆమె తన తండ్రిని చూడటం అదే ఆఖరిసారి. అదే రోజు రాత్రి, సిగరెట్ కాల్చడానికి కోబెన్ బయటకు వెళ్లాడు. ఆ తర్వాత సముదాయాన్ని విడిచిపెట్టడానికి ఆరడుగుల ఎత్తున్న ప్రహారీ గోడపైకెక్కాడు (ఆత్మహత్యాయత్నం పిరికివాళ్లు చేసే పని అని అదే రోజు ఉదయం తమాషాగా అన్నాడు). కోబెన్ టాక్సీ పట్టుకుని, లాస్‌ఏంజిల్స్ విమానాశ్రయం చేరుకున్నాడు. అక్కడ నుంచి విమానమెక్కి సీటిల్ వెళ్లాడు. అందులో గన్స్ N' రోజెస్‌కు చెందిన డఫ్ మెక్‌కాగన్ పక్కనే అతను కూర్చున్నాడు. గన్స్ N' రోజెస్‌కు నిర్వాణ నుంచి ముందస్తు శతృత్వం మరియు ఆక్సిల్ రోస్‌‌పై కోబెన్ సొంత వ్యక్తిగత ద్వేషం ఉన్నప్పటికీ, మెక్‌కాగన్‌ను కోబెన్ అభిమానంగా చూసినట్లే కనిపించాడు. "నా సహజాత ప్రవృత్తులన్నింటిలోనూ కొంత తప్పిదముంది." అన్న విషయాన్ని తాను గ్రహించానని మెక్‌కాగన్ తర్వాత చెప్పి ఉండొచ్చు.[49] ఏప్రిల్ 2 మరియు ఏప్రిల్ 3 రోజుల్లో కోబెన్ సీటిల్‌లోని పలు ప్రాంతాల్లో కనిపించాడు. అయితే అతని మిత్రులు మరియు కుటుంబానికి మాత్రం అతని జాడ తెలియకపోవడం గమనార్హం. ఏప్రిల్ 14న అతను కనిపించలేదు. దాంతో కోబెన్‌ను కనిపెట్టడానికి ఏప్రిల్, 13న లవ్ ఒక ప్రైవేటు అన్వేషకుడు టామ్ గ్రాంట్‌ను నియమించుకుంది. ఏప్రిల్ 7న నిర్వాణ ముక్కలు కాబోతుందన్న వదంతుల మధ్య ఆ ఏడాది తలపెట్టిన లొల్లాపలూజా సంగీత ఉత్సవం నుంచి బ్యాండ్ తప్పుకుంది.


దస్త్రం:Kurt'sNote.jpg
కోబెన్ ఆత్మహత్యా పత్రం.

8 ఏప్రిల్ 1994న, కోబెన్ మృతదేహాన్ని లేక్ వాషింగ్టన్‌లోని అతని నివాసంలో భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి అక్కడకు వచ్చిన ఒక ఎలక్ట్రీషియన్ గుర్తించాడు. కోబెన్ చెవి నుంచి కొద్దిగా రక్తం కారడం తప్ప అతని ఒంటిపై గాయాలను గుర్తించలేదని ఎలక్ట్రీషియన్ చెప్పాడు. కోబెన్ గడ్డంపై తుపాకీ పేలుడు గుర్తును చూసేంత వరకు అతను నిద్రపోతున్నాడనే తాను తొలుత అనుకున్నానని అన్నాడు. అక్కడ కనిపించిన ఆత్మహత్యా పత్రం‌లో "చాలా ఏళ్ల నుంచి ఇప్పటిదాకా...సంగీతాన్ని ఆస్వాదించలేకపోతున్నా. అలాగే రచనతో పాటు బాణీలను కట్టలేకపోతున్నా" అని రాయబడి ఉంది. అతని శరీరంలో మోతాదుకు మించి హెరాయిన్ మరియు వాలియం పదార్థం కూడా ఉండటం గుర్తించబడింది. కొన్ని రోజుల పాటు కోబెన్ శరీరం అక్కడే పడుంది. కోబెన్ 5 ఏప్రిల్ 1994న మరణించి ఉంటాడని వైద్యాధికారి నివేదిక అంచనా వేసింది.[50]


ఏప్రిల్ 10న సీటిల్ సెంటర్ వద్ద ఉన్న ఉద్యానవనంలో ఉంచిన కోబెన్‌ను కడసారిగా చూడటానికి సుమారు ఏడువేల మంది అక్కడకు వచ్చారు.[51] క్రిస్ట్ నోవోసెలిక్ మరియు కోర్ట్‌నీ లవ్ ముందస్తుగా రికార్డు చేసిన సందేశాలను కోబెన్ స్మారకం వద్ద వినిపించారు. కోబెన్ ఆత్మహత్యా పత్రం వివరాలను లవ్ అక్కడి జనసమూహానికి చదివి వినిపించిన తర్వాత కుప్పకూలిపోయింది. ఆమె కన్నీళ్లపర్యంతమవడంతో పాటు కోబెన్‌ను తీవ్రంగా నిందించింది. శవజాగారం ముగింపు సమయాని కల్లా పార్క్ వద్దకు చేరుకున్న లవ్ ఇంకా అక్కడే ఉన్న వారికి కోబెన్ వాడిన దుస్తులను పంచింది.[52] కోబెన్ మరణవార్త "బహుశా నా జీవితంలో నాకు జరిగిన అత్యంత దురదృష్టకరమైనదిగా భావిస్తున్నాను. నేను నిద్రలేచిన మరుసటిరోజు అతను చనిపోయాడన్న విషయం గుర్తుకురాగానే నా గుండెపగిలిపోయింది. 'సరే, నేను ఈ రోజు నిద్రలేచాను. నాకు మరుసటిరోజు కూడా ఉంది. కానీ అతనికి లేదు.'" అని అనుకున్నాను. కోబెన్ చిన్న వయసులోనే చనిపోవచ్చని తనకు తెలుసునని విశ్వసించిన అతను "కొన్నిసార్లు మనం కొందర్ని వారినుంచే కాపాడలేం," మరియు "కొన్ని మార్గాల్లో, ఆ దిశగా నిన్ను నీవు మలుచుకునే తీరు వాస్తవమవుతుంది." అని అన్నాడు.[53]


సంగీత ప్రభావాలు[మార్చు]

ది స్టూజెస్ రూపొందించిన రా పవర్ తనకు ఎప్పుడూ నచ్చే ఆల్బమ్ అవుతుందని కోబెన్ తన రచనల్లో పేర్కొన్నాడు. పిక్సీస్ బ్యాండ్ యొక్క ప్రభావాన్ని కూడా గుర్తించిన కోబెన్ "స్మెల్స్ లైక్ టీన్ స్పిరిట్" అనే పాట వారి ధ్వనికి సంబంధించిన కొన్ని సారూప్యతలను బోరెత్తించిందని వ్యాఖ్యానించాడు. 1994లో రోలింగ్ స్టోన్‌ తో ఇంటర్వూ సందర్భంగా అతను ఇలా తెలిపాడు.[54] "అత్యుత్తమ పాప్ పాటను రాయడానికి నేను ప్రయత్నిస్తున్నాను." నిజానికి పిక్సీస్ బ్యాండ్‌ను మోసగించే ప్రయత్నం చేశాను. నేను దానిని అంగీకరించాలి. పిక్సీస్‌ ఆల్బమ్‌ను నేను తొలిసారిగా విన్నప్పుడు, అందులో నేను పాల్గొనాలని దానికి మరింత చేరువయ్యాను. కనీసం పిక్సీస్ కవర్ బ్యాండ్‌గానైనా ఉండాలని ఆశపడ్డాను. మృదువుగా, ప్రశాంతంగా, తీక్షణమైన మరియు ఎంతో క్లిష్టమైన పిక్సీస్ యొక్క యంత్రశాస్త్ర పరిజ్ఞానాన్ని మేము వినియోగించాం." సర్ఫర్ రోసా ఆల్బమ్‌ను తొలిసారిగా విన్న తర్వాత ఇగ్గీ పాప్/ఏరోస్మిత్ తరహా పాటల రచనలకు అనుకూలంగా నెవర్‌మైండ్‌ లో కనిపించిన విధంగా ఉండే తన అత్యంత బ్లాక్ ఫ్లాగ్ బ్యాండ్ ప్రభావిత పాటల రచనను విడనాడేలా నిర్ణయం తీసుకున్నానని 1992లో మెలోడీ మేకర్‌ తో కోబెన్ అన్నాడు.[55]


పిక్సీస్‌కు చెందిన ప్రముఖ గాయకుడు మరియు గిటారిస్ట్ బ్లాక్ ఫ్రాన్సిస్‌ను కలిసే సదవకాశాన్ని దాని మేనేజర్ కెన్ గోస్ కోబెన్‌కు కల్పించాడు. అయితే అతను దానిని సున్నితంగా తిరస్కరించాడు. ఒక విధమైన భయం మరియు ఫ్రాన్సిస్ ప్రశంస నేపథ్యంలో అతను అలా చేశాడు. "కోబెన్ పెద్ద అభిమాని కాడు. అతనొక బ్యాండ్ విద్యార్థి . వారు చేస్తున్న దానికి అతను తప్పక నమ్రత కలిగి ఉంటాడు. దాని గురించి అతను ముందుకు కొనసాగాడు" అని గోస్ పేర్కొన్నాడు.[56]


కోబెన్‌ మరియు ఇతర గ్రంజ్ స్వరకర్తలపై నీల్ యంగ్ యొక్క విపరీతమైన ప్రభావం కారణంగా అతను "గ్రంజ్ పితామహుడు"గా పిలవబడ్డాడు. యంగ్ యొక్క "హే హే, మై మై" అనే పాటలోని "ఇట్స్ బెటర్ టు బర్న్ అవుట్ దేన్ టు ఫేడ్ అవే". అనే పంక్తిని కోబెన్ తన ఆత్మహత్యా పత్రంలో ఉటంకించాడు. కోబెన్‌ మరణానికి ముందు అతన్ని కలవడానికి యంగ్ పలుమార్లు ప్రయత్నించాడు.[57] అతని మరణం యొక్క ఉద్వేగభరితమైన ప్రభావంతో 1994లో తాను రూపొందించిన స్లీప్స్ విత్ ఏంజిల్స్ అనే ఆల్బమ్‌ను కోబెన్‌కు యంగ్ అంకితమిచ్చాడు.


ది బీటిల్స్ యొక్క సంగీత ప్రభావం కోబెన్‌పై తొలుత చాలా ఎక్కువగా ఉండేది. కోబెన్ తన రచనల్లో విశిష్ట వ్యక్తిగా పేర్కొనే జాన్ లెనాన్ పట్ల అతను ప్రత్యేక అభిమానం చూపాడు. మీట్ ది బీటిల్స్! విన్న మూడు గంటల అనంతరం అబౌట్ ఎ గర్ల్ అనే పాటను రాశానని కోబెన్ ఒకసారి అన్నాడు.[58] పంక్ రాక్ మరియు హార్డ్‌కోర్ రాక్‌తో పాటు తరచూ బ్లాక్ ఫ్లాగ్, బిగ్ బ్లాక్ మరియు సెక్స్ పిస్తోల్స్ వంటి గుర్తింపు పొందిన బ్యాండ్ల పరంగా తన యొక్క సృజనాత్మకత శైలి, తీరు పట్ల అతను విపరీతంగా ప్రభావితుడయ్యేవాడు. శాందినిష్టా! అనేది ది క్లాష్ అనే బ్యాండ్ చేత రూపొందించబడిన పంక్ సాహిత్యానికి సంబంధించిందని మరియు అది తాను కైవసం చేసుకున్న తొలి ఆల్బమ్ అని కోబెన్ స్పష్టం చేశాడు.[59]


R.E.M. మరియు సోనిక్ యూత్ వంటి ఆల్టర్‌నేటివ్ రాక్ యొక్క ప్రారంభ ప్రదర్శనల పరంగా కోబెన్ ఒక అంకితభావం కలిగిన విజేతగా ఉండేవాడు. బ్లాక్ ఫ్లాగ్, ఫ్లిప్పర్ మరియు మిలియన్స్ ఆఫ్ డెడ్ కాప్స్ వంటి పంక్ బ్యాండ్ల యొక్క పాటలు కలిగిన టేపును పొందడానికి మెల్విన్స్‌ బ్యాండ్‌కు చెందిన బజ్ ఆస్బోర్న్ అవకాశం కల్పించడం ద్వారా కోబెన్ తన సంగీత ప్రయత్నాలు మొదలుపెట్టాడు. పలు ఇంటర్వూల్లో అతను తరచూ తనకు నచ్చిన బ్యాండ్లను ఉల్లేఖనం చేసేవాడు. అలాగే తన సొంత సంగీతం కంటే ఎక్కువగా తనను ప్రభావితం చేసిన విస్తృత శ్రేణి బ్యాండ్లు మరియు రాక్ బ్యాండ్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవాడు. కోబెన్ ఇంటర్వూలు మరియు రచనలు ది వేసిలైన్స్, టీనేజ్ ఫ్యాన్‌క్లబ్, డేనియల్ జాన్స్‌టన్, యంగ్ మార్బుల్ జియాంట్స్, ది వైపర్స్, బట్‌హోల్ సర్ఫర్స్, కెప్టెన్ బీఫ్‌హార్ట్, ది పేస్టల్స్, సచ్చరిన్ ట్రస్ట్, ఫ్యాంగ్, ది షాగ్స్, ఫ్రైట్‌విగ్ ( తన MTV అన్‌ప్లగ్డ్ ప్రదర్శనలో అతను ఫ్రైట్‌విగ్ యొక్క టి-షర్టులను ధరించాడు), షోనెన్ నైఫ్,[60] హాఫ్ జపనీస్ (చనిపోయినప్పుడు ఈ సంస్థ టి-షర్టు అతను ధరించాడు),[61] టేల్స్ ఆఫ్ టెర్రర్, మెరైన్ గర్ల్స్, స్వాన్స్, ది ఫ్రాగ్స్, బిగ్ బ్లాక్, స్క్రాచ్ యాసిడ్ మరియు బిల్లీ చైల్డిష్ వంటి స్పష్టతలేని రాక్ బ్యాండ్ల ఉల్లేఖనాలతో తరచూ నిండిపోయేవి. కోబెన్‌కు సోనిక్ యూత్ సాయం చేయడానికి ముందుకు రావడం ద్వారా నిర్వాణ అఖండ విజయం సాధించింది. తద్వారా నిర్వాణ ఇతర పాప్ గ్రూపుల ప్రదర్శనలు విజయం సాధించే దిశగా తన వంతు సాయపడింది. ఈ బ్యాండ్ "ఓ, ది గిల్ట్" అనే పాటను చికాగోకు చెందిన రాక్ బ్యాండ్ ది జీసస్ లిజార్డ్‌తో కలిసి సమర్పించింది. జీసస్ లిజార్డ్‌‌కు అభిమానుల నుంచి విశేష ఆదరణ లభించడం ద్వారా నిర్వాణ యొక్క పాప్ గ్రూపు విశ్వసనీయతకు దోహదపడింది.


యునైటెడ్ కింగ్‌డమ్ పర్యటన సందర్భంగా, ది రెయిన్‌కోట్స్ అనే రాక్ బ్యాండ్ అదే పేరుతో రూపొందించిన ఆల్బమ్ కొత్త ప్రతి కోసం లండన్‌లోని పోర్టోబెల్లో రోడ్‌లో ఉన్న రఫ్ ట్రేడ్ షాప్‌కు కోబెన్ వెళ్లాడు. బ్యాండ్ సభ్యురాలు అనా ద సిల్వాను ఆమె యొక్క సోదరి పురాతన వస్తువుల దుకాణం జూడ్ క్రిటన్ అతన్ని లోపలికి పంపారు. ఈ సమావేశం గురించి ఇన్‌సెస్టిసైడ్ అనే ఆల్బమ్‌లో కోబెన్ అత్యంత ఉద్రేకంగా రాశాడు. 1993 ఆఖర్లో, కోబెన్ మరియు కిమ్ గోర్డాన్ యొక్క ఆల్బమ్ నోట్లు కలిగిన బ్యాండ్ యొక్క మూడు ఆల్బమ్‌లను రఫ్ ట్రేడ్ మరియు DGC రికార్డ్స్ విడుదల చేశాయి.


ప్రధాన స్రవంతి సంగీతాన్ని ఒకవైపు విమర్శిస్తూనే పాప్ గ్రూపు మరియు అంతర్గత కళాకారులను ప్రచారం చేయడంలో కోబెన్ విధేయత చాటుకున్నప్పటికీ, నిర్వాణ యొక్క ప్రారంభ శైలి 1970ల్లోని లెడ్ జెప్పిలిన్, AC/DC, బ్లాక్ సబ్బాత్, క్వీన్ మరియు కిస్ సహా ప్రముఖ రాక్ బ్యాండ్ల చేత ప్రభావితమయింది. నిర్వాణ బ్యాండ్ తొలినాళ్లలో లెడ్ జెప్పిలిన్ యొక్క ఇమ్మిగ్రేంట్ సాంగ్, డేజ్డ్ అండ్ కన్‌ఫ్యూజ్డ్, హార్ట్‌బ్రేకర్ మరియు బ్లాక్ సబ్బాత్‌ యొక్క హ్యాండ్ ఆఫ్ డూమ్ సహా సదరు బ్యాండ్ల కవర్ పాటలను సాధారణంగా వినిపించడం అలవాటుగా పెట్టుకుంది. అలాగే కిస్ బ్యాండ్‌కు సంబంధించిన "డు యు లవ్ మీ?" అనే పాటను కూడా స్టూడియో రికార్డింగ్ చేసేది. ది నాక్, బోస్టన్ మరియు ది బే సిటీ రోలర్స్ వంటి బ్యాండ్ల యొక్క ప్రభావం గురించి కూడా కోబెన్ ప్రస్తావించాడు. బ్లాండీ మరియు డెవో వంటి న్యూ వేవ్ బ్యాండ్లు, డెవో యొక్క "టర్న్‌ఎరౌండ్" మరియు అత్యంత జోరున్న "పాలీ" లేబుల్ కలిగిన "(న్యూ వేవ్) పాలీ" వెర్షన్‌ను కూడా జాన్ పీల్‌తో తమ BBC సమావేశాల సందర్భంగా ప్రస్తావించారు. ఈ రెండు కూడా ఇన్‌సెస్టిసైడ్ ఆల్బమ్‌లో చోటు చేసుకున్నాయి. అలాగే కిల్లింగ్ జోక్ మరియు పబ్లిక్ ఇమేజ్ లిమిటెడ్ వంటి పోస్ట్ పంక్ బ్యాండ్ల గురించి కూడా కోబెన్ తన రచనల్లో ప్రస్తావించాడు. నెవర్‌మైండ్ ఆల్బమ్‌లోని "కమ్ ఏజ్ యు ఆర్" పాటకు మరియు కిల్లింగ్ జోక్స్‌ యొక్క "ఎయిటీస్"కు మధ్య గల ప్రధాన సంగీత పదబంధ సారూప్యతను అతను గుర్తించాడు. సారూప్యతను బ్యాండ్లు తమకు తాముగా కూడా గుర్తించగలవు. ఈ నేపథ్యంలో ఆ సమయంలో అలా చేయలేదని కోబెన్ మరియు నిర్వాణ ఖండించినప్పటికీ, సంగీత పదబంధమునకు సంబంధించి కావ్యచోరత్వానికి పాల్పడ్డాడంటూ అతనిపై వివాదాస్పదమైన రీతిలో దావా వేయబడింది. కోబెన్ మరణానంతరం అతనిపై వేసిన చట్టపరమైన దావా ఉపసంహరించుకోబడింది. తర్వాత బ్యాండ్ తరపున డేవ్ గ్రోల్ 2003లో రూపొందించిన స్మారక ఆల్బమ్ కోసం డ్రమ్స్ బాధ్యతను చేపట్టాడు.[62][63]


నిర్వాణ యొక్క MTV అన్‌ప్లగ్డ్ కచేరీ "వేర్ డిడ్ యు స్లీప్ లాస్ట్ నైట్" అనే పాటతో ముగిసింది. తనకు నచ్చిన కళాకారుడిగా కోబెన్ పేర్కొనే గాత్ర మరియు వాద్య సంగీత కళాకారుడు లీడ్ బెల్లీ చేత ఈ పాట విశేష ఆదరణ పొందింది. లీడ్ బెల్లీ ఎస్టేట్ నుంచి $500,000తో తన గిటారును కొనుక్కునే విధంగా కోబెన్‌కు ఒక అవకాశం కల్పించబడింది. ఈ మొత్తం ఎక్కువ చేసి చూపించి ఉండినప్పటికీ, కోబెన్‌కు గిటారు కొనివ్వమని డేవిడ్ జిఫెన్‌ను వ్యక్తిగతంగా కూడా కోరడం జరిగింది. కోబెన్ యొక్క "పాలీ" అనేది "ప్రెట్టీ పాలీ"కి ఉత్తరాధికారి అని విమర్శకుడు గ్రీల్ మార్కస్ పేర్కొన్నాడు. ఒక హత్యా కథాగేయమైన ప్రెట్టీ పాలీ 1927లో డాక్ బాగ్స్‌ను రికార్డు చేసే నాటికి వందేళ్ల చరిత్రను కలిగి ఉండొచ్చు.


కోబెన్ తన సంగీత కార్యక్రమాల్లో తనకు నచ్చిన కళాకారులను చేర్చుకోవాలని కూడా పలు ప్రయత్నాలు చేశాడు. 1991లో జరిగిన రీడింగ్ ఫెస్టివల్‌లో వేసిలైన్స్‌కు చెందిన యుజెనీ కెల్లీ "మోలీస్ లిప్స్" అనే పాట కోసం నిర్వాణ బ్యాండ్‌‌తో చేతులు కలిపాడు. ఇది తన జీవితంలోని అత్యంత గొప్ప అనుభూతుల్లో ఒకటని తర్వాత కోబెన్ ప్రకటించాడు.[64] 1993లో, వేదికపై తనకు రెండో గిటారిస్ట్ సాయం అవసరమవుతుందని నిర్ణయించుకున్న కోబెన్ L.A. పంక్ బ్యాండ్ ది జెర్మ్స్ దిగ్గజం ప్యాట్ స్మియర్‌ను నియమించుకున్నాడు. 1993లో నిర్వాణ బ్యాండ్ యొక్క MTV అన్‌ప్లగ్డ్ ప్రదర్శన కోసం మూడు మీట్ పప్పెట్స్ బ్యాండ్లు చేసిన సాధనలు ఫలించలేదు. దాంతో బ్యాండ్‌లోని ఇద్దరు ప్రముఖ సభ్యులు కర్ట్ మరియు క్రిస్ కిర్క్‌వుడ్‌లపై కోబెన్ కేకలు వేశాడు. ఫలితంగా వారిద్దరూ బ్యాండ్‌తో సంబంధాలు తెంచుకున్నారు. తన మిత్రుడు డిలాన్ కార్ల్‌సన్‌కు చెందిన డ్రోన్ మెటల్ బ్యాండ్ ఎర్త్‌ యొక్క 1995 ఆల్బమ్ సన్ ఆంప్స్ అండ్ స్మాష్డ్ గిటార్స్‌ లో పొందుపరిచిన "డివైన్ అండ్ బ్రైట్" పాటకు అతిథి గాత్ర సంగీత బాధ్యతలను కోబెన్ చేపట్టాడు. 2001లో అది తిరిగి విడుదలయింది.


కోబెన్ తన మరణానికి కొంతకాలం ముందుగా తన మిత్రుడు, R.E.M. సారథి మైఖేల్ స్టైప్‌తో కలిసి రచన మరియు రికార్డింగ్‌ను ప్రారంభించాలని అనుకున్నాడు. డ్రైవరు, విమానం టిక్కెట్, స్టూడియో మరియు రికార్డింగ్ ఏర్పాట్లు చేసినప్పటికీ, చివరి నిమిషంలో కోబెన్ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడని స్టైప్ తెలిపాడు. కోబెన్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి స్టైప్ ఈ విధంగా విశ్వాసం వ్యక్తం చేసినట్లు తెలిసింది. "పలు వాద్యపరికరాలతో చాలా నెమ్మదిగానూ మరియు ధ్వనించే విధంగానూ మరియు అద్భుతమైన రికార్డును నెలకొల్పనున్నాయి. అయితే ఆత్మహత్య చేసుకున్నందుకు అతనిపై నాకు కొద్దిగా కోపం ఉంది." అని అన్నాడు. కోబెన్‌కు నివాళిగా "లెట్ మి ఇన్" అనే పాటను R.E.M. స్వయంగా రాసి, రికార్డు చేసింది. ఆ పాట 1994లో బ్యాండ్ రూపొందించిన మాన్స్‌టర్‌ అనే ఆల్బమ్‌లో పొందుపరచబడింది. తర్వాత కోబెన్ కుమార్తె ఫ్రాన్సెస్ బీన్‌కు స్టైప్ పితామహుడయ్యాడు.[65]


గేయ మరియు సృజనాత్మక సారం[మార్చు]

"తొలుత సంగీతం, తర్వాతే పాటలు", అని కోబెన్ విశ్వసించేవాడని డేవ్ గ్రోల్ అన్నాడు. కోబెన్ ఎక్కువగా శ్రావ్యమైన సంగీతంపైనే ఎక్కువగా దృష్టి పెట్టేవాడని తెలిపాడు.[66] అభిమానులు మరియు రాక్ పాత్రికేయులు తన గీతాలాపన వెనుక అసలు సమాచారాన్ని విడదీయడం మరియు తన పాటల్లోని నిగూఢర్థాన్ని వెలికితీయాలని ప్రయత్నించినప్పుడు కోబెన్ మండిపడేవాడు. "పాత్రికేయులు ఎందుకని నా పాటలకు మాములుగా నశ్వరమైన అంచనాకు పట్టుబడుతారు. అసలు వారు తమ 90 శాతం సమయాన్ని నా పాటలను అసంబద్ధంగా రాయడానికే వెచ్చిస్తూ, ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు?" అని అతను ప్రశ్నించేవాడు.[67] కోబెన్ తన పాటల యొక్క నైజవాదం మరియు అప్రధానంపైనే గట్టిగా పట్టుబట్టేవాడు. పాటలను రాసేటప్పుడు అతను చాలా శ్రమ పడటంతో పాటు నాన్చుడు ధోరణిని అవలంభించడం మరియు ప్రదర్శనల సమయంలో వాటి సారాన్ని మరియు క్రమాన్ని కూడా మార్చేవాడు.[68] కోబెన్ తన పాటలను "ఒక పెద్ద వైరుధ్యాల కుప్ప అని తనకు తానుగా అభివర్ణించేవాడు. నాకున్న అత్యంత నిష్కపటమైన ఆలోచనలు అలాగే నాకున్న దూషించే ఆలోచనలు మరియు మనోభావాలకు మరియు కొన్నేళ్లుగా క్షీణించిపోతున్న స్పష్టమైన అసాధారణ ఆదర్శాల దిశగా దూషించే మరియు ఆశాజనక, హాస్యభరిత ఆక్షేపణలకు మధ్య అవి అంతరాన్ని ఏర్పరుస్తున్నాయి."[69]


నిజానికి నెవర్‌మైండ్‌ ను రెండు పక్షాలుగా విడగొట్టాలని కోబెన్ కోరాడు. "అబ్బాయి" పక్షాన, తన ప్రారంభ జీవితం మరియు బాల్యంలోని అనుభవాలకు సంబంధించిన పాటల రచన అలాగే "అమ్మాయి" పక్షాన, టోబి వైల్‌తో తన అప్రయోజనాత్మక సంబంధం గురించి పాటలు రాయాలని అనుకున్నాడు.[70] చార్లెస్ R. క్రాస్ "తమ మధ్య చీలిక నేపథ్యంలో నాలుగు నెలల్లోనూ, అలాగే కర్ట్ తనకు అత్యంత స్మరణీయమైన అర డజను పాటలు అన్ని కూడా టోబి వైల్‌ గురించే రాశాడు." కోబెన్‌కు వైల్‌ తెలియక ముందే "లిథియం"ను రాసినప్పటికీ, ఆ పాటలోని పంక్తులు ఆమెతో సంబంధాన్ని తెలిపే విధంగా మార్చివేయబడ్డాయి.[71] మెజీషియన్‌ తో ఇంటర్వూ సందర్భంగా "ప్రియురాళ్లతో విభేదాలు మరియు చెడు సంబంధాలు వంటి నా వ్యక్తిగత అనుభవాలు కొన్ని, పాటలోని వ్యక్తి చాలా ఒంటరిగా బాధపడుతుండటాన్ని మరణం దూరం చేస్తుందని అభిప్రాయపడుతున్నాను." అని కోబెన్ పేర్కొన్నాడు.[72] తన జీవితంలోని అధిక భాగం చాలా అవ్యక్తమైనదని[73] ఇన్ ఉటెరో ఆల్బమ్‌లో కోబెన్ పేర్కొన్నాడు. తాను చిన్నతనంలో ఉండగా తన తల్లిదండ్రులు విడిపోవడం ద్వారా ఆల్బమ్ ఒప్పందంలో భాగస్వామి కావడం, తాను కొత్తగా సంపాదించుకున్న పేరుప్రఖ్యాతులు, ప్రజాదారణ మరియు ఆత్మజ్ఞానం, కోర్ట్‌నీ లవ్ గురించి "సర్వ్ ది సర్వెంట్స్" అనే పాటలోనూ, అలాగే లవ్‌తో తన సంబంధం గురించి "హార్ట్-షేప్డ్ బాక్స్" అనే పాటలో గర్భధారణ మరియు మహిళా దేహ నిర్మాణ శాస్త్రం యొక్క గేయ సంబంధ ఇతివృత్తాల ద్వారా వివరించాడు. "రేప్ మి" అనే పాటను కోబెన్ రాశాడు. ఇందులో అత్యాచార వస్తుగత చర్చ మాత్రమే కాక మీడియా తన పట్ల అనుసరించే వైఖరికి రూపవిక్రియాత్మక నిరసన కూడా తెలిపాడు. మాదకద్రవ్యాలకు బానిసవడం మరియు గర్భస్రావం గురించి "పెన్నీరాయల్ టీ" అనే పాటలోనూ మరియు మహిళా హక్కులు, ఫ్రాన్సెస్ ఫార్మర్ జీవితం గురించి "ఫ్రాన్సెస్ ఫార్మర్ విల్ హేవ్ హర్ రివెంజ్ ఆన్ సీటిల్" అనే పాటలోనూ కోబెన్ ప్రస్తావించాడు.


ఒక పంక్ రాక్ ప్రదర్శనకు హాజరైన అమ్మాయి అపహరణకు గురవుతుంది. తర్వాత ఆమె అత్యాచారానికి గురై, చివరకు మండే దీపంతో నానా హింసలు అనుభవిస్తుంది. ఈ సంఘటనకు సంబంధించి, 1987లో వార్తాపత్రికలో వచ్చిన కథనాన్ని చదవడం ద్వారా నెవర్‌మైండ్ ఆల్బమ్‌లోని "పాలీ" అనే పాటను రాసే విధంగా కోబెన్ ప్రేరణ పొందాడు. తనను పట్టుకున్న వ్యక్తితో సరసమాడటం ద్వారా ఆమె అతని చెర నుంచి తప్పించుకుకోగలిగింది.[74] నిర్వాణ ప్రదర్శన చూసిన అనంతరం, "పాలీ" పాట నిర్వాణ బ్యాండ్ యొక్క పాటల్లో అత్యుత్తమమైనదిగా బాబ్ డిలాన్ పేర్కొన్నాడు. అంతేకాక "ఆ పాపకు హృదయం ఉంది" అని కోబెన్ గురించి అతను ప్రస్తావించినట్లు ఉటంకించబడింది.[75] ప్యాట్రిక్ సుష్కింద్ యొక్క పెర్‌ఫ్యూమ్: ది స్టోరీ ఆఫ్ మర్డరర్ అనే నవల ఇన్ ఉటెరో ఆల్బమ్‌లోని "సెంట్‌లెస్ అప్రెంటీస్" అనే పాటను కోబెన్ రాసే విధంగా ప్రేరేపించింది. తన సొంత వాసన గురించి ఎవరూ తెలుసుకోలేని మరియు అత్యంత అభివృద్ధి చెందిన వాసనాజ్ఞానంతో మాత్రమే గుర్తించగలిగే జన్మత: గుణాన్ని కలిగిన పరిమళ విక్రయదారు వద్ద పనిచేసే శిక్షణార్థికి సంబంధించిన ఒక భయంకరమైన చారిత్రాత్మక నవల ఇది. అతను కన్య మహిళలను హతమార్చి, వారి నుంచి సేకరించిన అత్తరు ద్వారా "అత్యుత్తమ పరిమళం"ను తయారు చేసే ప్రయత్నం చేశాడు.[76]


గేయరచన పరంగా కోబెన్ తన జీవితమంతా సృజనాత్మక ప్రాజెక్టుల్లో మునిగిపోయాడు. తన కార్యకలాపాల మనోభావాలు తన పాటలకూ అంశాలుగా ఉండేవి. అంతేకాక తరచూ తన సొంత అంధకార మరియు భయానక హాస్యంతో వ్యక్తీకరించబడేవి. కోబెన్ తరచూ సృజనాత్మక వస్తువులను కొనుగోలు చేయలేకపోయేవాడు. అలాంటప్పుడు అతను వస్తువులతోనూ, బోర్డు గేములు మరియు ఆల్బమ్ కవర్లపై పెయింటింగ్ వేయడం అలాగే తన సొంత శారీరకమైన ద్రవ్యములు సహా వరుస పదార్ధాలతో పెయింటింగ్ వేయడం ద్వారా అప్పటికప్పుడు మనోధర్మం చేసేవాడు. తన రచనల్లో ని కళాఖండాలు తర్వాత అత్యున్నత సృజనాత్మక ప్రమాణాన్ని కలిగి ఉన్నాయని ప్రశంసలు అందుకున్నాయి. కోబెన్ యొక్క అసంఖ్యాక చిత్తరువులు, దృశ్య రూపకల్పనలు మరియు శిల్పాలు నిర్వాణ యొక్క పలు ఆల్బమ్‌ల కళాఖండాల్లో కనిపించేవి. అలాగే అతని యొక్క సృజనాత్మక భావాలు ప్రముఖంగా వాటి యొక్క మ్యూజిక్ వీడియోల్లో ప్రత్యేకతను చాటుకునేవి. అయితే కోబెన్ ఆలోచనల యొక్క సృజనాత్మక పరిపూర్ణతావాదం వల్ల నిర్మాణం మరియు దర్శకత్వం తగని విధంగా ఉండేవి.


కోబెన్ గిటారిస్ట్‌గా, రచయిత విలియం S. బరోస్ యొక్క గాత్రం ద్వారా వారిద్దరి ప్రయత్నంగా "ది "ప్రీస్ట్" దే కాల్డ్ హిమ్" అనే ఆడియో విడుదలయింది.[77] బరోస్‌ను కథానాయకుడుగా కోబెన్ పరిగణించాడు. అంతేకాక నిర్వాణ బ్యాండ్ ఐరోపా పర్యటన సమయంలో బరోస్ రాసిన నేక్డ్ లంచ్ ప్రతిని లండన్ పుస్తకవిక్రయకేంద్రంలో అతను కొనుగోలు చేశాడు.[78] సాట్చి గ్యాలరీ అనే వెబ్‍‌సైటులో కళాకారిణి స్టెల్లా వినేతో ముఖాముఖి పరిచయ కార్యక్రమం సందర్భంగా, "పెద్దల అబద్ధాలు మరియు అన్యాయంపై ఆగ్రహావేశం"పై కోబెన్ రాసే పాటల మాదిరిగా, "ఆత్మవంచకులతో నిండిన ప్రపంచం"పై హోల్డన్ కాల్‌ఫీల్డ్ అభిప్రాయాల మాదిరిగా మరియు "ప్రపంచంలోని నమ్మకద్రోహులపై కోపోద్రేకం మరియు విరోధం"పై సిల్వియా ప్లాత్ యొక్క కవిత్వం తరహాలో వినే కళ కూడా అత్యంత అవ్యాజ్యంగా ఉంటుందని అనా ఫైనల్-హోనిగ్‌మన్ పేర్కొంది.[79]


ఉత్తరదాయిత్వం[మార్చు]

విరెట్టా పార్కులోని బెంచ్ కోబెన్‌కు ప్రముఖ స్మారక చిహ్నంగా మారింది.
2005లో, వాషింగ్టన్‌లోని అబర్‌దీన్‌లో కోబెన్‌కు నివాళి తెలుపుతూ "వెల్‌కమ్ టు అబర్‌దీన్-కమ్ యాజ్ యు ఆర్" అని తెలిపే ఒక చిహ్నం ఏర్పాటు చేయబడింది.

కోబెన్ మరణానంతరం కొన్నేళ్లకు ఆల్టర్‌నేటివ్ మ్యూజిక్ చరిత్రలోనే అతనొక అత్యంత దిగ్గజ రాక్ స్వరకర్తగా స్మరించుకోబడినాడు. కోబెన్ 12వ అత్యుత్తమ గిటారిస్ట్‌గానూ మరియు 45వ అత్యుత్తమ గాయకుడుగానూ[80][81] రోలింగ్ స్టోన్ ప్రకటించింది. అలాగే "సంగీతంలోని 22 ప్రముఖ గాత్రాల్లో" అతనిది 7వ స్థానమని MTV పేర్కొంది.[82] 2005లో, వాషింగ్టన్‌లోని అబర్‌దీన్‌లో ఒక చిహ్నం కనిపించింది. దానిపై కోబెన్‌కు నివాళి తెలుపుతూ "వెల్కమ్ టు అబర్‌దీన్-కమ్ యాజ్ యు ఆర్" అని రాయబడి ఉంది. దానిని కోబెన్ గౌరవార్థం మే, 2004లో లాభాపేక్ష లేని సంస్థ కర్ట్ కోబెన్ స్మారక కమిటీ ఏర్పాటు చేసింది. అలాగే అబర్‌దీన్‌లో ఒక కర్ట్ కోబెన్ స్మారక పార్క్‌తో పాటు యువ కేంద్రం ఏర్పాటుకు కూడా కమిటీ యోచించింది.


కోబెన్‌ను పూడ్చటానికి స్థలం లేదు (అతన్ని దహనం చేశారు. అతని అస్థికలను వాషింగ్టన్‌లోని విష్కా నదిలో నిమజ్జనం చేశారు).[83] నిర్వాణ బ్యాండ్ యొక్క పలువురు అభిమానులు నివాళి తెలపడానికి కోబెన్ యొక్క గత లేక్ వాషింగ్టన్ నివాసానికి సమీపంలోని విరెట్టా పార్క్‌ను సందర్శించారు. కోబెన్ వర్థంతిని పురస్కరించుకుని యేటా అభిమానులు సదరు పార్కులో సమావేశమవుతారు. కోబెన్‌కు నివాళులు అర్పిస్తారు.


2006 మధ్యలో, నిర్వాణ పాట విశేషపత్రం(కేటలాగ్)ను విక్రయించడం ద్వారా పరమపదించిన అగ్ర సంపాదనపరుడుగా ఎల్విస్ ప్రెస్లీ స్థానాన్ని కోబెన్ ఆక్రమించాడు. అయితే ఆ స్థానాన్ని ప్రెస్లీ 2007లో తిరిగి దక్కించుకున్నాడు.[84]


అయితే కోబెన్‌ జ్ఞాపకార్థం జులై, 2009న అబర్‌దీన్‌లోని విష్కా నది వెంబడి ఏర్పాటు చేసిన స్మారకస్థూపం వద్ద "డ్రగ్స్ ఆర్ బ్యాడ్ ఫర్ యు... దే విల్ ఫక్ యు అప్." అని రాయడం వివాదానికి దారితీసింది. అందులో రాయబడిన "F---"[85] అనే పదానికి గాను నగరంలోని పలువురు కోబెన్ స్మారకస్థూపాన్ని సున్నితంగా కూలదోయాలని నిర్ణయించుకున్నారు. అయితే అభిమానులు తక్షణం సదరు అక్షరాలను తొలగించడంతో వివాదం సద్దుమణిగింది.[86] స్మారకస్థూపం మరియు వంతెన రెండూ అభిమానులు నివాళులు అర్పించడానికి ప్రముఖ ప్రదేశాలుగా అవతరించాయి.


కోబెన్ జీవిత చరమాంకంలోని చివరి గంటల్లో ఏమి జరిగి ఉండొచ్చన్న విషయం ఆధారంగా దర్శకుడు గస్ వ్యాన్ శాంట్ 2005లో లాస్ట్ డేస్ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. జనవరి, 2007లో జీవితచరిత్ర హెవియర్ దేన్ హీవెన్‌ ను హాలీవుడ్‌లోని పలు చిత్ర నిర్మాణ స్టూడియోలకు కోర్ట్‌నీ లవ్ అందజేయడం ప్రారంభించింది. కోబెన్ మరియు నిర్వాణ బ్యాండ్ విశ్లేషణలతో సదరు పుస్తకాన్ని ఒక అత్యుత్తమ చిత్రంగా తీర్చిదిద్దమని ఆమె కోరింది. కోబెన్ పాత్రధారుడుగా గిటార్ హీరో 5 అనే వీడియో గేమ్ రూపొందించారు.[87] అయితే, కోబెన్‌ను చేర్చడం వివాదానికి దారితీసింది. ఒక పాట కోసం అతన్ని ఉపయోగించుకునే అంశమై బ్యాండ్ మిత్రులు క్రిస్ట్ నోవోసెలిక్, డేవ్ గ్రోల్ మరియు భార్య కోర్ట్‌నీ లవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.[88]


కోబెన్‌పై పుస్తక రచనలు మరియు చలనచిత్రాలు[మార్చు]

కోబెన్ మరణానికి ముందు నిర్వాణ బ్యాండ్ చరిత్ర మరియు దాని సభ్యుల వ్యక్తిగత చరిత్రలను వివరిస్తూ రచయిత మైఖేల్ అజిరాడ్‌ ఒక పుస్తకాన్ని ముద్రించాడు.Come as You Are: The Story of Nirvana అందులో కోబెన్ మాదకద్రవ్యాలకు బానిసవడం మరియు బ్యాండ్‌‌ను చుట్టుముట్టిన లెక్కలేనన్ని వివాదాల గురించి వివరించారు. కోబెన్ మరణం తర్వాత అతని జీవితం యొక్క చరమాంకం వివరాలను చేరుస్తూ అజిరాడ్ సదరు పుస్తకాన్ని తిరిగి ముద్రించాడు. నిర్వాణ బ్యాండ్ సభ్యులు తమ వంతుగా రచయిత అజిరాడ్‌కు ఇంటర్వూలు ఇవ్వడంతో పాటు తమ వ్యక్తిగత సమాచారం కూడా అందివ్వడం ద్వారా ఈ పుస్తకం బాగా ప్రాచుర్యం పొందింది. 2006లో, కోబెన్‌తో అజిరాడ్ జరిపిన సంభాషణల టేపును కర్ట్ కోబెన్ అబౌట్ ఎ సన్ పేరుతో దానిని ఒక లఘు చిత్రంగా రూపాంతరం చేశారు. ఈ చిత్రానికి నిర్వాణ బ్యాండ్ సంగీతం అందించకపోయినప్పటికీ, అందులో కోబెన్‌ను ప్రేరేపించిన కొన్ని పాటలను గాయకులు ఆలపించారు.


వాస్తవానికి కోబెన్ హత్యకు గురయ్యాడంటూ 1998లో లఘు చిత్రం కర్ట్ & కోర్ట్‌నీ విడుదలయినప్పుడు టామ్ గ్రాంట్ చేసిన ఆరోపణపై నిర్మాత నిక్ బ్రూమ్‌ఫీల్డ్ ప్రత్యేకంగా పరిశోధన జరిపించాడు. లవ్ తండ్రి, కోబెన్ అత్త మరియు కోబెన్-లవ్ జంట యొక్క మాజీ సంరక్షకురాలు సహా కోబెన్ మరియు లవ్‌తో సన్నిహిత సంబంధమున్న అనేక మందిని అతని చిత్ర బృందం కలిసింది. కోబెన్‌ను హతమార్చడానికి లవ్ తనకు $50,000 ఇవ్వజూపిందని ఆరోపించిన మెంటార్స్ బ్యాండ్ సారథి ఎల్డాన్ "ఎల్ డ్రూస్" హోక్‌‌ను కూడా బ్రూమ్‌ఫీల్డ్ కలిశాడు. కోబెన్‌ను చంపిందెవరో తనకు తెలుసునని చెప్పిన హోక్ అతని పేరును మాత్రం వెల్లడించలేకపోయాడు. తన ఆరోపణకు తగిన సాక్ష్యాన్ని చూపించలేకపోయాడు. హోక్ మరణించిన కొద్దిరోజులకు అతని ఆఖరి ఇంటర్వూను బ్రూమ్‌ఫీల్డ్ అనుకోకుండా దక్కించుకున్నాడు. మధ్యంసేవించి ఉన్న సమయంలో రైలు ఢీకొని హోక్ మరణించినట్లు సమాచారం. ఏదేమైనప్పటికీ, చివరకు కోబెన్ మరణం వెనుక కుట్ర దాగిఉందని నిరూపించే విధంగా తగినన్ని ఆధారాలను సేకరించలేకపోయానని బ్రూమ్‌ఫీల్డ్ అభిప్రాయపడ్డాడు. 1998 నాటి ఇంటర్వూలో బ్రూమ్‌ఫీల్డ్ మొత్తంగా ఇలా చెప్పాడు.

"అతను ఆత్మహత్య చేసుకున్నాడని నేను అనుకుంటున్నాను. దానికి సంబంధించి నిర్వివాదమైన ఆధారం ఉంటుందని నేను అనుకోవడంలేదు. అతని మరణం చుట్టూ ఆవరించి ఉన్న అనేక విషయాలను విశ్లేషించడానికి ఒకే ఒక మార్గం ఉందని నేను అనుకుంటున్నాను. అతను హత్యకు గురికాలేదు. అయితే అతని పట్ల శ్రద్ధ తీసుకునే వారు కరవయ్యారు. కోర్ట్‌నీ మరింత ఆధిక్యతను కనబరచడం వల్ల అతను మరింత భారాన్ని మోయాల్సి వచ్చిందని నేను అనుకుంటున్నాను."[89]


పాత్రికేయులు ఇయాన్ హల్‍‌పెరిన్ మరియు మ్యాక్స్ వాలేస్ అదే విధమైన పంథాను ఎంచుకున్నారు. తద్వారా కోబెన్ మరణం వెనుక కుట్ర ఉందంటూ, పరిశోధన చేశారు. వారి ప్రథమప్రయత్నంగా 1999లో హూ కిల్డ్ కర్ట్ కోబెన్? అనే పుస్తకం విడుదలయింది. కోబెన్ మరణం వెనుక కుట్ర దాగి ఉందని చెప్పడానికి తగిన ఆధారాలు లేనప్పటికీ, కేసు విచారణను తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేయడానికి మాత్రం చాలా వరకు ఆస్కారముందనే వాదన తెరపైకి వచ్చింది.[90] గ్రాంట్‌తో వారు జరిపిన సంప్రతింపులు సదరు పుస్తకంలో కీలకమైన ఘట్టం. లవ్ వద్ద పనిచేసేటప్పుడు గ్రాంట్ దాదాపు ప్రతి సంభాషణ కూడా రికార్డు చేసేవాడు. కొన్నేళ్లు గడిచిన తర్వాత, రెండో పుస్తకం 2004'లను రాయడానికి హల్‍‌పెరిన్ మరియు వాలేస్ ఇద్దరూ గ్రాంట్‌తో చేతులు కలిపారు.Love and Death: The Murder of Kurt Cobain .


2001లో, కోబెన్ జీవితచరిత్రను హెవియర్ దేన్ హెవెన్ పేరుతో రచయిత చార్లెస్ R. క్రాస్ ప్రచురించాడు. అందుకోసం క్రాస్ సుమారు 400 ఇంటర్వూలను నిర్వహించాడు. అంతేకాక కోబెన్ రచనలు, పాటలు మరియు డైరీల పరిశీలనకు కోర్ట్‌నీ లవ్ నుంచి అతను అనుమతి కూడా పొందాడు.[91] క్రాస్ ప్రచురించిన జీవితచరిత్ర తీవ్ర విమర్శలు ఎదుర్కోవడంతో పాటు వివాదాస్పదమైంది. అతను వాస్తవమనుకుని అప్రధాన (మరియు తప్పుడు) సమాచారం పొందాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి.[92] క్రాస్ పుస్తకాన్ని తప్పులతడక, లోపభూయిష్ట మరియు అత్యంత ఏకపక్షంగా ఉందని ఆరోపించిన ఫ్రెండ్ ఎవరెట్ ట్రూ హెవియర్ దేన్ హెవెన్ అనేది "కోర్ట్‌నీ ఆమోదిత చారిత్రక కథనం"[93] లేదా, ప్రత్యామ్నాయంగా, క్రాస్ యొక్క "ఓ, ఐ థింక్ ఐ నీడ్ టు ఫైండ్ ది న్యూ బ్రూస్ స్ప్రింగ్స్‌టీన్ నౌ" అనే కర్ట్ కోబెన్ పుస్తకమని వ్యాఖ్యానించాడు.[94] విమర్శల విషయాన్ని పక్కనపెడితే, అందులో కోబెన్ మరియు నిర్వాణ యొక్క చరిత్రకు సంబంధించిన పలు వివరాలు ఉపేక్షించబడ్డాయి. 2002లో, కోబెన్ యొక్క రచనల నమూనాను సంచికలు గా ప్రచురించారు. 280 పేజీలున్న ఈ పుస్తకం ఒక మామూలు నలుపు కవరు కలిగి ఉంది. అందులోని పేజీలను కాలక్రమానుసారంగా(కోబెన్ వాటికి సాధారణంగా తేదీలను గుర్తించకపోయినప్పటికీ) అమర్చారు. అలాగే అందులోని పేజీలను తిరిగి రంగుల్లో ముద్రించారు. దానికి చివర్లో చదివేందుకు వీలుగా వివరణలు మరియు రాతప్రతులతో కూడిన ఒక అదనపు విభాగాన్ని జతచేశారు. 1980 ఆఖరి దశకాల్లో మొదలైన రచనలు అతని మరణం వరకు కొనసాగాయి. పేపరు కవర్లతో కూడిన పుస్తక అనువాదం 2003లో విడుదలయింది. తొలుత విడుదల చేసిన పుస్తకంలో లేని విధంగా అందులో పలు రచనలను అదనంగా చేర్చారు. కోబెన్ తన రచనల్లో జీవితంలోని ఎత్తుపల్లాలు, తనకు నచ్చిన సంగీతం వివరాలు మరియు భవిష్యత్ సూచనల కోసం తరచూ పాటల ఆలోచనలను కూడా రాశాడు. పుస్తకం విడుదల సందర్భంగా సమీక్షకులు మరియు అభిమానులు పోటీపడ్డారు. కోబెన్ గురించి మరింత ఎక్కువగా తెలుసుకోగలమనే ఉత్సుకత పలువురిలో నెలకొంది. అంతేకాక అతని అంతర్గత భావాలను అతని సొంత మాటల్లోనే తెలుసుకోవచ్చని కూడా భావించారు. అయితే అతని గోప్యతకు భంగం అనే కారణంతో వాటిని తొలగించడంతో వారు తీవ్ర నిరాశ చెందారు.[95]


2003లో గాడ్‌స్పీడ్: ది కర్ట్ కోబెన్ గ్రాఫిక్‌ ను ఓమ్నీబస్ ప్రెస్ విడుదల చేసింది. దానిని ఫ్లేమ్‌బాయ్ దృష్టాంతాలతో జిమ్ మెక్‌కార్తీ మరియు బార్నబీ లెగ్ రాశారు. అందులో కోబెన్ జీవితం గురించి వివరించబడింది. అయితే అది వాస్తవిక జీవితచరిత్ర కాదు. అయితే కోబెన్ జీవితాన్ని అతని సొంత ఆలోచనా విధానంతోనే వివరించడానికి అది సృజనాత్మక అనుమతి తీసుకుంది.


2009లో గ్రంజ్ ఈజ్ డెడ్: ది ఓరల్ హిస్టరీ ఆఫ్ సీటిల్ రాక్ మ్యూజిక్ పేరుతో ECW ప్రెస్ ఒక పుస్తకాన్ని విడుదల చేసింది. దానిని గ్రెగ్ ప్రాటో రాశాడు. అందులో (బ్యాండ్ సభ్యులు మరియు మిత్రులతో తాజా ఇంటర్వూలు సహా) ఎక్కువగా నిర్వాణ బ్యాండ్ మరియు కర్ట్ కోబెన్ జీవితం, మరణం గురించే ప్రస్తావించబడింది. అంతేకాక గ్రంజ్ చరిత్ర మరింత విఫులంగా వివరించబడింది. బ్లీచ్ శకంలోని కోబెన్ చిత్రాన్ని పుస్తకం యొక్క ముందు కవరు కోసం ఉపయోగించారు. అలాగే ఒకప్పుడు ఫోటీ తీసిన కోబెన్ ధరించిన చొక్కా ఆధారంగా దాని పేరు ఖరారు చేశారు.[96]


ఇవి కూడా చూడండి[మార్చు]


సూచనలు[మార్చు]

  • అజిరాడ్, మైఖేల్. కమ్ యాజ్ యు ఆర్: ది స్టోరీ ఆఫ్ నిర్వాణ . డబుల్‌డే, 1994. ISBN 0-385-14348-6.
  • బర్లిన్‌గేమ్, జెఫ్. కర్ట్ కోబెన్ : ఓ వెల్, వాట్‌ఎవర్, నెవర్‌మైండ్ . ఎన్‌స్లో, 2006. ISBN 0-7660-2426-1
  • క్రాస్, చార్లెస్. హెవియర్ దేన్ హీవెన్: ఎ బయోగ్రఫీ ఆఫ్ కర్ట్ కోబెన్ . హైపరియన్, 2001. ISBN 0-7868-8402-9.
  • సమ్మర్స్, కిమ్. "కర్ట్ కోబెన్". ఆల్‌మ్యూజిక్ . మే 9, 2005న అందుబాటులోకి వచ్చింది.
  • కిట్స్, జెఫ్ మరియు ఇతరుల బృందం. గిటార్ వరల్డ్ ప్రెజెంట్స్ నిర్వాణ అండ్ ది గ్రంజ్ రివల్యూషన్ . హాల్ లియోనార్డ్, 1998. ISBN 0-7935-9006-X.


గమనికలు[మార్చు]

  1. "The Kurt Cobain Equipment F.A.Q.". kurtsequipment.com.
  2. అజిరాడ్, మైఖేల్. "ఇన్‌సైడ్ ది హార్ట్ అండ్ మైండ్ ఆఫ్ నిర్వాణ." రోలింగ్ స్టోన్ . ఏప్రిల్ 16, 1992.
  3. ఆర్మ్‌స్ట్రాంగ్, మార్క్. "నిర్వాణ టాప్స్ 50 మిలియన్ మార్క్ ఇన్ వరల్డ్‌వైడ్ సేల్స్, 'జర్నల్స్' నంబర్ వన్". యాహూ! మ్యూజిక్. నవంబరు 17, 2002. ఆగష్టు 18, 2007న తిరిగి పొందబడింది.
  4. సెల్లింగ్ ఆర్టిస్ట్స్. RIAA.com. సెప్టెంబర్ 22, 2008న తిరిగి పొందబడింది.
  5. 5.0 5.1 5.2 Halperin, Ian & Wallace, Max (1998). Who Killed Kurt Cobain?. Birch Lane Press. ISBN 1-55972-446-3. 
  6. క్రాస్, పేజీ. 7
  7. అజిరాడ్, పేజీ. 13
  8. http://www.nirvanafreak.net/art/art8a.shtml
  9. క్రాస్, పేజీ.11
  10. గార్, గిల్లియన్. "వెర్స్ కోరస్ వెర్స్: ది రికార్డింగ్ హిస్టరీ ఆఫ్ నిర్వాణ". గోల్డ్‌మైన్ మేగజైన్. ఫిబ్రవరి 14, 1997.
  11. క్రాస్, పేజీ 9
  12. అజిరాడ్, పేజీ. 17
  13. సావేజ్, జాన్. "కర్ట్ కోబెన్: ది లాస్ట్ ఇంటర్వూ." గిటార్ వరల్డ్. 1997.
  14. క్రాస్, పేజీ. 196
  15. క్రాస్, పేజీ. 69
  16. 16.0 16.1 అజిరాడ్, పేజీ. 22
  17. అజిరాడ్, పేజీలు. 20–25
  18. క్రాస్, పేజీ. 41
  19. క్రాస్, పేజీ. 68
  20. Cobain, Kurt (2002). Journals. Riverhead Hardcover. ISBN 978-1573222327. 
  21. క్రాస్, పేజీ. 44
  22. క్రాస్, పేజీ.45
  23. అజిరాడ్, పేజీ. 35
  24. 24.0 24.1 అజిరాడ్, పేజీ. 37
  25. క్రాస్, చార్లెస్ R."రిక్వీమ్ ఫర్ ఎ డ్రీమ్." గిటార్ వరల్డ్. అక్టోబర్ 2001.
  26. అజిరాడ్, పేజీ. 43
  27. అజిరాడ్, పేజీ. 46
  28. క్రాస్, పేజీ.152
  29. క్రాస్, పేజీ. 153
  30. అజిరాడ్, పేజీ. 45
  31. క్రాస్, పేజీ. 253.
  32. అజిరాడ్, పేజీ. 169
  33. ట్రూ, ఎవరెట్. ""Wednesday March 1"". Archived from the original on 2008-02-06. . ప్లాన్ B మేగజైన్ బ్లాగ్స్. మార్చి 1, 2006
  34. అజిరాడ్, పేజీ. 172. కోర్ట్‌నీ లవ్: "వుయ్ బాండెడ్ ఓవర్ ఫార్మాసుటికల్స్."
  35. కెల్లీ, క్రిస్టినా. ""Kurt and Courtney Sitting in a Tree". Archived from the original on 2007-10-05. ". సాసీ మేగజైన్ . ఏప్రిల్ 1992
  36. అజిరాడ్, పేజీ. 266
  37. అజిరాడ్, పేజీ. 270
  38. అజిరాడ్, పేజీ. 66
  39. 39.0 39.1 క్రాస్, పేజీ. 76
  40. క్రాస్, పేజీ.75
  41. ఈవెన్ ఇన్ హిజ్ యూత్ ". AHealthyMe.com. ఫిబ్రవరి 24, 2007న తిరిగి పొందబడింది.
  42. అజిరాడ్, పేజీ. 41
  43. అజిరాడ్, పేజీ. 236.
  44. అజిరాడ్, పేజీ. 241
  45. క్రాస్, పేజీ. 296–297
  46. డేవిడ్ ఫ్రిక్కీ, "కోర్ట్‌నీ లవ్ : లైఫ్ ఆఫ్టర్ డెత్", రోలింగ్ స్టోన్ , డిసెంబరు 15, 1994.
  47. Seattle Police Department (1994). "Incident Report — March 18". Retrieved March 13, 2006.  Unknown parameter |dateformat= ignored (help)
  48. The Seattle Times (1994). "Questions Linger After Cobain Suicide". Retrieved March 13, 2006.  Unknown parameter |dateformat= ignored (help)
  49. క్రాస్, పేజీ.331
  50. Strauss, Neil (June 2, 1994). "The Downward Spiral". RollingStone.com. Retrieved June 4, 2008.  Unknown parameter |dateformat= ignored (help)
  51. అజిరాడ్, పేజీ. 346
  52. అజిరాడ్, పేజీ. 350
  53. http://www.nme.com/news/nirvana/48303
  54. ఫ్రిక్కీ, డేవిడ్. "కర్ట్ కోబెన్: ది రోలింగ్ స్టోన్ ఇంటర్వూ." రోలింగ్ స్టోన్ జనవరి 27, 1994.
  55. కోబెన్, కర్ట్. "కర్ట్ కోబెన్ ఆఫ్ నిర్వాణ టాక్స్ అబౌట్ ది రికార్డ్స్ దట్ చేంజ్డ్ హిజ్ లైఫ్". మెలోడీ మేకర్ . ఆగస్టు 29, 1992.
  56. క్రాస్, పేజీ.159
  57. నీల్ యంగ్: ది క్వయిట్ అఛీవర్ - smh.com.au
  58. క్రాస్, పేజీ. 121.
  59. క్రాస్, పేజీ. 169
  60. Mar, Alex (March 1, 2005). "Shonen Knife Bring Sweets". Rolling Stone. RealNetworks, Inc. Retrieved March 1, 2005. 
  61. "కర్ట్ & కోర్ట్‌నీ: నో నిర్వాణ". ది స్మోకింగ్ గన్.
  62. "కాన్‌స్పిరసీ ఆఫ్ టూ". కెరాంగ్! . ఏప్రిల్ 12, 2003
  63. బోర్జిల్లో-వెన్నా, క్యారీ. "నిర్వాణ పే బ్యాక్ కిల్లింగ్ జోక్". రోలింగ్ స్టోన్ . ఏప్రిల్ 10, 2003. అక్టోబరు 1, 2008న తిరిగి పొందబడింది.
  64. క్రాస్, పేజీ. 195
  65. గెనాన్, లౌసీ. "వుయ్ డిడ్ ఇట్ అవర్ వే... REM యొక్క రాక్ నిబంధనలు," డైలీ మెయిల్ , 19 ఆగస్టు 2008.
  66. క్లాసిక్ ఆల్బమ్స్—నిర్వాణ: నెవర్‌మైండ్ [DVD]. ఐసిస్ ప్రొడక్షన్స్, 2004.
  67. క్రాస్ 2001, పేజీ. 182
  68. క్రాస్ 2001, పేజీ. 177
  69. సిల్వర్: ది బెస్ట్ ఆఫ్ ది బాక్స్ ఆల్బమ్ బుక్‌లెట్.
  70. క్రాస్ 2001, పేజీ. 177
  71. క్రాస్ 2001, పేజీ. 168–69
  72. మోరిస్, క్రిస్. "ది ఇయర్స్ హాటెస్ట్ బ్యాండ్ కాంట్ స్టాండ్‌స్టిల్". మెజీషియన్ , జనవరి 1992.
  73. సావేజ్, జాన్. "సౌండ్స్ డర్టీ: ది ట్రూత్ అబౌట్ నిర్వాణ". ది అబ్జర్వర్ ఆగస్టు 15, 1993
  74. క్రాస్, పేజీ.136
  75. క్రాస్ 2001, పేజీ. 137
  76. గార్, 2006. పేజీ. 42–43
  77. క్రాస్, పేజీ. 301
  78. క్రాస్, పేజీ.189-190
  79. http://www.saatchi-gallery.co.uk/blogon/2007/07/stella_vine_in_conversation_wi.php
  80. http://www.rollingstone.com/news/story/5937559/the_100_greatest_guitarists_of_all_time/11
  81. http://www.rollingstone.com/news/coverstory/24161972/page/45
  82. http://www.listology.com/list/mtvs-22-greatest-voices-music
  83. కర్ట్ కోబెన్ (1967 - 1994) - ఫైండ్ ఎ గ్రేవ్ మెమోరియల్
  84. గోల్డ్‌మన్, లీ; డేవిడ్ M. ఎవాల్ట్, eds. (2007-10-29). "టాప్-ఎర్నింగ్ డెడ్ సెలబ్రిటీస్". ఫోర్బ్స్ 2007-10-31న తిరిగి పొందబడింది.
  85. The Daily World: Park’s four-letter controversy erased, retrieved 2009-08-17 
  86. Seattle Weekly: You Can Sandblast All You Want, But Drugs Will Still Fuck You Up, retrieved 2009-08-17 
  87. "టిమ్ వాకర్ : 'ఇన్ గిటార్ హీరో, ఎ వర్చువల్ కర్ట్ కోబెన్ కెన్ అప్పియర్ ఆన్ స్టేజ్ విత్ బాన్ జోవి'". ది ఇండిపెండెంట్. సెప్టెంబరు 7, 2009.
  88. Swash, Rosie (2009-09-11). "Kurt Cobain video game Guitar Hero gives Love a bad name". The Guardian. Retrieved 2009-09-11. 
  89. మిల్లర్, ప్రైరీ. "కర్ట్ అండ్ కోర్ట్‌నీ: ఇంటర్వూ విత్ నిక్ బ్రూమ్‌ఫీల్డ్". Minireviews.com. 1998.
  90. ;హల్‌పెరిన్ & వాలేస్, పేజీ. 202
  91. "Heavier than Heaven: A Biography of Kurt Cobain". HyperionBooks.com. Retrieved 2009-07-26. 
  92. ఎవరెట్ ట్రూ రాసిన నిర్వాణ: ది ట్రూ స్టోరీ
  93. స్మెల్స్ లైక్ ఎవరెట్ ట్రూ - బుక్స్ - ది స్ట్రేంజర్, సీటిల్స్ ఏకైక వార్తాపత్రిక
  94. MAGNET ఇంటర్వూ: ఎవరెట్ ట్రూ
  95. హర్ట్‌విగ్, డేవిడ్. "నిర్వాణ రిలీజెస్ ఎ హిట్ అండ్ మిస్." నోట్రీ డామ్ అబ్జర్వర్ . నవంబరు 19, 2002.
  96. "Grunge Is Dead". ECW Press. Retrieved May 3, 2009. 


బాహ్య వలయాలు[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.


మూస:Nirvana (band)