కర్ణాటక యుద్ధాలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కర్ణాటక యుద్ధాలు
Location {{{place}}}

కర్ణాటక యుద్ధాలు (1745-63) 18వ శతాబ్దం మధ్యలో భారత ఉపఖండాన సైనిక విభేదాల వలన సంభవించాయి. ఇందులో వారసత్వం మరియు భూభాగం కోసం జరిగిన పోరాటాలు, మరియు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీల మధ్య జరిగిన దౌత్య మరియు సైనిక పోరాటాలు ఉన్నాయి. ఈ యుద్ధాల ఫలితంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఐరోపా వ్యాపార కంపెనీలపై తమ ఆధిపత్యాన్ని స్థాపించింది. చివరకు ఫ్రెంచి కంపెనీ ప్రధానంగా ఒక్క పాండిచ్చేరికి మాత్రమే పరిమితమైనది. బ్రిటిష్ కంపెనీ ఆధిపత్యం చివరకు భారతదేశంలో బ్రిటీషు రాజ్య స్థాపనకు దారితీసింది. ప్రధానంగా మూడు కర్ణాటక యుద్ధాలు 1744-1763 మధ్య జరిగాయి.

మొదటి కర్నాటక యుద్దం (1746-48)[మార్చు]

కర్నాటక రాజ్యమును స్థాపించినది సాదితుల్లా ఖాన్, ఇతని తర్వాత నవాబు దోస్త్ అలీ. దోస్త్ అలీ మరణానంతరం అన్వరుద్దీన్ మరియు చందా సాహెబ్‌ల మధ్య ఆధిపత్య పోరు సాగింది. ఫ్రెంచ్ గవర్నరు డూప్లే సహకారంతో అన్వరుద్దీన్ నవాబు అయ్యాడు. ఆస్ట్రియా వారసత్వ యుద్ధ కారణంగా భారతదేశంలో బ్రిటీష్ మరియు ఫ్రెంచ్ వారి మధ్య మొదటి కర్నాటక యుద్ధ జరిగింది. భారతదేశంలో బ్రిటీష్ వారు ఫ్రెంచ్ నౌకలపై దాడి చేసారు.