కర్నూలు జిల్లా
| ?కర్నూలు ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం | 17,658 కి.మీ² (6,818 చ.మై) |
| ముఖ్య పట్టణము | కర్నూలు |
| ప్రాంతం | రాయలసీమ |
| జనాభా • జనసాంద్రత • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
40,46,601 (2011) • 229/కి.మీ² (593/చ.మై) • 2040101 • 2006500 • 61.13(2001) • 71.36 • 50.81 |
కర్నూలు దక్షిణ భారతదేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నగరము మరియు అదే పేరుగల జిల్లా యొక్క ముఖ్య పట్టణం. ఒకప్పుడు కందెనవోలు గా ప్రసిద్ధి చెందిన పట్టణం ఇప్పుడు కర్నూలుగా మారింది. 1953 అక్టోబరు 1 నుండి 1956 అక్టోబరు 31 వరకు ఆంధ్రరాష్ట్ర రాజధాని గా కొనసాగింది. జిల్లాలో ఆపరేషన్ టైగర్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేసిన, ప్రపంచంలోకెల్లా పెద్దదైన, వన్యమృగ సంరక్షణ కేంద్రం (శ్రీశైలం - నాగార్జునసాగర్) ఉంది. ఎప్పుడో అంతరించి పోయిందని భావించబడిన బట్టమేక పిట్ట ఇటీవల జిల్లాలోని రోళ్ళపాడు వద్ద కనిపించడంతో ఆ ప్రాంతాన్ని అభయారణ్యంగా ప్రకటించారు. అక్టోబరు 2, 2009న భారీ వర్షాలు మరియు హంద్రీ, తుంగభద్ర నదుల వరద నీటివల్ల కర్నూలు పట్టణంలో వందల ఇండ్లు మునిగిపోయి వేలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
మధ్వాచార్యులు అయిన రాఘవేంద్ర స్వామి పుణ్యక్షేత్రం మంత్రాలయం కర్నూలు జిల్లాలోదే. మంత్రాలయం తుంగభద్రా నదీ తీరంలో ఉన్న పుణ్యక్షేత్రం. అహోబిలంలో నరసింహస్వామి దేవాలయం ఉంది. ఇక్కడ నరసింహస్వామిని నవరూపాలుగా కొలుస్తారు. మహానందిలో నందీశ్వరుడు ఉన్నాడు. ఇక్కడి కోనేరులో అన్ని కాలాల్లోను నీరు ఒకే మట్టంలో ఉంటుంది. దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం ఈజిల్లాలోదే. ఇక్కడ మల్లికార్జున స్వామి, భ్రమరాంబ దేవాలయాలు ఉన్నాయి. కృష్ణా నదిపై ఇక్కడ నిర్మించబడ్డ ఆనకట్ట దేశంలోని అతిపెద్ద వాటిలో ఒకటి. లక్షలాది ఎకరాలకు నీరందించడమే కాక, విద్యుదుత్పత్తిలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే ప్రధాన వనరుగా ఉంది.
విషయ సూచిక |
జిల్లా పేరు వెనుక చరిత్ర [మార్చు]
ఇప్పుడు కర్నూలుగా పిలువబడే ఈ నగరం పూర్వ నామధేయం కందెనవోలు. 11వ శతాబ్దిలో ఆలంపూరు లో కడుతున్న ఆలయం కోసం బళ్ల మీద రాళ్లను తరలించే క్రమంలో, ఈ ప్రాంతంలో నదిలోకి బళ్లు దిగేముందు బండి చక్రాలకు కందెన రాయడానికి ఆపేవారట. దీని వల్ల ఈ ప్రాంతానికి కందెనవోలు అనే పేరు వచ్చింది. అదే రానురాను కర్నూలుగా రూపాంతరం చెందింది.
బాదామి చాళుక్యులు, తెలుగు చోళులు, కాకతీయులు ఈ ప్రాంతాన్ని పాలించినట్లుగా చరిత్ర చెబుతోంది. అటు తర్వాత విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని జయించి తమ ఆధీనం లోనికి తెచ్చుకొన్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రస్తుత జిల్లా అంతా ఆయన ఏలుబడి లోనికి వచ్చింది. కర్నూలులో ప్రఖ్యాతి గాంచిన కొండారెడ్డి బురుజు, అచ్యుతదేవరాయలు విజయనగర రాజుగా ఉన్నప్పుడు కట్టబడిన కోటలో ఓ భాగం మాత్రమే, ఆ తర్వాత ఎప్పుడో కొండారెడ్డి అనే విప్లవవీరుణ్ణి అక్కడ బంధించడం వల్ల ఆ పేరు వచ్చింది.
జిల్లా చరిత్ర [మార్చు]
1565లో తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత గోల్కొండ కుతుబ్ షాహీ సుల్తాన్ కర్నూలును వశపరచుకొన్నాడు. 1687లో ఔరంగజేబు కృష్ణానది తీరాన్ని దాటి దండయాత్ర చేసినప్పుడు, గియాసుద్దీన్ అనే సేనాని కర్నూలును జయించాడు. 1733లో ఇక్కడి నవాబు హిమాయత్ ఖాన్, కర్ణాటక యుద్ధాలుగా ప్రసిద్ధి గాంచిన ఆంగ్లేయ-ఫ్రెంచి వారి గొడవల్లో పాలుపంచుకొన్నాడు. 1741లో మరాఠా విజృంభణ కొనసాగినప్పుడు, కర్నూలు వారి హయాంలోనికి వచ్చింది.
1751 లో సలాబత్ జంగ్, ఫ్రెంచి జనరల్ బుస్సీ (పిల్లల పాటల్లోని బూచాడు) కర్నూలును ముట్టడించారు. 1755 లో మైసూరుకు చెందిన హైదర్ అలీ ఈ ప్రాంతాన్ని వశపరచుకొన్నాడు. 1799లో శ్రీరంగపట్టణంలో జరిగిన యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించగా అప్పుడు ఈ జిల్లా హైదరాబాద్ నిజాం నవాబు సొంతం అయింది. తన రక్షణ కోసం బ్రిటిషు సైనికులని ఉపయోగించుకొన్నందుకు ప్రతిగా 1800లో ఈ ప్రాంతాన్ని బ్రిటిషు వారికి దత్తత ఇచ్చాడు నిజాం నవాబు. అందుకే ఈ ప్రాంతాన్ని అప్పటి నుంచి 'దత్తమండలం' (సీడెడ్) అనేవారు. 1928 లో ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు ఇప్పటి రాయలసీమ అనే పేరు పెట్టాడు. ఇప్పటికీ సినీపరిభాషలో 'సీమ'ను సీడెడ్ అనే పిలుస్తారు.
18వ శతాబ్ధం లో కర్నూలు, అర్ధ స్వత్రంత్రుడైన పఠాన్ నవాబు యొక్క జాగీరు లో భాగముగా ఉండేది. 1838 లో ఈ నవాబు యొక్క వారసుని, బ్రిటీషు ప్రభుత్వము రాజద్రోహ నేరంమోపి గద్దె దింపినది. నవాబు యొక్క జాగీరు కర్నూలు రాజధానిగా మద్రాసు ప్రెసిడెన్సీలో ఒక జిల్లా అయినది. జిల్లా మధ్యలో బనగానపల్లె సంస్థానము నలువైపులా కర్నూలు జిల్లాచే చుట్టబడి ఉన్నది. 1947లో భారత దేశ స్వాతంత్రానంతరము కర్నూలు, పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీనుండి ఏర్పడిన మద్రాసు రాష్ట్రములో భాగమైనది. బనగానపల్లె సంస్థానము జిల్లాలో విలీనమైనది. 1953లో మద్రాసు రాష్ట్రములోని పదకొండు ఉత్తర జిల్లాలు కలసి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని అయినది. 1956లో ఆంధ్ర రాష్ట్రము విస్తరించి, పూర్వపు హైదరాబాద్ రాష్ట్రములో భాగమైన తెలంగాణ ప్రాంతమును కలుపుకొని ఆంధ్ర ప్రదేశ్ అవతరించినది. కొత్తగా ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాదును రాజధానిగా చేశారు.
భౌగోళిక స్వరూపం [మార్చు]
ఆర్ధిక స్థితి గతులు [మార్చు]
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలలాగే కర్నూలు జిల్లాలో కూడా వ్యవసాయమే ప్రధాన వృత్తి.
ఇక్కడ ఎక్కువ భాగం వ్యవసాయం వర్షాధారితమే అయినా కె.సి. కెనాల్, తెలుగుగంగ కింద చాలా ప్రాంతం సాగుబడికి వస్తుంది. వీటి పరీవాహక ప్రాంతాల్లో వరి పండిస్తారు. ఇవి కాకుండా వెలుగోడు ప్రాజెక్టు, అవుకు, పోతిరెడ్డిపాడు, శ్రీశైలం జలాశయాల కింద చాలా ప్రాంతం సాగుబడికి వస్తుంది. ఇక్కడ బేతంచెర్ల ప్రాంతంలో సున్నపు రాయి విరివిగా లభిస్తుంది. ఇళ్లలో ఫ్లోరింగుకు ఉపయోగించే నాపరాయి కూడా ఇక్కడ విరివిగా లభిస్తుంది. ఇక్కడ లభించే సున్నపురాయి ఆధారంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పాణ్యం సిమెంట్ స్తాపించింది.
టిజివి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, నంది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, చెప్పుకోదగిన వ్యాపార సంస్థలు. తాడిపత్రి దగ్గరి ఎల్ అండ్ టి లో కొంత భాగం కర్నూలు భూభాగంలోనే ఉంది.
కర్నూలు ఎ.పి.ఎస్.ఆర్.టీ.సీ బస్టాండు రాష్ట్రములో మూడో పెద్ద బస్టాండు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి రాష్ట్రములో రెండో పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి.
ఖనిజములు [మార్చు]
ముగ్గురాయి, రంగురాయి, సీసము మొదలగు ఖనిజములు జిల్లాలో లభ్యమగును. పూర్వము రత్నాలకోట (ప్రస్తుత రామళ్ళకోట), జొన్నగిరి గ్రామాలలో రత్నములు లభ్యమయ్యేవి.[2]
డివిజన్లు లేదా మండలాలు, నియోజక వర్గాలు [మార్చు]
భౌగోళికంగా కర్నూలు జిల్లాను 54 రెవిన్యూ మండలాలుగా విభజించినారు[3].
|
1.కౌతాలం 2.కోసిగి 4.నందవరము 6.గూడూరు 7.కర్నూలు 9.పగిడ్యాల 10.కొత్తపల్లె 11.ఆత్మకూరు 12.శ్రీశైలం 13.వెలుగోడు 14.పాములపాడు 16.మిడ్తూరు 17.ఓర్వకల్లు 18.కల్లూరు |
19.కోడుమూరు 20.గోనెగండ్ల 21.యెమ్మిగనూరు 22.పెద్ద కడబూరు 23.ఆదోని 24.హోలగుంద 25.ఆలూరు 26.ఆస్పరి 27.దేవనకొండ 28.క్రిష్ణగిరి 29.వెల్దుర్తి 30.బేతంచెర్ల 31.పాణ్యం 32.గడివేముల 34.నంద్యాల 35.మహానంది 36.శిరివెళ్ల |
37.రుద్రవరము 38.ఆళ్లగడ్డ 39.చాగలమర్రి 40.ఉయ్యాలవాడ 41.దోర్ణిపాడు 42.గోస్పాడు 43.కోయిలకుంట్ల 44.బనగానపల్లె 45.సంజామల 46.కొలిమిగుండ్ల 47.ఔకు 48.ప్యాపిలి 50.తుగ్గలి 51.పత్తికొండ 53.చిప్పగిరి 54.హాలహర్వి |
రవాణా వ్వవస్థ [మార్చు]
1985 నాటికి ఈ జిల్లాలో 2209 కి.మీ. ప్రభుత్వ రహదార్లు, 2146 కి.మీ. జిల్ల పరిషత్ రహదారులు, 1883 కి.మీ. సమితి రోడ్లు వున్నాయి.
జనాభా లెక్కలు [మార్చు]
- 1981 నాటి జనాబ లెక్కల ప్రకారం కర్నూలు జిల్ల జనాబా
- 24,07,299, స్త్రీ పురుషుల నిష్పత్తి: 983:1000, అక్షరాస్యత శాతం, 28.42. మూలం.... ఆంధ్రప్రధేశ్ దర్శిని, 1985.
సంస్కృతి [మార్చు]
పశుపక్ష్యాదులు [మార్చు]
విద్యాసంస్థలు [మార్చు]
ఆకర్షణలు [మార్చు]
- బెలూం గుహలు
- మంత్రాలయం
- అహోబిలం
- శ్రీశైలం
- మహానంది
- అయ్యప్ప స్వామి ఆలయము,కర్నూలు
- కొండారెడ్డి బురుజు
- జగన్నాథ గుట్ట ఆలయము
- రేవనూరు హుస్సేన్ స్వామి దర్గ
కర్నూలులో చూడవలసినవి [మార్చు]
క్రీడలు [మార్చు]
ప్రముఖవ్యక్తులు [మార్చు]
- పోతులూరి వీరబ్రహ్మం: యోగి, కాలజ్ఞాన సృష్టికర్త.
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి: స్వాతంత్ర సమరయోధుడు
- బుడ్డా వెంగళరెడ్డి: దాత- స్వాతంత్ర్యము రాక ముందు కరువు సమయాలలొ తన సర్వ ఆస్తిని పంచిన గొప్ప వ్యక్తి.
- గాడిచర్ల హరి సర్వోత్తమరావు: స్వాతన్త్రసమర యొధుడు , గ్రన్థాలయ ఉద్యమ స్థపకుడు : his house is now municipal libray- near kondareddy buruzu
- బి.తిమ్మయ్యయదావ్ ;స్వతంత్రసమరయోడుడు , ప్రాకృతివైపరీత్యాలు సంభవించిన ప్రతిసారి సహాయం చేశే వ్యక్తి ఆరుగురు ప్రధానమంత్రిలకు తొమ్మిది మంది ముక్యమంత్రులకు తనచేతుల మీదుగా డబ్బును బంగారాన్ని అందిచిన వక్తి ysr పై అభిమానంతో ఆయన పదయత్రలోను నడివ్యక్తి
- కొప్పెర క్రిష్ణ మూర్తి : నంద్యాల కె.సి కెనాల్ క్రింద ఉన్న గ్రామాలన్నింటికి నీరందించి జిల్లాకె నంద్యాలను అన్నపూర్ణ గ మార్ఛిన సేవాతత్పరుడు
- చండ్ర పుల్లారెడ్డి : స్వాతంత్ర్య సమర యొధుడు, CPIML పార్టీ స్థాపకుడు.
- డక్క చిన్నన్న : కోవెలకుంట్ల పరిసర ప్రాంతాలలో నీతి పారుదలకు క్రుషి చేసిన వ్యక్తి,మల్ల యోదుడు
- మాచాని సోమప్ప : YWCS స్థాపకుడు , యెమ్మిగనూరు అభివృద్ధి కి నాంది వేసిన వ్యక్తి : పద్మశ్రీ గ్రహీత
- కోట్ల విజయభాస్కరరెడ్డి: ఆంధ్ర ప్రదేశ్ కు రెండు సార్లు (1982-83, 1992-94) ముఖ్యమంత్రి.
- దామోదరం సంజీవయ్య: ఆంధ్ర ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి (1960-62), పూర్వ అఖిల భారత కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు.
- పెరుగు శివారెడ్డి: నేత్ర వైద్య నిపుణుడు.
- పెండేకంటి వెంకటసుబ్బయ్య: పూర్వ కేంద్ర మంత్రి, బీహారు మరియు కర్ణాటక గవర్నరు, ఆరు మార్లు నంద్యాల నియోజకవర్గ లోక్ సభ సభ్యులు.
- గుణంరెడ్డి పుల్లారెడ్డి : ప్రఖ్యాత వ్యాపారవేత్త, విద్యావేత్త
- పీ వీ నరసింహా రావు:భారత దేశ ప్రధానిగా సత్తా చాటారు
- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి: రాయలసీమ పరిరక్షణ సమితి స్థాపకుడు.
కొన్ని గణాంకాలు [మార్చు]
- రెవిన్యూ డివిజన్లు - 3 కర్నూలు, ఆదోని, నంద్యాల
- లోక్సభ స్థానాలు - 2 నియోజకవర్గాల పేర్లు: కర్నూలు నంద్యాల
- శాసన సభ స్థానాలు - 13 నియోజకవర్గాల పేర్లు: ఆలూరు, కోడుమూరు, ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు, పత్తికొండ, ద్రోణాచలం, బనగానపల్లె, ఆళ్ళగడ్డ, పాణ్యం, నందికోట్కూరు, నంద్యాల, ఆత్మకూరు.
- నదులు: తుంగభద్ర, హగరి, కుందేరు, సగిలేరు. తుంగభద్ర, హగరి కృష్ణానదికి ఉపనదులు. కుందేరు, సగిలేరు పెన్నానదికి ఉపనదులు.
- దర్శనీయప్రదేశాలు: మంత్రాలయం, సంగమేశ్వరం,శ్రీశైలం, మహానంది, అహోబిలం, యాగంటి, బెలూం గుహలు
బయటి లింకులు [మార్చు]
|
||||||||||||||
వనరులు [మార్చు]
మూలాలు [మార్చు]
- ↑ http://asihyd.ap.nic.in/kurnool/index.htm
- ↑ సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము, రెండవ భాగము, 1960 ప్రచురణ, పేజీ సంఖ్య 545
- ↑ పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో కర్నూలు జిల్లా తాలూకాల వివరాలు. జూలై 26, 2007న సేకరించారు.
