కర్మ సిద్ధాంతము
వికీపీడియా నుండి
కర్మవాదం (fatalism) అంటే ప్రతి సంఘటన కర్మ (fate) మీద ఆధారపడి జరుగుతుందని నమ్మడం. కర్మవాదులు వీరికి అనుకూలమైనది జరిగితే అది తమ అదృష్టమనో దేవుడు కరుణించాడనో నమ్ముతారు. వీరికి ప్రతికూలమైనది జరిగితే అది తమ దురదృష్టమనో, దేవుడు తిరస్కరించాడనో నమ్ముతారు. అదృష్టం, దురదృష్టం, దైవ నిర్ణయాల పేరుతో చేసే సూత్రీకరణలను కర్మ సిధ్ధాంతాలని అంటారు. కర్మ సిధ్ధాంతాలు భావవాదం క్రిందకి వస్తాయి. భౌతికవాదులు ఈ సిధ్ధాంతాలకి వ్యతిరేకం.
విషయ సూచిక |
[మార్చు] కర్మవాదానికి ఉదాహరణలు
పునర్జన్మల పై నమ్మకం, స్వర్గ ప్రాప్తి, నరక భీతి లాంటివి కూడా కర్మవాదం కిందకి వస్తాయి. ఉదాహరణ: "నేను గత జన్మలో ఏదో పాపం చెయ్యడం వల్లే ఇప్పుడు ఈ స్థితికి దిగజారాను" అని కొందరు అంటుంటారు.
[మార్చు] పుర:నియతివాదం
పుర:నియతివాదం (pre-determinism) అంటే ఫలానా సంఘటన జరుగుతుందనో జరగదనో శాస్త్రీయ అంచనా లేకుండా చెప్పడం. ఉదాహరణ: జ్యోతిష్యం, న్యూమరాలజీ వంటివి. పుర:నియతివాదాన్ని కూడా కర్మవాదంగా పరిగణిస్తారు. ఫలానా సంధర్భంలో ఫలనా సంఘటన జరిగింది కనుక ఎల్లప్పుడూ అలాగే జరుగుతుందని ఖచ్చితంగా చెప్పలేము. వీటి ఆధారంగా అన్ని సందర్భాలలో సూత్రీకరణలు చెయ్యడం నవకర్మవాదం (neo-fatalism)కు దారి తీస్తుంది.
[మార్చు] ఎన్ని విధాలైన కర్మలు
- సంచిత కర్మలు: పూర్వ జన్మలో చేసినవి
- ఆగామి కర్మలు: ముందు జన్మలలో చేసేవి
- ప్రారబ్ధ కర్మలు: ఈ జన్మలో చేసేవి.
[మార్చు] భగవద్గీతలో కర్మ
కర్మ బ్రహ్మోద్భవం.ప్రకృతి గుణాల వలన అన్ని కర్మలు నిర్వహింప బడతాయి.కర్మలను ఆవరించి దోషం ఉంటుంది.కర్మ కంటే జ్ఞానమే ఎక్కువ.కర్మ మానడం కంటే కర్మ చేయడం మేలు.కర్మ చేయకపోతే శరీర యాత్ర జరగదు.మనిషి కర్మ చేయకుండా ఉండడం సాధ్యం కాదు. అయితే కర్మలవలన దోషాలు తప్పవు కాబట్టి సత్కర్మలు ఆచరించాలి. కర్మలపై ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మ ఫలాలను దైవానికి త్యజించడం వలన మనిషి మోక్షాన్ని పొందుతాడు.
[మార్చు] బౌద్ధంలో కర్మ
కోరికే కర్మ.ఎవరి కర్మకు వారే సొంతదారులు బాధ్యులు.కర్మలవారసత్వంతోనే పుడతారు.
[మార్చు] ఇస్లాంలో కర్మవాదం
మాషా'అల్లాహ్ అంటే దైవనిర్ణయానుసారం (దేవుడు నిర్ణయించాడు) అని అర్థం. వీరి నమ్మకం ప్రకారం దైవ నిర్ణయానికి ఎవరూ అతీతులు కారు. వీరు స్వర్గ నరకాలని నమ్ముతారు కానీ పునర్జన్మలని నమ్మరు. వీరి నమ్మకం ప్రకారం కర్మ అనేది భూమి మీద అమలవుతుంది లేదా స్వర్గ ప్రాప్తికి గానీ నరకానికి పోవుటకు గానీ దారి తీస్తుంది.
- "అన్నీ ముందుగానే అల్లాహ్ నిర్ణయిస్తాడు, ఆయన నిర్ణయం ప్రకారమే అన్నీ జరుగుతాయి" (ఖురాన్ : 14:4, 16:93 , 2:7 , 6:148 , 7:186. )
- అలాహ్ మనిషి అత్మను చేసి అందులోకి పాప పుణ్యాలు రెంటినీ ఊదుతాడు.Consider the soul and Him Who made it perfect, then breathed into
it its sin and its piety." (ఖురాన్ 91:8).
- శిశువు గర్భంలోఉన్నప్పుడే మగా ఆడా , మంచివాడౌతాడా చెడ్డవాడౌతాడా ,అతని పనులు,ఉపాధి,ఆయుషు వ్రాసినతరువాతే అల్లాహ్ ప్రాణం పోస్తాడు.కొంతమంది స్వర్గార్హత కొద్దిలో కోల్పో వచ్చు,నరకాన్ని కొద్దిలో తప్పించుకోనూ వచ్చు(బుఖారీ 59:6,ముస్లిం:1216)
- విధివ్రాత ప్రకారమే ఏ పనైనాజరుగుతుంది (ముస్లిం :1218)
- ప్రతి ఒక్కరి స్థానం స్వర్గం లేదా నరకంలో ముందుగానే వ్రాయబడిఉంది.అదృష్టవంతుడికి మంచిపనులు చేసే సద్బుద్ది కలుగుతుంది.దురదృష్టవంతుడికి చెడ్డపనులుచేసే దుర్బుద్ది పుడుతుంది.(బుఖారీ 23:83)
- ప్రతి మనిషీ తాను దేనికొరకు పుట్టించబడ్డాడో ఆ పనులే చేస్తాడు (బుఖారీ 82:2)
- ఓ మూసా నీవు నా పుట్టుకకు నలభై ఏళ్ళముందే నా అదృష్టంలో రాసిన విషయాలగురించి నన్ను నిందిస్తున్నావే?-- హజ్రత్ ఆదమ్ (బుఖారీ 82:11)
- దేవుడు మనిషి అదృష్టంలో కొద్దో గొప్పో వ్యభిచారం వ్రాశాడు(బుఖారీ 79:12)
- పిల్లలు పెరిగి పెద్దయ్యాక ఏం పనులు చేస్తారో దేవునికి తెలుసు (బుఖారీ 23:93)
[మార్చు] క్రైస్తవంలో కర్మవాదం
- యెహోవా -తల్లి నిన్ను కనక ముందే ఆమెగర్భంలో ఉండగానే నీవేమౌతావో నాకు తెలుసు ,తమ్ముడు అన్న కంటే గొప్పవాడౌతాడు లాంటి ప్రవచనాలు పంపుతాడు .
- తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారిని ముందుగా నిర్ణయించెను.ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను.ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను.ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను (రోమా 8:28-30)
- మనలను ముందుగా తనకోసరము నిర్ణయించుకొని జగత్తు పునాది వేయబడకమునుపే ఆయన మనలను ఏర్పరచుకొనెను.దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయముచొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు (ఎఫెసీ 1:5,11)

