కర్సన్ ఘావ్రి
కర్సన్ ఘావ్రి (Karsan Devjibhai Ghavri ) భారత మాజీ క్రికెట్ ఆటగాడు. ఇతను 1951, ఫిబ్రవరి 28 న గుజరాత్ లోని రాజ్‌కోట్ లో జన్మించాడు. భారత్ తరఫున 1974 నుంచి 1981 మద్యకాలంలో 39 టెస్టులు, 19 వన్డే మ్యాచ్‌లు ఆడినాడు. 1975 మరియు 1979 ప్రపంచ కప్ క్రికెట్ లో కూడా ఇతడు భారత జట్టు సభ్యుడు. ఇతను ఎడమ చేతి మీడియం పేస్ బౌలర్. టెస్ట్ క్రికెట్ లో మొత్తం 109 వికెట్లను 33.54 సగటుతో సాధించాడు. ఒకే ఇన్నింగ్సులో 5 వికెట్లను 4 సార్లు చేజిక్కించుకున్నాడు. బ్యాటింగ్ లో చివర వసరలో వచ్చి 2 అర్థ సెంచరీలను కూడా సాధించాడు. అతని అత్యధిక స్కోరు 86 పరుగులు. దీనిని ముంబాయి లో ఆస్ట్రేలియా పై సాధించాడు. ఆ కాలంలో అతను 8 వ వికెట్టుకు సయ్యద్ కిర్మాణి తో జతగా సాధించిన 127 పరుగులు ఆ వికెట్టుకు రికార్డుగా నిల్చింది.
వన్డే క్రికెట్ లో 19 మ్యాచ్‌లు ఆడి 119 పరుగులు చేశాడు. 15 వికెట్లను పడగొట్టాడు. అత్యుత్తమ బౌలింగ్ 40 పరుగులకు 3 వికెట్లు.
ఇవి కూడా చూడండి [మార్చు]
|
|
|
|---|---|
| వెంకట రాఘవన్ (కెప్టెన్) · ఏక్నాథ్ సోల్కర్ · అంశుమన్ గైక్వాడ్ · కర్సన్ ఘావ్రి · బ్రిజేష్ పటేల్ · గుండప్ప విశ్వనాథ్ · ఫరూక్ ఇంజనీర్ (వికెట్ కీపర్) · అబిద్ అలీ · మోహిందర్ అమర్నాథ్ · మదన్‌లాల్ · బిషన్ సింగ్ బేడీ |
|
|
|
|---|---|
| వెంకట రాఘవన్ (కెప్టెన్) · సునీల్ గవాస్కర్ · మోహిందర్ అమర్నాథ్ · గుండప్ప విశ్వనాథ్ · దిలీప్ వెంగ్‌సర్కార్ · అంశుమన్ గైక్వాడ్ · కర్సన్ ఘావ్రి · కపిల్ దేవ్ · బ్రిజేష్ పటేల్ · సురీందర్ ఖన్నా · బిషన్ సింగ్ బేడీ · భరత్ రెడ్డి · యశ్పాల్ శర్మ |