తామర పువ్వు

వికీపీడియా నుండి
(కలువ నుండి దారిమార్పు చెందింది)
Nelumbo nucifera
Nelumbo nucifera flower
Scientific classification
Kingdom: ప్లాంటే
Phylum: మాగ్నోలియోఫైటా
Class: మాగ్నోలియోప్సిడా
Order: Proteales
Family: Nelumbonaceae
Genus: Nelumbo
Species: N. nucifera
Binomial name
Nelumbo nucifera
Gaertn.
Synonyms
  • Nelumbium speciosum Willd.
  • Nymphaea nelumbo

తామర పువ్వు (లేదా పద్మము) [[(ఆంగ్ల భాష Lotus flower) చాలా అందమైనది. తామర పువ్వు మొక్కల ఆకులు గుండ్రంగా, ఆకులు కాడలపై చిన్న చిన్న ముళ్ళు కలిగియుంటుంది. తామర పువ్వు ఆకుల పైభాగం నీటితో తడవకపోవడం విశేషం. తామర పువ్వు మొక్కలు ముఖ్యంగా కోస్తా తీర గ్రామాల్లో ఉండే మంచినీటి చెరువుల్లో కనిపిస్తాయి. వీటి ఆకులు కటికవాళ్ళు మాంసం ప్యాక్ చేయడానికి వాడతారు. తామర పువ్వుల్లో తెలుపు, లేత గులాబీ రంగు రకాలున్నాయి. ముద్ద లేత గులాబీ రంగు తామర పువ్వు భారత దేశ జాతీయ పుష్పం.

విషయ సూచిక

లక్షణాలు[మార్చు]

  • భూగర్భ కొమ్ముగల బహువార్షిక గుల్మం.
  • ఇంచుమించు గుండ్రంగా ఉన్న సరళ పత్రాలు.
  • ఏకాంతంగా పొడుగాటి వృంతాలతో ఏర్పడిన తెల్లని లేదా లేత గులాబీ రంగు పుష్పాలు.
  • గుండ్రటి పుష్పాసనంలో అమరియున్న అసంయుక్త ఫలదళాలు.

ఉపయోగాలు[మార్చు]

  • తామర పువ్వులు సువాసన కలిగి అందముగా ఉండడం వలన పుష్పపూజలలో ఉపయోగిస్తారు.
  • దీని పుష్పాలు, కేసరములు, కాడలు అతిసార వ్యాధికి, కామెర్లకు, గుండె జబ్బుల చికిత్సకు ఉపయోగిస్తారు.
  • దీని పువ్వుల రసము దగ్గు నివారణకు, మూలవ్యాధి, రక్తస్రావము తగ్గించుటకు వాడెదరు.
  • దీని విత్తనములను చర్మ వ్యాధులకు, కుష్ఠువ్యాధి నివారణకు ఉపయోగిస్తారు

-ఇతర విశేషాలు[మార్చు]

  • తామర పువ్వును (ఆంగ్లం లో : Lotus )అని పిలుస్తారు. చాలా మందికి తామర పువ్వుకు, తామర పువ్వు కు ఉన్న తేడాలు తెలియవు. కలువ పువ్వు నింఫియా కుంటుంబానికి చెందినది. కలువ పువ్వు ఆకుల కు మధ్యలో కట్ ఉండి తేలిగ్గా నీటిలో తడుస్తాయి, కాడలు సున్నితంగా ఉంటాయి. కలువ పువ్వులు వందలాది రంగుల్లో లభిస్తాయి. కలువు పువ్వు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రీయ పుష్పం.

చిత్రమాలిక[మార్చు]