కల్పనా చావ్లా
వికీపీడియా నుండి
| Kalpana Chawla ਕਲਪਨਾ ਚਾਵਲਾ कल्पना चावला |
|
|---|---|
| Astronaut | |
| జాతీయత | USA
India |
| Status | Deceased |
| జననం | March 17, 1962 Karnal, Haryana, India |
| మరణం | February 1, 2003 (aged 40) Over Texas |
| మునుపటి వృత్తి |
Research Scientist |
| Space time | 31d 14h 54m |
| Selection | 1994 NASA Group |
| Missions | STS-87, STS-107 |
| Mission insignia |
|
కల్పనా చావ్లా (హిందీ: कल्पना चावला; మూస:Lang-pa) (మార్చ్ 17, 1962 – ఫిబ్రవరి 1, 2003), ఈమె ఒక ఇండియన్ -అమెరికన్ వ్యోమగామి మరియు వ్యొమనౌక యంత్ర నిపుణురాలు. కొలంబియా వ్యొమనౌక విపత్తు లో చనిపోయిన ఏడుగురి బృందం లో ఈమె కూడా ఒకరు.
విషయ సూచిక |
[మార్చు] చిన్ననాటి జీవితం
కల్పనా చావ్లా, భారత దేశం లో హర్యానా లోని కర్నాల్ అనే ఊరులో ఒక పంజాబీ కుటుంబం లో పుట్టారు.[1] కల్పన అంటే సంస్కృతం లో అర్ధం "ఊహ". ఈమెకి ఆకాశంలో విహరించాలనే అభిరుచి, విమాన చోదకంలో మార్గదర్శక పైలట్ మరియు వ్యాపారవేత్త ఐన జే.ఆర్.డి.టాటా నుంచి వచ్చింది. [2] [3]
[మార్చు] చదువు
కల్పనా చావ్లా ముందుగా, కర్నాల్ లో ఉన్న టాగోర్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు.1982 లో ఈమె చండీగఢ్ లోఉన్న పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ఏరోనాటికాల్ ఇంజనీరింగ్ సైన్సు పట్టాను సంపాదించారు. 1982 లో ఈమె అమెరికా వెళ్లి అక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో మాస్టర్ అఫ్ సైన్సు డిగ్రీని, అర్లింగ్టన్ లో ఉన్న టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి 1984 లో పొందారు.1986 లో, చావ్లా రెండవ మాస్టర్ అఫ్ సైన్సు డిగ్రీని మరియు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో పిహెచ్ .డి ని బౌల్డెర్ లో ఉన్న కోలోరాడో విశ్వవిద్యాలయం నుంచి పొందారు.ఆ సంవత్సరం లో, NASA ఏమ్స్ పరిశోదనా కేంద్రం లో ఓవర్ సెట్ మేతడ్స్,ఇంక్. కి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఇక్కడ ఈమె వి /స్టోల్ మీద సిఎఫ్ డి పరిశోధన చేసారు. [2] చావ్లా విమానాలకు,గ్లైడర్లు లకు మరియు ఒకటి లేదా ఎక్కువ యంత్రాలు ఉండే విమానాలకు, వ్యాపార విమానాలకు శిక్షణ ఇచ్చే యోగ్యతాపత్రం కలిగి ఉన్నారు. ఆమె దగ్గర యఫ్సిసి జారీ చేసే టెక్నికల్ క్లాసు అమెచూర్ రేడియో అనుమతి కాల్ సైన్ KD5ESI ఉంది. ఆమె 1983 లో విమానయాన శిక్షకుడు మరియు విమాన చోదక శాస్త్ర రచయిత ఐన జీన్-పియర్ హారిసన్ ను వివాహం చేసుకున్నారు, 1990 లో యునైటెడ్ స్టేట్స్ దేశ పౌరురాలి గా అయ్యారు.[4]
[మార్చు] NASA కెరీర్
1995 లో NASA వ్యోమగామి కార్పస్ లో చేరారు మరియు 1998 లో మొదటి సారిగా అంతరిక్షయానం కోసం ఎన్నికైయ్యారు. ఆమె మొదటి స్పేస్ ప్రయాణం 1997 నవంబర్ 19 న స్పేస్ షటిల్ కొలంబియా STS-87 లో ఆరు వ్యోమగాముల సభ్యులతో మొదలైంది చావ్లా భారతదేశం లో పుట్టి అంతరిక్షం లోకి ఏగిన తొలి మహిళ మరియు భారత దేశ సంతతిలో అంతరిక్షయానం చేసిన రెండో మనిషి, ఈమె, 1984 లో సోవియట్ స్పేస్ క్రాఫ్ట్ లో అంతరిక్షయానం చేసిన వ్యోమోగామి రాకేశ్ శర్మాను అనుసరించారు. ఆమె మొదటి విధిలో, చావ్లా భూగ్రహం చుట్టూ 252 సార్లు మొత్తం 10.4 మిలియన్ మైళ్ళ దూరాన్ని 360 గంటలకన్నా ఎక్కువ సేపు ప్రయాణం చేసారు. STS-87 సమయంలో, ఈమె తన భాద్యతను సద్వినియోగం చేస్తూ స్పార్టన్ ఉపగ్రహం వదలగా, అది పనిచేయకపోవటం వల్ల, విన్స్టన్ స్కాట్ మరియు తకౌ డొఇ తప్పని స్థితిలో అంతరిక్షం లో ఉపగ్రహాన్ని పట్టుకోవటానికి నడిచారు. NASA దు నెలల నాసా విచారణ తర్వాత, తప్పులు సాఫ్టవేర్ లో మరియు విమాన సభ్యులకి నిర్వచించిన పద్దతులు ఇంకా భూమి నుండి అదుపు చేయటం లోనే ఉన్నాయని, చావ్లా తప్పేమీ లేదని తేల్చి చెప్పింది.
STS-87 ముగింపు పనులు పూర్తి అయిన తర్వాత, వ్యోమగాముల ఆఫీసులో చావ్లాను సాంకేతిక స్థానంలో నియమించారు. ఇక్కడ ఈమె పనిని గుర్తించి, సహుద్యోగులు ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చారు.
2000 లో, STS-107 ఈమెను రెండవసారి అంతరిక్ష యానం చేయటానికి మిగిలిన సభ్యులతోపాటు ఎన్నుకున్నారు. ఈ క్షిపణి, నిర్ణీత కాలం నిశ్చయించటంలో విభేదాలు మరియు సాంకేతిక సమస్యలు, ఎలాంటివంటే 2002 లో గుర్తించిన నౌకా ఇంజనులో బీటలు వంటివాటివల్ల పలుమార్లు ఆలస్యం జరిగింది. 2003 జనవరి 16, చివరగా చావ్లా తిరిగి కొలంబియా , విధివంచితమైన STS-107 క్షిపణి లో చేరారు.చావ్లా భాద్యతలలో SPACEHAB/BALLE-BALLE/FREESTAR మైక్రో గ్రావిటీ ప్రయోగాలు ఉన్నాయి, వీటి కోసం భూమీ ఇంకా అంతరిక్ష విజ్ఞానం, నూతన సాంకేతిక అభివృద్ధి మరియు వ్యోమగాముల ఆరోగ్యం ఇంకా వారి జాగ్రత మీద సభ్యులు 80 ప్రయోగాలు చేసారు. [5][6][7][8][9][10][11][12][13][14][15][16]
1991 లో భర్త తో కలసి చావ్లా, తన కుటుంభ సభ్యులతో సెలవలు గడపటానికి చివరిసారిగా భారతాదేశం వచ్చారు. వివిధ కారణాలవల్ల, చావ్లా వ్యోమగామి ఐన తర్వాత భారతదేశం రమ్మని ఆహ్వానించినప్పటికి ఆమె దానిని అనుసరించ లేక పోయారు.
[మార్చు] అవార్డులు
మరణానంతర బహుకరణలు;
- కాంగ్రెషనల్ స్పేస్ మెడల్ అఫ్ ఆనర్
- NASA స్పేస్ ఫ్లైట్ మెడల్
- NASA విశిష్ట సేవా మెడల్
- డిఫెన్స్ విశిష్ట సేవా మెడల్
[మార్చు] జ్ఞాపకార్ధం
- కల్పనా చావ్లా స్మృతిచిహ్న విద్యార్ధి వేతనం , ఎల్ పసో(UTEP) లో ఉన్న టెక్సాస్ విశ్వవిద్యాలయం లోని భారతదేశ విద్యార్ధుల సంఘం ప్రతిభావంతులై పట్టా పుచ్చుకున్న విద్యార్ధులకు విద్యార్ధి వేతనం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. [17]
- కొలంబియా సభ్యులు ఏడుగురిలో గ్రహశకలం 51826 కల్పనాచావ్లా గా ఉదాహరించారు.[18]
- 2003 ఫిబ్రవరి 5 న, భారతదేశ ప్రధానమంత్రి వాతావరణ క్రమం తెలిపే గ్రహాలు, METSAT కు కల్పనా అని పేరుమార్చి పెట్టారు. METSAT క్రమం లోని మొదటి గ్రహం ను, భారతదేశం సెప్టెంబర్ 12, 2002 లో ఆరంభించింది, దీనిని ఇప్పుడు "కల్పనా-1 గా పిలవబడుతోంది. "కల్పనా -2" 2007 లో ఆరంభించ వచ్చని ఆశిస్తునారు. [19]
- న్యూయార్క్ సిటీ లోని క్వీన్స్ ప్రాంతం లో 74 జాక్సన్ హైట్స్ వీధిని ఇప్పుడు ఆమె గౌరవార్ధమ్ 74 వ కల్పనా చావ్లా వీధి మార్గం అనిపేరు పెట్టారు.
- 2004 సంవత్సరంలో అర్లింగ్టన్ లో ఉన్న టెక్సాస్ విశ్వవిద్యాలయం (ఇక్కడ నుంచే చావ్లా కు 1984 లో మాస్టర్ అఫ్ సైన్సు డిగ్రీ ఇన్ ఎరోస్పేస్ ఇంజనీరింగ్ లో వచ్చింది) చావ్లా గౌరవార్ధమ్ వసతి గృహాన్ని ఆమె పేరు మీద, 2004 లో కల్పనా చావ్లా హాల్ ను ఆరంభించారు. [20]
- 2004 వ సంవత్సరం లో 'కల్పనా చావ్లా అవార్డు ఈ బహుకరణను యువ మహిళా శాస్త్త్రవేత్తల కోసం కర్ణాటక ప్రభుత్వము ఆరంభించింది. [21]
- చావ్లా పోయింతర్వాత పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ లోని ఆడపిల్లల హాస్టల్ కు కల్పనా చావ్లా అని పేరు పెట్టారు. దానితోపాటు, ఏరోనాటికాల్ ఇంజనీరింగ్ డిపార్టుమెంటు లో ఉత్త్తమ విద్యార్ధికి ఇరవై ఐదు వేల రూపాయలు, ఒక పతకము, మరియు ఒక యోగ్యతాపత్రం ఇవ్వటం ఆరంభించారు. [22]
- NASA ఒక సూపర్ కంప్యూటర్ ని కల్పనా కి అంకిత మిచ్చింది.[23]
- ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ కొలంబియా విలేజ సూట్,లో ఉన్న విద్యార్ధుల అపార్ట్మెంట్ ఆవరణలోని హాళ్ళకి ఒకొక్క వ్యోమగామి పేరు ఒకొక్కదానికి పెట్టారు, చావ్లా పేరు కూడా ఉంది దీన్లో.
- NASA మార్స్ యక్సప్లోరేషన్ రోవేర్ సంస్థ కొలంబియా కొండల లోని ఏడు శిఖరాలకి కొలంబియా వ్యోమనుక దుర్ఘటన లో పోయిన ఏడు వ్యోమగాముల పేర్లు పెట్టారు, కల్పనా చావ్లా పేరును చావ్లా కొండ అని పెట్టారు.
- కొలంబియా దుర్ఘటన జ్ఞాపకార్ధం మరియు బేండ్ మీద ఉన్న మమకారం తో డీప్ పర్పుల్ బెండ్ నుండి Steve Morseస్టీవ్ మోర్స్ "కాంటాక్ట్ లాస్" అనే పాటను సృష్టించాడు.బనానాస్ అనే ఆల్బం లో ఈ పాట ఉంది..[24]
- ఆమె సోదరుడు, సంజయ్ చావ్లా, "నా సోదరి నా దృష్టిలో చనిపోలేదు. ఆమె మరణానికి అతీతమైనది. ఇదే కదా నక్షత్రం అంటే?ఈమె, ఆకాశం లో ఒక శాశ్వత మైన నక్షత్రం.ఆమె ఎప్పటికి ఆకాశం లోనే ఉంటారు, ఆమె అక్కడికి చెందినదే."[25]
- 2007 లో నవలారచయిత పీటర్ డేవిడ్ తన నవల స్టార్ ట్రెక్ లో ఒక వ్యొమనౌకకు చావ్లా అని పేరు పెట్టారు. స్టార్ ట్రెక్: ది నెక్స్ట్ జనరేషన్:బిఫోర్ డిజానర్ .[26]
- హర్యానా ప్రభుత్వము, కురుక్షేత్రా లోఉన్న జ్యోతిసర్ లో ఒక నక్షత్ర శాలను ఏర్పాటు చేసి దానికి కల్పనా చావ్లా నక్షత్ర శాలగా పేరుపెట్టారు.[27]
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ , ఖరగ్పూర్ వారు ఆమె గౌరవార్ధమ్ కల్పనా చావ్లా స్పేస్ టెక్నాలజీ సెల్ ను ఆరంభించారు. [28][29]
- మరీల్యాండ్ , నావల్ ఎయిర్ స్టేషన్ పటుక్సేంట్ రివెర్ , లోఉన్న మిలటరీ ఇళ్ళను అభివృద్ధి చేసేవారు ఈప్రాంతానికి కొలంబియా కాలనీ అని పేరు పెట్టారు. దీనిలో ఒక వీధి చావ్లా మార్గం అని ఉంది.
[మార్చు] ఇది కూడా చూడండి
[మార్చు] ఇంకా చదవడానికి
- అమాంగ్ ది స్టార్స్ -లైఫ్ అండ్ డ్రీమ్స్ అఫ్ కల్పనా చావ్లా రాసినవారు గుర్దీప్ పందేర్
- ఇండియా'స్ 50 మోస్ట్ ఇల్లసట్రి యస్ వొమెన్ (ISBN 81-88086-19-3) రాసినవారు ఇంద్ర గుప్త
- కల్పనా చావ్లా, ఏ లైఫ్ (ISBN 0-14-333586-3) రాసినవారు అనిల్ పద్మనాభన్
[మార్చు] సూచనలు /రేఫెరెన్సెస్
- ↑ Tragedy of Space Shuttle Columbia. Space Today. తీసుకొన్న తేదీ: 2007-06-08.
- ↑ 2.0 2.1 Astronaut Biography, Kalpana Chawla. Space.com. తీసుకొన్న తేదీ: 2007-06-02.
- ↑ India mourns space heroine. CNN. తీసుకొన్న తేదీ: 2007-06-02.
- ↑ She lived her dream. The Hindu newspaper, India. తీసుకొన్న తేదీ: 2007-06-08.
- ↑ కల్పనా చావ్లా ఫ్యామిలీ ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ది ఎన్విరాన్మెంట్
- ↑ యాన్ యక్ష్క్లుజివె వెబ్సైటు ఆన్ కల్పనా చావ్లా
- ↑ NASA బైఒగ్రఫికాల్ డేటా - కల్పనా చావ్లా, పిహెచ్ .డి.
- ↑ స్పేస్ ఫేక్ట్స్ బయోగ్రఫి అఫ్ కల్పనా చావ్లా
- ↑ కల్పనా చావ్లా STS-107 క్రూ మెమోరియల్
- ↑ కల్పనా చావ్లా -- మిషన్ స్పెషలిస్ట్
- ↑ ఇండియా రీనేమ్స్ శాటిలైట్ ఇన్ మెమరీ అఫ్ కొలంబియా అస్ట్రోనాట్
- ↑ సెవెన్ హీరోస్ , సెవెన్ ఫైథ్స్
- ↑ రిపోర్టర్ టిప్స్, Dr. కల్పనా సి. చావ్లా , ఆస్ట్రోనాట్
- ↑ పిక్చర్స్ ఆఫ్ కల్పనా చావ్లా
- ↑ ది చావ్లాస్ ' ఒడిస్సీ
- ↑ ఆస్ట్రోనాట్ మెమోరియల్ ఫౌండేషన్ వెబ్ పేజ్
- ↑ Kalpana Chawla Memorial Scholarship. UTEP. తీసుకొన్న తేదీ: 2008-06-10.
- ↑ Tribute to the Crew of Columbia. NASA JPL. తీసుకొన్న తేదీ: 2007-06-10.
- ↑ ISRO METSAT Satellite Series Named After Columbia Astronaut Kalpana Chawla. Spaceref.com. తీసుకొన్న తేదీ: 2007-06-10.
- ↑ More about Kalpana Chawla Hall. University of Texas at Arlington. తీసుకొన్న తేదీ: 2007-06-10.
- ↑ Kalpana Chawla Award instituted. The Hindu. తీసుకొన్న తేదీ: 2007-06-10.
- ↑ Punjab Engineering College remembers Kalpana. తీసుకొన్న తేదీ: 2007-06-10.
- ↑ NASA Names Supercomputer After Columbia Astronaut. About.com. తీసుకొన్న తేదీ: 2007-06-10.
- ↑ హాబీ స్పేస్ - స్పేస్ మ్యూజిక్ - రాక్ /పాప్
- ↑ 'COLUMBIA IS LOST' A Muse for Indian Women. LA Times (reprint on IndianEmbassy.org). తీసుకొన్న తేదీ: 2007-06-02.
- ↑ డేవిడ్ , పీటర్ ; స్టార్ ట్రెక్: నెక్స్ట్ జనరేషన్ : బిఫోర్ డిస్ఆనర్ ; పేజ్ 24.
- ↑ http://ibnlive.in.com/news /planetarium -in-kalpana-chawlas-memory/36993-11.html IBN News
- ↑ http://www.flickr.com/photos/ambuj/421069342/
- ↑ http://www.kcstc.iitkgp.ernet.in/
[మార్చు] బాహ్య లింకులు
మూస:Congressional Space Medal of Honor మూస:STS-107 మూస:NASA Astronaut Group 14