కల్వకుంట్ల చంద్రశేఖరరావు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కల్వకుంట్ల చంద్రశేఖర రావు
K chandrashekar rao.jpg
పార్లమెంటు సభ్యుడు
నియోజకవర్గం మహబూబ్ నగర్
వ్యక్తిగత వివరాలు
జననం (1954-02-17)17 ఫిబ్రవరి 1954
చింతమడక, మెదక్, ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
భాగస్వామి శోభ
సంతానం కల్వకుంట్ల తారక రామారావు (కొడుకు) మరియు కవిత (కూతురు)
నివాసం హైదరాబాదు
మతం హిందూమతము
As of మార్చి 30, 2009
Source: KCR Bio data

కల్వకుంట్ల చంద్రశేఖర రావు (జ: 17 ఫిబ్రవరి, 1954) 15వ లోక్‌సభ సభ్యుడు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడైన చంద్రశేఖరరావు 15వ లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ లోని కరీంనగర్ లోకసభ నియోజకవర్గంకు ప్రాతినిధ్యం వహించాడు. 2004 నుండి 2006 వరకు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. ప్రస్తుతం 15వ లోక్‌సభలో మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుండి విజయం సాధించాడు. [1]

ఇతడు మొదట తెలుగుదేశం పార్టీలో సభ్యుడు. తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం సాధన ధ్యేయంగా ఆ పార్టీ నుండి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించాడు. 2004 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెసుతో కలిసి పోటీచేసి 5 లోక్‌సభ స్థానాలను దక్కించుకున్నాడు. అయితే తరువాత కాలంలో యు.పి.ఏ నుండి వైదొలగాడు. ఇతడు ఎం.ఏ (సాహిత్యం) ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పూర్తిచేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

విద్యార్థి దశలో ఉన్నప్పుడే రాజకీయ అనుభవం సంపాదించిన కె.చంద్ర శేఖరరావు ప్రారంభంలో తెలుగుదేశం పార్టీలో చేరి 1985లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. 1987-88 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా సంపాదించాడు. 1992-93లో పబ్లిక్ అండర్ టేకింగ్ చైర్మెన్ పదవిని నిర్వహించాడు. 1997-98లో కేబినెట్ హోదా మంత్రి పదవి లభించింది. 1999-2001 కాలంలో రాష్ట్ర శాసనసభ డిప్యూటి స్పీకర్ పదవికి కూడా నిర్వహించాడు. ఆ తరువాత ప్రారంభం నుండి తాను ఉంటున్న తెలుగుదేశం పార్టీకి రాజీనామా సమర్పించి నూతనంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటుచేశాడు. 2004 ఎన్నికలలో కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుండి గెలుపొందినాడు.[2]. 14వ లోక్‌సభలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయెన్స్ కూటమికి మద్దతు ప్రకటించి 5 లోక్‌సభ సభ్యులు ఉన్న టి.ఆర్.ఎస్. తరఫున ఆలె నరేంద్రతో పాటు కె.చంద్ర శేఖరరావు మంత్రిపదవులు పొందినారు. 2004 నుండి 2006 వరకు కేంద్రంలో కార్మికశాఖ మంత్రి పదవిని నిర్వహించిన అనంతరం మారిన రాజకీయ పరిమాణాల నేపథ్యంలో మంత్రిపదవులకు రాజీనామా చేయడమే కాకుండా యు.పి.ఏ. కూటమికి మద్దతు కూడా ఉపసంహరించబడింది. లోక్‌సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన అనంతరం జరిగిన ఉపఎన్నికలలో కరీంనగర్ స్థానం నుండి మళ్ళీ పోటీచేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన టి.జీవన్ రెడ్డిపై రెండు లక్షలకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించాడు. 2008లో మళ్ళీ రాష్ట్రమంతటా తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలలో మళ్ళీ కరీంనగర్ లోక్‌సభ స్థానం నుండి పోటీచేసి 15000 పైగా మెజారిటీతో విజయం సాధించాడు. 15వ లోక్‌సభ ఎన్నికలలో మహబూబ్ నగర్ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విఠల్ రావుపై గెలుపొందినాడు.


కేసీఅర్ వ్యాఖ్యలు[మార్చు]

  • "ఈ గడ్డ మీద పుట్టిన వారంతా తెలంగాణ బిడ్డలే.తల్లిదండ్రులు ఏ ప్రాంతానికి చెందిన వారైనా.. తెలంగాణలో పుట్టిన బిడ్డలు ఇక్కడ ఉద్యోగాలు, ఎమ్మెల్యే పదవులు సహా అన్నింటికీ అర్హులే".

మూలాలు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  1. ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009
  2. http://164.100.47.134/newls/Biography.aspx?mpsno=4083