కాంగేర్ లోయ జాతీయ వనం

వికీపీడియా నుండి
(కాంగేర్ లోయ జాతీయ అరణ్యం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కాంగర్ లోయ జాతీయ వనం
కాంగర్ లోయ జాతీయ వనం
IUCN category II (national park)
Map showing the location of కాంగర్ లోయ జాతీయ వనం
Map showing the location of కాంగర్ లోయ జాతీయ వనం
Map showing the location of కాంగర్ లోయ జాతీయ వనం
Map showing the location of కాంగర్ లోయ జాతీయ వనం
ప్రదేశంజగదల్ పూర్, చత్తీస్ గఢ్
సమీప నగరంజగదల్ పూర్
విస్తీర్ణం200 km2 (77 sq mi)
స్థాపితం1982
పాలకమండలిConservator of Forest
http://www.kvnp.in

కాంగేర్ లోయ జాతీయ అరణ్యం చత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పుర్ పట్టణానికి దక్షిణాన 35 కిలో మీటర్లు దూరాన ఉన్న జాతీయ అరణ్యం. ఈ అరణ్యం పులులు, చిరుత పులులు, అడవి కోళ్ళు, ఇతర జంతువులు, పక్షులకి ప్రసిద్ధి. తీరత్‌గఢ్ జలపాతాలు, కోతుంసర్ గుహలు, కైలాస గుహలు ఈ అరణ్యంలోనే ఉన్నాయి. 1982 లో ప్రభుత్వం దీన్ని జాతీయ వనంగా గుర్తించింది. చత్తీస్ గఢ్ రాష్ట్ర పక్షి అయిన బస్తరు కొండ మైనాకు ఈ వనం నెలవు.

34 కి.మీ. పొడవైన కాంగేర్ లోయలో ఈ వనాన్ని స్థాపించారు. దీని విస్తీర్ణం సుమారు 200 చ.కి.మీ. ఇది ఎక్కువగా పర్వత ప్రాంతం. ఈ పార్కు గుండా ప్రవహించే కాంగేర్ నది వలన దీనికి ఈ పేరు వచ్చింది. ఈ వనంలో మైదాన ప్రాంతం, పర్వత ప్రాంతం, పీఠభూమి ప్రాంతం, లోయలు, వాగుల వంటి వివిధ భౌగోళిక విశేషాలున్నాయి. అనేక జాతుల వృక్ష జంతు జాలానికి ఈ వనం నెలవు. పార్కులో కొన్ని గిరిజన జాతుల ప్రజలు కూడా అవాసముంటారు.

జంతుజాలం[మార్చు]

కోతుంసర్ గుహల్లో ఉండే గుహ చేప

ఈ వనంలో పులి, చిరుతపులి, జింక, అడవి పిల్లి, జింక, సాంబార్, నక్క, లంగూర్, ఎలుగుబంటి, ఎగిరే ఉడుత, అడవి పంది, చారల దుమ్ములగొండి, కుందేలు, కొండచిలువ, తాచుపాము, మొసలి వంటి జంతువులున్నాయి. కొండ మైనా, మచ్చల గూడ్లగూబ, అడవి కోడి, చిలుక, నెమలి, మైదాన గద్ద వంటి పక్షులు కూడా ఉన్నాయి. మొత్తం 49 రకాల క్షీరదాలు, 144 రకాల పక్షులూ ఈ వనంలో ఉన్నాయి.

మానవ ఆవసాలు[మార్చు]

ఈ జాతీయ వనంలో రెండు శ్రేణులున్నాయి - కోతుంసర్, కోలెంగ్. కోతుంసర్ శ్రేణి పార్కు పశ్చిమ భాగంలో ఉంది. ఇక్కడ అనేక మానవ ఆవాసాలున్నాయి. తూర్పున ఉండే కోలెంగ్ శ్రేణిలో గ్రామాలు తక్కువ. మొత్తమ్మీద ఈ వనంలో 48 గ్రామాలున్నాయి. [1]

మూలాలు[మార్చు]

  1. "Kanger Valley National Park Bastar, kvnp, kvnp bastar, Kanger Ghati rashtriya udyan". Kvnp.in. Archived from the original on 2013-12-31. Retrieved 2012-03-28.