కాంచన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాంచన
జననం
పురాణం వసుంధరాదేవి

(1939-08-16)1939 ఆగస్టు 16
వృత్తినటి

కాంచన ఒక తెలుగు సినిమా నటీమణి.

జీవితం[మార్చు]

ప్రకాశం జిల్లా కరవది గ్రామంలో సంపన్న కుటుంబములో జన్మించిన ఈమె అసలు పేరు పురాణం వసుంధరాదేవి. ఈమె చిన్న తనములోనే భరత నాట్యము, సంగీతములో శిక్షణ పొందినది. ఇవే ఆమె పెద్దయ్యాక నటిగా రాణించడానికి దోహదపడ్డాయి. ఈమె బ్రహ్మచారిణిగా జీవితాన్ని గడిపింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి తారుమారు కావడంతో కాంచన చదువు ఆపి ఎయిర్ హోస్టెస్ గా జీవితాన్ని ప్రారంభించింది.

1970వ దశకములో ప్రసిద్ధి చెందిన దర్శకుడు శ్రీధర్ ఈమెను చూసి ప్రేమించి చూడు సినిమాలో హీరోయిన్ అయ్యే అవకాశము ఇచ్చాడు. 1965 సంవత్సరం మధుసూధనరావు గారి వీరాభిమన్యులో కథానాయిక ఉత్తరగా నటించడం ఆమె జీవితానికి బంగారుబాట వేసింది. తర్వాత కె.విశ్వనాథ్ దర్శకత్వంలో ఆత్మ గౌరవంలో పోషించిన నాయిక పాత్రలో గ్లామర్ తో పాటు కొంత హెవీనెస్ కూడా ఉండటంతో ఆమె నటనకు మంచి మార్కులు లభించాయి. హీరో ఘట్టమనేని కృష్ణతో నటించిన అవే కళ్ళు, నేనంటే నేనే చిత్రాల్లో గ్లామరస్ పాత్రలు ధరించగా, స్విమ్మింగ్ డ్రస్ లో గ్లామరస్ స్టార్ గా కనిపించి ఓ రకమైన క్రేజ్ క్రియేట్ చేశారు. కాంచన సాంఘిక చిత్రాలే కాదు దేవకన్య, అందం కోసం పందెం, శ్రీకృష్ణావతారం వంటి జానపద, పౌరాణిక చిత్రాలలో మంచి నటనను ప్రదర్శించారు.

మనుషులు మారాలి, మంచి కుటుంబం చిత్రాల్లో కథకు కీలకమయిన పాత్రలు పోషించిన కాంచన నట జీవితానికి మిగిలిపోయే పాత్రను కళ్యాణ మండపంలో పొషించారు. ఈ చిత్రానికి మాతృక కన్నడంలో వచ్చిన 'గజ్జె పూజ'. ఒక వేశ్య కూతురుగా సంఘంలో గౌరవం పొందటం కోసం తండ్రి కాని తండ్రిని చూసి ఆనందం, ఆశ్చర్యం, తన్మయం, తృప్తి, అవ్యక్త మధురానుభూతితో మథనపడుతూ కాంచన పోషించిన నటనకు ప్రేక్షకుల కళ్ళు చమర్చాయి. హీరోయిన్ గా రిటైరైన తర్వాత ఆనంద భైరవి చిత్రంలో మంచి పాత్ర పోషించారు. 2017 లో విడుదల అయ్యిన అర్జున్ రెడ్డి సినిమాలో నటించారు. ఇప్పటికి అదే ఆవిడ చివరిసినిమా.

చిత్రమాలిక[మార్చు]

పురస్కారాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "23మందికి కళారత్న పురస్కారం". www.andhrabhoomi.net. 2016-04-09. Archived from the original on 2016-04-10. Retrieved 2023-03-24.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=కాంచన&oldid=3882700" నుండి వెలికితీశారు