Coordinates: 12°49′N 79°43′E / 12.82°N 79.71°E / 12.82; 79.71

కాంచీపురం జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Kancheepuram District
Waters of Chembarambakkam Lake Chennai limit
Waters of Chembarambakkam Lake Chennai limit
పటం
Kanchipuram district
Location in Tamil Nadu
Coordinates: 12°49′N 79°43′E / 12.82°N 79.71°E / 12.82; 79.71
Countryభారతదేశం India
రాష్ట్రం Tamil Nadu
Established1 July 1997
Founded byM. Karunanidhi
ముఖ్యపట్టణంKancheepuram
TaluksKancheepuram, Sriperumbudur, Uthiramerur, Walajabad, Kundrathur
Government
 • District CollectorM. Aarthi I.A.S
Area
 • Total1,448 km2 (559 sq mi)
Population
 (2011)
 • Total14,41,829
 • Density1,000/km2 (2,600/sq mi)
Languages
 • OfficialTamil
Time zoneUTC+5:30 (భా.ప్రా.కా)
పిన్ కోడ్
631 501
Telephone code044
ISO 3166 code?
Vehicle registrationTN-21, TN-87
Coastline87.2 kilometres (54.2 mi)
Largest MetroKanchipuram
Sex ratioM-50.6%/F-49.4% /
Literacy75.34%
Legislature typeelected
Legislature Strength3
Lok Sabha constituencyKancheepuram (SC), Sriperumbudur
Precipitation1,213 millimetres (47.8 in)
Avg. summer temperature36.6 °C (97.9 °F)
Avg. winter temperature19.8 °C (67.6 °F)

కాంచీపురం జిల్లా, భారతదేశం, తమిళనాడు రాష్ట్రం లోని ఒక జిల్లా. కాంచీపురం జిల్లాతో కూడిన ప్రాంతం గతంలో చింగ్లేపుట్ జిల్లాలో భాగంగా ఉండేది.అసలు 1997లో చింగ్లెపుట్ జిల్లావిడిపోయి ప్రస్తుత కాంచీపురం తిరువళ్లూరు జిల్లాలుగా ఏర్పడింది.[1][2] 2019 జులై 18న, చెంగల్‌పట్టు జిల్లా కాంచీపురం జిల్లానుండి వేరు చేయబడింది, చెంగల్‌పేట్ నుండి చెన్నై వైపు శివారు ప్రాంతాలు చెంగల్‌పేట లోని జిల్లాప్రధాన కార్యాలయం క్రింద ఉన్నాయి. ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి చేసిన విభజన నవంబరు 29 అమలులోకి వచ్చింది.[3]

భౌగోళిక శాస్త్రం[మార్చు]

తమిళనాడులోని ఈశాన్య భాగంలో కాంచీపురం జిల్లా ఉంది. దీనికి తూర్పున చెంగల్పట్టు జిల్లా, ఈశాన్యంలో చెన్నైజిల్లా, పశ్చిమాన రాణిపేట్, తిరువణ్ణామలై, ఉత్తరాన తిరువళ్లూరు జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఇది 11° 00' నుండి 12° 00' అక్షాంశాలు, 77° 28' నుండి 78° 50' రేఖాంశాల మధ్య ఉంది. జిల్లా భౌగోళిక విస్తీర్ణం మొత్తం 4,43,210 హెక్టార్లు.

దిగువ పట్టిక వివిధ కాలాలలో జిల్లాలో అనుభవించే గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలను చూపుతుంది.

వేసవి కాలం శీతాకాలం
గరిష్టంగా 38.5 °C (101.3 °F) 27.7 °C (81.9 °F)
కనిష్టంగా 29.1 °C (84.4 °F) 19.0 °C (66.2 °F)

ఈశాన్య, నైరుతి రుతుపవనాలలో వర్షపాతం ఎక్కువ. మొత్తం వార్షిక వర్షపాతానికి 54% , 36% మధ్యలోఉంటుంది.సాధారణ రుతుపవనాల సమయంలో, జిల్లా 1200 మి.మీ. వర్షపాతం పొందుతుంది. జిల్లాలో ప్రవహించే ముఖ్యమైన నది పాలార్. ఆంధ్రప్రదేశ్‌లో నదికి అడ్డంగా ఆనకట్టల నిర్మాణాల కారణంగా సంవత్సరంలోఎక్కువ భాగం పొడిగా ఉంటుంది. జిల్లాలో గణనీయమైన ఎత్తులో కొన్నికొండలు మాత్రమే ఉన్నాయి.మదురాంతకం తాలూకా దక్షిణ భాగంలో చిన్న కొండలు ఉన్నాయి.జిల్లాలో మొత్తం అటవీ విస్తీర్ణం 23,586 హెక్టార్లు ఉంది

పరిపాలన నిర్మాణం[మార్చు]

జిల్లాలో వివిధ స్థాయిల స్థానిక సంస్థలు పరిపాలనా ప్రయోజనాల కోసం ఉన్నాయి.[4]

  • నగరపాలక సంస్థలు
    • కాంచీపురం - జిల్లాకేంద్రం
  • పురపాలికలు
    • కుంరత్తూరు
    • మంగాడు
  • పట్టణ పంచాయతీలు
    • శ్రీపెరంబుదూర్
    • ఉతిరమేరూరు
    • వాలాజాబాద్
  • గ్రామీణ
    • జిల్లా పరిషత్తులు - 9
    • పంచాయతీ సమితులు - 5
    • గ్రామ పంచాయతీలు - 274

రెవెన్యూ డివిజన్లు, తాలూకాలు[మార్చు]

కాంచీపురం జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, ఐదు తాలూకాలు ఉన్నాయి:[5]

  • శ్రీపెరంబుదూర్ తాలూకా
  • కుండ్రత్తూరు తాలూకా
  • కాంచీపురం తాలూకా
  • వాలాజాబాద్ తాలూకా
  • ఉతిరమేరూర్ తాలూకా

జనాభా శాస్త్రం[మార్చు]

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±% p.a.
19017,08,782—    
19117,59,794+0.70%
19217,98,408+0.50%
19318,71,546+0.88%
19419,56,996+0.94%
195110,30,559+0.74%
196111,67,491+1.26%
197114,99,744+2.54%
198118,98,021+2.38%
199124,15,010+2.44%
200128,77,468+1.77%
201139,98,252+3.34%
ఆధారం:[6]

కాంచీపురం జిల్లాలో, 2011 భారత జనాభా లెక్కల ప్రకారం 3,998,252 జనాభా ఉంది.లింగ నిష్పత్తి ప్రతి 1,000 మంది పురుషులకు 986 స్త్రీలు ఉన్నారు. ఈ లింగ నిష్పత్తి, జాతీయసగటు 929 కంటే చాలా ఎక్కువ [7] పట్టణ జనాభా మొత్తంలో 431,574 మంది ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు. వీరిలో 220,341 మంది పురుషులు కాగా,211,233 మంది స్త్రీలు ఉన్నారు. జనాభా మొత్తంలో షెడ్యూల్డ్ కులాలు వారు 23.71% మంది ఉండగా, షెడ్యూల్డ్ తెగలు వారు, 1.03% ఉన్నారు. జిల్లా సగటుఅక్షరాస్యత 75.37% ఉంది. ఇది జాతీయ సగటు 72.99% కంటే ఎక్కువ.[7] జిల్లాలో మొత్తం 1,006,245 గృహాలు ఉన్నాయి.మొత్తం 1,673,814 మంది కార్మికులు,ఇందులో 74,761 మంది సాగుదారులు,162,494 ప్రధాన వ్యవసాయ కార్మికులు, 41,149కుటీర పరిశ్రమలు,1,088,974 ఇతర కార్మికులు, 306,436 మంది ఉపాంత కార్మికులు, 14,582 ఉపాంత సాగుదారులు,110,020 మంది ఉపాంత వ్యవసాయ కార్మికులు,13,583 కుటీర పరిశ్రమ ఉపాంత కార్మికులు,16,8,251 ఉపాంత కార్మికులు ఉన్నారు.[8]

రాజకీయం[మార్చు]

2021 శాసనసభ ఎన్నికలు[మార్చు]

జిల్లా నం. నియోజకవర్గం పేరు పార్టీ కూటమి వ్యాఖ్యలు
కాంచీపురం జిల్లా 29 శ్రీపెరంబుదూర్ శాసనసభ నియోజకవర్గం (ఎస్.సి.) సెల్వపెరుంతగై. కె భారత జాతీయ కాంగ్రెస్ యు.పి.ఎ
కాంచీపురం జిల్లా 36 ఉతిరమేరూరు శాసనసభ నియోజకవర్గం కె. సుందర్ ద్రవిడ మున్నేట్ర కజగం యు.పి.ఎ
37 కాంచీపురం శాసనసభ నియోజకవర్గం సివిఎంపి ఎజిలరసన్ ద్రవిడ మున్నేట్ర కజగం యు.పి.ఎ

మూలాలు[మార్చు]

  1. "History". Kancheepuram District. Retrieved 12 July 2020.
  2. "About District | Kancheepuram District,Government of Tamilnadu | City of Thousand Temples | India". Retrieved 2023-01-17.
  3. "Palaniswami inaugurates Chengalpattu district". The Hindu. 30 November 2019.
  4. "Local Body Ward Delimitation -2020 | Kancheepuram District,Government of Tamilnadu | City of Thousand Temples | India".
  5. "Tamil Nadu Government Portal". www.tn.gov.in. Retrieved 2020-05-07.
  6. Decadal Variation In Population Since 1901
  7. 7.0 7.1 "Census Info 2011 Final population totals". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 26 January 2014.
  8. "Census Info 2011 Final population totals - Kancheepuram district". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 26 January 2014.

వెలుపలి లంకెలు[మార్చు]