కాకినాడ
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
| ?కాకినాడ ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| జిల్లా(లు) | తూర్పు గోదావరి |
| జనాభా • ఆడ-మగ నిష్పత్తి • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
296,329 (2001) • 0.98 • 75.20 • 80.14 • 70.38 |
| కోడులు • పిన్‌కోడు • టెలీఫోను |
• 5330xx • ++91 884 |
కాకినాడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లా యొక్క ముఖ్యపట్టణం. కాకినాడ తూర్పు గోదావరి జిల్లాలో ప్రధాన పట్టణమే కాక భారత దేశ తూర్పు తీర ప్రాంతములోముఖ్యమైన రేవు పట్టణం.
విషయ సూచిక |
[మార్చు] నైసర్గిక స్వరూపము
కాకినాడ 16.93° ఉత్తర అక్షాంశం (lattitude)దగ్గర, 82.22° తూర్పు రేఖాంశం (longitude) దగ్గర ఉంది. భారతీయ ప్రామాణిక కాలమానానికి (Indian Standard Time) అధారభూతమైన 82.5 ఉత్తర రేఖాంశం కాకినాడ మీదుగా పోవటం గమనార్హం. కాకినాడ ఊరంతా సముద్రమట్టానికి 2 మీటర్లు ఎత్తులోనే ఉంది.
[మార్చు] కాకినాడ పేరు వెనుక ఇతిహాసం
- కాకినాడ పేరు మొదట కాకి నందివాడ అని ఉండేదని, అది కాలక్రమముగా కాకినాడ గా నామాంతరం చెందిందని చెబుతారు. స్వాతంత్ర్యం రాక ముందు కొంతకాలం కాకినాడ పెరు కొకనాడగా చలామణి అయ్యింది.
- ఇక్కడకి మొదట డచ్ వారు వర్తకం చేసుకొనడానికి వచ్చి వారి స్థావరం ఏర్పరచుకొన్నారు. వారి తరువాత ఆంగ్లేయులు వారి స్థావరం ఏర్పాటు చేసుకొన్నారు.తరువాత కెనడియన్ బాప్తిస్టు క్రైస్తవ మిషనరీలు ఇక్కడకి వచ్చారు.
- భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక పేరు కాకినాడగా మార్చబడింది. అయితే స్వాతంత్ర్యం రాక మునుపు బ్రిటిషు వారి పరిపాలన సమయం లో స్థాపించబడిన సంస్థల పేర్లు కొకనాడ గానే ఉన్నాయి. ఉదాహరణ- కొకనాడ చేంబర్ ఆఫ్ కామర్స్, జె ఎన్ టి యు లోని కొన్ని శిలాఫలకాలు.
- కాకినాడ లోని రహదార్లు ప్రణాళిక ప్రకారము వెయ్యడం వల్ల రహదార్లు ఒకదానికి ఒకటి సమాంతరం గా, రూళ్ళ కర్ర తో గీసినట్టుగా ఉంటాయి. కాకినాడ ని రెండవ మద్రాసు అని పిలుస్తారు.
కాకినాడ కు ఆ పేరు ఎలా వచ్ఛిందంటే పూర్వం త్రేతాయుగం లొ ఇది పెద్ద అరణ్యం దీన్నీ కాకాసురుడు అనే రాక్షసుడు పరిపాలిస్తూ ఉండే వాడు వనవాసం చేస్తున్న సీతను కాకి రూపంలో వేధించినపుడు రాముడు అతనిని సంహరించినాడు, అతని పేరున ఈ వనమ్ వెలిసినది.
[మార్చు] కాకినాడ ప్రత్యేకతలు
కాకినాడ ఊరు పేరు చెప్పగానే నోరూరే విషయాలు రెండు. ఒకటి కోటయ్య కాజాలు. ఇవి తాపేశ్వరం మడత కాజాల వంటి కాజాలు కావు. సన్నంగా, కోలగా దొండకాయలాగా ఉంటాయి. , కొరగ్గానే లోపల ఉన్న పాకం జివ్వున నోట్లోకి వస్తుంది. వీటిని గొట్టం కాజాలని కూడా అంటారు. తరువాత చెప్పుకోవలసినది నూర్జహాన్ కిళ్ళీ. ఇది తుని తమలపాకులతో చేసే మిఠాయి కిళ్ళీ. అలాగే కాకినాడలోని సుబ్బయ్య హోటలు. సంప్రదాయబద్ధంగా అరటి ఆకులో వడ్డించే ఇక్కడి అద్భుతమయిన భోజనానికి చాల ప్రశస్తి ఉంది. ఆసియా లో మొదటి బయో డీజల్ తయారి ఇక్కడ కలదు. కొట్లాటలు, కక్షలతొ కాక చక్కని ప్రశాంత వాతావరణం తొ పెన్ష్ నర్స్ పారడైస్ అని పిలుస్తారు. RajWebWorld.
[మార్చు] రవాణా సదుపాయాలు
[మార్చు] రైలు సదుపాయం
కాకినాడ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకి 564 కి మీ ల దూరంలో ఉన్నది. చెన్నై - కోల్కతా రైలు మార్గం లో సామర్లకోట దగ్గర బండి మారాలి. కాకినాడ నుండి ఇతర ప్రాంతాలకు దూరాలు, కిలోమీటర్లలో:
బెంగుళూరు 856
చెన్నై 684
హౌరా (కోల్కతా) 1028
ముంబై 1234
ఢిల్లీ 1848
రాజమండ్రి 65
విజయవాడ 223
విశాఖపట్నం 162
ప్రస్తుతం హైదరాబాదు, చెన్నై (మద్రాసు), షిర్ది, ముంబాయి, బెంగుళూరు లకు నేరుగా రైలు సదుపాయముంది.
కాకినాడ నుంచి కోనసీమ అందాలను చూపుతూ కోటిపల్లి వరకు పోయే రైలు బస్సు మరొక ఆకర్షణ.
[మార్చు] పట్టణ చరిత్ర
ఇది రాష్ట్రములోని ప్రధానమైన ఓడరేవులలో ఒకటి. రెండు శతాబ్దాల క్రితం ఈ రేవు నుండి మల్లాది సత్యలింగ నాయకర్ అనే ఆసామీ ఓడ వ్యాపారం చేసేవాడు. ఆయన వారసులు మల్లాది సత్యలింగ నాయకర్ ఛారిటీస్ (MSN Charities) అనే స్వచ్ఛంద సంస్థని స్థాపించి ఇప్పటికీ విద్యారంగంలో ఎన్నో ప్రజోపయోగమైన పనులు చేస్తున్నారు.
భారతదేశంలో వాసయోగ్యమైన బహుకొద్ది నగరాలలో కాకినాడ ఒకటిగా ఉండేది. తిన్నటి విశాలమైన వీధులు, విద్యుచ్చక్తి, నీటి సరఫరా, ఈశ్వర పుస్తక భాండాగారం వంటి గ్రంథాలయాలు, కళాశాలలు మొదలైన హంగులన్నీ ఈ ఊళ్ళో దరిదాపు 1900 సంవత్సరం నుండీ ఉన్నాయి. ఇప్పుడు కొత్త కొత్త కళాశాలలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థలు కూడ రావటంతో ఇంకా బాగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడి జె ఎన్ టి యు కళాశాల భారదేశంలోని అతి పురాతనమైన, అత్యుత్తమమైన ఏలెక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్ శాఖలను కలిగి ఉంది.
ప్రశాంతమయిన పరిసరాలు కలిగి ఉండడము చేత రాష్ట్రం నలు మూలల నుంచి రిటైర్డ్ ఉద్యొగులు ఎందరో వచ్చి కాకినాడలో స్థిరపడుతున్నారు. అందుకే ఈ నగరాన్ని "పెన్షనర్స్ ప్యారడైజ్" అని కూడా పిలుస్తారు. అయితే ఇప్పుడు పరిస్థితి చాలా మారింది.అడ్డు ఆపు లేని నగరీకరణం వలన పర్యావరణం పైన విపరీతమైన భారం కలిగి ఉష్ణోగ్రతలు విపరీతం గా పెరుగుతున్నాయి. ముఖ్యంగా వేసవి లొ పరిస్థితి భరించలేని రీతిలొ ఉంది. చెట్లు విపరీతం గా నరకడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చాలా మంది భావిస్తున్నారు.
[మార్చు] హోప్ ఐలాండ్
కాకినాడ తీర ప్రాంతం అంతా హోప్ ఐలాండ్ (హోప్ ద్వీపం) (వికీమాపియాలో హోప్ ఐలాండ్) చేత పరిరక్షింపబడుతున్నది. సముద్రపు (బంగాళా ఖాతము) ఆటుపోట్ల నుండి తీరము కోత కొయ్యబడకుండా ఐదు వందల సంవత్సరాల క్రితం నుండి ఈ హోప్ ఐలాండ్ ఏర్పడిందని తెలుస్తున్నది. ఈ హోప్ ఐలాండ్ తీరం వెంబడి 23 కి.మీల మేర విస్తరించి ఉన్నది. కాకినాడ సముద్రతీరంలో ఓడలు నిలిచినప్పుడు ఈ హోప్ ఐలాండ్ వల్ల ఓడలు లంగరు వేసినప్పుడు స్థిరంగా ఉండగల్గుతున్నాయి. మహలక్ష్మ tourism chollangipeta వారు బొటు లొ హోప్ ఐలాండ్ విహరా యత్ర matlapalem yanam road లొ కలదు
[మార్చు] విద్యాసంస్థలు
కాకినాడలో ఉన్న విద్యా పీఠాలు:
- పిఠాపురం రాజావారి కళాశాల (P. R. College), ఇది చాల రోజులబట్టి ఉన్న కళాశాల. రఘుపతి వెంకటరత్నంనాయుడు, వేమూరి రామకృష్ణారావు వంటి ఉద్దండులు ఇక్కడ పని చేసేరు.
- ఆంధ్రా పాలీటెక్నిక్
- జవాహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఇంజనీరింగు కళాశాల (JNTU Engineering College). ఇది ఆంధ్రాలో మొట్టమొదటి ఇంజనీరింగు కళాశాల. మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్రా విడిపోయినప్పుడు, విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో పెట్టాలన్న ఉద్దేశ్యంతో గిండీ ఇంజనీరింగు కాలేజీ నుండి దీనిని విడదీసేరు. మొదట్లో గిండీ లో ఉన్న ఆచార్యబృందాన్నే ఇక్కడికి బదిలీ చేసేరు. కాని వాల్తేరులో వనరులు లేక కాకినాడలో తాత్కాలికంగా పెట్టేరు. అది అలా అక్కడే 'ప్రభుత్వ ఇంజనీరింగు కళాశాల, కాకినాడ' (Government College of Engineering, Kakinada)అన్న పేరుతో స్థిరపడి పోయింది. తరువాత జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (Jawaharlal Nehru Technological University) స్థాపించిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఇంజనీరింగు కళాశాలలన్నిటిని ఈ కొత్త విశ్వవిద్యాలయానికి అనుబంధించేరు.
- ఐడియల్ కళాశాలలు(Ideal College)
- ఐడియల్ ఇంజినీరింగ్ కళాశాల
- ప్రగతి ఇంజనీరింగు కాలేజి
- ఆదిత్య ఇంజనీరింగు కాలేజి
- సాయి ఆదిత్య ఇంజనీరింగు కాలేజి
- శ్రీ ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల
- చైతన్య ఇంజనీరింగు కాలేజి
- రంగరాయ మెడికల్ కాలేజి
- ఆంధ్ర విశ్వవిద్యాలయం - స్నాతకోత్తర విద్యా కేంద్రం (Andhra University - Post-graduate Extension Center)
- ఎమ్ ఎస్ ఎన్ చారిటీస్
- శ్రీ రామక్రిష్ణా పబ్లిక్ స్కూల్
- ఆశ్రమ్ పబ్లిక్ స్కూల్
- కాకినాడ పబ్లిక్ స్కూల్,వలసపాకల
- Gandhi Centinary School
- MSN English Medium School (Nehru Convent)
- Seahorse Academy of Merchant Navy
- Rajiv Gandhi Institute of Management and Science
- ST.Joseph's Convent School
[మార్చు] నగరం లో షాపింగ్
కాకినాడ నగరం ఈ మధ్య కాలం లో అత్యంత వేగవంతం గా వృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటి.పెరుగుతున్న జనాభా తో పాటు పెరుగుతున్న అవసరాలకు అణుగుణం గా నగరంలో పలు షాపింగ్ మాల్స్ వెలిశాయి.ప్రముఖం గా చందన బ్రదర్స్ ఎప్పటి నుంచో నగర వాసులకు వస్త్ర రంగం లొ తమ సేవలను అందజేస్తుండగా ఆపైన సరికొత్తగా స్పెన్సర్స్ వెలసింది. ఆంధ్ర ప్రదేశ్ లో హైదరాబాదు, విశాఖపట్టణం, విజయవాడ నగరాల తరువాత కాకినాడ లొనే ఇది ఉన్నది. అలాగే విజయవాడ వారి ఎం అండ్ ఎం మరొకటి ఇది స్దాపింఛి రెండేళ్ళు కావస్తోంది.అలగే నగరం లోని రాజు భవన్, ఇంకా సోనా షాపింగ్ మాల్స్ నగర వాసులకు సేవలను అందజేస్తున్నాయి.ఇంకా మరెన్నో యూనివెర్ సెల్ మొబైల్స్,ది మొబైల్ స్టొర్,బిగ్ సి వంటి ప్రముఖ మొబైల్ షాపులు మొబైల్ వినియొగదారులకు తమ తమ సేవలను అందజేస్తున్నాయి.బంగారు నగల కొరకు దక్షిణ భారత దేశం లోనే ప్రఖ్యాతి గాంఛిన ఖజానా జ్యువెల్లరి కాకినాడ లో వెలసి తమ సేవలను అందిస్తుండగా టాటా వారి గోల్డ్ ప్లస్, చందన జ్యువెల్లరిస్, రాజ్ జ్యువెల్లరి మాల్ ఇంకా స్దానికం గా ఉన్న మరెన్నొ నగల దుకాణాలు నగర వాసుల అవసరాలను తీరుస్తున్నాయి.నగర ప్రజల ను ఎక్కువగా స్దానికం గా ఉన్న హొల్ సేల్ షాపులు వారి తక్కువ ధరలతో ఆకర్షిస్తూ ఉంటాయి.ఇక నగరం లో కట్టుబాటులను గురించి వారి వస్త్రధారణ గురించి చెప్పుకుంటే మగవారు ఎక్కువగా ఇంటిలో ఉన్నప్పుడు లుంగీ లను కట్టుకుంటారు. ఆడవారు నైటీలను, కాటన్ చీరలను, పంజాబి దుస్తులను ధరిస్తూ ఉంటారు.
[మార్చు] ఇవి కూడా చూడండి
[మార్చు] బయటి లింకులు
|
|||||||