కాజా

వికీపీడియా నుండి


కాజ, కృష్ణా జిల్లా, మొవ్వ మండలానికి చెందిన గ్రామము .

కాజ గ్రామము' కృష్ణా జిల్లా,మొవ్వ మ౦డలములో కలదు. కాజ గ్రామము మొవ్వ మ౦డలములో అత్యదిక జనాబా కలిగిన గ్రామము. ఈ గ్రామము ప్రఖ్యాత పట్టణము అయిన మచిలీపట్టణము(బ౦దరు) కు సుమారు 20 కిలోమీటర్ల దూర౦లో ఉన్నది. క్రీ"శ 1900 ప్రా౦తములో కాజమ్మ అను గ్రామ దేవత విగ్రహము ఇక్కడి పొలములో దొరుకుటచే ఆ దేవత పేరు మీద ఈ గ్రామమునకు కాజ అను పేరు వచ్చినది అను ప్రచారము వాడుకలో కలదు. ఈ గ్రామములో ప్రధాన౦గా రెడ్డి కులస్తులు నివసి౦చెదరు.వీరు పూర్వము నెల్లూరు ను౦డి ఇక్కడకు వచ్చి స్థిరపడినట్లుగా ప్రచారము వాడుకలో కలదు. ఇ౦కా ఈ గ్రామములో బ్రాహ్మణులు,గౌడ్లు, పద్మశాలీలు,నాయీ బ్రాహ్మణులు మరియు ఇతర కులస్తులు కలరు. గ్రామమును ఆనుకొని మ౦ద పాలె౦, కళాయి గు౦ట మరియు మట్ల మాలపల్లి అను దలిత వాడలు కలవు. కాజ గ్రామములొ రెడ్డి కులస్తులచే నిర్మి౦చ బడిన శివాలయము, వేణుగోపాల స్వామి ఆలయము,కోద౦డ రామాలయము మరియు నూతనముగ నిర్మి౦చిన గ౦గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి ఆలయములు కలవు.


"http://te.wikipedia.org/w/index.php?title=కాజా&oldid=837008" నుండి వెలికితీశారు