కాప్రిక్ ఆమ్లం
మూస:Chembox IUPACNameమూస:Chembox PubChemమూస:Chembox DrugBankమూస:Chembox KEGGమూస:Chembox ChEBIమూస:Chembox BoilingPtమూస:Chembox ExternalMSDSమూస:Chembox MainHazardsమూస:Chembox OtherFunctn
| కాప్రిక్ ఆమ్లం (Decanoic acid) | |
|---|---|
| ఇతర పేర్లు | Capric acid[1] n-Capric acid n-Decanoic acid Decylic acid n-Decylic acid C10:0 (Lipid numbers) |
| Identifiers | |
| CAS number | [334-48-5] |
| SMILES | O=C(O)CCCCCCCCC |
| InChI | 1/C10H20O2/c1-2-3-4-5-6-7-8-9-10(11)12/h2-9H2,1H3,(H,11,12) |
| రసాయన ధర్మాలు | |
| Molecular formula | C10H20O2 |
| Molar mass | 172.26 g/mol |
| స్వరూపం | White crystals with strong smell |
| సాంద్రత | 0.893 g/cm3, ? |
| ద్రవీభవణ స్థానం |
31.6 °C (304.8 K) [2] |
| నీటిలో ద్రావణీయత | immiscible |
| ప్రమాదాలు | |
| R-phrases | మూస:R36 మూస:R38 |
| S-phrases | మూస:S24 మూస:S25 S26 మూస:S36 మూస:S37 మూస:S39 |
| సంబంధిత రసాయనాలు | |
| సంబందిత రసాయనాలు | Decanol Decanal |
| మూస:Chembox verificationExcept where noted otherwise, data are given for materials in their standard state (at 25 °C, 100 kPa) | |
| Infobox references | |
కాప్రిక్ ఆమ్లం (Decanoic acid, or capric acid) ఒక సంతృప్త కొవ్వు ఆమ్లం. దీని రసాయన ఫార్ములా : CH3(CH2)8COOH. ఈ ఆమ్లపు లవణాలు మరియు ఎస్టర్లను డెకనేట్లు (decanoates) అంటారు. కాప్రిక్ అనే పదం లాటిన్ లో మేక అర్ధాన్నిస్తుంది. వీనికి మేకపాల వాసన మూలంగా ఈ పేరు వచ్చింది.[3]
కాప్రిక్ ఆమ్లం కొబ్బరి నూనె మరియు పామ్ కెర్నెల్ నూనె మరియు వివిధ జంతువుల పాలలో ఉంటుంది.[2]
దీనిని పెర్ఫ్యూమ్స్, కందెన, రబ్బరు, రంజకాలు, ప్లాస్టిక్, మందులు మొదలైన వాటి తయారీలో ఉపయోగిస్తారు.[4]
మేక పేరున్న రెండు ఇతరఆమ్లాలు: కాప్రోయిక్ ఆమ్లం మరియు కాప్రిలిక్ ఆమ్లం. ఈమూడు కొవ్వు ఆమ్లాలు కలిపి మేకపాలలో 15 శాతంవరకు ఉంటాయి.
విషయ సూచిక |
కాప్రిక్ ఆమ్లం [మార్చు]
కాప్రిక్ ఆమ్లం సంతృప్త కొవ్వు ఆమ్లం. 10 కార్బనులున్న ద్విబంధాలులేని, మధ్యస్తపొడవైన హైడ్రొకార్బను శృంఖలమువున్న మోనోకార్బక్షిలిక్ ఆమ్లం. కొన్నిజంతు పాలకొవ్వులలో,మరియు శాకగింజల నూనెలలో కాప్రిక్ ఆమ్లం కన్పించును. మొక్కలు పెరుగుతున్నప్పుడు, కణనిర్మాణ సమయంలో మరియు ఎదుగుదలకు అవసరమైన శక్తిని అందించుటకు కొవ్వు ఆమ్లాలు తొడ్పడుతాయి. మొక్క ఎదుగుదల సమయంలో కాప్రిక్ అమ్లం అవసరంఅంతగా లేదో, లేక ఎదుగుదల సమయంలో మొక్కలు లిపొసెస్ వలన గ్లైకొల్ నుండి కాప్రిక్ ఆమ్లంను తయారుచేసుకుంటాయా? అన్నది ఇంకను నిర్ధారణ కాలేదు. కొవ్వుల నుండి వేరుచేసిన కాప్రిక్ ఆమ్లం తెల్లని స్పటికరూపంలో ఘనరూపంలో వుండును. 400C మించి వేడిచేసిన పారదర్శకంగా మారును. అల్కహల్, ఈథరు, బెంజెన్, క్లొరోఫారం మరియు ఇతర హైడ్రొకార్బను ద్రావణులలో కరుగును.
లభ్యం [మార్చు]
ఆవు, మేక పాలకొవ్వులలో, కొబ్బరినూనె, మరియు పామ్ కెర్నల్ నూనెలలో లభించును. ఇతర నూనెలలో అంతగా కన్పించదు.
భౌతిక రసాయనిక ధర్మాలు [మార్చు]
కాప్రిక్ ఆమ్లం భౌతిక రసాయనిక ధర్మాల పట్టిక
| భౌతిక,రసాయనిక దర్మం | విలువల మితి |
| అణుఫార్ములా | CH3(CH2)8COOH |
| అణుభారం | 172.27 గ్రాం.మోల్. |
| సాంద్రత (350C | 0.8884 |
| వక్రీభవన సూచిక(400C) | 1.4288 |
| ద్రవీభవన ఉష్ణోగ్రత | 320C |
| మరుగు ఉష్ణోగ్రత | 2700C( at760mm/Hg Pr.) |
| మరుగు ఉష్ణోగ్రత | 1520C(at 10mm/Hg Pr.) |
| స్నిగ్థత mPa.s(700C) | 2.88 |
| విశిష్ణ ఉష్ణోగ్రత (35/650ఛ్) | 2.09 |
| వెలుగుఉష్ణోగ్రత(Flash point) | >1000C |
| వెపరుసాంద్రత | 5.9(గాలి=1) |
ఉత్పత్తి [మార్చు]
- కాప్రిక్ ఆమ్లం ఒకకార్బొక్షిలిక్ కొవ్వుఆమ్లం. అల్డిహైడులను ఆక్సికరణ (oxidation)చేయడం వలన కార్బొక్షిలిక్ ఆమ్లాలను ఉత్పత్తి చెయ్యవచ్చును. అల్డిహైడులు (aldehyde), ప్రైమరి అల్కహల్‌లను ఆక్సికరించడం ద్వారా ఎర్పడును. ప్రైమరి ఆల్కహలులు ప్రైమరి కార్బనుకు ఒకహైడ్రొక్సిల్ (Hydroxyl) రాడికల్‌కు అనుసంధానించడం వలన ఎర్పడును. ఉదాహరణకు ఇథనొల్, బుటనొల్‌లు. కాప్రిక్ ఆమ్లంను అసిటొన్ ద్రావణంలో, క్రొమియం ట్రైఅక్సైడ్ (chromium trioxide (CrO3)ను ఆక్సిడెంట్ గా వినియోగించి డెకనొల్ (Decanol) అల్కహల్‌ను అక్సికరణనొందించడం వలన కాప్రిక్ ఆమ్లం ఎర్పడును. ఇలా ఎర్పడిన కాప్రిక్ ఆమ్లం92-94% శుద్ధత కలిగివుండును.
- కాప్రిక్ ఆమ్లంను కలిగివున్న కొవ్వుల కొవ్వుఆమ్లాలను పాక్షిక/అంశీకణ స్వేదనం చెయ్యడం వలన కాప్రిక్ ఆమ్లంను ఉత్పత్తి చెయ్యవచ్చును.
ఉపయోగాలు [మార్చు]
- కాప్రిక్ ఆమ్లం మితమైన పొడవువున్న హైడ్రొకార్బను గొలుసును కలిగివుండటం వలన, జీర్ణ వ్యవస్దలో త్వరగా విఛ్చిన్నం చెందును. అందుచే త్వరగా శోషింపబడును.
- కాప్రిక్ ఆమ్లం యాంటి వైరల్, యాంటి మైక్రిబైయల్ గుణాలు కల్గివున్నది. కాప్రిక్ ఆమ్లం దేహంలో మోనొకాప్రిక్‌గా మారును. మోనొకాప్రిక్ దేహంలో వైరస్, బాక్టిరియా, యీస్ట్ కాన్డిడా అల్‌బికస్‌ను నియంత్రించును.
- '1998 అమెరికన్ జొర్నల్ ఆఫ్ క్లినిక్ న్యూట్రిసన్' పరిశోధన సమాచారం ప్రకారం కాప్రిక్ ఆమ్లం అధికసాంద్రత లిపోప్రోటిన్సు (high density lipo proteins)(cholesterol) పెరుగుదలకు తొడ్పడును.
- కాప్రిక్ ఆమ్లంకు రక్తంలోని ఇన్సులిన్‌ను అదుపులో వుంచును.
- కాప్రిక్ అమ్లంను ఇంకను గ్రీజులు, కందెనలు, ప్లాస్టికులు, రబ్బరులు, పరిమళ ద్రవ్యాల తయారిలోకూడా వినియోగిస్తారు.
మూలాలు [మార్చు]
- ↑ http://www.sigmaaldrich.com/catalog/ProductDetail.do?N4=W236403%7CALDRICH&N5=Product%20No.%7CBRAND_KEY&F=SPEC
- ↑ 2.0 2.1 (2001) "Lexicon of lipid nutrition (IUPAC Technical Report)". Pure and Applied Chemistry 73 (4): 685–744. DOI:10.1351/pac200173040685.
- ↑ http://www.wordinfo.info/words/index/info/view_unit/371
- ↑ http://www.chemicalland21.com/industrialchem/organic/CAPRIC%20ACID.htm
|
|||||