కామంచి
వికీపీడియా నుండి
| కామంచి | |
|---|---|
| Scientific classification | |
| Kingdom: | ప్లాంటే |
| Division: | మాగ్నోలియోఫైటా |
| Class: | మాగ్నోలియోప్సిడా |
| Order: | సొలనేలిస్ |
| Family: | సొలనేసి |
| Genus: | సొలానమ్ |
| Species: | సొ. నైగ్రమ్ |
| Binomial name | |
| సొలానమ్ నైగ్రమ్ లిన్నేయస్ |
|
| ఉపజాతులు | |
|
S. nigrum subsp. nigrum |
|
కామంచి (ఆంగ్లం: Black Nightshade) ఒక విధమైన చిన్న మందు మొక్క. దీని శాస్త్రీయనామం సొలానమ్ నైగ్రమ్ (Solanum nigrum). ఇది సొలనేసి కుటుంబంలో సొలానమ్ ప్రజాతికి చెందినది.
విషయ సూచిక |
ప్రాంతీయ నామాలు [మార్చు]
- ఆంగ్లం : Black Night shade
- హిందీ : మకోయి, గుర్కమ్మాయి
- కన్నడ : కాకరుండి
- మలయాళం : మనట్టక్కళి, కరింతకళి
- తమిళం : మనట్టక్కళి, మిలగుటక్కళి
లక్షణాలు [మార్చు]
- ఇది నిటారుగా పెరిగే చిన్న పొద.
- తీవ్రాగ్రంతో ఇంచుమించు అండాకారంలో ఉన్న సరళ పత్రాలు కలిగివుంటాయి.
- గ్రీవేతరంగా ఏర్పడిన నిశ్చిత గుచ్ఛంలో అమరి ఉన్న తెలుపు రంగు పుష్పాలు పూస్తాయి.
- వలయాకారంలో ఉన్న నలుపు రంగు మృదు ఫలాలు కాస్తాయి.
ఉపయోగాలు [మార్చు]
ఈ మొక్క యావత్తు వివిధ ఔషధ ప్రయోగాలున్నాయి.[1]
- ఇది యాంటీసెప్టిక్ గా ఉపయోగపడుతుంది
- ఇది శోధ, దగ్గు, జ్వరం, ఆస్తమా నివారణకు దివ్యౌషధం.
- విరేచనకారిగాను, జీర్ణకారిగాను పనిచేస్తుంది.
- కీళ్లనొప్పులు, బ్రాంకైటిస్, అల్సర్లు, అజీర్తి, నిస్సత్తువ వంటి లక్షణాలను అరికడుతుంది.
- మూత్రం సాఫీగా జారీ అయ్యేలా ఉపయోగపడుతుంది.
- ఈ మొక్క భాగాలను నీళ్లలో కాచి వడపోసి డికాక్షన్ తాగితే గుండె జబ్బుల్లో బాగా పనిచేస్తుంది. రక్తపోటును క్రమబద్దీకరిస్తుంది.
మూలాలు [మార్చు]
- ↑ కామంచి, ముఖ్యమైన ఔషధ మొక్కలు - సాగు పద్ధతులు, ఆంధ్రప్రదేశ్ ఔషధ సుగంధ మొక్కల బోర్డు, హైదరాబాద్, పేజీలు: 95-98.