కామాఖ్య దేవాలయము

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

Coordinates: 26°09′59″N 91°42′21″E / 26.1662763°N 91.7057776°E / 26.1662763; 91.7057776

కామాఖ్య దేవాలయము
Kamakhaya Temple, Guwahati
పేరు
నామము: కామాఖ్య దేవాలయము
స్థానము
ప్రదేశము: Nilachal Hill, near గౌహది, అసోం
నిర్మాణశైలి మరియు సంస్కృతి
ప్రధానదైవం: కామాఖ్య
చరిత్ర
కట్టిన తేదీ:
(ప్రస్తుత నిర్మాణము)
1565
నిర్మాత: Chilarai

కామాఖ్య దేవాలయము (ఆంగ్లం: Kamakhya Temple) భారతదేశంలోని అస్సాం నందలి గౌహతి నగర పశ్చిమ భాగంలోని నీలాచల్ కొండల యందు గల ఒక శక్తి ఆలయము. దశ మహావిద్య అనే భువనేశ్వరి , బగలాముఖి , చిన్నమస్తా , త్రిపురసుందరి మరియు తార అనే అమ్మవారి వివిధ రూపాలకు అంకితమైన వివిధ దేవాలయాల సముహములోని ఒక ముఖ్యమైన ఆలయము. సాధారణ హిందువులకు మరియు తాంత్రిక భక్తులకు ఇది ఒక ముఖ్యమైన యాత్రాస్థలము.

వర్ణన[మార్చు]

ప్రస్తుత దేవాలయ రూపము 1565లో కోచ్ రాజవంశమునకు చెందిన చిలరాయ్ చే మధ్యయుగ దేవాలయాల తరహాలో నిర్మించబడినది.[1] అంతకుముందు గల నిర్మాణము కాలా పహార్ అనే అజ్ఞాత వ్యక్తిచే నాశనము చేయబడినది. ప్రస్తుత నిర్మాణము తేనెపట్టులాంటి శిఖరముతో అద్భుతమైన శిల్ప శ్రేణులు మరియు వెలుపలివైపు వినాయకుడు మరియు హిందూ దేవుళ్ళు మరియు దేవతల చిత్రాలను కలిగి ఉంది.[2] ఈ దేవాలయము మూడు పెద్ద మండపాలను కలిగి ఉంది. పశ్చిమ మండపం చాలా పెద్దది మరియు దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది మరియు సాధారణ యాత్రికులు తమ పూజ కొరకు దీనిని ఉపయోగించరు. మధ్య మండపం చతురస్రాకారంలో ఉండి, తరువాతి కాలంలో ప్రతిష్టించబడిన అమ్మవారి చిన్న ప్రతిమను కలిగి ఉంది. ఈ మండప గోడలపై నరనారాయణుని చిత్రములు, దానికి సంబంధిత గాథలు మరియు ఇతర దేవుళ్ళ చిత్రాలు చెక్కబడి ఉన్నవి.[3] మధ్య మండపము గుహ రూపంలో ఉన్న దేవాలయము యొక్క పవిత్ర స్థలము నకు దారి తీస్తుంది. అక్కడ ఏవిధమైన రూపము ఉండదు. కానీ సహజంగా భూగర్భంలో ఏర్పడిన నీటి బుగ్గలోని నీరు యోని ఆకారము గల గండశిల పగులులోంచి ప్రవహిస్తూ ఉంటుంది. ప్రతి వేసవిలో అంబువాసి పండుగ సందర్భంగా కామాఖ్య దేవత యొక్క రసజ్వల ఉత్సవాలు నిర్వహింపబడతాయి. ఈ సమయంలో గర్భగుడి నుండి ప్రవహించే నీరు ఎర్రగా ఐరన్ ఆక్సైడ్ వలె రుతుస్రావము వలె కనబడుతుంది.

ఇది పురాతన ఖాసి బలి ఇచ్చే స్థలం వలె ఉండేది మరియు ఇక్కడ పూజలు ఇంకా బలులను కూడా కలిగి ఉన్నాయి. ఉపాసకులు ప్రతి ఉదయము అమ్మవారికి అర్పించటానికి మేకలను వెంటపెట్టుకొని వస్తారు.[4]

ప్రాచీన సంస్కృత సాహిత్యానికి చెందిన కాళికా పురాణం కామాఖ్య దేవిని కోరికలను తీర్చే దానిగా, శివుని చిన్న భార్యగా మరియు ముక్తిని ప్రసాదించే దానిగా వర్ణించింది. శక్తియే కామాఖ్యగా పిలవబడుతోంది.

పూజ[మార్చు]

అస్సాం నందలి ఆర్యుల అనార్యుల "నమ్మకాలు ఆచారాల దాడికి" చిహ్నముగా అస్సాం నందలి కామాఖ్య ఆలయము నిలుస్తుంది.[5] ఈ దేవతకు సంబంధించిన వివిధ రకాల పేర్లలో స్థానిక ఆర్యుల మరియు అనార్యుల దేవతల పేర్లు ఉన్నాయి (కాకతి 1989, పేజి38).[6] యోగిని తంత్రము చెప్పిన ప్రకారము యోగిని తండ్రి యొక్క మతము కిరాత జాతి మూలాలను కలిగి ఉంది.[7] బణికాంత కాకతి ప్రకారము, అక్కడ నరనారాయణ చేత ఏర్పాటు చేయబడిన పూజరులయిన గారోలు ఒక మాట్రిలినియాల్ ప్రజలలో కామాఖ్య ఆలయ స్థలంలో పందులను బలి ఇచ్చే పూజా సంప్రదాయం కలదు (కాకతి 1989, p37).

అక్కడ దేవతను వామాచారము (ఎడమ చేతి వాటము) దానితో పాటు దక్షిణాచారము (కుడి చేతి వాటము) అనే రెండు పూజా పద్ధతులలో పూజలను నిర్వహిస్తారు (కాకతి, 1989 p45). సాధారణంగా దేవతలను పుష్పాలతో అర్చిస్తారు, కానీ ఇక్కడ జంతుబలులు కూడా కలిగి ఉన్నాయి. సాధారణంగా ఆడ జంతువులను బలుల నుండి మినహాయిస్తారు, ఈ నియమం సామూహిక బలుల సందర్భంలో సడలించబడింది (కాకతి 1989, p65).[8]

పురాణాలు[మార్చు]

కాళికా పురాణం ప్రకారం, ఈ ఆలయం శివుని కోసం సతీదేవి తన సొగసును అర్పించిన రహస్య ఏకాంత ప్రదేశాన్ని సూచిస్తుంది, మరియు ఈ స్థలం, శివుడు సతీదేవి శవంతో నృత్యం చేస్తున్నప్పుడు, ఆమె యోని పడిపోయిన స్థలం కూడా.[9] 108 స్థలాలలో సతీదేవి శరీరానికి అనుబంధము ఉందని పేర్కొన్న దేవీ భాగవతం దీనిని ధృవపరచుట లేదు, ఐతే కామాఖ్య ఆలయం అనుబంధ జాబితా లో పేర్కొనబడినది.[10] తరువాతి కథనం యోగిని తంత్రము , కాళికా పురాణము నందలి కామాఖ్య మూలాలను పట్టించుకోలేదు మరియు కామాఖ్య దేవిని కాళికా అమ్మవారితో పోల్చింది, మరియు యోని భాగాన్ని సృజనాత్మక చిహ్నంగా నొక్కి చెప్పింది.[11]

అహోం శకంలో కామాఖ్య[మార్చు]

ఒక పురాణం ప్రకారం కోచ్ బీహార్ రాజ కుటుంబాన్ని దేవి తనకు తాను ఆలయంలో పూజలు చేయకుండా నిషేధించింది. ఈ శాప భయంచేత ఈ వంశస్థులు ఈ రోజుకి కూడా ఆ దారివెంట వెళుతూ ఉన్నప్పుడైనా కనీసం కామాఖ్య పర్వతాన్ని చూడడానికి కుడా ధైర్యం చేయరు.

కోచ్ రాజ కుటుంబము మద్దతు లేకపోవడంతో ఆలయము చాల కష్టాలు ఎదుర్కొంది. 1658 చివరి నాటికి అహోంలు జయధ్వజ సింహ రాజు నేతృత్వంలో అస్సాం క్రింది భాగాన్ని జయించారు, మరియు ఆలయంపై వారికి అభిరుచి పెరిగింది. దశాబ్దాల పాటు అహోం రాజులు శైవితి లేదా శాక్తల ఉపాసకులుగా ఉంటూ, ఆలయ పునర్నిర్మాణము, నూతన నిర్మాణములు చేసి ఆలయానికి మద్దతును కొనసాగించారు.

రుద్ర సింహుడు (కాలము 1696 నుండి 1714) ఒక హిందూ మత ఉపాసకుడు. అతను ముసలివాడైన తరువాత ఆచారం ప్రకారం హిందూ మతాన్ని స్వీకరించి, సనాతన హిందువుగా మారి, గురువును ఆశ్రయించాడు. అతను రాజుకు మంత్రాలను నేర్పి రాజుకు ఆధ్యాత్మిక మార్గదర్శి అయ్యాడు. కానీ, తన పాలనలో ఉన్న ఒక బ్రాహ్మణుని యందు అణుకువ కలిగి ఉండటం అనే ఆలోచనను భరించలేకపోయాడు. అందుచేత అతను రాయబారులను బెంగాల్ కు పంపి, నాడియా జిల్లాలోని శాంతిపూర్ దగ్గరగల మలిపోతలో నివసించుచున్న శక్త శాఖకు చెందిన ప్రముఖ మహంత్ అయిన కృష్ణారామ్ భట్టాచార్యను రమ్మని ఆజ్ఞాపించాడు. మహంత్ రావటానికి ఇష్టపడలేదు కానీ, కామాఖ్య ఆలయ రక్షక బాధ్యతలు ఇస్తామని హామీ ఇవ్వటంతో ఒప్పుకున్నాడు. రాజు తను శరణు కోరనప్పటికీ, తన కుమారులను తన సహచర వర్గంలోని బ్రాహ్మణులను అతనిని ఆధ్యాత్మిక గురువుగా అంగీకరించమని ఆజ్ఞాపించుట ద్వారా మహంత్ ను సంతృప్తిపరచాడు.

రుద్ర సింహుని మరణాంతరము అతని పెద్ద కొడుకు శిబ సింహుడు (కాలము 1714 నుండి 1744), రాజు అయ్యి కామాఖ్య ఆలయ నిర్వహణను మరియు దానికి గల ఎన్నో ఎకరాల భూమిని (దైవదత్త భూమి) మహంత్ కృష్ణారామ్ భట్టాచార్యకు అప్పగించాడు. మహంత్ మరియు అతని వారసులు నీలాచల కొండలపైన నివసించుచున్నందున, పర్వతీయ గోసైనులుగా పిలవబడ్డారు. చాలామంది కామాఖ్య పూజారులు మరియు అస్సాంకు చెందిన ఆధునిక శక్తలు, పర్వతీయ గోసైనుల శిష్యులు లేదా వంశస్తులు లేదా నాతి మరియు నా గోసైనులై ఉన్నారు.[12]

పండుగలు[మార్చు]

తాంత్రిక పూజలకు కేంద్రమైన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరము నిర్వహించే అంబుబాచి మేళ పండుగ, వేలమంది తాంత్రిక ఉపాసకులను ఆకర్షించుచున్నది. మరొక వార్షికోత్సవముమానస పూజ . ఆకురాలుకాలంలో వచ్చే నవరాత్రి సమయంలో దుర్గా పూజను కూడా కామాఖ్య ఆలయంలో వార్షికంగా నిర్వహిస్తుంటారు. ఈ ఐదురోజుల పండుగ వేలకొలది సందర్శకులను ఆకర్షిస్తోంది.[13]

గమనికలు[మార్చు]

 1. సర్కార్ 1992 p16. విశ్వ సింహ కామాఖ్య ఆలయంలో పూజలను పునః ప్రారంభించాడు అని చెప్పబడుచున్నది. విశ్వసింహ కుమారుడు చిలరాయ్ కోచ్ బీహార్ రాజు నరనారాయణ కాలంలో ఆలయాన్ని 1565లో నిర్మించాడు.
 2. "Kamakhya temple". Archived from the original on 2006-03-18. సంగ్రహించిన తేదీ 2006-09-12. 
 3. "Kamakhya". సంగ్రహించిన తేదీ 2006-09-12. 
 4. "Kamakhya temple". సంగ్రహించిన తేదీ 2006-09-12. 
 5. పబ్లిషర్స్ సూచన లో సతీష్ భట్టాచార్య, కాకతి 1989.
 6. కాకతి suspects that of కామాఖ్య యొక్క కామా ఆర్యన్ సంతతికి చెందని వాడని కాకతి అనుమానించాడు, మరియు నైవేద్యరూపములకు సంబంధించి వివరణలు ఇచ్చాడు: కమోయి , కమోయిట్ , కామిన్ , కామత్ మొదలైనవి.
 7. కాకతి 1989, p9: యోగిని తంత్ర (2/9/13) సిద్దేసి యోగిని పితే ధర్మః కైరతజః మతః .
 8. కాళికా పురాణం మరియు యోగిని తంత్రము లలో పేర్కొనబడిన బలికి అర్హమైన జంతువులు ఆ ప్రాంతంలోని వివిధ గిరిజన సమూహాలకు చెందిన బలి ఇచ్చే జంతువులుగా కాకతి పేర్కొన్నాడు.
 9. కాకతి 1989, p34
 10. కాకతి, 1989, p42
 11. కాకతి , 1989 p35
 12. గైట్,ఎడ్వర్డ్ అస్సాం చరిత్ర , 1905, pp172-173
 13. "Kamakhya Temple". సంగ్రహించిన తేదీ 2006-09-12. 

సూచనలు[మార్చు]

 • కాకతి, బణికాంత (1989) ది మదర్ గాడెస్ కామాఖ్య , పబ్లికేషన్ బోర్డు, గౌహతి
 • సర్కార్, J. N. (1992) చాప్టర్ I: ది సోర్సెస్ ఇన్ ది కంప్రేహెన్సివ్ హిస్టరీ ఆఫ్ అస్సాం, (ed H K బర్పుజారి) పబ్లికేషన్ బోర్డు, అస్సాం.
 • గైట్, ఎడ్వర్డ్ (1905) ఎ హిస్టరీ ఆఫ్ అస్సాం

బాహ్య లింకులు[మార్చు]

మూస:Hindu Temples in Assam