కార్టూనిస్ట్ టీవీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టీవీ పొలిటికల్ కార్టూనిస్ట్

టీవీ అసలు పీరు టి.వెంకట్రావు. ఇతడు రాజకీయ కార్టూనిస్ట్. అంటీ రాజకీయాల పై చిత్రించే వ్యంగ్య చిత్ర కారుడు. 1961 సం. నుండి ఈయన విశాలాంధ్ర దినపత్రిక లో కార్టూన్లు గీస్తున్నారు. అంటే గత 50 సంవత్సరాలుగ కార్టూనిస్టుగ పనిచేస్తున్నారు. . ఈయన 2003 సంవత్సరములో ఐక్య రాజ్య సమితి నుంచి ఆనరబుల్ మెన్షన్ అవార్డును అందుకున్నారు. 2004 కు గాను బెస్ట్ కార్టూనిస్టు అవార్డును ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి అందుకున్నారు. 2007లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయరచయితల సంఘం, గుంటూరు జిలాశాఖ వారిచే అమరజీవి పులుపుల వెంకటశివయ్య సాహితీ సత్కారం[1]స్వీకరించారు.

జీవిత విశేషాలు[మార్చు]

వీరు 1944, ఫిబ్రవరి 2వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరులో అప్పాయమ్మ, రాములు దంపతులకు జన్మించారు. బి.ఎ.ఫైన్ ఆర్ట్స్ చదివారు. కార్టూనిస్ట్‌గా, పెయింటింగ్ టీచర్‌గా వృత్తిని స్వీకరించారు. చిత్రసూత్ర కరెస్పాండెన్స్ స్కూల్‌ను స్థాపించి 1500మందికి పైగా చిత్రకారులను తయారుచేశారు.[2]

గ్రంథాలు[మార్చు]

వీరు ఈ క్రింది చిత్రకళాగ్రంథాలను ప్రచురించారు.

  1. టి.వి.రాజకీయ కార్టూన్లు
  2. చిత్రకళ చరిత్ర
  3. డ్రాయింగ్ నేర్చుకోండి
  4. పెయింటింగ్ నేర్చుకోండి
  5. కార్టూన్లు నేర్చుకోండి

మూలాలు[మార్చు]

  1. పెనుగొండ లక్ష్మీనారాయణ (1 January 2020). గుంటూరు సీమ సాహిత్య చరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం. pp. 282–283.
  2. ఆంధ్రకళాదర్శిని - కళాసాగర్ - పేజీ:38