కార్తిక్ (గాయకుడు)
కార్తీక్ (పుట్టిన రోజు 7 నవంబర్ 1980, చెన్నై, తమిళనాడు) భారతీయ చిత్ర నేపథ్యగాయకుడు.
కార్తీక్ గాయకుడి గా తన ప్రస్థానాన్ని బ్యాకింగ్ వోకాలిస్ట్ గా మొదలుపెట్టి అతి తక్కువ కాలం లోనే తెలుగు, తమిళ చిత్రసీమలో ముఖ్యమైన గాయకుడిగా ఎదిగాడు. ఇప్పటికి దాదాపు 1,000 పైగా పాటలను తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ మరియు హిందీ బాషలలో పాడారు. కార్తీక్ చిన్ననాటి నుంచే సంగీతం అంటే మక్కువ పెంచుకున్నాడు. స్కూల్ కి వెళ్ళే రోజుల్లో కర్ణాటక సంగీతం కొంత కాలం నేర్చుకున్నాడు. అతని 4 సంవత్సరాల వయస్సు లో మొదలు పెట్టి నేర్చుకుని, కొంత కాలం పాటు అపుచేసాడు. మళ్ళి 17 సంవత్సరాలప్పుడు తిరిగి మొదలుపెట్టాడు. కాలేజి చదివే రోజుల్లో స్నేహితులతో కలిసి ఒక మ్యూజిక్ గ్రూప్ లా ఏర్పడి అనేకమైన పోటీలలో పాల్గొన్నాడు. ప్రతి సంవత్సరం IIT మద్రాస్ లో జరిగే “సారంగ్” లో పాల్గొనే వాడు.
ఏ.ఆర్.రెహమాన్ కి వీరాభిమాని అయిన కార్తీక్, రెహమాన్ ని కలుసుకోవాలని, అతని దర్శకత్వం లో పాడాలని కలలు కన్నాడు. అతని కలలు నిజమయ్యే రోజు రానే వచ్చింది. కార్తీక్ ప్రాణ స్నేహితుడి అన్నయ్య, గాయకుడు శ్రీనివాస్ కలిసాడు. శ్రీనివాస్ ఏ.ఆర్.రెహమాన్ దగ్గర చాలా పాటలు పాడాడు. కార్తీక్ గురించి అతను ఒక సందర్బం లో చెప్పాడు. ఆ తరువాత దాదాపు ఒక సంవత్సరం తరువాత రెహమాన్ నుంచి పిలుపు వచ్చింది. రెహమాన్ ఓకే క్రొత్త గాత్రం కోసం ఎదురు చూస్తున్నపుడు కార్తీక్ లో టాలెంట్ గుర్తించి అతనికి “ పూకార్” అనే హిందీ సినిమా లో అవకాశం కల్పించాడు. దాదాపు ఒక సంవత్సరం తరువాత అతనికి సోలోగా పాడే అవకాసం వచ్చింది. “ఓన్ 2 కా 4” సినమా లో ఆలాపనా పాడే అవకాశం వచ్చింది. ఇక ఇక్కడి నుంచి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. అలా చాలా ప్రఖ్యాత సంగీత దర్శకులైన ఏ.ఆర్.రెహమాన్, ఇళయరాజా, విద్యాసాగర్, మణిశర్మ, దేవిశ్రీప్రసాద్, హరిస్ జై రాజ్, మిక్కీ జే మేయర్.. ఇలా చాలా మంది తో వారితో పనిచేసాడు
[మార్చు] కార్తీక్ పాడిన కొన్ని హిట్ సాంగ్స్
- నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి రా
- ఒక మారు కలిసిన బంధం
- అరరే అరరే మనసే జారే
- ఓ …మై ఫ్రెండ్…
- నిజంగా నేనేనా…
- ఉసురే పోయెను ఉసురే పోయెను…
కార్తీక్ గాయకుడు గానే కాకుండా సంగీత దర్శకుడి గా కూడా అవకాశం వచ్చింది. మొదట కోకా కోలా ప్రకటన కు చేసే అవకాశం వచ్చింది. అలా చాల ప్రకటనలకు సంగీతాన్ని అందించాడు.
అతను దర్శకత్వం వహించిన మొదటి సినిమా “అరవాన్” (ఇంకా రిలీజ్ కాలేదు).