కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి తెలుగు రచయిత, భాషా ప్రేమికుడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన విజయవాడ నింగినగర్ నివాసి. కాకినాడ పి.ఆర్.కళాశాలలో ఇంటర్ చదివారు. రైల్వేలో సూపరింటెండెంట్గా జూలై 1952 న విధుల్లో చేరి, విధులు నిర్వహించి డిసెంబరు 31 1985 న పదవీవిరమణ చేసారు.[1] ఆయనకు చిన్నప్పటి నుంచి తెలుగు భాష పట్ల మక్కువ ఎక్కువ. 80కి పైబడిన వయస్సులో కూడా ఆయన తన రచనా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. కథలు, నవలలు, వ్యాసాలు, ఆయన జీవితంలో మమేకం అయ్యాయి. చిన్నతనంలో తనకు తెలుగు పాఠం చెప్పిన గురువులను ప్రేరణగా తీసుకొని సాహిత్యంపై దృష్టి సారించారు. ఆలా మొదలైన శాస్త్రి గారి రచనలు అప్పటి నుండి కొనసాగాయి. దాదాపు 30 కి పైగా వ్యాసాలు, అనువాద నవలలు, లెక్కలేనన్ని వచన కవితలు, కవితా సంకలనాలు రచించారు. దాదాపు 50కి పైగా నాటికలకు దర్శకత్వం కూడా వహించారు. ఆంగ్లంలోనూ నైపుణ్యమున్న శాస్త్రి ఆ భాషలో వ్యాసాలు, రూపకాలు కవితలు, హాస్య ప్రహసనాలు రచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలోనూ ఆయన ముందున్నారు. 1989లో అమెరికా వెళ్ళిన ఆయన కంప్యూటరులో తెలుగు భాష వాడకం నేర్చుకున్నారు. ఆయన తమ్ముడు అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉండేవారు. అంతర్జాలం ఉపయోగించి తెలుగు రాయడం, రచనలను అందులో ఉంచడంపైన ఆయన పట్టు సాధించారు. దాదాపు 600కు పైగా వెబ్‌సైట్లలో ఆయన కథలు అందుబాటులో ఉన్నాయి.

వీరభద్రశాస్త్రి తన విజ్ఞానాన్ని పేదలకు పంచాలన్న తలంపుతో సత్యన్నారాయణపురంలోని వైస్‌మన్ క్లబ్ తరపున ఉచిత కంప్యూటర్ శిక్షణనిచ్చేవారు. ఆయన 1300 పైగా మహిళలకు కంఫ్యూటరులో శిక్షణనిచ్చారు. అంతేకాకుండా కుట్టుమిషన్ పైన పట్టు సాధించిన ఆయన ఎంతో మందికి ఉచితంగా శిక్షణనిచ్చారు.

రచనలు[మార్చు]

  • నింగి – నేల
  • వసంత హేల (గేయం)
  • వూహాతీతం (కవిత)
  • నాదొక కోరిక (స్కెచ్)
  • సూక్తి ముక్తావళి (పద్య కవిత)
  • గ్రీష్మ పుష్పవిలాసం
  • శ్రీ భద్రాచల సీతారామస్వామి సుప్రభాతం
  • ఇంకా చీకట్లో వున్నట్లే!!
  • అహం భవాస్మి
  • నేను తెలుగు వాడను
  • కుసుమాభ్యర్ధన
  • పాప!
  • ఒక్కసారి బ్రతికించు
  • సమాజమా? అదెక్కడవుంది?

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]

Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: