కాలబిలము

వికీపీడియా నుండి


పాలపుంత ముందు భాగాన కాలబిలము దృశ్యం. దీని ద్రవ్యరాశి 10 సౌరద్రవ్యరాసులతో సమానం. మరియు 600 కి.మీ. నుండి వీక్షించగలము. దీన్నుండి తటస్థంగా వుండగలగాలంటే, 400 మిలియన్ల g అవసరం. [1]

కాల రంధ్రం, కాలబిలం, కృష్ణ బిలం, కర్రి గుండం...ఇవన్నీ బ్లాక్ హోల్ (black hole) అనే ఇంగ్లీషు మాటకి సమానార్ధలకాలుగా తెలుగులో వాడుతున్నారు. ఈ పేరూ ఇంకా స్థిరపడ లేదు. దీనిని ఎవ్వరూ ఇంతవరకు చూడలేదు. దీని అస్థిత్వాన్ని సిద్ధాంత పరంగా ప్రతిపాదించేరు. ప్రత్యక్ష సాక్ష్యం లేక పోయినా ఈ సిద్ధాంతాలు నిజమే అని గట్టి నమ్మిక భౌతిక శాస్త్రవేత్తల్లో ఉంది.


విశ్వంలో అత్యధిక ద్రవ్యరాశి మరియు గురుత్వ బలం కలిగిన స్థానాలే కాలబిలాలు అని సిద్ధాంతం. వీటి ప్రబల శక్తి వలన ఈ కృష్ణ బిలాలలోకి ప్రవేశించిన ఒక వస్తువు కానీ, విద్యుదయస్కాకాంత కిరణాలు కానీ (ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్)(కాంతి కిరణాలతో సహా) వాటిని దాటుకుని బయటకు రాలేవు. అందువలన ఇవి విశ్వంలో నల్లని ప్రదేశాలుగా పేర్కొన బడుతున్నాయి. ఈ కృష్ణ బిలాల అధ్యయనం వలన సృష్టి ఆవిర్భావ రహస్యాలు తెలుస్తాయని శాస్త్రజ్ణులు భావిస్తున్నారు. మృత నక్షత్రాలు కృష్ణ బిలాలుగా మారతాయని ఒక సిద్ధాంతం ఉంది.[2][3][4]

కాలబిలాలు,క్రిష్ణ బిలాలు రెండూ విభిన్న ప్రక్రియలు.కాలబిలాలు కూడా క్రిష్ణ బిలాల లాగానే అత్యధిక గురుత్వాకర్షణ శక్తి వల్ల ఏర్పడతాయి.క్రిష్ణ బిలాల ఉనికికి సంభంధించి ఆధరాలు లభిన్చినప్పటికి, కాల బిలాల ఉనికి కి సంభంధించి ఆధరాలు లభించలేదు.

అత్యధిక గురుత్వాకర్షణ శక్తి వల్ల spacetime లో జరిగే మర్పుల వల్ల కాలబిలాలు ఏర్పడతాయి. ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధ్హాంతం ప్రకారం, spacetime ను గురుత్వాకర్షణ శక్తి వల్ల ఒక విధమైన సొట్ట (dent) ఏర్పడుతుంది. గురుత్వాకర్షణ శక్తి పేరిగె కొద్దీ ఇది ఒక మడత లాగ (fold) లాగ మారుతుంది.దీన్ని ఒక పలుచటి దుప్పటి లో బంతి లాగ అనుోవచ్చు.బంతి బరువు ఎక్కువైనప్పుడు ఎలాగైతే మడత ఏర్పడుతుందో అలాగన్నమాట. ఈ మడతల వల్ల ఇంత వరకు దూరంగా ఉన్న ప్రదేశాలు దగ్గర అవుతాయి.వీటినే కాలబిలాలు(Worm holes) అంటారు.

కాల బిలాల గుండా కాల ప్రయాణం సాధ్యమనే వాదన ఉంది.ఒక పురుగు ఆపిల్ పండు తొడెం నుంచి ఇంకో వైపుకు మధ్య లో నుంచి వెళ్ళినట్లన్నమాట.దీనిపై వాదనలు ఎలా ఉన్నప్పటికి science fiction లో మాత్రం బాగా ప్రాచుర్యం పందింది.


[మార్చు] మూలాలు


[మార్చు] వనరులు

[మార్చు] బయటి లింకులు







పేజీకి సంభందించిన లింకులు