కాలేయం
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
| కాలేయం | |
|---|---|
| గొర్రె కాలేయము: (1)కుడి తమ్మె, (2) ఎడమ తమ్మె, (3) కాడేట్ లోబ్, (4) క్వాడ్రేట్ లోబ్, (5) కాలేయ ధమని మరియు పోర్టల్ సిర, (6) కాలేయ లింఫు కణుపులు, (7) పిత్తాశయము. | |
| మానవ ఉదరములో కాలేయము (ఎరుపు రంగు) యొక్క స్థానము. | |
| గ్రే'స్ | subject #250 1188 |
| ధమని | కాలేయ ధమని |
| సిర | కాలేయ సిర, పోర్టల్ సిర |
| నాడి | సీలియాక్ గాంగ్లియా, వేగస్[1] |
| Precursor | foregut |
| MeSH | Liver |
కాలేయం మానవుని శరీరంలోని అతి పెద్ద గ్రంథి. ఇది ఉదరంలో ఉదరవితానానికి (డయాఫ్రమ) క్రిందగా కుడివైపున మధ్యలో ఉంటుంది. కాలేయము పైత్యరసాన్ని తయారుచేస్తుంది. అది పిత్తాశయంలో నిలువచేయబడి జీర్ణక్రియలో చాలా తోడ్పడుతుంది. పైత్యరసవాహిక ద్వారా పైత్యరసము, ఆంత్రమూలానికి చేరుతుంది.
కాలేయము, ఆంత్రమూలానికి కుడి పక్కన ఉదరవితానానికి దిగువగా ఉంటుంది. ఇది బూడిద రంగులో ఉంటుంది. కాలేయానికి నాలుగు తమ్మెలుంటాయి. దీనిలోని కణాలను కాలేయకణాలంటారు.
[మార్చు] ఒకేకాలేయం ఇద్దరికి
చెన్నై గ్లోబల్ ఆస్పత్రికి చెందిన కాలేయ సర్జన్ డా||మహ్మద్ రేలా 'స్ల్పిట్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్ర చికిత్సను మనదేశంలో తొలిసారిగా చేశారు.దాత నుండి కాలేయాన్ని సేకరించేటప్పుడే రెండు ముక్కలుగా విడదీసి, ఓ ముక్కను అరుదైన కాలేయ వ్యాధితో బాధ పడుతున్న బాలికకు, మరోముక్కను ప్రాణాంతక పరిస్థితుల్లో ఉన్న వృద్ధురాలికి అమర్చారు.
[మార్చు] పునరుత్పత్తి స్వభావం ఉన్న కాలేయం
పునరుత్పత్తి స్వభావం ఉన్న కాలేయాన్ని దానం చేయడం ఎంతో సులువు . అవయవంలో ఉండే ఎనిమిదింటిలో మూడు వరకు అరలు ఉన్నా అది సాధారణంగా పని చేస్తుంది. దీంతో ఇతరులకు కాలేయం అవసరమైనపుడు దాతలకు చెందిన కాలేయంలో కొంత భాగాన్ని బాధితులకు అమర్చవచ్చు. రెండు నెలల్లో దాత కాలేయం పెరిగి సాధారణ స్థాయికి చేరుతుంది.కాలేయ మార్పిడికి హైదరాబాద్‌లో రూ.18-20 లక్షల వరకు ఖర్చవగా... ఇతర దేశాల్లో ఆ మొత్తం రూ.1.50 కోట్ల వరకు ఉంటుంది.కాలేయం శరీరంలో ఏకంగా 500 రకాల చర్యలను నిర్వహించే రసాయన కర్మాగారం.
- హెపటైటిస్ ఎ, ఇలు కలుషిత మంచినీరు, ఆహారం తీసుకోవడం వల్ల సంక్రమిస్తాయి.హెపటైటిస్ బి, సి వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. లైంగిక సంబంధాలు, రక్త మార్పిడి, ఒకే నీడిల్స్‌ను ఇద్దరు, అంతకంటే ఎక్కువ మందికి వాడటం ద్వారా ఇవి సంక్రమిస్తాయి.
- స్థూలకాయం వల్ల కొవ్వు పెరిగి, కాలేయంపై పేరుకుపోతుంది.
- నూనె వస్తువులు, పిజ్జా, బర్గాలు, ఫాస్ట్‌ఫుడ్స్ మద్యం సేవించడం ద్వారా వ్యాధులు వస్తున్నాయి.
[మార్చు] మూలాలు
|
|||||||||||||||||||||||