కావేరి నది
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
కావేరి నది (Kaveri river) భారతదేశంలో ప్రధానమైన నదుల్లో ఒకటి. హిందువులు ఈ నదిని పవిత్ర నదుల్లో ఒకటిగా భావిస్తారు. దీని జన్మస్థానం కర్ణాటక, లోని పశ్చిమ కనుమల్లో ఉన్న కొడగు జిల్లాలోని తలకావేరి అనే ప్రదేశం. ఈ నదినే దక్షిణ గంగ అని కూడా వ్యవహరించడం జరుగుతుంది.
విషయ సూచిక |
[మార్చు] ఉపయోగాలు
కావేరి నదిలోని నీరు ముఖ్యంగా వ్యవసాయానికి, గృహావసరాలకు, విద్యుదుత్పత్తికీ ఉపయోగిస్తారు. నదిలోకి నీరు ముఖ్యంగా ఋతుపవనాల కారణంగా కలిగే వర్షాలవల్లనే లభిస్తుంది ఈ నదిపై నిర్మించబడిన కృష్ణ రాజ సాగర్ డ్యామ్, మెట్టూర్ డ్యామ్, మొదలైనవి ఋతుపవనాల సమయంలో నీరు నిల్వచేసి వర్షాభావ పరిస్థితుల్లో విడుదల చేయబడుతాయి.
[మార్చు] హిందూ మతంలో కావేరి ప్రాముఖ్యత
బ్రహ్మగిరి కొండల్లో నెలకొని ఉన్న మరియు ఈ నది జన్మస్థానమైన తలకావేరి ఒక సుప్రసిద్ధ యాత్రా స్థలంగా ప్రసిద్ధి గాంచింది. తుల సంక్రమణం అనే ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొను వేలాది మంది భక్తులు ఇక్కడ గల మూడు దేవాలయాలను సందర్శిస్తారు. ఈ సంధర్భంగా ఇక్కడ నీరు ఫౌంటెయిన్ లాగా ఎగజిమ్ముతూ ప్రవహిస్తుందని భక్తుల విశ్వాసం.
[మార్చు] పరీవాహక ప్రాంతాలు
చందనం అడవులకు పేరు గాంచిన, మరియు ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకొనే కూర్గ్ ఈ నదీమతల్లి వరప్రసాదమే. టిప్పు సుల్తాన్ రాజధానియైన శ్రీరంగ పట్టణం ఈనది ఒడ్డునే నెలకొని ఉంది. తమిళనాడులోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రములు శ్రీరంగం, కుంభకోణం ఈనది ఒడ్డునే నెలకొని ఉన్నవి.. బ్రుందావన్ గార్దెన్స్ ఈ నది వొడ్దు న కలవు.
[మార్చు] కావేరి జల వివాదం
ఈ నదీ జలాల వినియోగ విషయంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య చాలాకాలంగా వివాదం నెలకొని ఉంది. తమిళనాడు రాష్ట్రం చాలాకాలంగా ఈ నదీ జలాలను విస్తారంగా వాడుకుంటుండగా, కర్ణాటక దీన్ని చారిత్రక తప్పిదంగా భావిస్తోంది.
[మార్చు] బయటి లింకులు
|
|||||