కాశీ వంగ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాశీ వంగ
Closeup of flowers
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Subclass:
Order:
Family:
Genus:
Species:
సొ. వైరమ్
Binomial name
సొలానమ్ వైరమ్
Synonyms

See text

కాశీ వంగ లేదా ఔషధ వంగ ఒక విధమైన చిన్న మొక్క. సొలనేసి కుటుంబానికి చెందిన ఈ మొక్క కాయలలో స్టిరాయిడ్ లున్నందువలన ఎంతో ప్రసిద్ధిచెందిన ఔషధ మొక్కగా పేరొందినది. వీనికి నొప్పులు, వాపులను తగ్గించే శక్తితో పాటు సంతాన నిరోధక లక్షణాలున్నాయి. అందువలన ఈ స్టిరాయిడ్ లను ప్రపంచ వ్యాప్తంగా కుటుంబ నియంత్రణ ఔషధాలలో ఉపయోగిస్తున్నారు.

ఇది వంగ మొక్కలాగా ఉండి ఒక మీటరు ఎత్తు పెరుగుతుంది. ఆకులు వెడల్పుగా ఉంటాయి. కాండం మీద కొక్కెం లాంటి ముల్లుంటాయి. తెల్లని పుష్పాలను పూస్తుంది. పండినప్పుడు పసుపురంగుకు మారతాయి. విత్తనాలు గోధుమ రంగులో ఉంటాయి.

ఈ మొక్కలను అస్సాం, మణిపూర్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, ఒడిషా, నీలగిరి ప్రాంతాలలో పెంచుతున్నారు.

"https://te.wikipedia.org/w/index.php?title=కాశీ_వంగ&oldid=1443998" నుండి వెలికితీశారు