కాసు బ్రహ్మానందరెడ్డి

వికీపీడియా నుండి

అనన్య మేధావి, రాజనీతి చతురుడు, అపర చాణక్యుడు, వాసికెక్కిన రాజకీయవేత్తలలో ప్రముఖుడు కాసు బ్రహ్మానందరెడ్డి. ఆయన తలపై టోపీని అటూ ఇటూ మార్చితే అమోఘ మైన రాజకీయ ఎత్తు వేసినట్టే. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రి పదవులతో పాటు అనేక పదవులను ఆయన విజయవంతంగా నిర్వహించారు.

విషయ సూచిక

[మార్చు] జననం, విద్యాబ్యాసం

బ్రహ్మానందరెడ్డి 1909 జూలై 28గుంటూరు జిల్లా నరసావురావు పేట సమీపాన తూబాడు గ్రామంలో జన్మించారు. మదరాసు పచయప్ప కళాశాలలో పట్టా, పిమ్మట న్యాయ పట్టా పుచ్చుకున్నారు.

[మార్చు] స్వాతంత్ర సమర పోరాటం

పన్నేండటవ ఏట విజయవాడ కాంగ్రెస్ సదస్సుకు విచ్చేసిన మహాత్మగాంధీ ని సందర్శించారు. వారి బోధనలో ప్రభావితులై శాకాహరిగా ఉంటానని ప్రమాణం చేసారు. జీవితాంతం ఖద్ధరు ధరించారు. టంగుటూరి ప్రకాశం పంతులు సహచార్యం, బోధనలు వారిని స్వాతంత్ర ఉద్యమం వైపు నడిపాయి. లా ప్రాక్టీసును పక్కనబెట్టి బ్రిటీష్ వారిపై పోరాటానికి ఉత్సాహంగా కదిలారు. పోలీసు లాఠీ దెబ్బలు తిన్నారు. సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. 1942లో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లారు.

[మార్చు] రాజకీయ ప్రస్ధానం

జిల్లాబోర్డు సభ్యునిగా ప్రారంభమైంది ఆయన రాజకీయ జీవితం. ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో మొదటి సారిగా 1946 లో శాసన సభ్యునిగా ఎన్నికైనారు. 1946 నుండి 1952 వరకు 1952 నుండి 1972 వరకు శాసన సభకు ఎన్నికైనారు. 1952నుండి 195 వరకు రాష్ట్ర కాంగ్రెస్ కమీటికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తరువాత 1956 లో పురపాలక శాఖ మంత్రిగా నీలం సంజీవరెడ్డి మంత్రి వర్గంలో చేరారు. పిమ్మట దామోదరం సంజీవయ్య మంత్రి వర్గంలో కొనసాగి వాణిజ్య శాఖ, ఆర్ధిక శాఖలు నిర్వహించారు. ఆర్ధిక శాఖను వారు అత్యంత సమర్ధవంతంగా నిర్వహించారు. 1964వ సంవత్ఫరం ఫిబ్రవరి 29న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. అప్పటి తెలంగాణా ఉద్యమం సెగతో వారు 1971 సెప్టెంబర్ 15న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా నిర్వహించారు. కేంద్రమంత్రి వర్గంలో 1974 వ సంవత్సరంలో భాద్యతలు చేపట్టి కమ్యూనికేషన్, హోం, పరిశ్రమల శాఖలను నిర్వహించారు.

[మార్చు] ఎఐసీసీ సారథ్యం

1977లో జరిగిన లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం అదే ప్రథమం. ఆ సమయంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పశ్చిమబెంగాల్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత సిద్ధార్థ శంకర్ రే పై పోటీచేసి విజయం సాధించారు.అద్యక్ష పదవికి ఎన్నిక జరిగి అలా ఎన్నికైన అతి కొద్ది మంది అధ్యక్షుల్లో ఆయన ఒకరు. ఓటమి పిమ్మట పతనావస్ధలో ఉన్న పార్టీని పునరుజ్జీవంపజేసేందుకు శాయశక్తులా పని చేసారు. తదనంతరం ఇందిరాగాంధీతో విభేదాలు తలెత్తాయి. ఆమెను ఏకంగా పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో కాంగ్రెస్ నిట్టనిలువునా చీలింది. ఒక వర్గానికి ఇందిరాగాంధీ నాయకత్వం వహించగా మరో వర్గానికి కాసు సారథ్యం వహించారు. ఆయన నేతృత్వంలోని పార్టీ రెడ్డి కాంగ్రెస్ గా రూపాంతరం చెందింది. 1978లో రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో ఇందిరా కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆయనలో ఆత్మ పరిశీలన మొదలైంది. ఫలితంగా రెడ్డి కాంగ్రెస్ 1980లో ఇందిరాకాంగ్రెస్‌లో విలీనం చేశారు.

[మార్చు] రాష్ట్రప్రగతి కి సోపానాలు

రాష్ట్ర ప్రగతికి బ్రహ్మానంద రేడ్డి అహర్నిశలు శ్రమించారు.అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు పరిచారు. రాష్ట్రాభివృద్ధికి దోహదపడే దీర్ఘకాలిక ప్రాజెక్టుల పనులను పూర్తి చేయించారు. బహుళార్థ సాధక ప్రాజెక్టు నాగార్జున సాగర్ పనులు కాసు హయాంలోనే పూర్తయ్యాయి. సాగర్ నిర్మాణానికి అవసరమైన నిధుల సేకరణకు ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దేశంలో అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తపన పడ్డారు. నాగార్జునసాగర్ మొదటిదశ పూర్తి కాగానే, 1966 ఫిబ్రవరి ఆగస్టు 3న నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారు. రాయలసీమ ప్రాంతానికి వరదాయిని అయిన తుంగభద్ర ప్రాజెక్టు హైలెవల్ కెనాల్ ప్రాజెక్టుకు అవసరమైన క్లియరెన్సుల మంజూరు, నిధులు సమకూర్చడానికి కాసు బ్రహ్మానంద రెడ్డి కృషి చేసారు. పోచంపాడు ప్రాజెక్టు కు రూపకల్పన చేసారు. అప్పట్లో ఎల్.ఐ.సి.నుంచి పది కోట్ల రూపాయల రుణాన్ని తీసుకుని బలహీనవర్గాల వారికి ఇళ్లు నిర్మించారు. ఆయన హయాంలో పంచాయతీ చట్టం అమలులోకి వచ్చింది. సికింద్రాబాద్ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ ఏర్పాటు కావడం వెనుక ఆయన కృషి ఎంతో ఉంది.

[మార్చు] మరణం

బ్రహ్మానందరెడ్డి 1994 మే 20 న హైదరాబాద్ లో మరణించారు.

[మార్చు] స్మ్మతి చిహ్నాలు

వీరి జ్ఞాపకార్ధం హైదరాబాదు నగరంలో జూబ్లీ హిల్స్ ప్రాంతంలోని చిరాన్ పాలెస్ ప్రాంతాన్ని కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ వనం గా నామకరణం చేశారు.


ఇంతకు ముందు ఉన్నవారు:
నీలం సంజీవరెడ్డి
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
29/02/1964—30/09/1971
తరువాత వచ్చినవారు:
పి.వి.నరసింహారావు

మూస:ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు