కిరండూల్
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
| కిరండూల్ | |
| — పట్టణము — | |
| జనాభా (2001) | |
| - మొత్తం | 19,053 |
|---|---|
| - సాంద్రత | /km2 (/sq mi) |
| PIN | 494556 |
| వెబ్‌సైటు: dantewada.gov.in | |
కిరండూల్ చత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలోని ఒక పట్టణం. ఈ పట్టణం బైలడీలా పర్వత శ్రేణులలో ఉన్నది. ఈ పట్టణం యొక్క పూర్వ నామం కిరణ్‌దుర్గ్. కాలక్రమంలో కిరండూల్‌గా మారింది. ఈ ప్రదేశం నాణ్యమైన ముడి ఇనుము కు ప్రసిద్ది.
విషయ సూచిక |
నేపధ్యము [మార్చు]
1040 - 1950 మధ్యకాలంలో జపాన్ దేశం నుండి వచ్చిన ఒక బృందం ఇక్కడి ఇనుప ఖనిజం నాణ్యతను పరిశీలించుటకు వచ్చింది. తరువాత భారత జాతీయ ఖణిజాభివృద్ది సంస్థ, జపాన్ దేశ సహకారంతో ఇక్కడ మొదటిసారిగా ఇనుము శుద్ది పరిశ్రమను ప్రారంభించినది.
సంస్కృతీ సంప్రదాయాలు [మార్చు]
ఇక్కడ ఖనిజ పరిశ్రమ వేళ్ళూనుకోడంతో పలు ఉపాధి అవకాశాలు పెరిగాయి. దీనితో దేశంలో అనేక ప్రాంతాలనుండి ప్రజలు జీవనోపాధి వెతుక్కుటూవచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. దీనితో ఇక్కడ మిశ్రమ సంస్కృతి కానవస్తుంది. ప్రజల ప్రధాన భాష హిందీ. దీనితో బాటు ఆంగ్లము, బెంగాలీ. తెలుగు, తమిళం మరియు ఇతర ప్రధాన భాషలు మాట్లాడేవారిని ఇక్కడ చూడవచ్చు. ఇక్కడి ప్రజలు రాముడు మరియు సీతను పూజిస్తారు. పట్టణములో ఒక రామాలయము, కపిలాలయము, తొమ్మిది చర్చిలు మరియు రెండు మసీదులు ఉన్నాయి. వివిధ ప్రాంతాలనుండి వచ్చిన ప్రజలు వారివారి భాషా సమితులను ఏర్పరుచుకున్నాయి. దేవీ నవరాత్రులు ఘనంగా జరుగుతాయి.
పర్యాటకము [మార్చు]
కెకె లైన్ గా పిలవబడే కొత్తవలస కిరండూల్ రైలు మార్గం పర్యాటక ప్రియులకు స్వర్గధామము. ఈ మార్గంలోనే ప్రపంచ ప్రసిద్ది గాంచిన బొర్రా గుహలు మరియు అరకులోయ ఉన్నాయి. [విశాఖపట్నం]] నుండి కిరండూల్ ప్రయాణం కొండలు, కోనల మధ్య మరపురానివిధంగా సాగుతుంది. పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది.