కిరణ్ బేడీ
కిరణ్ బేడీ (Kiran Bedi) భారతదేశపు మొట్టమొదటి ఐ.పి.ఎస్.అధికారిణి. 1972 బ్యాచ్‌కు చెందిన కిరణ్ బేడీ పోలీసు శాఖలో అనేక పదవులు చేపట్టి, అనేక సంస్కరణలు చేపట్టి, మెగసెసె అవార్డుతో సహా పలు అవార్డులను పొందినది. బ్యూరో ఆప్ పోలీస్ రీసెర్చి అండ్ డెవెలప్‌మెంట్ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తూ డిసెంబర్ 2007లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకొంది.[1]
విషయ సూచిక |
[మార్చు] బాల్యం, విధ్యాభాసం
కిరణ్ బేడీ జూన్ 9, 1949 నాడు పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ లో జన్మించింది. తల్లిదండ్రులకు 4 కూతూర్లలో ఈమె రెండవది. డిగ్రీ వరకు స్థానికంగా అమృత్‌సర్ లోనే విధ్యాభాసం కొనసాగించింది. 1968-70 లో రాజనీతి శాస్త్రంలో పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగర్ నుంచి ఎం.ఏ.పట్టా పొందినది. ఉద్యోగంలో చేరిన తరువాత 1988లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందినది. 1993లో ఢిల్లీ ఐ.ఐ.టి. పి.హెచ్.డి. పట్టాను ప్రధానం చేసింది. కిరణ్ బేడీ చిన్న వయస్సులో మంచి క్రీడాకారిణిగా గుర్తింపు పొందినది. గతంలో అఖిల భారత టెన్నిస్ టైటిల్ ను మరియు ఆల్ ఏషియన్ టెన్నిస్ టైటిల్‌ను గెలుపొందింది. 22 ఏళ్ళ వయసులో ఏషియా మహిళల టైటిన్‌ను గెలుపొందినది.
[మార్చు] ఉద్యోగ జీవితం
కిరణ్ బేడీ అమృత్‌సర్ లోని ఖాల్సా మహిళల కళాశాలలో రాజనీతి శాస్త్రంలో ఉపన్యాసకురాలిగా (లెక్చరర్) జీవితం ప్రారంభించినది (1970-72. 1972లో ఆమె ఇండియన్ పోలీస్ సర్వీసుకు ఎంపైకైంది. ఢిల్లీలో ట్రాఫిక్ పోలీస్ కమీషనర్‌గా, మిజోరాంలో డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆప్ పోలీస్‌గా, చంఢీగర్ లెప్టినెంట్ గవర్నర్ సలహాదారునిగా, ఐక్యరాజ్య సమితిలోను పనిచేసింది. ఢిల్లీ ట్రాపిక్ పోలీస్ కమీషనర్ గా ఉన్నప్పుడు రోడ్లపై ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన కార్లను క్రేన్లతో పారద్రోలి క్రేన్ బేడీగా ప్రసిద్ధి చెందినది. తీహారు జైలులో పలు సంస్కరణలు ప్రవేశపెట్టి అందరి మన్నలను పొందింది. వాటి ఫలితంగా ప్రభుత్వ సర్వీసు రంగంలో రామన్ మెగసెసె అవార్డు పొందినది.
[మార్చు] సాధించిన అవార్డులు
- 1979 : రాష్ట్రపతి గ్యాలెంటరీ అవార్డు
- 1980 : విమెన్ ఆప్ ది ఇయర్ అవార్డ్
- 1991 : మత్తుపదార్థాల నివారణ మరియు నిర్మూలన వారి ఆసియా స్థాయి అవార్డు
- 1994 : మెగ్సేసే అవార్డు (ప్రభుత్వ రంగంలో )
- 1995 : మహిళా శిరోమణి అవార్డు
- 1995 : లయన్ ఆప్ ది ఇయర్ అవార్డు
- 1999 ; ప్రైడ్ ఆప్ ఇండియా అవార్డు
- 2005 : మదర్ థెరీసా జాతీయ స్మారక అవార్డు (సాంఘిక న్యాయం)
[మార్చు] బయటి లింకులు
[మార్చు] మూలాలు
- ↑ http://www.eenadu.net/district/districtshow1.asp?dis=delhi తీసుకున్న తేది 27.12.2007