కిషోరీ అమోంకర్

వికీపీడియా నుండి

కిషోరీ అమోంకర్ (మరాఠీ : किशोरी आमोणकर) (జననం: ఏప్రిల్ 10, 1931 ) ప్రముఖ భారతీయ హిందుస్తానీ సంగీత విద్వాంసురాలు. ఈమె జయ్‌పూర్ - అత్రౌలి ఘరానా కు చెందిన ఖయాల్ లను చక్కగా పాడుతుంది.

విషయ సూచిక

[మార్చు] బాల్యం, జీవిత చరిత్ర

కిషోరీ అమోంకర్ తల్లి, సుప్రసిద్ధ హిందుస్తానీ సంగీత గాయకురాలు, మోగుబాయి కుర్దీకర్. కిషోరీ తల్లి వద్దనే సంగీతాన్ని అభ్యసించింది.

[మార్చు] సంగీత ప్రస్థానం

కిషోరీ అమోంకర్ జయ్‌పూర్-అత్రౌలి ఘరానా యొక్క క్లిష్టమైన సంగతులను త్వరలోనే ఆకళింపు చేసుకొని, తన స్వంత గాయన శైలిని రూపొందించుకొంది. ఈమె తన సహజమైన మధుర గాత్రంతో, పురాతన జయ్‌పూర్-అత్రౌలి ఘరానా సాంప్రదాయాలకు భంగం వాటిల్లకుండా, అలవోకగా రాగాలను ఆలపించి, అటు సంగీత విద్వాంసులను, ఇటు శ్రోతలను ఆకట్టుకొంటుంది. ఆమె గాయనంలో బోల్తాన్, ఫిర్తాన్ ల సౌందర్యం చెక్కుచెదరదు. ఆమె హిందీ మరియు మరాఠీ భక్తిగీతాలు, సంస్కృత, కన్నడ భజనల నెన్నింటినో పాడింది.

[మార్చు] శిష్యగణం

మానిక్ భిడె, పద్మా తల్వార్కర్, అరుణ్ ద్రావిడ్, రఘునందన్ పన్శీకర్, వయొలినిస్ట్, మిలింద్ రాయ్కర్, విద్యా భగ్‌వత్, మనవరాలు తేజశ్రీ అమోంకర్‌లు.

[మార్చు] వ్యక్తిగత జీవితం

కిషోరీ అమోంకర్ బడిపంతులు, రవి అమోంకర్‌ను పెళ్ళి చేసుకొంది. ఆయన 1992 లో మరణించాడు. కిషోరీ అమోంకర్ రాఘవేంద్ర స్వామి భక్తురాలు.

[మార్చు] విడుదలైన ఆల్బంలు

1. దివ్య (2008) 2. ప్రభాత్ (2000) 3. సాంప్రదాయ (2003) 4.మల్హార్ మాలిక 5. సంగీత్ సర్తాజ్ 6. కిషోరీ అమోంకర్ - లైవ్ ఇన్ లండన్ 7. దృష్టి 8. బాగెశ్రీ ‍‍‍‍‍‍‍, భూప్ - ఎల్.పి. రికార్డు (1972)

[మార్చు] అవార్డులు

[మార్చు] బయటి లింకులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు