కీటకము
వికీపీడియా నుండి
(కీటకాలు నుండి దారిమార్పు చెందింది)
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
|
కీటకాలు |
|||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|
Western honey bee (Order Hymenoptera)
|
|||||||||
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||
|
|||||||||
|
|
|||||||||
SubclassApterygota
|
కీటకాలు (Insects) ఇప్పటివరకు జీవించిన అన్ని జీవులకంటె అతి విజయవంతమైన సమూహం. కీటక జాతుల సంఖ్య మిగిలిన అన్ని జంతుజాతుల సంఖ్య కంటె ఎక్కువ.
[మార్చు] సామాన్య లక్షణాలు
- శరీరం తల, వక్షం, ఉదరం అనే మూడు భాగాలుగా విభాజితమై ఉంటుంది.
- తల ఆరు ఖండితాల కలయికతో ఏర్పడి, సంయుక్త నేత్రాలు, స్పర్శశృంగాలు, హనువులు, జంభికలు, ద్వంద్వంకాని అధరం కలిగి ఉంటుంది.
- వక్షంలో మూడు ఖండితాలుంటాయి. దీనికి మూడు జతల కాళ్ళు ఉంటాయి. అందువల్ల ఇన్సెక్టాను 'షట్పాది' అని కూడా అంటారు.
- సాధారణంగా వక్షానికి రెండు జతల రెక్కలు ఉంటాయి. కొన్నిటిలో ఒక జత రెక్కలుంటాయి. లెపిస్మాలాంటి కీటకాలలో రెక్కలు ఉండవు.
- ప్రౌఢజీవి ఉదరానికి ఉపాంగాలు లేవు. డింభక దశలో ఉదరానికి ఉపాంగాలుంటాయి.
- ఉదరం 9-11 ఖండితాలతో ఉంటుంది.
- శ్వాస నిర్మాణాలు వాయునాళాలు. వీటి చివరి శాఖలను వాయునాళికలంటారు. ఇవి కణజాలం వరకు తిన్నగా చేరతాయి.
- విసర్జక అవయవాలు మాల్ఫీజియన్ నాళికలు. ముఖ్య నత్రజని విసర్జక వ్యర్థ పదార్ధం యూరిక్ ఆమ్లం.
- ఒకే జనన రంధ్రం ఉదరానికి పరాంతాన ఉంటుంది
- పరోక్ష అభివృద్ధి జరుగుతుంది. ఇందులో డింభకదశలు, వాటి రూపవిక్రియ ఉంటుంది.

