కీర్తన
కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు.
క్రైస్తవ కీర్తన సాహిత్యం [మార్చు]
1844లోనే క్రైస్తవ గీతాల ముద్రణ ప్రారంభం అయ్యింది. తెలుగు క్రైస్తవ కీర్తనలకు పితామహులు చౌథరి పురుషోత్తము . ఆయన నూట ముప్పై కీర్తనలు రాశారు. వందన, విజ్ఞాపన, పరితాప, ఆత్మానంద, ప్రబోధాత్మక, సిద్ధపాటు, ఆదరణ అనే శీర్షికల కింద వాటిని విభజించారు. విల్యం డాసన్, పులిపాక జగన్నాథము, ఎన్.డి.ఏబెలు, మల్లెల దావీదు, బాబు జాన్ చౌథరి, కూచిపూడి రాజరత్నము ,ఫిలిప్, బి.జ్ఞానరత్నమ్మ, వేశపోగు గుల్బానమ్మ, కొమ్ము కృపమ్మ, కట్టాం చంద్రమ్మ, పిల్లి విజయా చార్లెస్,తాళ్ళూరి జీవరత్నం, బేతాళ జాన్‌కవి ,చదలవాడ ఫ్రాన్సిస్, థామస్, జఖర్యా, జోనాకవి, గూటం జాన్ తాతయ్య , జక్కం పాల్, కామిరెడ్డి యాకోబు, బన్యన్ జోసఫ్, హనుమగుత్తి దేవదానం, కొత్తపల్లి జాన్, దేవరాజు, దేవదాసు , రావూరి లక్ష్మయ్య, రంగయ్య, శేషయ్య, లక్ష్మీనరసయ్య, దావీదు, అల్లారి పెదవీరాస్వామి, ప్రసంగి పట్టాభి , సరెల్ల సమూయేలు సుబ్బయ్య, మార్తాండ జ్ఞానప్రకాశం, ఈతకోటి ప్రకాశం, మెలతాటి విద్యానందం ,ఎస్.టి. జ్ఞానా నందకవి,మాసిలామణి, మోదుకూరి జాన్సన్ వంటివారు ఎన్నో కీర్తనలు రాశారు.