కుంజరాణి దేవి

వికీపీడియా నుండి
(కుంజరని దేవి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కుంజరాణి దేవి
జననం1968 మార్చి 1
వృత్తివెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న

నమీరాక్‌పామ్ కుంజరాణి దేవి (జననం: 1968 మార్చి 1) వెయిట్ లిఫ్టింగులో పేరుగాంచిన భారతీయ క్రీడాకారిణి. వివిధ అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించింది. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కార గ్రహీత.

నేపథ్యం[మార్చు]

కుంజరాణి 1968 మార్చి 1 న మణిపూర్ రాష్ట్రం, ఇంఫాల్ లోని కైరాంగ్ మాయై లేకాయ్ లో జన్మించింది.1978 ఇంఫాల్ లోని సిండామ్ సిన్షాంగ్ రెసిడెంట్ ఉన్నత పాఠశాలలో చదువుతూ ఉన్నపుడే క్రీడల పట్ల ఆకర్షితురాలైంది. ఇంఫాల్ లోని మహారాజా బోధ చంద్ర కాలేజిలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసే నాటికి వెయిట్ లిఫ్టింగే ఆమెకు లోకమైంది.

సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్ లో ఉద్యోగంలో చేరింది. పోలీసు ఛాంపియన్‌షిప్పులలో ఆమె చరిత్ర సృష్టించింది. 1996 నుండి 1998 వరకు ఇండియన్ పోలీస్ టీమ్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించింది.

క్రీడా చరిత్ర[మార్చు]

1985వ సంవత్సరం మొదలుకొని జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 44, 46, 48 కిలోల విభాగాల్లో పతకాలు సాధించింది. వీటిల్లో ఎక్కువ శాతం బంగారు పతకాలే. 1987 లో త్రివేండ్రంలో జరిగిన పోటీలలో 2 జాతీయ రికార్డులు నెలకొల్పింది. 1994లో పూణేలో జరిగిన పోటీలలో మొదటిసారిగా 46 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించింది, తిరిగి నాలుగు సంవత్సరాల తర్వాత మణిపూర్ లో జరిగిన పోటీలలో 48 కిలోల విభాగంలో వెండి పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

1989లో మాంచెస్టర్ లో జరిగిన ప్రపంచ మహిళా వెయిట్ లిఫ్టింగ్ పోటీలో మొదటిసారి పాల్గొని మూడు వెండి పతకాలు కైవసం చేసుకోవడం ఆమెలో ఆత్మస్థైర్యం నింపింది. అప్పటినించి 1993 మెల్‌బోర్న్ పోటీలు మినహా వరుసగా ఏడు ప్రపంచపోటీలలో బహుమతి సాధించింది. కానీ ప్రతిసారి వెండిపతకంతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది.

1990లో బీజింగ్,1994లో హిరోషిమాలో జరిగిన ఆసియా క్రీడలలో రజతపతకాన్ని సాధించింది. కానీ 1998లో జరిగిన ఆసియా క్రీడలలో పతక సాధించలేక పోయింది.

ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మాత్రం కుంజరాణి ప్రదర్శన మెరుగ్గా ఉంది. 1989 షాంఘైలో జరిగిన పోటీలలో ఒక రజత, రెండు కాంస్య పతకాలు గెలిచింది. 1991లో ఇండోనేషియాలో జరిగిన పోటీలో 44 కిలోల విభాగంలో మూడు వెండిపతకాలతో తన విజయ పరంపర కొనసాగించినది. తదుపరి 1992లో థాయిలాండ్ లోను, 1993లో చైనా పోటీల్లోమూ తన రెండవ స్థానాన్ని సుస్థిరపరుచుకుంది. 1995లో దక్షిణకొరియాలో జరిగిన పోటీల్లో 46 కిలోల విభాగములో అత్యుత్తమమైన ఆటతీరుతో రెండు బంగారు పతకాలు, ఒక రజతపతకమూ సాధించింది. కానీ 1996లో జపాన్ లో జరిగిన పోటీల్లో రెండు రజత పతకాలు, ఒక కాంస్యంతో సరిపెట్టుకోవలసి వచ్చింది.

వివాదం[మార్చు]

2001లో నిషేదించిన ష్టిరాయిడ్స్ వాడినట్లుగా రుజువైనందున కుంజరాణి దేవిపై 6 నెలలపాటు తాత్కాలిక నిషేధం విధించారు.

గుర్తింపు[మార్చు]

  • 1990లో ఆమెను అర్జున అవార్డు వరించింది. 1996-1997లో లియాండర్ పేస్ తో కలిపి రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న పురస్కారం లభించింది. అదే సంవత్సరం ఆమె కే.కే బిర్లా అవార్డు గెలుచుకుంది.
  • ఆమె ఖాతాలో యాబై కి పైగా అంతర్జాతీయ అవార్డులు ఉన్నాయి. 2006 మెల్‌బోర్న్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో 48 కిలోల విభాగంలో బంగారుపతకాన్ని గెలవడమేకాక 72 కిలోలు , 94 కిలోల ఉమ్మడి విభాగంలో రికార్డు నెలకొల్పింది.

ప్రస్తుత పరిస్థితి[మార్చు]

కుంజరాణి ప్రస్తుతం సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్సులో అసిస్టెంటు కమాండెంట్ గా పనిచేస్తోంది.

బయటి లింకులు[మార్చు]

అంతకు ముందువారు
కరణం మల్లేశ్వరి
రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న
1996/1997
Joint with లియాండర్ పేస్
తరువాత వారు
సచిన్ టెండుల్కర్