| కుమార సంగక్కర |
Sri Lanka |
| వ్యక్తిగత సమాచారం |
| బ్యాటింగ్ శైలి |
ఎడమచేతి బ్యాట్స్‌మన్ |
| బౌలింగ్ శైలి |
రైట్-ఆర్మ్ ఆఫ్‌స్పిన్ |
| కెరీర్ గణాంకాలు |
|
Tests |
ODIs |
| మ్యాచ్‌లు |
71 |
213 |
| పరుగులు |
6032 |
6277 |
| బ్యాటింగ్ సగటు |
56.37 |
36.28 |
| 100లు/50లు |
16/24 |
7/42 |
| అత్యుత్తమ స్కోరు |
287 |
138* |
|
| ఓవర్లు |
1 |
- |
| వికెట్లు |
0 |
- |
| బౌలింగ్ సగటు |
- |
- |
| ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు |
0 |
- |
| ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు |
0 |
n/a |
| అత్యుత్తమ బౌలింగ్ |
- |
- |
| క్యాచ్ లు/స్టంపింగులు |
149/20 |
195/54 |
|
As of జనవరి 24, 2008
Source: [1]
|
1977, అక్టోబర్ 27న జన్మించిన కుమార సంగక్కర (Kumar Chokshanada Sangakkara) శ్రీలంకకు చెందిన ప్రముఖ క్రికెట్ ఆటగాడు. ఇతడు ఎడమ చేతి బ్యాట్స్‌మెన్ మరియు వికెట్ కీపర్. ప్రారంభంలో బ్యాట్స్‌మెన్‌గా క్రీడాజీవితం ప్రారంభించిననూ క్రమక్రమంగా వికెట్ కీపర్‌గా కూడా విధులను నిర్వహిస్తున్నాడు. [[2007], డిసెంబర్ 6న LG ICC టెస్ట్ ర్యాంకింగ్‌లో నెంబర్ వన్‌గా ప్రకటించబడ్డాడు. శ్రీలంక తరఫున ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ ఇతడే. టెస్ట్ క్రికెట్‌లో వరుసగా నాలుగు సార్లు 150 పైగా పరుగులు సాధించిన తొలి బ్యాట్స్‌మెన్ కూడా సంగక్కరే.[1]
క్రీడాజీవితంలో ముఖ్యఘట్టాలు[మార్చు]
2006 జూలైలో సంగక్కర మహేలా జయవర్థనేతో కలిసి 624 పరుగులు భాగస్వామ్యంతో ప్రపంచ రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికాపై సాధించిన ఈ స్కోరు ఫస్ట్ క్లాన్ మరియు టెస్ట్ క్రికెట్‌లో ఏ వికెట్ కైనా అత్యధిక భాగస్వామ్య రికార్డు. అదే ఇన్నింగ్సులో సంగక్కర వ్యక్తిగతంగా 287 పరుగులు సాధించి తన అత్యధిక స్కోరును మెరుగుపర్చుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో 4 సార్లు డబుల్ సెంచరీ పూర్తిచేశాడు. అతడు చేసిన 16 సెంచరీలలో చాలా వరకు అత్యధిక పరుగుల వద్దకు లాక్కొచ్చాడు. సెంచరీ చేయగానే వికెట్ పారేసుకొనే తవ్తం కాకుండా బాధ్యతాయుత బ్యాట్స్‌మెన్‌గా పేరు సంపాదించాడు. డిసెంబర్, 2007లో వరుసగా 4 సార్లు 150పై చిలుకు పరుగులు సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గాను రికార్డు సృష్టించాడు.
టెస్ట్ క్రికెట్ గణాంకాలు[మార్చు]
సంగక్కర 71 టెస్టులకు ప్రాతినిధ్యం వహించి 56.37 సగటుతో 6032 పరుగులు సాధించాడు. అందులో 16 సెంచరీలు మరియు 24 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అతడి అత్యధిక స్కోరు 287 పరుగులు.
వన్డే క్రికెట్ గణాంకాలు[మార్చు]
కుమార సంగక్కర 213 వన్డేలు ఆడి 36.28 సగటుతో 6277 పరుగులు సాధించాడు. అందులో 7 సెంచరీలు మరియు 42 అర్థసెంచరీలు ఉన్నాయి. వన్డేలలో అతడి అత్యధిక స్కోరు 138 (నాటౌట్).
ప్రపంచ కప్ క్రికెట్[మార్చు]
సంగక్కర 2 పర్యాయాలు ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో శ్రీలంక క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2003లో మొదటి సారి మరియు 2007లో రెండో సారి ప్రపంచ కప్ పోటీలలో పాల్గొన్నాడు.
బయటి లింకులు[మార్చు]
- ↑ LG ICC Cricket Rankings
|
2003 ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు సభ్యులు |
|
|
|
|
|
2007 ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు సభ్యులు |
|
|
|
|