కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సుత్తివేలు
Suttivelu.jpg
జన్మ నామం కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు
జననం (1947-08-07)ఆగష్టు 7, 1947 / 1947 ఆగస్టు 7
భోగిరెడ్డిపల్లి, మచిలీపట్నం మండలం, కృష్ణా జిల్లా
మరణం సెప్టెంబరు 16, 2012(2012-09-16) (వయసు 65)
India మద్రాసు, భారతదేశం
భార్య/భర్త లక్ష్మీ రాజ్యం
ప్రముఖ పాత్రలు నాలుగు స్తంభాలాట (1982)
వందేమాతరం (1985)
ప్రతిఘటన(1988)

సుత్తివేలుగా ప్రఖ్యాతి గాంచిన కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు ప్రముఖ తెలుగు హాస్య నటులు. వీరు ఇప్పటి వరకు సుమారు 200 [1] చిత్రాలలో నటించారు.అలాగే కొన్ని టెలివిజన్ ధారావాహికలలో కూడా నటించారు. అనారోగ్యం తో బాధపడుతూ 2012, సెప్టెంబరు 16మద్రాసు లోని ఒక ఆసుపత్రిలో మరణించారు[2][3][4].

నేపధ్యము[మార్చు]

శ్రీ సుత్తివేలు అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. వీరు చిన్నతనం లో చాలా అల్లరి చేసేవారు. అలాగే వీరు చిన్నతనం లో చాలా సన్నగా ఉండేవారు. దానితో వీరి పక్కంటి పిన్ని జానకాంబ గారు వీరిని వేలు అని పిలిచేవారు. వీరు నటించిన నాలుగు స్తంభాలాట లో వీరి పాత్ర పేరు 'సుత్తి'. ఆ చిత్ర విజయం తరువాత అందరూ వీరిని సుత్తివేలు అని పిలవడం ప్రారంభింఛారు. శ్రీ సుత్తివేలు తండ్రి ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి. బాల్యం నుండి వీరికి నాటకాల పట్ల ఆసక్తి ఎక్కువ. దానితో ఏడవ తరగతి తప్పి, తండ్రి తో చీవాట్లు తిన్నారు.

నట ప్రస్థానం[మార్చు]

వీరికి చిన్నప్పటి నుండి నాటకాలంటే ప్రత్యేక ఆసక్తి. 1966లో పి.యు.సి చదివిన అనంతరం , హైదరాబాదుకు చేరుకున్నారు. అక్కడ తాత్కాలిక ఉద్యోగం చేసేవారు. 1967లో ఉద్యోగం మారి బాపట్ల చేరుకున్నారు. ఉద్యోగం మానేసి స్నేహితులతో నాటకాలు వేసేవారు.

1981లో విశాఖ డాక్ యార్డులో శాశ్వత ఉద్యోగం వావడంతో అక్కడికి మకాం మార్చారు. భమిడిపాటి గారి అంతా ఇంతే నాటకం ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది. మనిషి నూతిలో పడితే అనే నాటకంలో ఆయన పాత్రను చూసిన హాస్యబ్రహ్మ జంధ్యాల తన చిత్రం ముద్ద మందారం లో అయనకు రిసెప్షనిష్టు గా చిన్న పాత్రను ఇచ్చారు. ఇలా 1981 లో సుత్తివేలు సినీరంగ ప్రస్థానం జరిగింది. అటు పిమ్మట జంధ్యాల, తన వరుస చిత్రాలైన మల్లె పందిరి, నాలుగు స్తంభాలాట లలో కూడా సుత్తివేలుకు అవకాశాలనిచ్చారు. ఈ చిత్ర విడుదల ఆలస్యం కావడంతో సుత్తివేలు ఉద్యోగం పోగొట్టుకున్నారు.

ఉద్యోగం పోయిన తర్వాత నటననే తన వృత్తిగా స్వీకరించారు. ఆనంద భైరవి, రెండుజెళ్ళ సీత, శ్రీవారికి ప్రేమలేఖ, చంటబ్బాయి వంటి పలు విజయవంతమైన చిత్రాలలో హాస్యపాత్రలను పోషించారు. త్రిశూలం చిత్రం తర్వాత అవకాశాలు సన్నగిల్లడంతో కొద్దిరోజులు కష్టాలను అనుభవిందారు. తర్వాత టి. కృష్ణ వరుసగా ఐదు చిత్రాలలో అవకాశాలిచ్చారు. అప్పటి వరకు హాస్య పాత్రలనే పోషిస్తూ వచ్చిన సుత్తివేలుకు , ఈ చిత్రాలలో తన నటనలోని మరో పార్శాన్ని ఆవిర్భవించే అవకాశం చిక్కింది. వందేమాతరం, ప్రతిఘటన, కలికాలం, ఒసేయ్ రాములమ్మ చిత్రాలలో ఆయన పోషించిన పాత్రలు మరపురానివి. వందేమాతరం చిత్రానికి గాను 1984లో ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు.

వీరు తమ స్థిర నివాసం మద్రాసులో ఏర్పరుచుకున్నారు. చిత్రపరిశ్రమ హైదరాబాదుకు తరలడంతో తగినన్ని అవకాశాలు దక్కించుకోలేక పోయారు. దీనితో పలు టెలివిజన్ ధారావాహికలలో నటించారు. ఆనందోబ్రహ్మ, మల్లాది రామకృష్ణశాస్త్రి కథలు, భమిడిపాడి రామగోపాల్ కథలు వీరికి మంచిపేరు తీసుకువచ్చాయి. చివరి రోజులలో తన మకాంను హైదరాబాదుకు మార్చారు.

వ్యక్తిగత జీవితము[మార్చు]

శ్రీ సుత్తివేలు గారి వివాహము లక్ష్మీ రాజ్యం గారితో జరిగినది. వీరికి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానము.

ఆయనకు ఆంగ్ల రచయిత షేక్స్పియర్ అంటే అభిమానం. [5]

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర ఇతరత్రా విశేషాలు
2008 అందరికీ వందనాలు బాలల చిత్రం
2006 మొదటి సినిమా
వీరభద్ర
2005 ఆ నలుగురు
శ్లోకం
2004 Xట్రా
మాణిక్యం
చిల్లర మొగుడు అల్లరి కొడుకు న్యాయవాది
2002 123
1999 ఆదిత్య 369 రక్షక భటుడు
ఖైదీ నెంబరు.786
చైతన్య
అపూర్వ సహోదరులు
కిల్లర్
1989 అత్తకు యముడు అమ్మాయికి మొగుడు
1988 యముడికి మొగుడు
1987 దొంగ మొగుడు
1986 చంటబ్బాయి గణపతి
ప్రతిఘటన రక్షక భటుడు
1984 ఆనంద భైరవి
1983 ఖైది
1982 నాలుగు స్తంభాలాట సుత్తి
ముద్దమందారం తొలి చిత్రం

మూలాలు[మార్చు]

  1. http://timesofindia.indiatimes.com/entertainment/regional/telugu/news-interviews/Suthi-Velu-passes-away/articleshow/16419124.cms
  2. http://www.thehindu.com/news/states/andhra-pradesh/article3904844.ece.
  3. http://eenadu.net/Homeinner.aspx?item=break17
  4. http://timesofindia.indiatimes.com/entertainment/regional/telugu/news-interviews/Suthi-Velu-passes-away/articleshow/16419124.cms
  5. http://ishtapadi.blogspot.in/2014/08/blog-post_9.html

బయటి లింకులు[మార్చు]