శ్రీ కృష్ణదేవ రాయలు

వికీపీడియా నుండి
(కృష్ణదేవరాయలు నుండి దారిమార్పు చెందింది)
హైదరాబాదు లోని టాంక్‌బండ్ పై శ్రీ కృష్ణదేవ రాయలు విగ్రహము
SrIkRshNadEvaraayalu text.jpg
విజయ నగర రాజులు
సంగమ వంశము
మొదటి హరిహర రాయలు 1336-1356
మొదటి బుక్క రాయలు 1356-1377
రెండవ హరిహర రాయలు 1377-1404
విరూపాక్ష రాయలు 1404-1405
రెండవ బుక్క రాయలు 1405-1406
మొదటి దేవరాయలు 1406-1422
రామచంద్ర రాయలు 1422
వీర విజయ బుక్క రాయలు 1422-1424
రెండవ దేవ రాయలు 1424-1446
మల్లికార్జున రాయలు 1446-1465
రెండవ విరూపాక్ష రాయలు 1465-1485
ప్రౌఢరాయలు 1485
సాళువ వంశము
సాళువ నరసింహదేవ రాయలు 1485-1491
తిమ్మ భూపాలుడు 1491
రెండవ నరసింహ రాయలు 1491-1505
తుళువ వంశము
తుళువ నరస నాయకుడు 1491-1503
వీరనరసింహ రాయలు 1503-1509
శ్రీ కృష్ణదేవ రాయలు 1509-1529
అచ్యుత దేవ రాయలు 1529-1542
సదాశివ రాయలు 1542-1570
ఆరవీటి వంశము
అళియ రామ రాయలు 1542-1565
తిరుమల దేవ రాయలు 1565-1572
శ్రీరంగ దేవ రాయలు 1572-1586
రామ రాజు
వేంకటపతి దేవ రాయలు 1586-1614
శ్రీరంగ రాయలు 1 1614-1614
రామదేవుడు 1617-1632
వేంకటపతి రాయలు 1632-1642
శ్రీరంగ రాయలు 2 1642-1646

శ్రీ కృష్ణదేవ రాయలు (పా.1509-1529) అత్యంత ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్య యాదవచక్రవర్తి. ఈయన పాలనలో సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు మరియు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజుని గా మరియు కన్నడ రాజ్య రమా రమణ గా కీర్తించబడినాడు. ఈయన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు డొమింగో పేస్ మరియు న్యూనిజ్‌ ల రచనల వలన తెలియుచున్నది. రాయలకు ప్రధాన మంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి కూడా తిమ్మరుసు చాలా దోహదపదడినాడు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించి "అప్పాజీ" (తండ్రిగారు) అని పిలిచేవాడు.

కృష్ణదేవ రాయలు, తుళువ నరస నాయకుడు, నాగలాంబల (తెలుగు ఆడపడుచు) కుమారుడు.[1] ఇతను ఇరవై సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 4, 1509న విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించినాడు. ఇతని పట్టాభిషేకానికి అడ్డురానున్న అచ్యుత రాయలు నూ, వీర నరసింహ రాయలునూ, అనుచరులనూ తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించినాడు.


పరిశోధనల ప్రకారము నరస నాయకుడు చంద్రగిరి ప్రాంతమునకు చెందిన చంద్రగిరి బలిజ వంశీయుడు. వీరి తండ్రి తుళువ ఈశ్వరనాయకుడు. ఇంటిపేరు'సంపెట లేదా సమ్మెట'. తుళువ ప్రాంతములో 20 సంవత్సరాలుండి సాధించిన ప్రాభవమునకు 'తుళు' పదము చేరినదని చరిత్రకారుల అభిప్రాయము. యీ తుళువ వంశీయుల ప్రస్తుత తరాల వారు గుంటూరు జిల్లాలోనూ, కడప జిల్లాలోనూ, తమిళనాడులోనూ స్థిరపడి ఉన్నారు. వీరెల్లరు చంద్ర వంశ బలిజ క్షత్రియ వంశీయులగా ఉన్నారు.[ఆధారం కోరబడినది]

రాయలు తల్లి గారైన నాగలాంబ గారు గండికోటను పాలించిన పెమ్మసాని నాయకులు ఆడపడచు రాయలవారి వంశము: [2] అని కమ్మ కులస్తులు చెప్పేమాట. కాని లబించిన ఆధారాల ప్రకారం నాగలాంబ అరిగండాపురం గ్రామానికి చెందిన గాజుల బలిజ వంశీయుల ఆడపడుచు. వీరు చంద్రగిరి బలిజ వంశీయులు. శ్రీ కృష్ణదేవ రాయలు తమ తల్లి గారి జ్ఞాపకార్దం యీ అరిగండాపురం గ్రామానికి నాగలాపురం అను పేరు పెట్టెను. మదుర, తంజావూరు, చెంజి, ఖండి రాజ్యాలను పాలించిన నాయక రాజులు కూడా యీ గ్రామానికి చెంది యుండి నాగలాంబ గారి బందు వర్గములోని గాజుల బలిజ వంశీయులని మదుర రాజుల శ్రీవంశ ప్రకాశిక, అనువంశిక రాజ గురువుల శ్రీముఖములు, కైఫీయత్తులు, మద్రాసు ప్రెసిడెంసీ గవర్నమెంటు రికార్డ్స్ ద్వారా తెలియుచున్నది.[ఆధారం కోరబడినది]


విషయ సూచిక

[మార్చు] వారసులు

  • ఇతనికి ఇద్దరు భార్యలు, తిరుమల దేవి, చిన్నాదేవి .
  • ఇద్దరు కుమార్తెలు, వారిలో పెద్ద కూతురు తిరుమలాంబను రామ రాయలు కు, చిన్న కూతురును రామ రాయలు సోదరుడైన తిరుమల రాయలు కు ఇచ్చి వివాహం చేసాడు.
  • ఒక్కడే కొడుకు, తిరుమల దేవ రాయలు . ఇతనికి చిన్న తనంలోనే పట్టాభిషేకం చేసి, తానే ప్రధానిగా ఉండి రాజ్యవ్యవహారాలు చూసుకునేవాడు. కాని దురదృష్టవశాత్తూ తిరుమల దేవ రాయలు 1524 లో మరణించినాడు. ఈ విషయం పై కృష్ణ దేవ రాయలు తిమ్మరుసును అనుమానించి అతనిని గుడ్డివానిగా చేసాడు. తానూ అదే దిగులుతో మరణించినాడని ఓ అభిప్రాయము. మరణానికి ముందు చంద్రగిరి దుర్గమునందున్న సోదరుడు, అచ్యుత రాయలు ను వారసునిగా చేసాడు.

....

[మార్చు] రాజ్య పాలన

240 కోట్ల వార్షికాదాయము కలదు.


[మార్చు] సాహిత్య పోషకునిగా

కృష్ణదేవరాయలు స్వయంగా కవిపండితుడు కూడా కావడంతో ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని బిరుదు. ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము, తెలుగులో ఆముక్తమాల్యద లేక గోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు. రాయల ఆస్థానమునకు భువన విజయము అని పేరు. భువనవిజయము లో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి), అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు (భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు ఉండేవారని ప్రతీతి. వీరు అష్టదిగ్గజములు గా ప్రఖ్యాతి పొందారు.

అష్టదిగ్గజములు
  1. అల్లసాని పెద్దన,
  2. నంది తిమ్మన,
  3. ధూర్జటి,
  4. మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి),
  5. అయ్యలరాజు రామభద్రుడు,
  6. పింగళి సూరన,
  7. రామరాజభూషణుడు (భట్టుమూర్తి),
  8. తెనాలి రామకృష్ణుడు

[మార్చు] కవిగా


తెలుగదేల యన్న దేశంబు తెలుగేను
తెలుగు రేడ నేను తెలుగొకొండ
ఎల్ల జనులు వినగ ఎరుగవే బాసాడి
దేశభాష లందు తెలుగు లెస్స

అన్న పలుకులు రాయలు రాసినవే!

[మార్చు] భక్తునిగా

తిరుమలవెంకన్న ఆలయం లో సతీసమేతుడైన శ్రీ కృష్ణదేవ రాయలు

ఇతను మత సహనం కలవాడు. అనేక వైష్ణవ, శైవ దేవాలయములను నిర్మించినాడు; అనేక దాన ధర్మాలు చేసినాడు. ముఖ్యంగా తిరుమల శ్రీనివాసులకు పరమ భక్తుడు, సుమారుగా ఆరు పర్యాయములు ఆ దేవదేవుని దర్శించి అనేక దానధర్మాలు చేశాడు. ఇతను తన కుమారునికి తిరుమల దేవ రాయలు అని, కుమార్తెకు తిరుమలాంబ అని పేర్లు పెట్టుకున్నాడు.

[మార్చు] నిర్మాణాలు

ఈయన చెన్నకేశవస్వామి వారి దేవాలయం కంట్టించారు.

[మార్చు] ఇతర విశేషాలు

రాయలు విజయనగరాధీశులందరిలోకీ చాలా గొప్పవాడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్ధిక వేత్త, మత సహనము కలవాడు, వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడువని వాడు, కవి పోషకుడు, రాజ్య నిర్మాత మొదలగున్న సుగుణాలు కలవాడు. ఇతను దక్షిణ భారతదేశం మొత్తం ఆక్రమించినాడు.

శ్రీకృష్ణదేవరాయలు, విజయనగర సామ్రాజ్యం నేపథ్యం గా వచ్చిన సినిమాలలో కొన్ని
  1. మల్లీశ్వరి
  2. మహామంత్రి తిమ్మరుసు
  3. తెనాలి రామకృష్ణ
  4. ఆదిత్య 369

ఇంకా ఎన్నో సినిమాలు వచ్చాయి. మన్జునథ్ బబు సొమ్పల్యమ్

[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] మూలాలు

  1. Prof K.A.N. Sastri, History of South India, From Prehistoric times to fall of Vijayanagar, 1955, pp 250,258
  2. [ ఈనాడు లోవ్యాసం]


విజయనగర రాజులు విజయ నగర రాజులు
సంగమ వంశము | సాళువ వంశము | తుళువ వంశము | ఆరవీటి వంశము | వంశ వృక్షము | పరిపాలనా కాలము | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధము | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | పరిపాలనా కాలము | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యము


ఇంతకు ముందు ఉన్నవారు:
వీరనరసింహ రాయలు
విజయనగర సామ్రాజ్యము
1509 — 1529
తరువాత వచ్చినవారు:
అచ్యుత దేవ రాయలు


వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు