కె.వి.మహదేవన్

వికీపీడియా నుండి

కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహదేవన్ (కె.వి.మహదేవన్) (1917 - 2001) సుప్రసిద్ధ తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు. వందలకొద్దీ తెలుగు, తమిళ చలన చిత్రాలకు ఈయన సంగీత దర్శకత్వం వహించారు. జానకిరాముడు, శంకరాభరణం, శ్రీనివాస కళ్యాణం (వెంకటేష్, గౌతమి, భానుప్రియ)మొదలైనవి ఆయన దర్శకత్వం వహించిన కొన్ని తెలుగు ఆణి ముత్యాలు.

మహదేవన్ 1917లో తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో జన్మించాడు. ఎం.ఎస్ విశ్వనాథన్ సమకాలీకుడైన మహదేవన్ 1942లో ఆనందన్ అనే తమిళ సినిమాతో చిత్రరంగములో అడుగుపెట్టి ఐదు దశాబ్దాలపాటు 600కు పైగా దక్షిణభారత సినిమాలకు సంగీతం సమకూర్చాడు. 1990లో ఆరోగ్య కారణాలు ఈయన సినీజీవితానికి తెరదించాయి. ఈయన సంగీతము సమకూర్చిన చివరి సినిమా మురుగనే తుణై (1990).[1]

సంపూర్ణ రామాయణము, తిరువిళయదల్ వంటి పౌరాణికచిత్రాలకు పేరుమోసిన మహదేవన్ శాస్త్రీయ సంగీతాన్ని, సినిమా సంగీతముతో మిళితం చేసే ఒరవడికి ఆద్యుడని భావిస్తారు. అనేకమంది సినీ సంగీత దర్శకులు ఈయన గురువు. ఈయన సంగీతం సమకూర్చిన సినిమాలలో శంకరాభరణం, కందన్ కరుణై, వసంత మాలిగై, వియత్నాం వీడు, పడిక్కథ మీతై మరియు వానంబాడి ప్రసిద్ధిగాంచినవి.

మహదేవన్ అంతిమదినాలలో శ్వాసపీల్చుకోవటం కష్టమై వారం రోజులపాటు అస్వస్థతతో ఆసుపత్రిలో ఉండి 2001, జూన్ 22న 83 సంవత్సరాల వయసులో మద్రాసులో మరణించాడు.[2]

విషయ సూచిక

[మార్చు] పురస్కారాలు

  • జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు(1967) - కందణ్ కరుణై
  • జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు (1980) - శంకరాభరణం

[మార్చు] అవీ ఇవీ

  • జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకునిగా పురస్కారం అందుకొన్న మొదటి వ్యక్తి.

[మార్చు] తెలుగు చిత్రాలు

కె.వి.మహదేవన్ స్వరపరచిన కొన్ని తెలుగు చిత్రాలు:

[మార్చు] మూలాలు

పేజీకి సంభందించిన లింకులు
ఇతర భాషలు