కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
వికీపీడియా నుండి
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
భారత కేంద్ర సాహిత్య అకాడమీ ప్రతిఏటా ఇచ్చే పురస్కారం - కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. అకాడమీ గుర్తించిన 22 భారతీయ భాషల్లో ప్రతి భాషకూ రెండు పురస్కారాలను అకాడమీ ఇస్తుంది - ఉత్తమ సాహిత్య కృషికి ఒకటి, అనువాదానికి ఒకటి. ప్రతిభా ఫలకం, 40 వేల రూపాయల నగదు ఈ పురస్కారంలో భాగం. అనువాదానికి ఫలకం, 15 వేల రూపాయల నగదు బహూకరిస్తారు.
విషయ సూచిక |
భాషలు [మార్చు]
అస్సామీ, బెంగాలీ, డోగ్రీ, ఇంగ్లీషు, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరి, కొంకణి, మైథిలి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, రాజస్థానీ, సంస్కృతం, సింధీ, తమిళం, తెలుగు, ఉర్దూ
తెలుగు భాషకు చెందిన పురస్కార గ్రహీతలు [మార్చు]
| సంవత్సరం | పుస్తకం | సాహితీ విభాగం | రచయిత |
|---|---|---|---|
| 2007 | శతపత్రం | ఆత్మకథ | గడియారం రామకృష్ణ శర్మ |
| 2006 | అస్థిత్వ నదం ఆవలి తీరాన | చిన్న కథ | మునిపల్లె రాజు |
| 2005 | తనమార్గం | కథా సంకలనం | అబ్బూరి ఛాయాదేవి |
| 2004 | కాలరేఖలు | నవల | అంపశయ్య నవీన్ |
| 2003 | శ్రీ కృష్ణ చంద్రోదయము | పద్యరచన | ఉత్పల సత్యనారాయణాచార్య |
| 2002 | స్మృతి కిణాంకం | వ్యాసాలు | చేకూరి రామారావు |
| 2001 | హంపి నుంచి హరప్పా దాకా | ఆత్మకథ | తిరుమల రామచంద్ర |
| 2000 | కాలాన్ని నిద్ర పోనివ్వను | పద్యరచన | ఆచార్య ఎన్.గోపి |
| 1999 | కథాశిల్పం | వ్యాసాలు | వల్లంపాటి వెంకటసుబ్బయ్య |
| 1998 | బలివాడ కాంతారావు కథలు | కథలు | బలివాడ కాంతారావు |
| 1997 | స్వప్నలిపి | కవిత | అజంతా (పి. వి. శాస్త్రి) |
| 1996 | కేతు విశ్వనాథ రెడ్డి కథలు | కథలు | కేతు విశ్వనాథరెడ్డి |
| 1995 | యజ్ఞంతో తొమ్మిది | కథలు | కాళీపట్నం రామారావు |
| 1994 | కాలరేఖ | విమర్శ | గుంటూరు శేషేంద్రశర్మ |
| 1993 | మధురాంతకం రాజారాం కథలు | కథలు | మధురాంతకం రాజారాం |
| 1992 | హృదయ నేత్రి | నవల | మాలతీ చందూర్ |
| 1991 | ఇట్లు మీ విధేయుడు | కథలు | భమిడిపాటి రామగోపాలం |
| 1990 | మోహనా ఓ మోహనా | కవిత | కె.శివారెడ్డి |
| 1989 | మణిప్రవాళము | వ్యాసాలు | ఎస్.వి.జోగారావు |
| 1988 | అనువాద సమస్యలు | విమర్శ | రాచమల్లు రామచంద్రారెడ్డి |
| 1987 | గురజాడ గురుపీఠం | వ్యాసాలు | ఆరుద్ర |
| 1986 | ఆంధ్ర సాహిత్య విమర్శ- ఆంగ్ల ప్రభావం | సాహితీ విమర్శ | ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం |
| 1985 | గాలివాన | కథలు | పాలగుమ్మి పద్మరాజు |
| 1984 | ఆగమ గీతి | కవిత | ఆలూరి బైరాగి |
| 1983 | జీవనసమరం | వ్యాసాలు | రావూరి భరద్వాజ |
| 1982 | స్వర్ణ కమలాలు | కథలు | ఇల్లిందల సరస్వతీదేవి |
| 1981 | సీతజోస్యం | నాటకం | నార్ల వెంకటేశ్వరరావు |
| 1979 | జనప్రియ రామాయణం | కవిత్వం | పుట్టపర్తి నారాయణాచార్యులు |
| 1978 | కృష్ణశాస్త్రి రచనల సంకలనం (6 సంపుటాలు) | కవిత్వం, నాటకాలు | దేవులపల్లి కృష్ణశాస్త్రి |
| 1977 | కుందుర్తి కృతులు | కవిత్వం | కుందుర్తి ఆంజనేయులు |
| 1975 | గుడిసెలు కూలిపోతున్నాయి | కవిత్వం | బోయి భీమన్న |
| 1974 | తిమిరంతో సమరం | కవిత్వం | దాశరథి |
| 1973 | మంటలు మానవుడు | కవిత్వం | సి.నారాయణరెడ్డి |
| 1972 | శ్రీశ్రీ సాహిత్యము | కవిత్వం | శ్రీశ్రీ |
| 1971 | విజయవిలాసము: హృదయోల్లాస వ్యాఖ్య | వ్యాఖ్యానం | తాపీ ధర్మారావు |
| 1970 | అమృతం కురిసిన రాత్రి | కవిత్వం | దేవరకొండ బాలగంగాధర తిలక్ |
| 1969 | మహాత్మకథ | కవిత్వం | తుమ్మల సీతారామమూర్తి |
| 1965 | మిశ్రమంజరి | కవిత్వం | రాయప్రోలు సుబ్బారావు |
| 1964 | క్రీస్తుచరిత్ర | కవిత్వం | గుర్రం జాషువా |
| 1963 | పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా | నవల | త్రిపురనేని గోపీచంద్ |
| 1962 | విశ్వనాథ మధ్యాక్కరలు | కవిత్వం | విశ్వనాథ సత్యనారాయణ |
| 1961 | ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము | జీవిత చరిత్ర | బాలాంత్రపు రజనీకాంతరావు |
| 1960 | నాట్యశాస్త్రము | చరిత్ర | పి.ఎస్.ఆర్. అప్పారావు |
| 1957 | శ్రీ రామకృష్ణుని జీవిత చరిత్ర | జీవిత చరిత్ర | చిరంతానందస్వామి |
| 1956 | భారతీయ తత్వశాస్త్రము | పరిశోధన | బులుసు వెంకటేశ్వర్లు |
| 1955 | ఆంధ్రుల సాంఘిక చరిత్రము | చరిత్ర | సురవరం ప్రతాపరెడ్డి |
1958, 1959, 1966, 1967, 1968, 1976, 1980 సంవత్సరాలలో పురస్కారం ఎవరికీ ఇవ్వలేదు.
తెలుగు భాషకు చెందిన అనువాదాల పురస్కార గ్రహీతలు [మార్చు]
| సంవత్సరం | అనువాద పుస్తకం పేరు | అనువాద రచయిత | మూలం పేరు (భాష, సాహితీ విభాగం) | మూల రచయిత |
|---|---|---|---|---|
| 2005 | మాస్తి చిన్నకథలు | జి.ఎస్.మోహన్ | సన్న కథెగళు సం. 12-13 (కన్నడ, చిన్న కథలు) | మాస్తి వెంకటేశ అయ్యంగార్ |
| 2004 | పర్వ | గంగిశెట్టి లక్ష్మీనారాయణ | పర్వ (కన్నడ, నవల) | ఎస్.ఎల్.బైరప్ప |
| 2003 | శ్రీ దేవీభాగవతము | బేతవోలు రామబ్రహ్మం | దేవీభాగవతం (సంస్కృతం, పురాణం) | వేదవ్యాసుడు |
| 2002 | మాటన్నది జ్యోతిర్లింగం | డి.వి.సుబ్బారావు | కన్నడ 'వచనాల' సంపుటి (కన్నడ, పద్యాలు) | వివిధ రచయితలు |
| 2001 | ఆత్మ సాక్షాత్కారము | పింగళి సూర్య సుందరం | సెల్ఫ్ రియలైజేషన్ (ఇంగ్లీషు, జీవిత చరిత్ర) | బి.వి.నరసింహస్వామి |
| 2000 | ఛాయారేఖలు | ఆర్.ఎ.పద్మనాభరావు | షాడో లైన్స్ (ఇంగ్లీషు, నవల) | అమితావ్ ఘోష్ |
| 1999 | సగం వెన్నెల రాత్రి | వేమరాజు భానుమూర్తి | ఆధ్ చనాణీ రాత్ (పంజాబీ, నవల) | గుర్దయాళ్ సింగ్ |
| 1998 | మెట్టుకు పైమెట్టు | ఇలపావులూరి పాండురంగారావు | ఎనిప్పాదికళ్ (మలయాళం, నవల) | తక్కాళి శివశంకర పిళ్ళై |
| 1997 | గడచిన కాలం | బి.కె.ఈశ్వర్ | కజింజ కాలం(మలయాళం, నవల) | కె.పి.కేశవ మీనన్ |
| 1996 | కావ్య ప్రకాశము | పి.శ్రీరామచంద్రుడు | కావ్య ప్రకాశం (సంస్కృతం, వ్యాఖ్యానం) | మమ్మట |
| 1995 | తలదండం | భార్గవి పి. రావు | తలెదండ (కన్నడ, నాటకం) | గిరీష్ కర్నాడ్ |
| 1994 | అమృతం విషం | పి.ఆదేశ్వరరావు | అమృత్ ఔర్ విష్ (హిందీ, నవల) | అమృత్లాల్ నాగర్ |
| 1993 | సమయం కాని సమయం | మద్దిపట్ల సూరి | అసమయ (బెంగాలీ, నవల) | బిమల్ కార్ |
| 1992 | తమస్ | యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ | తమస్ (హిందీ, నవల) | భీషమ్ సాహనీ |
| 1991 | తిరుక్కురళ్ | సి.ఆర్.శర్మ | తిరుక్కురళ్ (తమిళం, వ్యాఖ్యానం | తిరువళ్ళువార్ |
| 1990 | గణపతి రామాయణ సుధ | చర్ల గణపతిశాస్త్రి | శ్రీమద్రామాయణం(సంస్కృతం, పురాణం) | వాల్మీకి |
| 1989 | రవీంద్రుని నాటికలు | బెజవాడ గోపాలరెడ్డి | బిదాయెర్ అభిశాప్, చిత్రాంగద, మొ.. (బెంగాలీ, నాటికలు) | రవీంద్రనాథ టాగోర్ |